Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › కొత్త పేర్లు

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో కొత్త పేర్లు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 16 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినదిసామె 22:1
    వచనాలు
    సామె 22:1గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.

ఉదాహరణలు

  • అబ్రాము అబ్రాహాము అయ్యాడుఆది 17:5
    వచనాలు
    ఆది 17:5ఇకపైన నీ పేరు అబ్రాము కాదు. నిన్ను అనేక జాతులకు తండ్రిగా నియమిస్తున్నాను కనుక ఇకనుండి నీ పేరు అబ్రాహాము అవుతుంది.
  • శారయి శారా అయిందిఆది 17:15
    వచనాలు
    ఆది 17:15దేవుడు అబ్రాహాముతో ఇంకా ఇలా అన్నాడు. “నీ భార్య అయిన శారయిని ఇకనుండి శారయి అని పిలువవద్దు. ఇకనుండి ఆమె పేరు శారా
  • యాకోబు ఇశ్రాయేలు అయ్యాడుఆది 32:28
    వచనాలు
    ఆది 32:28అప్పుడాయన “నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు” అని చెప్పాడు.
  • రాహేలు తన కుమారునికి బెనోని అని పేరు పెట్టింది; అతని తండ్రి అతణ్ణి బెన్యామీను అన్నాడుఆది 35:18
    వచనాలు
    ఆది 35:18రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
  • ఫరో యోసేపుకు జఫనత్ పనేహు అని పేరు పెట్టాడుఆది 41:45
    వచనాలు
    ఆది 41:45ఫరో, యోసేపుకు “జఫనత్ పనేహు” అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు.
  • మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టాడుసంఖ్యా 13:16
    వచనాలు
    సంఖ్యా 13:16ఆ దేశాన్ని పరీక్షించడానికి మోషే పంపిన వ్యక్తుల పేర్లు ఇవి. నూను కొడుకు హోషేయకి మోషే యెహోషువ అనే పేరు పెట్టాడు.
  • నయోమి: నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండిరూతు 1:20
    వచనాలు
    రూతు 1:20అప్పుడు నయోమి “నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. అమిత శక్తిశాలి నాకు చాలా వేదన కలిగించాడు.
  • సొలొమోనుకు యదీద్యా అనే పేరు కూడా ఉంది2 సమూ 12:24–25
    వచనాలు
    2 సమూ 12:24–25తరువాత దావీదు తన భార్య బత్షెబ దగ్గరికి వెళ్లి ఆమెను ఓదార్చి ఆమెతో శయనించాడు. ఆమె ఒక కొడుకును కన్నది. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతణ్ణి ప్రేమించి నాతాను ప్రవక్తను పంపాడు. అతడు యెహోవా చెప్పినట్టు ఆ బిడ్డకు యదీద్యా అని పేరు పెట్టాడు.
  • ఫరో నెకో ఎల్యాకీము పేరును యెహోయాకీముగా మార్చాడు2 రాజులు 23:34
    వచనాలు
    2 రాజులు 23:34యోషీయా కొడుకు ఎల్యాకీమును అతని తండ్రి యోషీయా స్థానంలో నియమించి, అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టాడు. కాని అతడు యెహోయాహాజును ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినప్పుడు అతడు అక్కడ చనిపోయాడు.
  • బబులోను రాజు మత్తన్యా పేరును సిద్కియాగా మార్చాడు2 రాజులు 24:17
    వచనాలు
    2 రాజులు 24:17ఇంకా బబులోను రాజు యెహోయాకీను బాబాయి మత్తన్యాకు సిద్కియా అనే మారుపేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించాడు.
  • దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా: బెల్తెషాజరు, షద్రకు, మేషాకు, అబేద్నెగోదాని 1:7
    వచనాలు
    దాని 1:7నపుంసకుల అధికారి దానియేలుకు బెల్తెషాజరు అనీ, హనన్యాకు షద్రకు అనీ, మిషాయేలుకు మేషాకు అనీ, అజర్యాకు అబేద్నెగో అనీ పేర్లు మార్చాడు.
  • సీమోనును కేఫా, అంటే పేతురు అని పిలిచారుయోహా 1:42
    వచనాలు
    యోహా 1:42యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు” అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం).
  • యాకోబు, యోహానులకు బోయనేర్గెసు, అంటే ఉరిమేవారు అని పేరు పెట్టారుమార్కు 3:17
    వచనాలు
    మార్కు 3:17జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఆయన ‘బోయనేర్గెసు’ అనే పేరు పెట్టాడు, ఆ మాటకి ‘ఉరిమేవారు’ అని అర్థం),
  • సైప్రస్ వాడైన యోసేపును బర్నబా, అంటే ఆదరణ పుత్రుడు అని పిలిచారుఅపొ.కా 4:36
    వచనాలు
    అపొ.కా 4:36సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ‘ఆదరణ పుత్రుడు.’
  • పౌలు అని కూడా పిలువబడిన సౌలుఅపొ.కా 13:9
    వచనాలు
    అపొ.కా 13:9అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు