అన్వేషించండి › అంశాలు › మిడతలు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో మిడతలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 14 భాగాలు, వాక్యం వాక్యంగా.
- మిడతలు, గొల్లభామలు, కీచురాళ్ళు ఆహారంగా అనుమతించబడ్డాయిలేవీ 11:22
వచనాలు
లేవీ 11:22అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. ఆకు మిడత, కీచురాయి, గడ్డి మిడత ఇలా అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు.
- బాప్తిసమిచ్చే యోహాను మిడతలూ అడవి తేనే తినేవాడుమత్తయి 3:4, మార్కు 1:6
వచనాలు
మత్తయి 3:4ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
మార్కు 1:6యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం.
- మిడతలకు రాజు లేడు, అయినా అవి బారులు తీరి సాగుతాయిసామె 30:27
వచనాలు
సామె 30:27మిడతలకు రాజు లేడు అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి.
- కరువు, కాటుక తెగులు, బూజు, మిడతల గురించి సొలొమోను ప్రార్థిస్తాడు1 రాజులు 8:37
వచనాలు
1 రాజులు 8:37దేశంలో కరువు గాని, తెగులు గాని, వడ గాడ్పు దెబ్బ గాని, బూజు పట్టడం గాని, పంటలకు మిడతలు గాని, చీడపురుగు గాని సోకినా, వారి శత్రువు వారి పట్టణాలను ముట్టడి వేసినా, ఏ తెగులు గాని వ్యాధి గాని సోకినా,
- చాలా విత్తనాలు విత్తుతావు, కాని మిడతలు వాటిని తినేస్తాయిద్వితీ 28:38
వచనాలు
ద్వితీ 28:38ఎక్కువ విత్తనాలు పొలంలో చల్లి కొంచెం పంట ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మిడతలు వాటిని తినివేస్తాయి.
ఐగుప్తులో తెగులు
- దేశాన్ని కప్పి ఇళ్ళను నింపే మిడతల గురించి మోషే హెచ్చరించాడునిర్గ 10:4–6
వచనాలు
నిర్గ 10:4–6నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను. నేల కనపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్నదాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కనూ అవి తినేస్తాయి. మీ గృహాలూ మీ సేవకుల గృహాలూ ఐగుప్తీయుల ఇళ్ళన్నీ వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు, పూర్వికులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకూ ఇలాంటి వాటిని చూసి ఉండలేదు” అని చెప్పి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు.
- తూర్పు గాలి ఉదయానికల్లా వాటిని తెచ్చిందినిర్గ 10:13
వచనాలు
నిర్గ 10:13మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి.
- దేశం నల్లబడింది; పచ్చనిదేదీ మిగల్లేదునిర్గ 10:14–15
వచనాలు
నిర్గ 10:14–15తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికీ వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్నీ కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇకముందు కూడా ఉండబోవు. ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు.
- పడమటి గాలి వాటిని ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయేలా చేసిందినిర్గ 10:19
వచనాలు
నిర్గ 10:19అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.
పోలికలు
- యోవేలు: ఒక మిడత విడిచిపెట్టినదాన్ని మరొకటి తినేసిందియోవే 1:4
వచనాలు
యోవే 1:4ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి. పెద్ద మిడతలు విడిచిపెట్టిన దాన్ని మిడత పిల్లలు తినేశాయి. మిడత పిల్లలు విడిచిపెట్టిన దాన్ని గొంగళిపురుగులు తినేశాయి.
- మిద్యానీయులు మిడతల దండులా వచ్చారున్యాయా 6:5, న్యాయా 7:12
వచనాలు
న్యాయా 6:5వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి.
న్యాయా 7:12మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుప్రాంతాల వాళ్ళు లెక్కకు మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ల ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న యిసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి.
- అనాకు వంశస్థుల పక్కన వేగులవారికి తాము మిడతల్లా అనిపించారుసంఖ్యా 13:33
వచనాలు
సంఖ్యా 13:33అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూశాం. వారు అనాకు వంశం వాడైన నెఫీలీ తెగ వారు. వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికీ అలాగే ఉన్నాం” అన్నారు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు