Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › కాళ్ళు, చేతులు కడుక్కోవడం

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో కాళ్ళు, చేతులు కడుక్కోవడం

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 27 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • అబ్రాహాము తన అతిథులకు కాళ్ళు కడుక్కుని విశ్రాంతి తీసుకోవడానికి నీళ్ళు ఇస్తాడుఆది 18:4
    వచనాలు
    ఆది 18:4నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి.
  • లోతు: కాళ్ళు కడుక్కుని రాత్రి గడపండిఆది 19:2
    వచనాలు
    ఆది 19:2వారితో ఇలా అన్నాడు “నా ప్రభువులారా, దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. వచ్చి కాళ్ళు కడుక్కోవాలనీ, ఈ రాత్రి గడపాలనీ వేడుకుంటున్నాను. తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” అన్నాడు. అందుకు వాళ్ళు “అలా కాదు. మేము వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం.” అన్నారు.
  • లాబాను ఇంటివారు అబ్రాహాము సేవకునికీ అతని మనుషులకూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారుఆది 24:32
    వచనాలు
    ఆది 24:32ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఆ ఒంటెల జీను ఊడదీసి వాటికి గడ్డీ మేతా పెట్టాడు. అబ్రాహాము సేవకునికీ అతనితో కూడా వచ్చిన వారికీ కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చాడు.
  • యోసేపు గృహనిర్వాహకుడు అన్నదమ్ములకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాడుఆది 43:24
    వచనాలు
    ఆది 43:24గృహనిర్వాహకుడు వారిని యోసేపు ఇంట్లోకి తీసికు వచ్చి, వారికి నీళ్ళిస్తే, వారు కాళ్ళు కడుక్కున్నారు. అతడు వారి గాడిదలకు మేత వేయించాడు.
  • గిబియాలో ముసలివాని ఇంట్లో వారు కాళ్ళు కడుక్కుని, తిని, తాగారున్యాయా 19:21
    వచనాలు
    న్యాయా 19:21అయితే రాత్రి ఇలా వీధిలో గడపకూడదు” అన్నాడు. అలా చెప్పి అతణ్ణి తన ఇంటికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు. అతని గాడిదల కోసం మేత సిద్ధం చేశాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కుని భోజనం చేశారు.
  • అబీగయీలు: నా యజమాని సేవకుల కాళ్ళు కడగడానికి సిద్ధంగా ఉన్నాను1 సమూ 25:41
    వచనాలు
    1 సమూ 25:41ఆమె లేచి సాగిలపడి “నా స్వామి ఇష్టం. నా యేలినవాని సేవకుల కాళ్లు కడగడానికైనా నా యేలినవాని దాసీనైన నేను సిద్దం” అని చెప్పింది.
  • ఊరియాతో దావీదు: నీ ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కో2 సమూ 11:8
    వచనాలు
    2 సమూ 11:8తరువాత దావీదు “నువ్వు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో” అని ఊరియాకు అనుమతి ఇచ్చాడు. ఊరియా రాజు నగరం నుండి బయలుదేరాడు. రాజు అతని వెనకాలే అతనికి ఒక బహుమానం పంపించాడు.
  • దావీదు దూరంగా ఉన్నంత కాలం మెఫీబోషెతు తన కాళ్ళను పట్టించుకోలేదు2 సమూ 19:24
    వచనాలు
    2 సమూ 19:24సౌలు మనవడు మెఫీబోషెతు రాజును కలుసుకోవడానికి వచ్చాడు. రాజు పారిపోయిన రోజునుండి అతడు క్షేమంగా తిరిగి వచ్చేంత వరకూ అతడు కాళ్లు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేదు.
  • పరమగీతం: నా పాదాలు కడుక్కున్నాను — మళ్ళీ మురికి చేసుకోవాలా?పరమ 5:3
    వచనాలు
    పరమ 5:3నేను బట్టలు తీసేశాను. మళ్ళీ వాటిని వేసుకోవాలా? కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ మురికి చేసుకోవాలా?

సువార్తల్లో

  • సీమోనుతో యేసు: నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదులూకా 7:44
    వచనాలు
    లూకా 7:44ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు, “ఈ స్త్రీని చూస్తున్నావు కదా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నాకు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది.
  • ఒక స్త్రీ తన కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిపి తన జుట్టుతో తుడిచిందిలూకా 7:38
    వచనాలు
    లూకా 7:38ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది.
  • మరియ జటామాంసితో యేసు పాదాలకు పూసి తన జుట్టుతో తుడిచిందియోహా 12:3
    వచనాలు
    యోహా 12:3అప్పుడు మరియ, అరకిలో బరువు ఉన్న స్వచ్చమైన జటామాంసి చెట్లనుంచి తీసిన ఖరీదైన అత్తరును యేసు పాదాల మీద పోసి అభిషేకించి, ఆయన పాదాలు తన తలవెంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా ఆ అత్తరు సువాసనతో నిండిపోయింది.
  • భోజన సమయంలో యేసు నడుముకు తువాలు చుట్టుకుని శిష్యుల పాదాలు కడిగాడుయోహా 13:4–5
    వచనాలు
    యోహా 13:4–5ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు.
  • పేతురు: నువ్వు ఎన్నటికీ నా పాదాలు కడగకూడదు!యోహా 13:8
    వచనాలు
    యోహా 13:8పేతురు ఆయనతో, “నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు” అన్నాడు.
  • యేసు: స్నానం చేసినవాడు తన పాదాలు మాత్రమే కడుక్కోవాలియోహా 13:10
    వచనాలు
    యోహా 13:10యేసు అతనితో, “స్నానం చేసినవాడు తన పాదాలు తప్ప ఇంకేమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అతడు పూర్తిగా శుద్ధుడే. మీరూ శుద్ధులే గాని, మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు.
  • మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలియోహా 13:14
    వచనాలు
    యోహా 13:14బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి.
  • పవిత్రుల పాదాలు కడిగినందుకు పేరుపొందిన వితంతువు1 తిమో 5:10
    వచనాలు
    1 తిమో 5:10ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.

చేతులు కడుక్కోవడం

  • సేవ చేసే ముందు యాజకులు కంచు గంగాళం దగ్గర చేతులూ కాళ్ళూ కడుక్కునేవారునిర్గ 30:18–21, నిర్గ 40:31
    వచనాలు
    నిర్గ 30:18–21సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి. ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు. వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.”
    నిర్గ 40:31అక్కడ మోషే, అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.
  • చంపినవాడు తెలియని హత్య విషయంలో పెద్దలు ఒక పెయ్య మీద చేతులు కడుక్కుంటారుద్వితీ 21:1, ద్వితీ 21:6
    వచనాలు
    ద్వితీ 21:1“మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోని పొలంలో ఒకడు చచ్చి పడి ఉండడం మీరు చూస్తే, వాణ్ణి చంపిన వాడెవడో తెలియనప్పుడు
    ద్వితీ 21:6అప్పుడు ఆ శవానికి దగ్గరగా ఉన్న ఆ ఊరి పెద్దలంతా ఆ ఏటి లోయలో మెడ విరగదీసిన ఆ పెయ్య మీద తమ చేతులు కడుక్కుని
  • పిలాతు జనసమూహం ఎదుట చేతులు కడుక్కున్నాడు: ఈ మనిషి రక్తం విషయంలో నేను నిర్దోషినిమత్తయి 27:24
    వచనాలు
    మత్తయి 27:24అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు.
  • పెద్దల సంప్రదాయం ప్రకారం పరిసయ్యులు చేతులు కడుక్కోకుండా తినరుమార్కు 7:3–4
    వచనాలు
    మార్కు 7:3–4పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం తమ చేతులను ఆచారరీతిగా కడుక్కోకుండా భోజనం చేయరు. వారు బయట నుండి వచ్చినపుడు స్నానం చేయకుండా భోజనం చేయరు. గిన్నెలు, కుండలు, ఇతర ఇత్తడి పాత్రలు, భోజనపు బల్లలు సహా శుద్ధి చేయడం అనే అనేకమైన ఆచారాలను వారు కచ్చితంగా పాటిస్తారు.
  • యేసు శిష్యులు చేతులు కడుక్కోకుండా ఎందుకు తింటున్నారని వారు అడుగుతారుమత్తయి 15:2, మార్కు 7:5
    వచనాలు
    మత్తయి 15:2“నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు.
    మార్కు 7:5పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యేసుతో, “మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు.
  • భోజనానికి ముందు యేసు కడుక్కోకపోవడం చూసి ఒక పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడులూకా 11:38
    వచనాలు
    లూకా 11:38ఆయన భోజనానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోకపోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు.
  • కానాలోని ఆరు రాతి బానల్లో శుద్ధి ఆచారాల కోసం నీళ్ళు ఉన్నాయియోహా 2:6
    వచనాలు
    యోహా 2:6యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు