Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › ఓడలు, సముద్ర ప్రయాణం

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో ఓడలు, సముద్ర ప్రయాణం

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 31 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • నోవహు ఓడ: గోఫెరు చెక్క, గదులతో, కీలుతో పూసినదిఆది 6:14–15
    వచనాలు
    ఆది 6:14–15కోనిఫర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి. నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి.
  • సొలొమోను ఎర్ర సముద్రం మీద ఎసోన్గెబెరులో ఓడలు కట్టించాడు1 రాజులు 9:26
    వచనాలు
    1 రాజులు 9:26సొలొమోను రాజు ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరంలోని ఏలతు దగ్గర, ఎసోన్గెబెరులో, ఓడలను నిర్మించాడు.
  • హీరాము నావికులు ఓఫీరు నుంచి 450 తలాంతుల బంగారం తెచ్చారు2 దిన 8:18
    వచనాలు
    2 దిన 8:18హీరాము తన పనివారి ద్వారా ఓడలనూ ఓడ నడిపే నైపుణ్యం గల పనివారిని పంపాడు. వీరు సొలొమోను పనివారితో కలిసి ఓఫీరుకు వెళ్ళి అక్కడనుండి 900 మణుగుల బంగారాన్ని ఆ ఓడలపై ఎక్కించుకుని సొలొమోను రాజు కోసం తీసుకు వచ్చారు.
  • ప్రతి మూడు సంవత్సరాలకు: బంగారం, వెండి, దంతాలు, కోతులు, నెమళ్ళు1 రాజులు 10:22
    వచనాలు
    1 రాజులు 10:22సముద్ర ప్రయాణానికి రాజుకు హీరాము ఓడలతోబాటు తర్షీషు ఓడలు కూడా ఉన్నాయి. ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు తీసుకు వస్తుండేవి.
  • యెహోషాపాతు ఓడలు ప్రయాణం మొదలుపెట్టకముందే బద్దలయ్యాయి1 రాజులు 22:48, 2 దిన 20:36–37
    వచనాలు
    1 రాజులు 22:48యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరు దేశానికి వెళ్ళడానికి తర్షీషు ఓడలను కట్టించాడు గానీ ఆ ఓడలు బయలుదేర లేదు. అవి ఎసోన్గెబెరు దగ్గర బద్దలై పోయాయి.
    2 దిన 20:36–37తర్షీషుకు వెళ్ళగలిగిన ఓడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు. అప్పుడు మారేషా వాడు దోదావాహు కొడుకు, ఎలీయెజెరు “నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు కాబట్టి యెహోవా నీ ప్రయత్నాలను నాశనం చేశాడు” అని యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు. ఆ ఓడలు తర్షీషుకు వెళ్లలేక బద్దలైపోయాయి.
  • యెహెజ్కేలు తూరును సరళ వృక్షం, దేవదారు, సింధూర వృక్షం, నారతో చేసిన ఓడగా చిత్రిస్తాడుయెహె 27:5–7
    వచనాలు
    యెహె 27:5–7నీ ఓడలను హెర్మోను పర్వత సరళ వృక్షం కలపతో కట్టారు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ దూలం చేశారు. బాషాను సింధూర చెక్కతో నీ తెడ్లు చేశారు. కుప్ర ద్వీపం నుంచి వచ్చిన కలపతో దంతపు పని పొదిగిన నీ ఓడ పైభాగం చేశారు. నీకు జెండాలుగా ఉండడానికి నీ తెరచాపలు ఐగుప్తులో తయారై బుట్టా వేసిన శ్రేష్ఠమైన నారతో చేశారు!
  • జమ్ము పడవలు నీళ్ళ మీద దూతలను తీసుకువెళ్ళాయియెష 18:2
    వచనాలు
    యెష 18:2అది సముద్రంపై నీళ్ళ మీద జమ్ము పడవల్లో రాయబారులను పంపిస్తూ ఉంది. వేగిరపడే వార్తాహరులారా! వెళ్ళండి. నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళండి! చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేసే ఆ బలమైన జనాల దగ్గరకూ, నదులు విభజించే వాళ్ళ దేశానికీ వెళ్ళండి!
  • పెద్ద ఓడను చాలా చిన్న చుక్కానితో నడిపిస్తారుయాకో 3:4
    వచనాలు
    యాకో 3:4ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు.
  • సముద్రంలో ఓడ వెళ్ళే దారి: ఆగూరుకు అది అర్థం కానంత ఆశ్చర్యంసామె 30:18–19
    వచనాలు
    సామె 30:18–19నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి. అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ.

సముద్ర ప్రయాణాలు

  • యోనా తర్షీషుకు వెళ్ళే ఓడకు చార్జీ చెల్లించాడుయోనా 1:3
    వచనాలు
    యోనా 1:3కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు.
  • తుపానులో నావికులు సరుకును సముద్రంలో పడవేశారుయోనా 1:4–5
    వచనాలు
    యోనా 1:4–5అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది. అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు.
  • వారు గట్టిగా తెడ్డు వేశారు కాని ఒడ్డుకు చేరలేకపోయారుయోనా 1:13
    వచనాలు
    యోనా 1:13అయినా వాళ్ళు ఓడను సముద్రం ఒడ్డుకు చేర్చడానికి తెడ్లు చాలా బలంగా వేశారు. సముద్రం ఇంకా చెలరేగుతూ ఉండడం వలన అలా చెయ్య లేకపోయారు.
  • యేసు సీమోను పడవలో నుంచి జనసమూహానికి బోధించాడులూకా 5:2–3
    వచనాలు
    లూకా 5:2–3ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. పడవల్లో సీమోను పడవ ఒకటి. యేసు ఆ పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు.
  • తుపానులో యేసు పడవ వెనుక భాగంలో తలగడ మీద నిద్రపోయాడుమార్కు 4:37–38
    వచనాలు
    మార్కు 4:37–38అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు.
  • శిష్యులు ఎదురుగాలికి వ్యతిరేకంగా కష్టపడి తెడ్డు వేశారుమార్కు 6:48
    వచనాలు
    మార్కు 6:48ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,
  • పౌలు మూడుసార్లు ఓడ బద్దలై, ఒక పగలు నడి సముద్రంలో గడిపాడు2 కొరింతీ 11:25
    వచనాలు
    2 కొరింతీ 11:25మూడు సార్లు నన్ను బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు పగిలిపోయాయి. ఒక పగలు, ఒక రాత్రి సముద్రంలో గడిపాను.

పౌలు రోమ్ ప్రయాణం

  • ఆసియ తీరం వెంట వెళ్ళే అద్రముత్తియ ఓడఅపొ.కా 27:2
    వచనాలు
    అపొ.కా 27:2ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అగస్టస్ సైనిక దళంలోని ఎక్కి మేము బయలుదేరాం. మాసిదోనియ లోని తెస్సలోనిక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడ ఉన్నాడు.
  • ఉపవాస దినం తర్వాత సముద్ర ప్రయాణం ప్రమాదకరంగా మారిందిఅపొ.కా 27:9
    వచనాలు
    అపొ.కా 27:9చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచింది కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.
  • ఈశాన్య పెనుగాలి కొట్టింది; వారు ఓడ కింద తాళ్ళు బిగించారుఅపొ.కా 27:14, అపొ.కా 27:17
    వచనాలు
    అపొ.కా 27:14కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది.
    అపొ.కా 27:17దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టారు. ఓడ సూర్తిస్ అనే ఇసుకతిప్పకు తగిలి పగిలిపోతుందేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకుపోయారు.
  • సరుకు, తర్వాత ఓడ సామగ్రి సముద్రంలో పడవేశారుఅపొ.కా 27:18–19
    వచనాలు
    అపొ.కా 27:18–19గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలుపెట్టారు. మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు.
  • లోతు కొలిచారు: నీళ్ళు తక్కువవుతున్నాయిఅపొ.కా 27:28
    వచనాలు
    అపొ.కా 27:28ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు 120 అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్ళిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి 90 అడుగుల లోతని తెలుసుకున్నారు.
  • ఓడ వెనుక భాగం నుంచి నాలుగు లంగర్లు వేశారుఅపొ.కా 27:29
    వచనాలు
    అపొ.కా 27:29అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకుని ఉన్నారు.
  • నావికులు చిన్న పడవలో తప్పించుకోవాలని చూశారు; సైనికులు దాని తాళ్ళు కోసేశారుఅపొ.కా 27:30, అపొ.కా 27:32
    వచనాలు
    అపొ.కా 27:30అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి, లంగరులు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు.
    అపొ.కా 27:32వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు.
  • ఓడలో 276 మంది ఉన్నారుఅపొ.కా 27:37
    వచనాలు
    అపొ.కా 27:37ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం.
  • ఓడను తేలిక చేయడానికి వారు గోధుమలను సముద్రంలో పారబోశారుఅపొ.కా 27:38
    వచనాలు
    అపొ.కా 27:38వారు తిని తృప్తి పొందిన తరువాత, గోదుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు.
  • ఓడ ఇసుక దిబ్బకు తగిలి, దాని వెనుక భాగం బద్దలైందిఅపొ.కా 27:41
    వచనాలు
    అపొ.కా 27:41కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకుపోయి ఇసుకలో ఇరుక్కుపోయింది. అందువల్ల ఓడ ముందు భాగం కూరుకుపోయి కదలలేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలైపోతూ ఉంది.
  • అందరూ ఒడ్డుకు చేరారు, కొందరు చెక్క పలకల మీదఅపొ.కా 27:44
    వచనాలు
    అపొ.కా 27:44మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకుని ఒడ్డుకు చేరాం.
  • కవల దేవుళ్ళ చిహ్నం ఉన్న అలెగ్జాండ్రియ ఓడలో రోమ్‌కుఅపొ.కా 28:11
    వచనాలు
    అపొ.కా 28:11కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు