అన్వేషించండి › అంశాలు › చెరసాలలు, గొలుసులు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్‌లో చెరసాలలు, గొలుసులు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 45 భాగాలు, వాక్యం వాక్యంగా.
పాత నిబంధనలో
- రాజు ఖైదీలను ఉంచే చెరసాలలో యోసేపును వేశారుఆది 39:20
వచనాలు
ఆది 39:20యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదీలను బంధించే చెరసాలలో వేయించాడు. అతడు చెరసాలలో ఉన్నాడు.
- చెరసాల అధికారి ఖైదీలందరినీ యోసేపు ఆధీనంలో ఉంచాడుఆది 39:22
వచనాలు
ఆది 39:22చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. వారక్కడ చేసే పనులన్నీ యోసేపే చేయించేవాడు.
- ఫరో గిన్నె అందించేవాణ్ణీ రొట్టెలవాణ్ణీ అదే చెరసాలలో ఉంచారుఆది 40:3
వచనాలు
ఆది 40:3వారిని చెరసాలలో ఉంచడానికి రాజు అంగరక్షకుల అధిపతికి అప్పగించాడు. ఆ చెరసాలలోనే యోసేపును కూడా బంధించారు.
- యోసేపును చెరసాల నుంచి తెచ్చారు; అతడు క్షౌరం చేయించుకుని బట్టలు మార్చుకున్నాడుఆది 41:14
వచనాలు
ఆది 41:14ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.
- యోసేపు తన అన్నలను మూడు రోజులు బంధించి, తర్వాత షిమ్యోనును బంధించి ఉంచాడుఆది 42:17, ఆది 42:24
- అహాబు: మీకాయాను చెరసాలలో వేసి రొట్టె, నీళ్ళు మాత్రమే ఇవ్వండి1 రాజులు 22:27
వచనాలు
1 రాజులు 22:27వాళ్ళతో ఇలా చెప్పండి రాజు ఇలా అంటున్నాడు. ఇతన్ని చెరసాలలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకూ అతనికి కేవలం కొద్దిగా రొట్టె, కొంచెం మంచినీళ్లు ఇవ్వండి.”
- ఆసా కోపంతో దీర్ఘదర్శి హనానీని చెరసాలలో వేయించాడు2 దిన 16:7, 2 దిన 16:10
వచనాలు
2 దిన 16:7ఆ సమయంలో దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజు ఆసా దగ్గరికి వచ్చి అతనికి ఈ ప్రకటన చేశాడు. “నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా ఆరాము రాజును నమ్ముకున్నావే. అందుకనే ఆరాము రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకు పోయింది.
2 దిన 16:10ఆ దీర్ఘదర్శి చేసిన ఈ ప్రకటనకి ఆసా అతని మీద కోపగించి ఆగ్రహంతో అతణ్ణి ఖైదులో వేశాడు. అదే సమయంలో ఆసా ప్రజల్లో కొంతమందిని బాధపరిచాడు కూడా.
- అష్షూరు రాజు రాజైన హోషేయను చెరసాలలో వేశాడు2 రాజులు 17:4
వచనాలు
2 రాజులు 17:4అతడు ఐగుప్తు రాజు సో దగ్గరికి వార్తాహరులను పంపి, ఇంత వరకూ తాను ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు అష్షూరు రాజుకు కప్పం కట్టడం ఆపి వేశాడు. హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్లు వేయించి ఖైదు చేశాడు.
- మనష్షేను గాలంతో, కంచు సంకెళ్ళతో బబులోనుకు తీసుకువెళ్ళారు2 దిన 33:10–11
వచనాలు
2 దిన 33:10–11యెహోవా మనష్షేతో అతని ప్రజలతో మాట్లాడాడు కానీ వారు పట్టించుకోలేదు. కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు.
- గుడ్డివాడైన సిద్కియాను కంచు సంకెళ్ళతో బబులోనుకు తీసుకువెళ్ళారు2 రాజులు 25:7, యిర్మీ 52:11
వచనాలు
2 రాజులు 25:7సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి, సిద్కియా కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు.
యిర్మీ 52:11సిద్కియా రెండు కళ్ళూ పీకించాడు. అతణ్ణి ఇత్తడి సంకెళ్ళతో బంధించి, బబులోనుకు తీసుకు వచ్చారు. అతడు చనిపోయేంత వరకూ బబులోను రాజు అతణ్ణి చెరసాలలోనే ఉంచాడు.
- ముప్ఫై ఏడు సంవత్సరాల తర్వాత యెహోయాకీను విడుదలై రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు2 రాజులు 25:27–29
వచనాలు
2 రాజులు 25:27–29యూదారాజు యెహోయాకీను బందీగా ఉన్న 37 వ సంవత్సరంలో 12 వ నెల 27 వ రోజున బబులోను రాజు ఎవీల్మెరోదకు తాను పరిపాలన ఆరంభించిన సంవత్సరంలో, చెరసాలలో నుంచి యూదా రాజు యెహోయాకీనును బయటకు తెప్పించాడు. అతనితో దయగా మాట్లాడి, అతని పీఠాన్ని బబులోనులో తన దగ్గరున్న రాజుల పీఠాలకన్నా ఎత్తు చేశాడు. అతడు తన చెరసాల బట్టలు తీసేసి వేరే వస్త్రాలు వేసుకుని తాను బ్రతికిన రోజులన్నీ రాజు బల్ల మీద రాజుతో భోజనం చేస్తూ వచ్చాడు.
యిర్మీయా
- కొట్టబడి బెన్యామీను ఎగువ ద్వారం దగ్గర బొండలో పెట్టబడ్డాడుయిర్మీ 20:2
వచనాలు
యిర్మీ 20:2కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు.
- లేఖకుడైన యోనాతాను ఇంట్లోని చీకటి కొట్టులో బంధించబడ్డాడుయిర్మీ 37:15–16
వచనాలు
యిర్మీ 37:15–16అధికారులు యిర్మీయా మీద కోపపడి, అతన్ని కొట్టి, తాము చెరసాలగా మార్చిన లేఖికుడైన యోనాతాను ఇంట్లో అతన్ని ఉంచారు. యిర్మీయా భూగర్భంలో ఉన్న ఒక చెరసాల గదిలో చాలా రోజులు ఉన్నాడు.
- కావలివారి ఆవరణలో ఉంచబడ్డాడు, రోజుకు ఒక రొట్టెతోయిర్మీ 32:2, యిర్మీ 37:21
వచనాలు
యిర్మీ 32:2ఆ కాలంలో బబులోను రాజు సైన్యం యెరూషలేముకు ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యూదా రాజు గృహ ప్రాంగణంలో ఖైదీగా ఉన్నాడు.
యిర్మీ 37:21కాబట్టి రాజైన సిద్కియా ఆజ్ఞ జారీ చేశాడు. అతని సేవకులు ఆ ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయాను పెట్టారు. పట్టణంలో రొట్టెలున్నంత వరకూ రొట్టెలు కాల్చేవాళ్ళ వీధిలోనుంచి ప్రతిరోజూ ఒక రొట్టె అతనికి ఇస్తూ వచ్చారు. కాబట్టి సేవకుల ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయా ఉన్నాడు.
- నీళ్ళు లేని, బురద మాత్రమే ఉన్న గోతిలోకి తాళ్ళతో దించబడ్డాడుయిర్మీ 38:6
వచనాలు
యిర్మీ 38:6వాళ్ళు యిర్మీయాను పట్టుకుని చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజకుమారుడు మల్కీయా గోతిలోకి దింపారు. అందులోకి యిర్మీయాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
- రమాలో అతని చేతుల గొలుసులు విప్పి విడుదల చేశారుయిర్మీ 40:1, యిర్మీ 40:4
వచనాలు
యిర్మీ 40:1రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుంచి, యూదాలో నుంచి బబులోనుకు బందీలుగా తీసుకెళ్ళిన ప్రజలందరి దగ్గర నుంచి, సంకెళ్లతో బంధించి ఉన్న యిర్మీయాను రమా నుంచి పంపించేసినప్పుడు యెహోవా నుంచి అతనికి వచ్చిన వాక్కు.
యిర్మీ 40:4కాని ఇప్పుడు చూడు! ఈ రోజు నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించాను. నాతోబాటు బబులోను రావడం మంచిదని నీకు అనిపిస్తే నాతో రా. నేను నీ గురించి జాగ్రత్త తీసుకుంటాను. అయితే మంచిది కాదనిపిస్తే రావద్దు. దేశమంతా నీ ఎదుట ఉంది. ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళు.”
కొత్త నిబంధనలో
- హేరోదు యోహానును బంధించి చెరసాలలో వేశాడుమత్తయి 14:3
వచనాలు
మత్తయి 14:3అంతకు పూర్వం, “నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను చెప్పినందుకు
- చెరసాల నుంచి యోహాను తన శిష్యులను యేసు దగ్గరికి పంపాడుమత్తయి 11:2–3
వచనాలు
మత్తయి 11:2–3క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు.
- చెరసాలలో యోహాను తల నరికారుమత్తయి 14:10
వచనాలు
మత్తయి 14:10భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు.
- తిరుగుబాటు, హత్య చేసినందుకు బరబ్బ చెరసాలలో ఉన్నాడులూకా 23:19
వచనాలు
లూకా 23:19బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నాడు.
- యేసు: నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూడడానికి వచ్చారుమత్తయి 25:36
వచనాలు
మత్తయి 25:36బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.
- సాయంత్రం అయినందువల్ల పేతురు, యోహానులను రాత్రంతా బంధించి ఉంచారుఅపొ.కా 4:3
వచనాలు
అపొ.కా 4:3వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు.
- చెరసాల తాళం వేసి, కాపలా ఉన్నప్పటికీ అపొస్తలులు అక్కడ లేరుఅపొ.కా 5:18–19, అపొ.కా 5:23
వచనాలు
అపొ.కా 5:18–19అపొస్తలులను పట్టుకుని పట్టణంలోని చెరసాల్లో వేశారు. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి
అపొ.కా 5:23“చెరసాల చాలా భద్రంగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందు నిలబడి ఉండడం చూశాం గానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవరూ కనబడలేదు” అని వారికి చెప్పారు.
- గట్టి కాపలా కింద పేతురు ఇద్దరు సైనికుల మధ్య గొలుసులతో నిద్రపోయాడుఅపొ.కా 12:4, అపొ.కా 12:6
వచనాలు
అపొ.కా 12:4అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తరువాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు.
అపొ.కా 12:6హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు.
- గొలుసులు ఊడిపడ్డాయి, ఇనుప ద్వారం తనంతట తానే తెరుచుకుందిఅపొ.కా 12:7, అపొ.కా 12:10
వచనాలు
అపొ.కా 12:7ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి.
అపొ.కా 12:10మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
- ఫిలిప్పీలో: లోపలి చెరసాల, బొండలో బిగించిన కాళ్ళుఅపొ.కా 16:23–24
వచనాలు
అపొ.కా 16:23–24వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు.
- అర్ధరాత్రి భూకంపం తలుపులు తెరిచింది, గొలుసులన్నీ ఊడిపోయాయిఅపొ.కా 16:25–26
వచనాలు
అపొ.కా 16:25–26మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
- యెరూషలేములో పౌలును రెండు గొలుసులతో బంధించారుఅపొ.కా 21:33
వచనాలు
అపొ.కా 21:33అతడు వచ్చి పౌలును పట్టుకుని, రెండు సంకెళ్లతో అతనిని బంధించమని ఆజ్ఞాపించి, “ఇతడెవడు? ఏమి చేశాడు?” అని అడిగాడు.
- ఫేలిక్సు పౌలును రెండు సంవత్సరాలు చెరసాలలో విడిచిపెట్టాడుఅపొ.కా 24:27
వచనాలు
అపొ.కా 24:27రెండు సంవత్సరాల తరువాత ఫేలిక్సుకు బదులుగా పోర్కియస్ ఫేస్తు గవర్నరుగా వచ్చాడు. అప్పుడు ఫేలిక్సు యూదుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని, పౌలును చెరసాల్లోనే విడిచిపెట్టి వెళ్ళాడు.
- రోమ్‌లో పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికునితో, గొలుసుతో బంధించబడి నివసించాడుఅపొ.కా 28:16, అపొ.కా 28:20
వచనాలు
అపొ.కా 28:16మేము రోమ్ కు వచ్చినప్పుడు పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఉండడానికి అనుమతి పొందాడు.
అపొ.కా 28:20ఈ కారణం చేతనే మీతో మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తం ఈ గొలుసులతో నన్ను బంధించి ఉంచారు” అని వారితో చెప్పాడు.
- అతడు రెండు సంవత్సరాలు పూర్తిగా తన సొంత అద్దె ఇంట్లో ఉన్నాడుఅపొ.కా 28:30
వచనాలు
అపొ.కా 28:30పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో నివసించి, తన దగ్గరికి వచ్చే వారినందరినీ ఆదరిస్తూ
- ఒనేసిఫోరు పౌలు గొలుసుల విషయంలో సిగ్గుపడలేదు2 తిమో 1:16
వచనాలు
2 తిమో 1:16ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక.
బంగారు గొలుసులు
- ఫరో యోసేపు మెడలో బంగారు గొలుసు వేశాడుఆది 41:42
వచనాలు
ఆది 41:42ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.
- బెల్షస్సరు దానియేలు మెడలో బంగారు గొలుసు వేయించాడుదాని 5:29
వచనాలు
దాని 5:29అతని మెడలో స్వర్ణ హారం వేసి, ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణలో అతణ్ణి మూడవ అధికారిగా నియమించి చాటింపు వేయించారు.
- గిద్యోను మిద్యాను ఒంటెల మెడల్లోని గొలుసులు తీసుకున్నాడున్యాయా 8:26
వచనాలు
న్యాయా 8:26మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు, కర్ణభూషణాలు, ధూమ్రవర్ణపు దుస్తులు, ఒంటెల మెడల మీద ఉన్న గొలుసుల తూకం కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల తులాల బంగారం అయ్యింది. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించి తన సొంత ఊరు ఒఫ్రాలో దాన్ని ఉంచాడు.
- సొలొమోను గర్భాలయం ముందు భాగం అడ్డంగా బంగారు గొలుసులు వేలాడదీశాడు1 రాజులు 6:21
వచనాలు
1 రాజులు 6:21ఈ విధంగా సొలొమోను మందిరం లోపల అంతా మేలిమి బంగారంతో పొదిగించి అతి పరిశుద్ధ స్థలం ఎదుట బంగారు గొలుసులు ఉన్న తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు