అన్వేషించండి › అంశాలు › తిత్తులు, కూజాలు, బుడ్లు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో తిత్తులు, కూజాలు, బుడ్లు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 31 భాగాలు, వాక్యం వాక్యంగా.
నీళ్ళ, ద్రాక్షారసం, పాల తిత్తులు
- అబ్రాహాము హాగరుకు రొట్టెనూ నీళ్ళ తిత్తినీ ఇచ్చాడుఆది 21:14
వచనాలు
ఆది 21:14కనుక అబ్రాహాము తెల్లవారకముందే లేచి రొట్టె, నీళ్ళు పోసిన తోలు తిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు. ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అడవికి చేరి అక్కడ తిరుగుతూ ఉంది.
- తిత్తి ఖాళీ అయినప్పుడు ఆమెకు ఒక బావి కనిపించింది, దాన్ని నింపుకుందిఆది 21:15, ఆది 21:19
- యాయేలు పాల తిత్తిలోనుంచి సీసెరాకు తాగడానికి ఇచ్చిందిన్యాయా 4:19
వచనాలు
న్యాయా 4:19అప్పుడు ఆమె అతనిపై దుప్పటి కప్పింది. అతడు “దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు” అని అడిగాడు. ఆమె తోలుతో చేసిన తిత్తి విప్పి అతనికి దాహానికి ఇచ్చి, అతనికి మళ్ళీ దుప్పటి కప్పే సమయంలో
- గిబియోనీయులు చినిగి కుట్టిన పాత ద్రాక్షారసపు తిత్తులు చూపించారుయెహో 9:4, యెహో 9:13
వచనాలు
యెహో 9:4వారు కుయుక్తితో, రాయబారుల్లాగా వేషం వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెసంచులు కట్టి, పాతగిలి మాసికలు వేసిన ద్రాక్షారసం తిత్తులు తీసుకుని,
యెహో 9:13ఈ ద్రాక్షారసపు తిత్తులు మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పుడు అవి చినిగిపోయాయి. బహుదూర ప్రయాణం చేయడం వల్ల మా బట్టలు, చెప్పులు పాతవైపోయాయి” అని అతనితో చెప్పారు.
- హన్నా ఒక కోడె, పిండి, ద్రాక్షారసపు తిత్తితో సమూయేలును షిలోహుకు తెచ్చింది1 సమూ 1:24
వచనాలు
1 సమూ 1:24పాలు మానిన తరువాత బాలుడు ఇంకా పసి వాడుగా ఉన్నప్పుడే ఆమె అతణ్ణి ఎత్తుకుని మూడేళ్ళ కోడెదూడ, తూమెడు పిండి, ద్రాక్షారసం తిత్తిని తీసుకు షిలోహులోని మందిరానికి వచ్చింది.
- బేతేలుకు వెళ్తున్న ముగ్గురు మనుషులు: మేకపిల్లలు, మూడు రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి1 సమూ 10:3
వచనాలు
1 సమూ 10:3తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్లి తాబోరు మైదానానికి రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని దగ్గరకి వెళ్లే ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు. వారిలో ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, మరొకడు ద్రాక్షారసపు తిత్తిని మోసుకుంటూ వస్తారు.
- యెష్షయి రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, మేకపిల్లతో దావీదును సౌలు దగ్గరికి పంపాడు1 సమూ 16:20
వచనాలు
1 సమూ 16:20అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు.
- అబీగయీలు దావీదుకు రెండు ద్రాక్షారసపు తిత్తులూ చాలా ఆహారమూ తెచ్చింది1 సమూ 25:18
వచనాలు
1 సమూ 25:18అప్పుడు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పకుండా గబగబా 200 రొట్టెలు, రెండు ద్రాక్షారసం తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, ఐదు మానికల వేయించిన ధాన్యం, 100 ఎండు ద్రాక్షగెలలు, 200 అంజూరు పండ్ల ముద్దలు గాడిదలకెక్కించి
- బరువులు ఎక్కించిన గాడిదలతో, ద్రాక్షారసపు తిత్తితో సీబా దావీదును కలుసుకున్నాడు2 సమూ 16:1
వచనాలు
2 సమూ 16:1దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్లినప్పుడు మెఫీబోషెతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టిబడి ఉన్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, వంద అంజూర ఫలాలున్న కొమ్మలు, ఒక ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి.
- యేసు: కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లో ఎవరూ పోయరుమత్తయి 9:17, మార్కు 2:22, లూకా 5:37–38
వచనాలు
మత్తయి 9:17పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి, ద్రాక్షారసం కారిపోతుంది. తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఆ రెండూ చెడిపోవు.”
మార్కు 2:22పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం ఎవరూ పోయరు. అలా పోస్తే కొత్త ద్రాక్షరసం వల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోయాలి” అని వారితో అన్నాడు.
లూకా 5:37–38ఎవడూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడు. పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగిపోతాయి. రసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి.
- ఎలీహు: నా కడుపు కొత్త తిత్తిలా పగిలిపోయేలా ఉందియోబు 32:19
వచనాలు
యోబు 32:19నా మనస్సు తెరవని ద్రాక్షారసపు తిత్తి లాగా ఉంది. కొత్త తిత్తుల్లాగా అది పిగిలిపోడానికి సిద్ధంగా ఉంది.
- ఒక కీర్తనకారుడు: పొగ తగిలి ఎండిపోయిన తిత్తిలాకీర్త 119:83
వచనాలు
కీర్త 119:83నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు.
- ఒక కీర్తనకారుడు: నా కన్నీళ్ళను నీ బుడ్డిలో ఉంచుకీర్త 56:8
వచనాలు
కీర్త 56:8నా పలాయనాలను నువ్వు లెక్కించావు. నా అశ్రువులు నీ ఎదుట ఉన్న సీసాలో నింపావు. అవన్నీ నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా.
కూజాలు, బుడ్లు
- రిబ్కా తన కుండను భుజం మీద పెట్టుకుని బయటికి వచ్చిందిఆది 24:15
వచనాలు
ఆది 24:15అతడు ఈ మాటలు ముగించక ముందే రిబ్కా కుండ భుజంపై పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు. ఈ బెతూయేలు అబ్రాహాము సోదరుడైన నాహోరుకూ అతని భార్య అయిన మిల్కాకూ పుట్టిన కుమారుడు.
- గిద్యోను మనుషులు కుండల్లో కాగడాలు పెట్టుకుని తీసుకువెళ్ళి వాటిని పగలగొట్టారున్యాయా 7:16, న్యాయా 7:19–20
వచనాలు
న్యాయా 7:16ఆ మూడు వందలమందిని మూడు గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి ఒక బూర, ఒక ఖాళీ కుండ, ఆ కుండలో ఒక దివిటీని ఇచ్చి, వాళ్లతో ఇలా అన్నాడు “నన్ను చూసి, నేను చేసినట్టు చేయండి.
న్యాయా 7:19–20కాబట్టి, అర్దరాత్రి కాపలా కాసేవారు కాపలా సమయం మారుతూ ఉన్నప్పుడు, గిద్యోను, అతనితో ఉన్న వందమంది, శిబిరం చివరకూ వెళ్లి, బూరలు ఊది, వాళ్ళ చేతుల్లో ఉన్న కుండలు పగులగొట్టారు. అలా ఆ మూడు గుంపులవాళ్ళు బూరలు ఊదుతూ ఆ కుండలు పగులగొట్టి, ఎడమ చేతుల్లో దివిటీలు, కుడి చేతుల్లో ఊదడానికి బూరలు పట్టుకుని “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం” అని కేకలు వేశారు.
- సమూయేలు సౌలు తల మీద తైలపు బుడ్డి పోశాడు1 సమూ 10:1
వచనాలు
1 సమూ 10:1అప్పుడు సమూయేలు నూనె బుడ్డి తీసుకు సౌలు తల మీద నూనె పోసి అతణ్ణి ముద్దు పెట్టుకుని “యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల మీద నిన్ను రాజుగా నియమించాడు” అని ఇంకా ఇలా చెప్పాడు,
- నిద్రపోతున్న సౌలు తల దగ్గర నుంచి దావీదు ఈటెనూ నీటి బుడ్డినీ తీసుకున్నాడు1 సమూ 26:12
వచనాలు
1 సమూ 26:12సౌలు దిండు దగ్గర ఉన్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకు ఇద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా వల్ల అక్కడు ఉన్న వారందరికీ గాఢనిద్ర కలిగింది. వారిలో ఎవ్వరూ నిద్ర నుండి లేవలేదు. ఎవ్వరూ వచ్చిన వాళ్ళను చూడలేదు, ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు.
- సారెపతు వితంతువు దగ్గర తొట్టిలో గుప్పెడు పిండి, కొంచెం నూనె ఉన్నాయి1 రాజులు 17:12
వచనాలు
1 రాజులు 17:12అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది.
- పాత్రలు అయిపోయే వరకు ఒక వితంతువు నూనె పోసింది2 రాజులు 4:2–6
వచనాలు
2 రాజులు 4:2–6దానికి ఎలీషా ఆమెతో “నీకు నేనేం చేయగలను? నీకు ఇంట్లో ఏమున్నాయో చెప్పు” అన్నాడు. అప్పుడు ఆమె “నీ సేవకురాలి ఇంట్లో ఓ జాడీలో నూనె తప్పించి ఇంకేమీ లేదు” అంది. అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళి నీ పొరుగు వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అరువు తెచ్చుకో. ఎన్ని తేగలవో అన్ని తెచ్చుకో. అప్పుడు నువ్వూ, నీ కొడుకులూ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకోండి. అన్ని పాత్రల్లో నూనె పోయండి. నూనెతో నిండిన పాత్రలు ఒక పక్కన ఉంచండి” అని ఆమెతో చెప్పాడు. ఆమె ఎలీషా దగ్గరనుండి వెళ్ళింది. తన కొడుకులతో లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. తన కొడుకులు తెచ్చిన పాత్రలను నూనెతో నింపింది. ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె “ఇంకో పాత్ర పట్రండి” అంది. కానీ ఆమె కొడుకు “ఇక పాత్రలేమీ లేవు” అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది.
- ఎలీషా ఒక యువ ప్రవక్తను తైలపు బుడ్డితో రామోత్ గిలాదుకు పంపాడు2 రాజులు 9:1
వచనాలు
2 రాజులు 9:1ఆ తరువాత ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల సమాజం నుండి ఒక వ్యక్తిని పిలిచాడు. అతనితో “ప్రయాణానికి బట్టలు ధరించు. ఈ చిన్న నూనె సీసా పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్ళు.
- యిర్మీయా కుమ్మరి మట్టి కూజా కొని పెద్దల ఎదుట దాన్ని పగలగొట్టాడుయిర్మీ 19:1, యిర్మీ 19:10
వచనాలు
యిర్మీ 19:1యెహోవా ఇలా చెప్పాడు,
యిర్మీ 19:10ఈ మాటలు చెప్పిన తరువాత నీతో వచ్చిన మనుష్యులు చూస్తుండగా నువ్వు ఆ కుండ పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి.”
- కానాలో ఆరు రాతి బానలు, ఒక్కొక్కటి ఎన్నో లీటర్లు పట్టేవి, అంచుల వరకు నింపారుయోహా 2:6–7
వచనాలు
యోహా 2:6–7యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి. యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు.
- నీళ్ళ కుండ మోసుకువెళ్తున్న ఒక మనిషి శిష్యులను దారి చూపిస్తాడుమార్కు 14:13
వచనాలు
మార్కు 14:13యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, “మీరు ఊళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి.
- సమరయ స్త్రీ తన నీళ్ళ కుండను విడిచి ఊరిలోకి వెళ్ళిందియోహా 4:28
వచనాలు
యోహా 4:28ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది.
- ఒక స్త్రీ జటామాంసి ఉన్న సున్నపురాతి బుడ్డిని పగలగొట్టి యేసు తల మీద పోసిందిమార్కు 14:3
వచనాలు
మార్కు 14:3ఆ సమయంలో యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీ అగరు చెట్ల నుండి చేసిన స్వచ్ఛమైన, ప్రశస్తమైన అత్తరును ఒక చలువరాతి సీసాలో తన వెంట తెచ్చింది. ఆమె ఆ సీసా పగలగొట్టి ఆ అత్తరును యేసు తల మీద పోసింది.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు