అన్వేషించండి › అంశాలు › దీర్ఘాయుష్షు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో దీర్ఘాయుష్షు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 37 భాగాలు, వాక్యం వాక్యంగా.
- జలప్రళయానికి ముందు యెహోవా మనిషి ఆయుష్షుకు పరిమితి పెడతాడుఆది 6:3
వచనాలు
ఆది 6:3యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు.
- ఒక కీర్తన: మా ఆయుష్షు డెబ్బై సంవత్సరాలు, బలం ఉంటే ఎనభైకీర్త 90:10
వచనాలు
కీర్త 90:10మా బలము డెభ్భై ఏళ్ళు. ఆరోగ్యంగా ఉంటే ఎనభై ఏళ్ళుకూడా ఉండొచ్చు. అయినా మా శ్రేష్ట కాలం కష్టాలూ దుఃఖాలే. అవును, అవి త్వరగా గడిచిపోతాయి. మేము ఎగిరిపోతాం.
జలప్రళయానికి ముందు
- ఆదాము 930 సంవత్సరాలు జీవించాడుఆది 5:5
వచనాలు
ఆది 5:5ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
- షేతు 912 సంవత్సరాలు జీవించాడుఆది 5:8
వచనాలు
ఆది 5:8షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
- ఎనోషు 905 సంవత్సరాలు జీవించాడుఆది 5:11
వచనాలు
ఆది 5:11ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
- కేయినాను 910 సంవత్సరాలు జీవించాడుఆది 5:14
వచనాలు
ఆది 5:14కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
- మహలలేలు 895 సంవత్సరాలు జీవించాడుఆది 5:17
వచనాలు
ఆది 5:17మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
- యెరెదు 962 సంవత్సరాలు జీవించాడుఆది 5:20
వచనాలు
ఆది 5:20యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.
- హనోకు: 365 సంవత్సరాలు, తర్వాత అతడు కనిపించలేదుఆది 5:23–24
వచనాలు
ఆది 5:23–24హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు. హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
- మెతూషెల 969 సంవత్సరాలు జీవించాడుఆది 5:27
వచనాలు
ఆది 5:27మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
- లెమెకు 777 సంవత్సరాలు జీవించాడుఆది 5:31
వచనాలు
ఆది 5:31లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
- నోవహు జలప్రళయం తర్వాత 350 సంవత్సరాలు, మొత్తం 950 సంవత్సరాలు జీవించాడుఆది 9:28–29
వచనాలు
ఆది 9:28–29ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు. నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.
జలప్రళయం తర్వాత
- షేము: 100 ఏళ్ళకు కుమారుడు, తర్వాత ఇంకా 500 సంవత్సరాలుఆది 11:10–11
వచనాలు
ఆది 11:10–11షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు. షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.
- అర్పక్షదు: 35 ఏళ్ళకు కుమారుడు, తర్వాత ఇంకా 403 సంవత్సరాలుఆది 11:12–13
వచనాలు
ఆది 11:12–13అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు. అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
- షేలహు: 30 ఏళ్ళకు కుమారుడు, తర్వాత ఇంకా 403 సంవత్సరాలుఆది 11:14–15
వచనాలు
ఆది 11:14–15షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
- ఏబెరు: 34 ఏళ్ళకు కుమారుడు, తర్వాత ఇంకా 430 సంవత్సరాలుఆది 11:16–17
వచనాలు
ఆది 11:16–17ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు. ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.
- పెలెగు: 30 ఏళ్ళకు కుమారుడు, తర్వాత ఇంకా 209 సంవత్సరాలుఆది 11:18–19
వచనాలు
ఆది 11:18–19పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు. పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.
- నాహోరు: 29 ఏళ్ళకు కుమారుడు, తర్వాత ఇంకా 119 సంవత్సరాలుఆది 11:24–25
వచనాలు
ఆది 11:24–25నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు. నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.
- తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడుఆది 11:32
వచనాలు
ఆది 11:32తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.
తర్వాతి జీవితాలు
- శారా 127 సంవత్సరాలు జీవించిందిఆది 23:1
వచనాలు
ఆది 23:1శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.
- అబ్రాహాము 175 సంవత్సరాలు జీవించాడుఆది 25:7
వచనాలు
ఆది 25:7అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు.
- ఇష్మాయేలు కూడా దీర్ఘకాలం జీవించాడుఆది 25:17
వచనాలు
ఆది 25:17ఇష్మాయేలు నూట ముప్ఫై ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.
- ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడుఆది 35:28
వచనాలు
ఆది 35:28ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.
- యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు, చివరి పదిహేడు ఐగుప్తులోఆది 47:28
వచనాలు
ఆది 47:28యాకోబు ఐగుప్తుదేశంలో 17 ఏళ్ళు జీవించాడు. యాకోబు మొత్తం 147 ఏళ్ళు బతికాడు.
- యోసేపు 110 ఏళ్ళ వయసులో చనిపోయాడు; ఐగుప్తులో సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేశారుఆది 50:26
వచనాలు
ఆది 50:26యోసేపు 110 ఏళ్ల వయసువాడై చనిపోయాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధపరచి ఐగుప్తు దేశంలో ఒక శవపేటికలో ఉంచారు.
- లేవి 137 సంవత్సరాలు, కహాతు 133, అమ్రాము 137 జీవించారునిర్గ 6:16, నిర్గ 6:18, నిర్గ 6:20
వచనాలు
నిర్గ 6:16లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు.
నిర్గ 6:18కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 సంవత్సరాలు జీవించాడు.
నిర్గ 6:20అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోను, మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు.
- అహరోను 123 ఏళ్ళ వయసులో హోరు కొండ మీద చనిపోయాడుసంఖ్యా 33:39
వచనాలు
సంఖ్యా 33:39అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
- మోషే 120 ఏళ్ళ వయసులో చనిపోయాడు, అతని కళ్ళు మసకబారలేదుద్వితీ 34:7
వచనాలు
ద్వితీ 34:7మోషే చనిపోయినప్పుడు అతని వయసు 120 సంవత్సరాలు. అప్పటికి అతని కళ్ళు మసకబారలేదు. అతని బలం తగ్గలేదు.
- 85 ఏళ్ళ కాలేబు: మోషే తనను పంపిన రోజు ఎంత బలంగా ఉన్నాడో ఇప్పుడూ అంతేయెహో 14:10–11
వచనాలు
యెహో 14:10–11యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు సంవత్సరాలు ఆయన చెప్పినట్టే నన్ను సజీవంగా కాపాడాడు. ఇదిగో, నాకిప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు. మోషే నన్ను యుద్ధం చేయడానికీ పంపినప్పుడు నాకెంత బలముందో ఈ రోజు కూడా అంత బలం ఉంది. యుద్ధం చేయడానికీ రావడానికీ పోవడానికీ నాకు ఎప్పటిలాగా బలముంది.
- యెహోషువ 110 ఏళ్ళ వయసులో చనిపోయాడుయెహో 24:29
వచనాలు
యెహో 24:29ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడు, యెహోవా సేవకుడు అయిన యెహోషువ 110 సంవత్సరాల వయసులో చనిపోయాడు.
- ఏలీకి 98 సంవత్సరాలు, అతడు చూడలేకపోయాడు1 సమూ 4:15
వచనాలు
1 సమూ 4:15అప్పుడు ఏలీ వయసు తొంభై ఎనిమిదేళ్లు. అతనికి చూపు మందగించి కళ్ళు కనిపించడం లేదు.
- ఎనభై ఏళ్ళ బర్జిల్లయి రాజైన దావీదుకు ఆహారం సమకూర్చాడు2 సమూ 19:32
వచనాలు
2 సమూ 19:32ఇప్పుడు బర్జిల్లయి వయసు 80 ఏళ్ళు. వయసు పైబడి బాగా ముసలివాడైపోయాడు. అతడు అత్యంత ధనవంతుడు. రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి ఆహార పదార్ధాలు పంపిస్తూ వచ్చాడు.
- యాజకుడైన యెహోయాదా 130 ఏళ్ళ వయసులో చనిపోయాడు2 దిన 24:15
వచనాలు
2 దిన 24:15యెహోయాదా వయసు మీరి పండు వృద్ధాప్యంలో చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతని వయస్సు 130 ఏళ్ళు.
- యోబు ఇంకా 140 సంవత్సరాలు జీవించి నాలుగు తరాలను చూశాడుయోబు 42:16–17
వచనాలు
యోబు 42:16–17ఆ పైన యోబు నూట నలభై సంవత్సరాలు బతికి, తన కొడుకులను, మనవళ్ళను నాలుగు తరాల వరకూ చూశాడు. తరువాత యోబు కాలం నిండిన వృద్ధుడై తనువు చాలించాడు.
- ఎనభై నాలుగేళ్ళ వయసు వరకు వితంతువుగా ఉన్న అన్నా దేవాలయాన్ని విడిచి వెళ్ళలేదులూకా 2:36–37
వచనాలు
లూకా 2:36–37దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు