Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › తల వెంట్రుకలు, గడ్డాలు

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో తల వెంట్రుకలు, గడ్డాలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 36 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయిమత్తయి 10:30, లూకా 12:7
    వచనాలు
    మత్తయి 10:30మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు.
    లూకా 12:7మీ తలవెంట్రుకలన్నిటికీ లెక్క ఉంది. భయపడకండి. మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారు కదా.
  • ఒక్క వెంట్రుకను కూడా నువ్వు తెల్లగా గాని నల్లగా గాని చేయలేవుమత్తయి 5:36
    వచనాలు
    మత్తయి 5:36నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు.
  • పౌలు: పొడవాటి జుట్టు పురుషునికి అవమానం, స్త్రీకి మహిమ1 కొరింతీ 11:14–15
    వచనాలు
    1 కొరింతీ 11:14–15పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపించడం లేదా? దేవుడు స్త్రీకి తల వెంట్రుకలు పైటచెంగుగా ఇచ్చాడు కాబట్టి ఆమె వాటిని పెంచుకోవడం ఆమెకు ఘనత అని మీకు స్వతహాగా తెలుసు కదా!
  • జడలు అల్లుకోవడం నుంచి అందం రాకూడదు1 తిమో 2:9, 1 పేతు 3:3
    వచనాలు
    1 తిమో 2:9అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా
    1 పేతు 3:3జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు.

ధర్మశాస్త్రంలో

  • తల పక్కల వెంట్రుకలు కత్తిరించవద్దు, గడ్డపు అంచులు కత్తిరించవద్దులేవీ 19:27
    వచనాలు
    లేవీ 19:27విగ్రహ పూజలు చేసే ఇతర జనాల్లాగా మీ తల పక్క భాగాలు గానీ నీ గడ్డం అంచులు గానీ గుండ్రంగా గొరిగించుకోకూడదు.
  • యాజకులు బోడి మచ్చలు గొరిగించుకోకూడదు, గడ్డపు అంచులు కత్తిరించుకోకూడదులేవీ 21:5
    వచనాలు
    లేవీ 21:5యాజకులు బోడిగుండు చేసుకోకూడదు. గడ్డం పక్కలను క్షవరం చేసుకో కూడదు. కత్తితో శరీరాన్ని గాట్లు పెట్టుకోకూడదు.
  • చనిపోయినవారి కోసం నొసలు గొరిగించుకోకూడదుద్వితీ 14:1
    వచనాలు
    ద్వితీ 14:1“మీరు మీ యెహోవా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు.
  • వెంట్రుకలు రాలిపోయినవాడు ఇంకా పవిత్రుడేలేవీ 13:40–41
    వచనాలు
    లేవీ 13:40–41మగవాడి తల వెంట్రుకలు రాలిపోతే అతనిది బట్టతల. అయినా అతడు శుద్ధుడే. ముఖం వైపు ఉన్న జుట్టు రాలిపోతే అతడిది బోడి నొసలు. అతడు శుద్ధుడే.
  • నాజీరు తన జుట్టు పెరగనిచ్చి, మొక్కుబడి ముగిసినప్పుడు దాన్ని కాల్చాడుసంఖ్యా 6:5, సంఖ్యా 6:18
    వచనాలు
    సంఖ్యా 6:5అతడు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజుల్లో మంగలి కత్తి అతడి తలని తాకకూడదు. యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజులు పూర్తయే వరకూ జుట్టు పెరగనియ్యాలి. దేవుని కోసం అతడు ప్రత్యేకంగా ఉండాలి. తలపై జుట్టు పొడుగ్గా పెరగనియ్యాలి.
    సంఖ్యా 6:18అప్పుడా నాజీరు సన్నిధి గుడారం ద్వారం దగ్గర తన ప్రత్యేకతను సూచించే తల జుట్టు కత్తిరించుకోవాలి. ఆ జుట్టును శాంతిబలి అర్పణ సామగ్రి కింద ఉన్న మంటలో పడవేయాలి.

ఉదాహరణలు

  • ఫరో దగ్గరికి వెళ్ళే ముందు యోసేపు క్షౌరం చేయించుకున్నాడుఆది 41:14
    వచనాలు
    ఆది 41:14ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.
  • సంసోను తల మీద మంగలి కత్తి పడకూడదున్యాయా 13:5, న్యాయా 16:17
    వచనాలు
    న్యాయా 13:5నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు.”
    న్యాయా 16:17అప్పుడు సంసోను సమస్తం ఆమెకు తెలియచేశాడు. “నేను పుట్టిన దగ్గర్నుంచి మంగలి కత్తి నా తలపైకి రాలేదు. ఎందుకంటే నేను నా తల్లి గర్భంలోనే దేవునికి నాజీరుగా ఉన్నాను. నా తలపై జుట్టును క్షౌరం చేస్తే నేను అందరిలాగానే సామాన్యుడిగా మారతాను” అని ఆమెకు చెప్పాడు.
  • దెలీలా అతని తల గొరిగించింది; తర్వాత అతని జుట్టు మళ్ళీ పెరగడం మొదలైందిన్యాయా 16:19, న్యాయా 16:22
    వచనాలు
    న్యాయా 16:19ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్ర పోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తల పై ఉన్న ఏడు జడలనూ క్షౌరం చేయించింది. అతణ్ణి లొంగదీసుకోసాగింది. ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది.
    న్యాయా 16:22అతణ్ణి చెరసాల్లో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి.
  • దావీదు పిచ్చివానిలా నటిస్తూ తన గడ్డం మీదికి ఉమ్మి కారనిచ్చాడు1 సమూ 21:13
    వచనాలు
    1 సమూ 21:13అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ, గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మిని తన గడ్డంపైకి కారనిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు.
  • హానూను దావీదు రాయబారుల గడ్డాల్లో సగం గొరిగించాడు2 సమూ 10:4
    వచనాలు
    2 సమూ 10:4ఈ మాటలు విన్న హానూను దావీదు పంపిన మనుషులను పట్టుకుని, సగం గడ్డం గొరిగించి, వారు తొడుక్కొన్న బట్టలు వెనక వైపు నడుము కింద వరకూ మధ్యకు కత్తిరించి వారిని వెళ్లగొట్టాడు.
  • దావీదు: మీ గడ్డాలు మళ్ళీ పెరిగే వరకు యెరికోలో ఉండండి2 సమూ 10:5
    వచనాలు
    2 సమూ 10:5ఆ మనుషులు ఎంతో అవమానం పొందారని దావీదు విన్నప్పుడు, వారిని కలుసుకోవడానికి మనుషులను పంపించి “మీ గడ్డాలు పెరిగే వరకూ యెరికో పట్టణంలో ఆగిపోయి ఆ తరువాత యెరూషలేము రండి” అని వారికి చెప్పమన్నాడు.
  • అబ్షాలోము ఏటేటా కత్తిరించిన జుట్టు రెండు వందల తులాల బరువు2 సమూ 14:26
    వచనాలు
    2 సమూ 14:26అతడు ఏడాదికొకసారి తన తలవెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటాడు. ఆ వెంట్రుకల బరువు ఆనాటి కొలతను బట్టి దాదాపు రెండు కిలోగ్రాముల బరువు ఉండేది.
  • దావీదు దూరంగా ఉన్నంత కాలం మెఫీబోషెతు మీసాలు కత్తిరించుకోలేదు2 సమూ 19:24
    వచనాలు
    2 సమూ 19:24సౌలు మనవడు మెఫీబోషెతు రాజును కలుసుకోవడానికి వచ్చాడు. రాజు పారిపోయిన రోజునుండి అతడు క్షేమంగా తిరిగి వచ్చేంత వరకూ అతడు కాళ్లు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేదు.
  • ముద్దుపెట్టుకోబోతున్నట్టు యోవాబు అమాశా గడ్డం పట్టుకున్నాడు2 సమూ 20:9
    వచనాలు
    2 సమూ 20:9అప్పుడు యోవాబు అమాశాను చూసి “నా సోదరా, క్షేమంగా ఉన్నావా?” అని అడుగుతూ, అమాశాను ముద్దు పెట్టుకొంటున్నట్టు తన కుడి చేత్తో అతని గడ్డం పట్టుకున్నాడు.
  • ఏలీయా ఒంటి నిండా వెంట్రుకలున్నవాడు, తోలు నడికట్టు కట్టుకునేవాడు2 రాజులు 1:8
    వచనాలు
    2 రాజులు 1:8అందుకు వారు “అతడు గొంగళి కట్టుకుని తోలు నడికట్టు పెట్టుకుని ఉన్నాడు” అన్నారు. అప్పుడు రాజు “ఆ వ్యక్తి తిష్బీ వాడైన ఏలీయానే” అన్నాడు.
  • కుర్రవాళ్ళు ఎలీషాను ఎగతాళి చేశారు: “బోడి వాడా, బోడి వాడా, వెళ్లిపో”2 రాజులు 2:23
    వచనాలు
    2 రాజులు 2:23తరువాత ఎలీషా అక్కడ నుండి బేతేలుకు వెళ్ళాడు. అతడు దారిలో వెళ్తుండగా ఆ పట్టణంలో నుండి కొంతమంది కుర్రవారు వచ్చి “బోడి వాడా, బోడి వాడా, వెళ్లిపో” అంటూ ఎగతాళి చేసారు.
  • అహరోను గడ్డం, దాని మీదుగా కారే పరిమళ తైలంకీర్త 133:2
    వచనాలు
    కీర్త 133:2అది ఆహరోను తలమీద పోసిన పరిమళ తైలం వంటిది. అది అహరోను గడ్డం నుండి అతడి అంగీ అంచులదాకా కారుతూ ఉన్న పరిమళ తైలం వంటిది.
  • యోబు దుఃఖంలో తల గొరిగించుకున్నాడుయోబు 1:20
    వచనాలు
    యోబు 1:20అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు.
  • ఎజ్రా విస్మయంతో తన తల వెంట్రుకలూ గడ్డం వెంట్రుకలూ పెరికివేసుకున్నాడుఎజ్రా 9:3
    వచనాలు
    ఎజ్రా 9:3ఈ సంగతి విని నేను నిర్ఘాంతపోయాను. నా అంగీనీ, దుప్పటినీ చింపుకుని, నా తల వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు పెరికి వేసుకుని కూర్చుండిపోయాను.
  • గడ్డాలు గొరిగించుకుని ఎనభై మంది దుఃఖితులు యెహోవా మందిరానికి వచ్చారుయిర్మీ 41:5
    వచనాలు
    యిర్మీ 41:5గడ్డాలు గీయించుకుని, బట్టలు చింపుకుని, శరీరాలు గాయపరచుకున్న 80 మంది పురుషులు యెహోవా మందిరానికి తీసుకెళ్ళడానికి నైవేద్యాలు, ధూపద్రవ్యాలు చేతపట్టుకుని షెకెము నుంచి, షిలోహు నుంచి, షోమ్రోను నుంచి వచ్చారు.
  • నెబుకద్నెజరు జుట్టు గరుడ పక్షి ఈకల్లా పెరిగిందిదాని 4:33
    వచనాలు
    దాని 4:33ఆ క్షణంలోనే ఆ మాట నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ప్రజల్లో నుండి అతడు తరిమివేయబడ్డాడు. అతడు పశువుల వలె గడ్డిమేశాడు. ఆకాశం నుండి కురిసే మంచు అతని శరీరాన్ని తడిపింది. అతని తల వెంట్రుకలు గరుడ పక్షి రెక్కల ఈకలంత పొడవుగా, అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివిగా పెరిగాయి.
  • ఒక స్త్రీ తన జుట్టుతో యేసు పాదాలు తుడిచిందిలూకా 7:38, యోహా 12:3
    వచనాలు
    లూకా 7:38ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది.
    యోహా 12:3అప్పుడు మరియ, అరకిలో బరువు ఉన్న స్వచ్చమైన జటామాంసి చెట్లనుంచి తీసిన ఖరీదైన అత్తరును యేసు పాదాల మీద పోసి అభిషేకించి, ఆయన పాదాలు తన తలవెంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా ఆ అత్తరు సువాసనతో నిండిపోయింది.
  • మొక్కుబడి కోసం పౌలు కెంక్రేయలో తల గొరిగించుకున్నాడుఅపొ.కా 18:18
    వచనాలు
    అపొ.కా 18:18పౌలు ఇంకా చాలా రోజులు అక్కడే ఉండి చివరికి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. కెంక్రేయ ఓడరేవులో తన నాజీరు వ్రత సంబంధమైన జుట్టు కత్తిరించుకుని ప్రిస్కిల్ల, అకులతో కలిసి సిరియాకు బయలుదేరాడు.

దుఃఖంలో

  • దుఃఖానికి గుర్తుగా గొరిగిన తలలు, కత్తిరించిన గడ్డాలుయెష 15:2, యిర్మీ 48:37, మీకా 1:16
    వచనాలు
    యెష 15:2ఏడవడానికి మోయాబీయులు గుడికీ, మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.
    యిర్మీ 48:37ప్రతి తలా బోడి అయింది. ప్రతి గడ్డమూ క్షవరం అయింది. ప్రతి వ్యక్తి చేతి పైనా గాట్లు ఉన్నాయి. ప్రతి నడుముకూ గోనె పట్టా ఉంది.
    మీకా 1:16నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో. నీ వెంట్రుకలు కత్తిరించుకో. రాబందులాగా బోడిగా ఉండు. నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు