Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › ఎలుగుబంట్లు

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో ఎలుగుబంట్లు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 7 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • గొర్రెపిల్లలను ఎత్తుకుపోయిన సింహాన్నీ ఎలుగుబంటినీ దావీదు చంపాడు1 సమూ 17:34–37
    వచనాలు
    1 సమూ 17:34–37అందుకు దావీదు సౌలుతో “నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే నేను దాన్ని వెంటాడి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించాను. అది నాపైకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. నీ సేవకుడనైన నేను సింహాన్నీ ఎలుగుబంటినీ చంపాను. సజీవుడైన దేవుని సైన్యాన్ని దూషించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదానిలాగా అవుతాడు. సింహం, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడా నన్ను విడిపిస్తాడు” అని చెప్పాడు. సౌలు “యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, వెళ్ళు” అని దావీదుతో అన్నాడు.
  • ఎలీషాను ఎగతాళి చేసిన నలభై ఇద్దరు కుర్రవాళ్ళను రెండు ఆడ ఎలుగుబంట్లు చీల్చాయి2 రాజులు 2:23–24
    వచనాలు
    2 రాజులు 2:23–24తరువాత ఎలీషా అక్కడ నుండి బేతేలుకు వెళ్ళాడు. అతడు దారిలో వెళ్తుండగా ఆ పట్టణంలో నుండి కొంతమంది కుర్రవారు వచ్చి “బోడి వాడా, బోడి వాడా, వెళ్లిపో” అంటూ ఎగతాళి చేసారు. ఎలీషా వెనక్కు తిరిగి వాళ్ళను చూసి యెహోవా పేరున వాళ్ళను శపించాడు. అప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగు బంట్లు వచ్చి వారిలో నలభై రెండు మందిని గాయపరిచాయి.
  • దావీదు, అతని మనుషులు పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిలా ఉగ్రులు2 సమూ 17:8
    వచనాలు
    2 సమూ 17:8నీ తండ్రి, అతనితో ఉన్నవారు మహా బలమైన యుద్ధ వీరులు. అడవిలో తమ పిల్లలను పోగొట్టుకొన్న ఎలుగుబంటులను పోలినవారై రగిలిపోతూ ఉన్నారని నీకు తెలుసు. నీ తండ్రి యుద్ధవిద్యలో నేర్పరి. అదీకాక అతడు తన మనుషులతో కలసి బసచేయడు.
  • బుద్ధిహీనుణ్ణి అతని మూర్ఖత్వంలో కలుసుకోవడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడం మేలుసామె 17:12
    వచనాలు
    సామె 17:12మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం.
  • కఠినమైన పాలకుడు మీదికి దూకే ఎలుగుబంటి లాంటివాడుసామె 28:15
    వచనాలు
    సామె 28:15పేద ప్రజలను పరిపాలించే దుష్టుడు గర్జించే సింహం, దాడి చేసే ఎలుగుబంటి లాంటి వాడు.
  • సింహం నుంచి పారిపోతే ఎలుగుబంటి ఎదురవుతుందిఆమో 5:19
    వచనాలు
    ఆమో 5:19ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురు పడినట్టు, లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.
  • మనమందరం ఎలుగుబంట్లలా గుర్రుమంటాంయెష 59:11
    వచనాలు
    యెష 59:11మేము ఎలుగుబంట్లలాగా గుర్రుమంటున్నాం. గువ్వలలాగా మూలుగుతున్నాం. న్యాయం కోసం చూస్తున్నాం, గానీ అది దొరకడం లేదు. విడుదల కోసం చూస్తున్నాం గానీ అది మాకు దూరంగా ఉంది.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు