Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › పుట్టినరోజులు

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో పుట్టినరోజులు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 8 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • ఫరో తన పుట్టినరోజున తన అధికారులకు విందు చేశాడుఆది 40:20
    వచనాలు
    ఆది 40:20మూడవ రోజు ఫరో పుట్టినరోజు. అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు. వారందరిలో గిన్నె అందించేవారి నాయకుడిపైనా రొట్టెలు చేసే వారి నాయకుడిపైనా మిగతా సేవకులందరికంటే ధ్యాస పెట్టాడు.
  • ఆ రోజు అతడు గిన్నె అందించేవాణ్ణి తిరిగి నియమించి, రొట్టెలు కాల్చేవాణ్ణి ఉరితీయించాడుఆది 40:21–22
    వచనాలు
    ఆది 40:21–22గిన్నె అందించేవారి నాయకుని ఉద్యోగం అతనికి తిరిగి ఇచ్చాడు, కాబట్టి అతడు ఫరో చేతికి మళ్ళీ గిన్నె అందించాడు. యోసేపు చెప్పినట్టుగా రొట్టెలు చేసేవారి నాయకుణ్ణి ఉరి తీయించాడు.
  • హేరోదు తన పుట్టినరోజున గలిలయ నాయకులకు విందు చేశాడుమార్కు 6:21
    వచనాలు
    మార్కు 6:21ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సైన్యాధిపతులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు.
  • హేరోదియ కుమార్తె నాట్యం చేసి యోహాను తల అడిగిందిమత్తయి 14:6–8
    వచనాలు
    మత్తయి 14:6–8హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది. కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు. తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం, “బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.
  • యోబు తాను పుట్టిన రోజును శపించాడుయోబు 3:1–3
    వచనాలు
    యోబు 3:1–3ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు. యోబు ఇలా అన్నాడు. నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. “మగ పిల్లవాడు పుట్టాడు” అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్టయితే బాగుండేది. నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది. ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది.
  • యిర్మీయా: నేను పుట్టిన రోజు శాపగ్రస్తం అవుతుంది గాకయిర్మీ 20:14, యిర్మీ 20:18
    వచనాలు
    యిర్మీ 20:14నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక.
    యిర్మీ 20:18కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?”
  • పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు, పుట్టిన రోజు కంటే మరణ దినం మేలుప్రస 7:1
    వచనాలు
    ప్రస 7:1పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకడు పుట్టిన రోజు కంటే చనిపోయిన రోజే మేలు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు