అన్వేషించండి › అంశాలు › భూకంపాలు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో భూకంపాలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 15 భాగాలు, వాక్యం వాక్యంగా.
- భూమి కంపించడం, పర్వతాలు వణకడం గురించి కీర్తనలు మాట్లాడతాయికీర్త 18:7, కీర్త 46:2–3, కీర్త 104:32
వచనాలు
కీర్త 18:7అప్పుడు భూమి కంపించి వణికింది. దేవుడు కోపంగా ఉన్నాడు గనక పర్వతాల పునాదులు కూడా కదిలి వణికాయి.
కీర్త 46:2–3కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం. సముద్రంలో నీళ్ళు గర్జించినా, తీవ్ర ఉద్రేకంతో అవి పొంగినా, వాటి పొంగుకు పర్వతాలు కంపించినా సరే. సెలా.
కీర్త 104:32ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి.
ఉదాహరణలు
- సీనాయి పర్వతమంతా తీవ్రంగా కంపించిందినిర్గ 19:18, కీర్త 68:8
వచనాలు
నిర్గ 19:18మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. ఆ కొండంతా తీవ్రంగా కంపించింది.
కీర్త 68:8దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.
- కోరహు, దాతాను, అబీరాముల కింద నేల చీలిపోయిందిసంఖ్యా 16:31–32
వచనాలు
సంఖ్యా 16:31–32మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.
- యోనాతాను దాడి తర్వాత ఫిలిష్తీయుల శిబిరంలో భూమి కంపించింది1 సమూ 14:15
వచనాలు
1 సమూ 14:15ఆ సమూహంలో, పొలంలో ఉన్నవారందరిలో తీవ్రమైన ఆందోళన ఏర్పడింది. సైన్యానికి కావలివారు, దోచుకొనేవారూ భయపడ్డారు, నేల కంపించింది. ఇదంతా దేవుడు జరిగించిన పని అని వారు అనుకున్నారు.
- హోరేబులో ఏలీయా: గాలి, భూకంపం, అగ్ని, తర్వాత మెల్లని స్వరం1 రాజులు 19:11–12
వచనాలు
1 రాజులు 19:11–12యెహోవా అతనితో “నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు” అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు. ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది.
- ఉజ్జియా కాలంలో భూకంపానికి రెండు సంవత్సరాల ముందు ఆమోసు మాట్లాడాడుఆమో 1:1
వచనాలు
ఆమో 1:1ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని గొర్రెల కాపరి ఆమోసు చూసిన దర్శనంలోని విషయాలివి. యూదారాజు ఉజ్జియా రోజుల్లో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము రోజుల్లో భూకంపం రావడానికి రెండేళ్ళు ముందు, అతడు ఈ దర్శనం చూశాడు.
- ఉజ్జియా రోజుల్లో భూకంపం నుంచి ప్రజలు పారిపోయిన సంగతి జెకర్యా గుర్తుచేస్తాడుజెక 14:5
వచనాలు
జెక 14:5కొండల మధ్య ఏర్పడిన లోయ ఆజీలు వరకు వ్యాపిస్తుంది. మీరు ఆ కొండ లోయగుండా పారిపోతారు. గతంలో యూదా రాజు ఉజ్జియా రోజుల్లో కలిగిన భూకంపానికి భయపడి పారిపోయినట్టు మీరు పారిపోతారు. నీతోబాటు పరిశుద్ధులందరూ వస్తారు. అప్పుడు నా దేవుడు యెహోవా ప్రత్యక్షం అవుతాడు.
- యేసు మరణించినప్పుడు భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయిమత్తయి 27:51
వచనాలు
మత్తయి 27:51అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి.
- శతాధిపతి భూకంపం చూసి భయపడ్డాడుమత్తయి 27:54
వచనాలు
మత్తయి 27:54రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు.
- సమాధి రాయి దొర్లించబడినప్పుడు గొప్ప భూకంపంమత్తయి 28:2
వచనాలు
మత్తయి 28:2ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది.
- విశ్వాసులు ప్రార్థించిన స్థలం కంపించిందిఅపొ.కా 4:31
వచనాలు
అపొ.కా 4:31వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
- ఫిలిప్పీలో భూకంపం చెరసాల తలుపులు తెరిచిందిఅపొ.కా 16:26
వచనాలు
అపొ.కా 16:26అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు