అన్వేషించండి › అంశాలు › జనాభా లెక్కలు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో జనాభా లెక్కలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 21 భాగాలు, వాక్యం వాక్యంగా.
అరణ్యంలో
- సేవ చేయగల ఇరవై ఏళ్ళు, అంతకు పైబడిన ప్రతి పురుషుణ్ణి లెక్కించారుసంఖ్యా 1:2–3
వచనాలు
సంఖ్యా 1:2–3“ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు. ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి.
- లెక్కించబడిన ప్రతివాడూ — ధనవంతుడైనా పేదవాడైనా — అర తులం చెల్లించాడునిర్గ 30:13–15, నిర్గ 38:26
వచనాలు
నిర్గ 30:13–15జాబితాలో నమోదు అయిన ప్రతివాడూ అర తులం వెండి చెల్లించాలి. పవిత్ర స్థలం లెక్క చొప్పున పూర్తి బరువు ఇవ్వాలి. యెహోవాకు అర్పణగా దాన్ని చెల్లించాలి. ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళంతా జన సంఖ్యలో నమోదు కావాలి. జన సంఖ్యలో చేర్చే ప్రతి ఒక్కరూ యెహోవాకు అర్పణ చెల్లించాలి. విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి.
నిర్గ 38:26ఇరవై సంవత్సరాలు పైబడి లెక్కలో చేరినవారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అర తులం.
- మొదటి లెక్క: 603,550సంఖ్యా 1:46
వచనాలు
సంఖ్యా 1:46వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు.
- లేవీయులను మిగతా గోత్రాలతో కలిపి లెక్కించలేదుసంఖ్యా 1:47–49
వచనాలు
సంఖ్యా 1:47–49కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు. ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు. “లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.
- ఒక నెల, అంతకు పైబడిన లేవీ మగవారు: 22,000సంఖ్యా 3:39
వచనాలు
సంఖ్యా 3:39యెహోవా తమకు ఆదేశించినట్లు మోషే అహరోనులు లేవీ వంశంలో ఒక నెల వయసున్న మగ బిడ్డ నుండి అందర్నీ లెక్కించారు. వారు 22,000 మంది అయ్యారు.
- రెండో లెక్క, యొర్దాను దగ్గర: 601,730సంఖ్యా 26:2, సంఖ్యా 26:51
వచనాలు
సంఖ్యా 26:2“మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకుని ఆ పై వయస్సు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చెయ్యగల సామర్థ్యం ఉన్న వారిని, తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి” అన్నాడు.
సంఖ్యా 26:51ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు.
- మొదట లెక్కించినవారిలో కాలేబు, యెహోషువ తప్ప ఎవరూ మిగల్లేదుసంఖ్యా 26:64–65
వచనాలు
సంఖ్యా 26:64–65మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు. ఎందుకంటే వారు కచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెపున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిల్లో ఒక్కడైనా మిగల్లేదు.
దావీదు జనాభా లెక్కలు
- లెక్కకు తొమ్మిది నెలల ఇరవై రోజులు పట్టింది2 సమూ 24:8
వచనాలు
2 సమూ 24:8ఈ విధంగా వారు దేశమంతా సంచరించి తొమ్మిది నెలల ఇరవై రోజులకు తిరిగి యెరూషలేము చేరారు.
- సమూయేలు గ్రంథం: ఇశ్రాయేలులో 800,000, యూదాలో 500,0002 సమూ 24:9
వచనాలు
2 సమూ 24:9అప్పుడు యోవాబు యుద్ధం చేయగల వారి మొత్తం లెక్క రాజుకు తెలియపరిచాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షలమంది యోధులు ఉన్నారు. యూదావారిలో 5 లక్షలమంది ఉన్నారు.
- దినవృత్తాంతాలు: ఇశ్రాయేలులో 1,100,000, యూదాలో 470,0001 దిన 21:5
వచనాలు
1 దిన 21:5ఇశ్రాయేలీయులందరిలో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు పదకొండు లక్షలమంది. యూదావాళ్ళల్లో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు నాలుగు లక్షల డెబ్భైవేలమందిగా లెక్కకు వచ్చారు.
- యోవాబు లేవి, బెన్యామీను గోత్రాలను లెక్కించలేదు1 దిన 21:6
వచనాలు
1 దిన 21:6రాజు మాట యోవాబుకు అసహ్యంగా అనిపించింది కాబట్టి అతడు లేవి, బెన్యామీను గోత్రం వాళ్ళను ఆ లెక్కలో చేర్చలేదు.
- లెక్క తర్వాత దావీదు మనస్సాక్షి అతణ్ణి గద్దించింది2 సమూ 24:10
వచనాలు
2 సమూ 24:10జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో “నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి” అన్నాడు.
- ఆ సంఖ్య రాజైన దావీదు చరిత్ర గ్రంథంలో నమోదు కాలేదు1 దిన 27:24
వచనాలు
1 దిన 27:24ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదికి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు.
ఇతర లెక్కలు
- ముప్ఫై ఏళ్ళు, అంతకు పైబడిన లేవీయులు: 38,0001 దిన 23:3
వచనాలు
1 దిన 23:3అప్పుడు లేవీయులు ముప్ఫై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్న వాళ్ళను లెక్కలో చేర్చారు. వాళ్ళ సంఖ్య ముప్ఫై ఎనిమిది వేలు.
- సొలొమోను దేశంలోని విదేశీయులను 153,600 మందిని లెక్కించాడు2 దిన 2:17
వచనాలు
2 దిన 2:17సొలొమోను దేశంలోని అన్యజాతుల వారినందరినీ తన తండ్రి దావీదు వేయించిన అంచనా ప్రకారం వారిని లెక్కించినప్పుడు వారు 1, 53, 600 అయ్యారు.
- తిరిగి వచ్చిన బందీలు 42,360 మందిఎజ్రా 2:64
వచనాలు
ఎజ్రా 2:64సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు.
- ఔగుస్తు జనాభా లెక్కలకు ఆజ్ఞ ఇచ్చాడు; కురేనియస్ సిరియాకు అధిపతిలూకా 2:1–2
వచనాలు
లూకా 2:1–2ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజరు అగస్టస్ ఆజ్ఞాపించాడు. ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య.
- యోసేపు, మరియ పేరు నమోదు చేయించుకోవడానికి బేత్లెహేముకు వెళ్ళారులూకా 2:3–5
వచనాలు
లూకా 2:3–5అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు. యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు. తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు.
- జనాభా లెక్కల రోజుల్లో గలిలయ వాడైన యూదా లేచాడుఅపొ.కా 5:37
వచనాలు
అపొ.కా 5:37అతని తరువాత జనాభా లెక్కలు తీసే రోజుల్లో గలిలయవాడైన యూదా అనేవాడు లేచి, కొంతమందిని తన వైపుకు ఆకర్షించాడు. వాడు కూడా నశించిపోయాడు, వాణ్ణి అనుసరించిన వారంతా చెదరిపోయారు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు