Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › ఒంటెలు

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో ఒంటెలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 26 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • ఒంటెను తినకూడదులేవీ 11:4
    వచనాలు
    లేవీ 11:4అయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి. కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఒంటె లాంటి జంతువులు నెమరు వేస్తాయి. కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా ఎంచాలి.
  • అబ్రాము, యాకోబు, యోబు ఒంటెలను తమ సంపదలో లెక్కించారుఆది 12:16, ఆది 30:43, యోబు 1:3
    వచనాలు
    ఆది 12:16ఆమె మూలంగా అతడు అబ్రామును చాలా బాగా చూసుకున్నాడు. అతనికి గొర్రెలు, ఎడ్లు, మగ గాడిదలు, సేవకులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇచ్చాడు.
    ఆది 30:43ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు.
    యోబు 1:3అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశుసంపద ఉంది. అనేకమంది పనివాళ్ళు అతని దగ్గర పని చేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పవాడుగా ఎంచారు.
  • యోబుకు 3,000 ఒంటెలు, తర్వాత 6,000యోబు 1:3, యోబు 42:12
    వచనాలు
    యోబు 1:3అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశుసంపద ఉంది. అనేకమంది పనివాళ్ళు అతని దగ్గర పని చేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పవాడుగా ఎంచారు.
    యోబు 42:12యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడు. అతనికి పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటెలు, వెయ్యి జతల ఎడ్లు, వెయ్యి ఆడగాడిదలు ఉన్నాయి.
  • ఇష్మాయేలీయుడైన ఓబీలు దావీదు ఒంటెలపై అధికారి1 దిన 27:30
    వచనాలు
    1 దిన 27:30ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు నియామకం జరిగింది.

కథల్లో

  • ఇస్సాకుకు భార్యను వెదకడానికి అబ్రాహాము సేవకుడు పది ఒంటెలను తీసుకువెళ్ళాడుఆది 24:10
    వచనాలు
    ఆది 24:10ఆ దాసుడు తన యజమానికి చెందిన పది ఒంటెలను తీసుకుని ప్రయాణమయ్యాడు. అలాగే తన యజమాని దగ్గర నుండి అనేక రకాలైన వస్తువులను బహుమానాలుగా తీసుకు వెళ్ళాడు. అతడు ప్రయాణమై వెళ్ళి ఆరాం నహరాయిము ప్రాంతంలో ఉన్న నాహోరు పట్టణం చేరాడు.
  • సాయంత్రం అతడు బావి దగ్గర ఒంటెలను మోకరింపజేశాడుఆది 24:11
    వచనాలు
    ఆది 24:11అతడు ఆ పట్టణం బయటే ఉన్న ఒక నీటి బావి దగ్గర తన ఒంటెలను మోకరింప చేశాడు. అప్పటికి సాయంత్రం అయింది. ఊరి స్త్రీలు నీళ్ళు తోడుకోడానికి వచ్చే సమయమది.
  • రిబ్కా అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు చేదిందిఆది 24:14, ఆది 24:19–20
    వచనాలు
    ఆది 24:14ఇది ఈ విధంగా జరగనియ్యి. ‘నీ కుండ కొంచెం వంచి నేను తాగడానికి కాసిన్ని నీళ్ళు పొయ్యి’ అని నేను అంటే ‘తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను’ అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి. ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వాస్యత చూపించావని తెలుసుకుంటాను” అన్నాడు.
    ఆది 24:19–20ఆమె అతనికి తాగడానికి నీళ్ళు ఇచ్చిన తరవాత “మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్ళు తోడి పోస్తాను” అని చెప్పి త్వరగా అక్కడి తొట్టిలో కుండెడు నీళ్ళు కుమ్మరించి తిరిగి నీళ్ళు తోడటానికి బావి దగ్గరికి పరుగు తీసింది. అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు తోడి పోసింది.
  • రిబ్కా ఇస్సాకును కలుసుకోవడానికి ఒంటె మీద ప్రయాణించిందిఆది 24:61, ఆది 24:64
    వచనాలు
    ఆది 24:61రిబ్కా, ఆమె సేవకురాళ్ళూ ఒంటెలెక్కి ఆ వ్యక్తి వెంట వెళ్లారు. ఆ విధంగా అబ్రాహాము సేవకుడు రిబ్కాను తీసుకుని తన దారిన వెళ్ళాడు.
    ఆది 24:64రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటె పైనుండి దిగింది.
  • రాహేలు లాబాను విగ్రహాలను తన ఒంటె జీను సంచిలో దాచి వాటి మీద కూర్చుందిఆది 31:34
    వచనాలు
    ఆది 31:34రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు.
  • యాకోబు ఏశావుకు పంపిన కానుకలో పిల్లలతో పాటు 30 పాడి ఒంటెలు ఉన్నాయిఆది 32:15
    వచనాలు
    ఆది 32:15ముప్ఫై పాడి ఒంటెలూ వాటి పిల్లలూ నలభై ఆవులూ పది ఆబోతులూ ఇరవై ఆడ గాడిదలూ పది గాడిద పిల్లలూ తీసుకు మందమందను వేరు వేరుగా ఉంచాడు.
  • ఇష్మాయేలీయుల ఒంటెలు సుగంధ ద్రవ్యాలను ఐగుప్తుకు మోసుకువెళ్ళాయిఆది 37:25
    వచనాలు
    ఆది 37:25వారు భోజనానికి కూర్చున్నపుడు, ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు.
  • మిద్యానీయుల ఒంటెలు ఇసుకలా లెక్కలేనన్నిన్యాయా 7:12
    వచనాలు
    న్యాయా 7:12మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుప్రాంతాల వాళ్ళు లెక్కకు మిడతల్లా ఆ మైదానంలో పోగై ఉన్నారు. వాళ్ల ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న యిసుక రేణువుల్లా లెక్కకు మించి ఉన్నాయి.
  • గిద్యోను రాజుల ఒంటెల మెడల్లోని చంద్రవంకల ఆభరణాలను తీసుకున్నాడున్యాయా 8:21
    వచనాలు
    న్యాయా 8:21అప్పుడు జెబహు సల్మున్నాలు “వయస్సునుబట్టి మనిషికి శక్తి ఉంటుంది గనుక, నువ్వే లేచి, మమ్మల్ని చంపు” అన్నారు. గిద్యోను లేచి జెబహును, సల్మున్నాను చంపి, వాళ్ళ ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.
  • నాలుగు వందల మంది అమాలేకీయులు ఒంటెల మీద దావీదు నుంచి తప్పించుకున్నారు1 సమూ 30:17
    వచనాలు
    1 సమూ 30:17దావీదు అదను కనిపెట్టి సంధ్యవేళ మొదలు మరునాటి సాయంత్రం వరకూ వారిని చంపుతూ ఉంటే ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యువకులు తప్ప ఒక్కడు కూడా తప్పించుకొన్నవాడు లేకపోయాడు.
  • షేబ రాణి సుగంధ ద్రవ్యాలూ బంగారమూ మోసే ఒంటెలతో వచ్చింది1 రాజులు 10:2
    వచనాలు
    1 రాజులు 10:2ఆమె గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. సొలొమోనును కలిసి అతనితో తన మనసులో ఉన్న సంగతులన్నిటిని గురించి మాటలాడింది.
  • హజాయేలు ఎలీషాకు నలభై ఒంటెల బరువు కానుకలు తెచ్చాడు2 రాజులు 8:9
    వచనాలు
    2 రాజులు 8:9కాబట్టి హజాయేలు ఎలీషాకు కానుకగా దమస్కులో దొరికే మంచి వస్తువులను తీసుకుని వాటిని నలభై ఒంటెల మీద ఎక్కించి బయల్దేరాడు. హజాయేలు వచ్చి ఎలీషా ఎదుట నిలబడ్డాడు. “సిరియా రాజూ, నీ కొడుకులాంటి వాడూ అయిన బెన్హదదు తన రోగం నయమౌతుందా అని అడగడానికి నన్ను పంపాడు” అన్నాడు.
  • కల్దీయ దోపిడీదారులు యోబు ఒంటెలను ఎత్తుకుపోయారుయోబు 1:17
    వచనాలు
    యోబు 1:17అతడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. అతడు “కల్దీయ జాతి వారు మూడు గుంపులుగా వచ్చి ఒంటెలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని, పనివాళ్ళను చంపివేశారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.
  • యోహాను ఒంటె వెంట్రుకల బట్ట వేసుకున్నాడుమత్తయి 3:4, మార్కు 1:6
    వచనాలు
    మత్తయి 3:4ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
    మార్కు 1:6యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం.

యేసు మాటలు

  • సూది బెజ్జంలో ఒంటె దూరడం తేలికమత్తయి 19:24
    వచనాలు
    మత్తయి 19:24ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక.”
  • మీరు దోమను వడకట్టి ఒంటెను మింగుతారుమత్తయి 23:24
    వచనాలు
    మత్తయి 23:24అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు