Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › ఇటుకలు, ఇటుకల తయారీ

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో ఇటుకలు, ఇటుకల తయారీ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 15 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • బాబెలు దగ్గర: రండి, ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాంఆది 11:3
    వచనాలు
    ఆది 11:3వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
  • రాయికి బదులు ఇటుక, సున్నానికి బదులు తారు వాడారుఆది 11:3
    వచనాలు
    ఆది 11:3వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
  • యెహెజ్కేలు ఒక ఇటుక మీద యెరూషలేము పట్టణాన్ని గీశాడుయెహె 4:1
    వచనాలు
    యెహె 4:1అయితే నరపుత్రుడా, ఒక పెంకు తీసుకో. దాన్ని నీముఖానికి ఎదురుగా ఉంచుకో. దాని పైన యెరూషలేము పట్టణం నమూనాను చిత్రించు.
  • దావీదు అమ్మోనీయులను ఇటుకల బట్టీల దగ్గర పనిలో పెట్టాడు2 సమూ 12:31
    వచనాలు
    2 సమూ 12:31పట్టుకున్న వారిని బయటికి తీసుకువచ్చి రంపాలతో, పదునైన ఇనుప పనిముట్లతో, ఇనుప గొడ్డళ్ళతో పని చేసేవారిగా, ఇటుక బట్టీల్లో పనిచేసేవారిగా నియమించాడు. అమ్మోనీయుల పట్టణాలన్నిటిలో అతడు ఇలాగే చేశాడు. ఆ తరువాత దావీదు, అతని మనుషులూ తిరిగి యెరూషలేము చేరుకున్నారు.
  • యిర్మీయా తహపనేసులో ఫరో రాజభవనపు ఇటుక నేలలో రాళ్ళను పాతిపెట్టాడుయిర్మీ 43:9
    వచనాలు
    యిర్మీ 43:9యూదులు చూస్తూ ఉండగా నువ్వు కొన్ని పెద్ద రాళ్ళను చేతిలో పట్టుకుని తహపనేసులో ఉన్న ఫరో భవన ద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పేర్చిన దారిలో సున్నం కింద వాటిని దాచి పెట్టు.
  • ఇటుకల బలిపీఠాల మీద వేసిన ధూపం గురించి యెషయా ప్రస్తావిస్తాడుయెష 65:3
    వచనాలు
    యెష 65:3తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు. వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు.
  • నహూము నీనెవెతో: బురద తొక్కు; ఇటుకల బట్టీని బాగుచెయ్యి!నహూ 3:14
    వచనాలు
    నహూ 3:14వారు ముట్టడించే సమయానికి నీళ్లు చేదుకో. నీ కోటలను దిట్టపరచుకో. బంకమట్టిలోకి దిగి ఇటుకల కోసం బురద తొక్కు. కొలిమి సిద్ధం చేసుకో.

ఐగుప్తులో

  • ఇటుకలు, సున్నపు పనితో ఇశ్రాయేలీయుల జీవితాలు చేదుగా చేయబడ్డాయినిర్గ 1:14
    వచనాలు
    నిర్గ 1:14బంకమట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పనీ కఠినంగా చేయించుకుని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకొనే అన్ని పనులూ కఠిన బాధతో కూడి ఉండేవి.
  • వారు పీతోము, రామెసేసు అనే గిడ్డంగి పట్టణాలను కట్టారునిర్గ 1:11
    వచనాలు
    నిర్గ 1:11అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు.
  • ఫరో: ఇక గడ్డి లేదు, కాని ఇటుకల లెక్క అంతేనిర్గ 5:7–8
    వచనాలు
    నిర్గ 5:7–8“ఇటుకలు చేయడానికి ఉపయోగించే గడ్డి ఇకనుండి మీరు ఇవ్వకండి. వాళ్ళే వెళ్లి కావలసిన గడ్డి తెచ్చుకోవాలి. అయినప్పటికీ వాళ్ళు లెక్క ప్రకారం ఇంతకు ముందు చేసినట్టుగానే ఇటుకల పని చెయ్యాలి. వాళ్ళు సోమరిపోతులు కనుక లెక్క ఏమాత్రం తగ్గించవద్దు. అందుకే వారు ‘మేము వెళ్లి మా దేవునికి బలులు అర్పించడానికి అనుమతి ఇవ్వండి’ అని కేకలు వేస్తున్నారు.
  • గడ్డికి బదులు కొయ్యకాళ్ళు ఏరుకోవడానికి ప్రజలు ఐగుప్తు అంతటా చెదిరిపోయారునిర్గ 5:12
    వచనాలు
    నిర్గ 5:12అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాడ పుల్లలు సమకూర్చుకోవడానికి ఐగుప్తు దేశమంతటా చెదిరిపోయారు.
  • లెక్క తగ్గినందుకు ఇశ్రాయేలీయుల నాయకులను కొట్టారునిర్గ 5:14
    వచనాలు
    నిర్గ 5:14ఫరో ఆస్థాన అధికారులు తాము ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన ఇశ్రాయేల్ నాయకులను కొట్టారు. “ఇది వరకూ లాగా మీ లెక్క ప్రకారం ఇటుకలు నిన్న, ఈ రోజు ఎందుకు చేయించ లేదు?” అని అడిగారు.
  • గడ్డి ఇవ్వడం లేదు, అయినా ఇటుకలు చేయమంటున్నారునిర్గ 5:16
    వచనాలు
    నిర్గ 5:16తమ దాసులకు గడ్డి ఇవ్వకుండా రోజువారీ లెక్క ప్రకారం ఇటుకలు తయారు చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. అధికారులు తమ దాసులైన మా నాయకులను హింసిస్తున్నారు. అసలు తప్పు తమ ఆస్థాన అధికారులదే” అని మొర పెట్టుకున్నారు.
  • మీ రోజువారీ ఇటుకల లెక్క తగ్గించకూడదునిర్గ 5:18–19
    వచనాలు
    నిర్గ 5:18–19మీరు వెళ్లి పని చెయ్యండి. మీకు గడ్డి ఇవ్వడం జరగదు. మీరు మాత్రం లెక్క ప్రకారం ఇటుకలు అప్పగించక తప్పదు. మీ ఇటుకలు లెక్కలో ఏమాత్రం తగ్గకూడదు, ఏ రోజు పని ఆ రోజే ముగించాలి” అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల నాయకులు తాము దుర్భరమైన స్థితిలో కూరుకు పోయామని గ్రహించారు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు