అన్వేషించండి › అంశాలు › మోసాలు, మారువేషాలు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో మోసాలు, మారువేషాలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 45 భాగాలు, వాక్యం వాక్యంగా.
ఆదికాండంలో
- సర్పం స్త్రీతో చెబుతుంది: మీరు చావనే చావరుఆది 3:4
వచనాలు
ఆది 3:4పాము స్త్రీతో “మీరు చావనే చావరు.
- తాను తన సోదరినని చెప్పమని అబ్రాము శారయిని అడుగుతాడుఆది 12:13
వచనాలు
ఆది 12:13నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు” అన్నాడు.
- గెరారులో అబ్రాహాము శారా గురించి మళ్ళీ అంటాడు: ఈమె నా సోదరిఆది 20:2
వచనాలు
ఆది 20:2అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గూర్చి “ఈమె నా చెల్లి” అని చెప్పాడు. కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు శారా కోసం తన మనుషులను పంపించాడు. వాళ్ళు శారాను అబీమెలెకు ఇంట్లో చేర్చారు.
- మనుషులు తనను చంపుతారేమోనని భయపడి ఇస్సాకు రిబ్కా తన సోదరి అంటాడుఆది 26:7
వచనాలు
ఆది 26:7అక్కడి మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు “ఆమె నా చెల్లి” అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందకత్తె కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం తనని చంపుతారేమో అనుకున్నాడు.
- రిబ్కా యాకోబుకు ఏశావు బట్టలు తొడిగి మేక చర్మాలు కప్పుతుందిఆది 27:15–16
వచనాలు
ఆది 27:15–16రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏశావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి. ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేక పిల్లల చర్మాన్ని అతని మెడ పైని నున్నని భాగంలో కప్పింది.
- చూడలేని తన తండ్రితో యాకోబు అంటాడు: నేను నీ పెద్ద కొడుకు ఏశావునుఆది 27:1, ఆది 27:19
వచనాలు
ఆది 27:1ఇస్సాకు బాగా ముసలి వాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో “నా కొడుకా” అని పిలిచాడు. అతడు “చిత్తం నాన్నగారూ” అన్నాడు.
ఆది 27:19దానికి యాకోబు “నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు” అన్నాడు.
- లాబాను రాహేలుకు బదులు లేయాను ఇస్తాడు; యాకోబు: నన్నెందుకు మోసం చేశావు?ఆది 29:23, ఆది 29:25
- యాకోబు లాబానుకు చెప్పకుండా వెళ్ళిపోతాడుఆది 31:20
వచనాలు
ఆది 31:20యాకోబు తాను వెళ్ళిపోతున్నట్టు సిరియావాడైన లాబానుకు తెలియ పరచకపోవడం చేత అతణ్ణి మోసపుచ్చినట్టు అయ్యింది.
- రాహేలు లాబాను ఇంటి విగ్రహాలను జీను సంచిలో దాచి వాటి మీద కూర్చుంటుందిఆది 31:34–35
వచనాలు
ఆది 31:34–35రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో “తమ ఎదుట నేను లేఛి నిలబడనందుకు తమరు కోపపడవద్దు. నేను నా నెలసరి కాలంలో ఉన్నాను” అని చెప్పింది. అతడెంత వెతికినా ఆ విగ్రహాలు దొరకలేదు.
- యాకోబు కుమారులు సున్నతి చేయించుకోమని షెకెము మనుషులను అడిగి, తర్వాత పట్టణం మీద దాడి చేస్తారుఆది 34:13, ఆది 34:15, ఆది 34:25
వచనాలు
ఆది 34:13అయితే తమ సోదరి అయిన దీనాను అతడు చెరిచినందుకు యాకోబు కుమారులు షెకెముతో, అతని తండ్రి హమోరుతో కపటంగా జవాబిచ్చారు.
ఆది 34:15అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే మేము దీనికి అంగీకరించగలం.
ఆది 34:25మూడో రోజు వారంతా బాధపడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారుల్లో ఇద్దరు, అంటే దీనా సోదరులైన షిమ్యోను, లేవి, వారి కత్తులు తీసుకు అకస్మాత్తుగా ఆ ఊరిమీద పడి ప్రతి మగ వాణ్నీ చంపేశారు.
- అన్నలు యోసేపు అంగీని మేక రక్తంలో ముంచి యాకోబుకు చూపిస్తారుఆది 37:31–33
వచనాలు
ఆది 37:31–33వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు. వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి “ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు” అన్నారు. అతడు దాన్ని గుర్తుపట్టి “ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది” అన్నాడు.
- తామారు ముసుగు వేసుకుంటుంది; యూదా ఆమెను వేశ్య అనుకుంటాడుఆది 38:14–15
వచనాలు
ఆది 38:14–15షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకుని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది. యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకుని ఉండడం వలన ఆమె వేశ్య అనుకుని,
- యోసేపు తన వెండి గిన్నెను బెన్యామీను సంచిలో దాచిపెట్టిస్తాడుఆది 44:1–2
వచనాలు
ఆది 44:1–2యోసేపు “వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచుల్లో నింపి ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు, చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు” అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా, యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు.
న్యాయాధిపతులు, రాజులు
- గిబియోనీయులు పాత సంచులూ బూజుపట్టిన రొట్టెలూ తెచ్చి దూరదేశం వారమని చెప్పుకుంటారుయెహో 9:4–6
వచనాలు
యెహో 9:4–6వారు కుయుక్తితో, రాయబారుల్లాగా వేషం వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెసంచులు కట్టి, పాతగిలి మాసికలు వేసిన ద్రాక్షారసం తిత్తులు తీసుకుని, పాతబడి పిగిలిపోయిన చెప్పులు తొడుక్కుని, పాతబట్టలు కట్టుకుని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకొన్న రొట్టెలన్నీ ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి. వారు గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి “మేము దూర దేశం నుండి వచ్చాం, మాతో ఒక ఒప్పందం చేయండి” అని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ అన్నారు.
- ఒప్పందం జరిగిన మూడు రోజులకు వారు పొరుగువారని ఇశ్రాయేలుకు తెలిసిందియెహో 9:16
వచనాలు
యెహో 9:16అయితే వారితో ఒప్పందం చేసి మూడు రోజులైన తరువాత, వారు తమకు పొరుగు వారేననీ, తమ మధ్య నివసించే వారేననీ ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు.
- యాయేలు సీసెరాను లోపలికి పిలిచి పాలిచ్చి, అతడు నిద్రపోతుండగా చంపుతుందిన్యాయా 4:18–21
వచనాలు
న్యాయా 4:18–21అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని అతణ్ణి చూసి “ప్రభూ, ఇటు నా వైపుకి రండి, భయపడవద్దు” అని చెప్పింది. అప్పుడు అతడు ఆమె గుడారంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆమె అతనిపై దుప్పటి కప్పింది. అతడు “దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు” అని అడిగాడు. ఆమె తోలుతో చేసిన తిత్తి విప్పి అతనికి దాహానికి ఇచ్చి, అతనికి మళ్ళీ దుప్పటి కప్పే సమయంలో అతడు “గుడారం ద్వారం దగ్గర నుండి ఎవరైనా లోపలికి వచ్చి, లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎవరూ లేరని నువ్వు చెప్పాలి” అన్నాడు. ఆ తరువాత హెబెరు భార్య యాయేలు గుడారానికి కొట్టే మేకు తీసుకుని ఒక సుత్తె చేత్తో పట్టుకుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని కణతలో ఆ మేకు దిగగొట్టగా అది అతని తలలో గుండా నేలలోకి దిగింది.
- మీకాలు దావీదు మంచం మీద మేక వెంట్రుకలతో ఒక విగ్రహం పెడుతుంది: అతనికి జబ్బుగా ఉంది1 సమూ 19:13–16
వచనాలు
1 సమూ 19:13–16తరువాత మీకాలు ఒక విగ్రహం తీసుకు మంచంమీద ఉంచి తలవైపు మేక చర్మం ఉంచి దుప్పటితో కప్పివేసింది. సౌలు దావీదును పట్టుకోవడానికి సైనికులను పంపినపుడు “అతడు అనారోగ్యంతో మంచాన ఉన్నాడు” అని చెప్పింది. దావీదును చూసేందుకు సౌలు సైనికులను పంపి “అతణ్ణి మంచంతోసహా తీసుకురండి. నేను అతణ్ణి చంపుతాను” అన్నాడు. ఆ సైనికులు లోపల జొరబడి చూసినప్పుడు తల వైపున మేక చర్మం ఒక మంచంపై ఉన్న విగ్రహం కనబడింది.
- తాను రాజు రహస్య పని మీద ఉన్నానని దావీదు నోబులోని యాజకునితో చెబుతాడు1 సమూ 21:1–2
వచనాలు
1 సమూ 21:1–2దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి “నువ్వు ఒంటరిగా వచ్చావెందుకు?” అని అడిగాడు, దావీదు “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నీకు ఆజ్ఞాపించి పంపిస్తున్న పని ఎలాటిదో అది ఎవ్వరితో చెప్పవద్దు’ అన్నాడు. ఒక చోటికి వెళ్ళమని యువకులకు నేను చెప్పాను.
- దావీదు గెషూరీయుల మీద దాడి చేసి, యూదా దక్షిణ ప్రాంతం మీద దాడి చేశానని ఆకీషుతో చెబుతాడు1 సమూ 27:8, 1 సమూ 27:10
వచనాలు
1 సమూ 27:8తరువాత దావీదు, అతనివారు బయలుదేరి గెషూరీయుల మీదా, గెజెరీయుల మీదా అమాలేకీయుల మీదా దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకూ ఉన్న దేశంలో నివసించారు.
1 సమూ 27:10అప్పుడు ఆకీషు “ఇప్పుడు మీరు ఏ దేశంపై దండెత్తి వచ్చారు?” అని దావీదును అడిగితే, దావీదు “యూదా దేశానికి, యెరహ్మెయేలు దేశానికి, కేనీయ దేశానికి దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంపై దండెత్తాము” అన్నాడు.
- తామారు తన దగ్గరికి వచ్చేలా అమ్నోను జబ్బుపడినట్టు నటిస్తాడు2 సమూ 13:6
వచనాలు
2 సమూ 13:6అమ్నోను జబ్బు పడ్డాడని రాజుకు తెలిసి, అతణ్ణి పరామర్శించేందుకు వచ్చాడు. అప్పుడు అమ్నోను “నా సోదరి తామారు చేతి వంట నేను తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం రెండు రొట్టెలు చేయమని చెప్పు” అని రాజును అడిగాడు.
- దుఃఖిస్తున్నదానిలా నటించడానికి యోవాబు తెకోవ నుంచి ఒక జ్ఞానవతిని పంపుతాడు2 సమూ 14:2–3
వచనాలు
2 సమూ 14:2–3తెకోవ పట్టణం నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో “చాలాకాలం నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాప దుస్తులు వేసుకో. నూనె రాసుకోకుండా ఎంతోకాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా రాజును వేడుకో” అని చెప్పాడు.
- మొక్కుబడి కోసం హెబ్రోనుకు వెళ్తానని అబ్షాలోము అనుమతి అడిగి అక్కడ తిరుగుబాటు మొదలుపెడతాడు2 సమూ 15:7, 2 సమూ 15:10
వచనాలు
2 సమూ 15:7ఆ విధంగా నాలుగేళ్ళు గడచిన తరువాత అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చాడు. “నీ దాసుడనైన నేను అరాము దేశంలోని గెషూరులో ఉన్నప్పుడు ‘యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పిస్తే నేను ఆయనను సేవిస్తాను’ అని మొక్కుకున్నాను. కాబట్టి
2 సమూ 15:10అబ్షాలోము తన గూఢచారులను పిలిచి “మీరు బూర శబ్దం విన్నప్పుడు, ‘అబ్షాలోము హెబ్రోనులో పరిపాలిస్తున్నాడు’ అని కేకలు వేయాలని అన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారిని సిద్ధపరచండి” అని చెప్పి పంపించాడు.
- దావీదు స్నేహితుడైన హూషై అబ్షాలోమును పలకరిస్తాడు: రాజు చిరకాలం జీవించు గాక!2 సమూ 16:16
వచనాలు
2 సమూ 16:16దావీదుతో స్నేహంగా ఉన్న అర్కీయుడు హూషై అనేవాడు అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. అబ్షాలోమును చూసి “రాజు సదాకాలం జీవిస్తాడు గాక, రాజు సదాకాలం జీవిస్తాడు గాక” అని చెప్పాడు.
- అబ్షాలోము అహీతోపెలు సలహా కంటే హూషై సలహాను ఇష్టపడతాడు2 సమూ 17:14
వచనాలు
2 సమూ 17:14అబ్షాలోము, ఇశ్రాయేలువారు ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన మాట అహీతోపెలు చెప్పినదానికంటే యోగ్యమైనదని ఒప్పుకున్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి విపత్తు రప్పించాలని అహీతోపెలు చెప్పిన తెలివైన ప్రణాళిక నిరర్ధకమయ్యేలా చేయాలని నిశ్చయించుకున్నాడు.
- ఒక ముసలి ప్రవక్త దైవజనుణ్ణి తన ఇంటికి తిరిగి తీసుకురావడానికి అబద్ధం చెబుతాడు1 రాజులు 13:18
వచనాలు
1 రాజులు 13:18అప్పుడు ఆ ముసలి ప్రవక్త అతనితో “నేను కూడా నీలాంటి ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞ ప్రకారం ఒక దేవదూత ‘భోజనం చేయడానికి అతన్ని వెంటబెట్టుకుని తీసుకు రా’ అని నాతో చెప్పాడు” అన్నాడు. అలా అతడు ఆ దేవుని మనిషితో అబద్ధమాడాడు.
- యరొబాము భార్య మారువేషంలో వెళ్తుంది; చూడలేని అహీయా ఆమెను పేరుతో పలకరిస్తాడు1 రాజులు 14:2, 1 రాజులు 14:4, 1 రాజులు 14:6
వచనాలు
1 రాజులు 14:2యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు. “నీవు లేచి యరొబాము భార్యవని ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహు వెళ్ళు. ఈ ప్రజల మీద నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహీయా అక్కడున్నాడు.
1 రాజులు 14:4యరొబాము భార్య అలానే చేసింది. ఆమె షిలోహులోని అహీయా ఇంటికి వెళ్ళింది. ముసలితనం వలన అహీయా కళ్ళు కనిపించడం లేదు.
1 రాజులు 14:6గుమ్మం గుండా ఆమె వస్తున్న కాలి చప్పుడు విని అహీయా ఆమెతో ఇలా అన్నాడు. “యరొబాము భార్యా, లోపలికి రా! నీవు వేషం వేసుకుని రావడం ఎందుకు? కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుడు నాకు చెప్పాడు.
- నయమాను దగ్గర వెండి తీసుకోవడానికి గేహజీ ఎలీషా పేరుతో ఒక సందేశం కల్పిస్తాడు2 రాజులు 5:22, 2 రాజులు 5:25
వచనాలు
2 రాజులు 5:22గేహాజీ “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపించాడు. ‘ఎఫ్రాయిము పర్వత ప్రాంతం లోని ప్రవక్తల సమాజం నుండి ఇద్దరు యువకులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. మీరు దయచేసి వారి కోసం ముప్ఫై నాలుగు కిలోల వెండీ, రెండు జతల బట్టలూ ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.
2 రాజులు 5:25తరువాత అతడు లోపలికి వెళ్ళి తన యజమాని ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా అతణ్ణి “గేహజీ, నీవు ఎక్కడినుండి వస్తున్నావ్?” అని అడిగాడు. దానికి గేహాజీ “నీ సేవకుణ్ణి. నేను ఎక్కడికీ వెళ్ళలేదు” అన్నాడు.
- బయలు సేవకులను సమకూర్చడానికి యెహూ బయలుకు గొప్ప బలి ప్రకటిస్తాడు2 రాజులు 10:19
వచనాలు
2 రాజులు 10:19కాబట్టి బయలు దేవుడి ప్రవక్తలందర్నీ, ఆరాధకులందర్నీ, పూజారులందర్నీ నా దగ్గరికి పిలుచుకు రండి. బయలు దేవుడికి ఒక మహా బలి చేయబోతున్నాను. కాబట్టి ఎవరూ రాకుండా ఉండిపోకూడదు. అలా రాని వాణ్ణి నేను బతకనివ్వను” అన్నాడు. బయలు ఆరాధకులందర్నీ చంపాలనే ఉద్దేశ్యంతో యెహూ ఈ మోసపూరితమైన ప్రకటన చేశాడు.
- నెహెమ్యాకు హాని చేయాలని సన్బల్లటు అతణ్ణి ఓనో మైదానానికి పిలుస్తాడునెహె 6:2
వచనాలు
నెహె 6:2సన్బల్లటు, గెషెంలు నాకు ఎలాగైనా కీడు తలపెట్టాలని చూశారు. “ఓనో మైదానంలో ఎదో ఒక చోట మనం కలుసుకుందాం, రండి” అని మాకు కబురు పంపారు.
- కూలికి కుదిరినవాడు దేవాలయంలో దాక్కోమని నెహెమ్యాను ప్రోత్సహిస్తాడునెహె 6:10, నెహె 6:12
వచనాలు
నెహె 6:10తరువాత మెహేతబేలు మనవడు దెలాయ్యా కొడుకు షెమయా యింటికి వచ్చాను. అతణ్ణి అతడి ఇంట్లోనే నిర్బంధించారు. అతడు “రాత్రివేళ నిన్ను చంపడానికి వాళ్ళు వస్తారు, మనం దేవుని మందిరం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుందాం రా” అని నాతో అన్నాడు.
నెహె 6:12అప్పుడు షెమయా ద్వారా దేవుడు ఈ మాట చెప్పించలేదనీ, టోబీయా, సన్బల్లటులు అతనికి డబ్బిచ్చి నా గురించి ఇలా చెప్పించారనీ స్పష్టంగా తెలుసుకున్నాను.
కొత్త నిబంధనలో
- తాను కూడా వచ్చి ఆ శిశువును పూజించాలనుకుంటున్నానని హేరోదు జ్ఞానులతో చెబుతాడుమత్తయి 2:8
వచనాలు
మత్తయి 2:8తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ, “మీరు వెళ్ళి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పాడు.
- ప్రధాన యాజకులు యేసును రహస్యంగా పట్టుకోవడానికి మార్గం వెదుకుతారుమార్కు 14:1
వచనాలు
మార్కు 14:1రెండు రోజుల తరువాత పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ రాబోతున్నాయి. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును రహస్యంగా బంధించి చంపాలని కుట్రలు పన్నుతున్నారు.
- శిష్యులు శరీరాన్ని ఎత్తుకుపోయారని చెప్పడానికి సైనికులకు డబ్బు ఇస్తారుమత్తయి 28:12–13
వచనాలు
మత్తయి 28:12–13కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి, “మీరు ‘మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు’ అని చెప్పండి.
- అననీయ, సప్పీరా తమ భూమి వెలలో కొంత దాచుకుంటారుఅపొ.కా 5:1–2, అపొ.కా 5:8
వచనాలు
అపొ.కా 5:1–2అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
అపొ.కా 5:8అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు