అన్వేషించండి › అంశాలు › తాళంచెవులు, ముద్రలు, ముద్రికలు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్‌లో తాళంచెవులు, ముద్రలు, ముద్రికలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 27 భాగాలు, వాక్యం వాక్యంగా.
తాళంచెవులు, గడియలు
- ఏహూదు రాజైన ఎగ్లోను మేడ గది తలుపులు తన వెనుక తాళం వేశాడున్యాయా 3:23
వచనాలు
న్యాయా 3:23అప్పుడు ఏహూదు వసారాలోకి వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టాడు.
- సేవకులు కనిపెట్టి, తర్వాత తాళంచెవి తీసుకుని తలుపులు తెరిచారున్యాయా 3:24–25
వచనాలు
న్యాయా 3:24–25అతడు వెళ్ళిపోయిన తరువాత ఆ రాజు సేవకులు లోపలికి వచ్చి చూసినప్పుడు ఆ మేడగది తలుపుల గడియలు వేసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు, రాజు తన చల్లని గదిలో మూత్ర విసర్జన చేస్తున్నాడనుకున్నారు. వాళ్ళు ఎంతసేపు కనిపెట్టినా రాజు ఆ గది తలుపులు తీయకపోవడంతో వాళ్ళు తాళపు చెవి తెచ్చి తలుపులు తీసి చూశారు. వాళ్ళ రాజు చనిపోయి నేలమీద పడి ఉన్నాడు.
- లేవీయులు రాత్రి దేవుని మందిరానికి కాపలా ఉండి ప్రతి ఉదయం దాన్ని తెరిచేవారు1 దిన 9:27
వచనాలు
1 దిన 9:27వాళ్ళు దేవుని మందిరానికి కావలివారు కాబట్టి రాత్రంతా మేలుకుని కాపలా కాయడం, ఉదయాన్నే మందిరపు ద్వారాలు తెరవడం వాళ్ళ విధి.
- యెరూషలేము ద్వారాలను తలుపులు, గడియలు, అడ్డకర్రలతో మళ్ళీ కట్టారునెహె 3:3
వచనాలు
నెహె 3:3హస్సెనాయా వంశం వారు చేప ద్వారం కట్టారు. వారు దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.
ముద్రలు, ముద్రికలు
- యూదా తన ముద్ర, దారం, కర్రను తాకట్టుగా తామారు దగ్గర విడిచిపెట్టాడుఆది 38:18
వచనాలు
ఆది 38:18అతడు “ఏమి తాకట్టు పెట్టమంటావ్?” అని ఆమెను అడిగాడు. ఆమె “నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర” అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది.
- తామారు: ఈ ముద్ర, దారం, కర్ర ఎవరివి?ఆది 38:25
వచనాలు
ఆది 38:25ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరికి అతని వస్తువులను పంపి “ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి” అని చెప్పించింది.
- ఫరో తన ముద్ర ఉంగరాన్ని యోసేపు వేలికి తొడిగాడుఆది 41:42
వచనాలు
ఆది 41:42ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్ఠమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.
- యెజెబెలు అహాబు పేరుతో ఉత్తరాలు రాసి అతని ముద్రతో ముద్రించింది1 రాజులు 21:8
వచనాలు
1 రాజులు 21:8ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకూ ఇంకా ముఖ్యమైన వారికీ పంపింది.
- అహష్వేరోషు తన ముద్ర ఉంగరాన్ని హామానుకు ఇచ్చాడుఎస్తే 3:10
వచనాలు
ఎస్తే 3:10రాజు తన రాజముద్రిక తీసి దాన్ని హమ్మెదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామానుకు ఇచ్చాడు. ఇతడు యూదులకు శత్రువు.
- హామాను ఆజ్ఞ రాజు పేరుతో రాయబడి ఉంగరంతో ముద్రించబడిందిఎస్తే 3:12
వచనాలు
ఎస్తే 3:12మొదటి నెల పదమూడో రోజున రాజుగారి లేఖికులను పిలిపించారు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం, రాజు నియమించిన సంస్థానాల అధికారులకు, వివిధ సంస్థానాల పాలకులకు, వివిధ ప్రజల అధికారులకు, ప్రజలందరిపై ఉన్న కార్యనిర్వాహక అధిపతులకు వారి వారి లిపి ప్రకారం, వివిధ ప్రజల భాషల్లో రాసి పంపాలని ఆజ్ఞ అయింది. రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులు తాకీదులు రాశారు. వాటిపై రాజముద్ర వేశారు.
- హామాను నుంచి తిరిగి తీసుకున్న ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చారుఎస్తే 8:2
వచనాలు
ఎస్తే 8:2అతడు రాజు సన్నిధికి వచ్చినప్పుడు రాజు హామాను చేతిలోనుండి తీసుకున్న తన ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిపై అధికారిగా ఉంచింది.
- రాజ ముద్ర ఉంగరంతో ముద్రించిన శాసనాన్ని రద్దు చేయలేరుఎస్తే 8:8
వచనాలు
ఎస్తే 8:8అయితే రాజు పేరున రాసి రాజ ముద్రిక వేసిన శాసనాన్ని మానవ మాత్రుడెవరూ మార్చలేడు. కాబట్టి మీకిష్టమైనట్టు మీరు రాజునైన నా పేర యూదులకు అనుకూలంగా వేరొక శాసనం రాయించి రాజ ముద్రికతో ముద్రించండి.”
- మొర్దెకై ఉత్తరాలకు ముద్ర వేసి గుర్రపు రౌతుల ద్వారా పంపాడుఎస్తే 8:10
వచనాలు
ఎస్తే 8:10మొర్దెకై అహష్వేరోషు పేర శాసనాలు రాయించి రాజముద్రికతో ముద్రించాడు. గుర్రాలపై, అంటే రాచకార్యాలకు వినియోగించే మేలు జాతి అశ్వాలపై అంచెలుగా ప్రయాణించే వార్తాహరులతో ఆ శాసనాలను పంపించాడు.
- సింహాల గుహను రాజు ఉంగరంతో, అతని ప్రముఖుల ఉంగరాలతో ముద్రించారుదాని 6:17
వచనాలు
దాని 6:17ఆ వ్యక్తులు ఒక పెద్ద రాయి తీసుకువచ్చి ఆ గుహ ద్వారం ఎదుట వేసి దాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో రాజు తన నిర్ణయం మార్చుకుంటాడేమోనని భావించి, గుహ ద్వారానికి రాజముద్రను, అతని రాజ ప్రముఖుల ముద్రలను వేశారు.
- నాయకుల, లేవీయుల, యాజకుల పేర్లతో ముద్రించిన లిఖిత ఒప్పందంనెహె 9:38, నెహె 10:1
- యిర్మీయా క్రయపత్రం మీద సంతకం చేసి ముద్రించాడు: ఒక ప్రతి ముద్రించినది, ఒక ప్రతి తెరిచినదియిర్మీ 32:10–11
వచనాలు
యిర్మీ 32:10–11అప్పుడు నేను దాన్ని తోలు చుట్ట మీద రాసి ముద్ర వేసి సాక్షుల సంతకాలు పెట్టించుకున్నాను. ఆ తరువాత వెండిని తూచి ఇచ్చాను. ఆ తరువాత ఆజ్ఞల, చట్టాల ప్రకారం ముద్ర ఉన్న, ముద్ర లేని దస్తావేజులను తీసుకున్నాను.
- చాలా కాలం నిలిచి ఉండేలా క్రయపత్రాలను మట్టి కుండలో పెట్టారుయిర్మీ 32:14
వచనాలు
యిర్మీ 32:14“ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘కొనుగోలు రసీదుతో పాటు ఈ రాత ప్రతులు, అంటే, ముద్ర వేసిన రాత పత్రం, ముద్ర లేని రాత పత్రం తీసుకుని, అవి చాలా కాలం ఉండేలా వాటిని కొత్త కుండలో ఉంచు.’
- రాయికి ముద్ర వేసి, కాపలా పెట్టి యేసు సమాధిని భద్రపరిచారుమత్తయి 27:66
వచనాలు
మత్తయి 27:66వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.
ముద్రలా చెక్కినవి
- ఇశ్రాయేలు కుమారుల పేర్లు ముద్రలా చెక్కిన రెండు గోమేధిక రాళ్ళునిర్గ 28:9, నిర్గ 28:11, నిర్గ 39:6
వచనాలు
నిర్గ 28:9నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను అంటే వారి పుట్టుక క్రమం చొప్పున
నిర్గ 28:11ముద్ర మీద చెక్కిన పనిలాగా ఆ రెండు రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్లు చెక్కి బంగారు కుదురుల్లో వాటిని పొదగాలి.
నిర్గ 39:6బంగారు అంచులలో పొదిగిన లేత పచ్చలు సిద్ధం చేశారు. ఇశ్రాయేలు కొడుకుల పేర్లు శాశ్వతంగా ఉండేలా ముద్రల రూపంలో చెక్కారు.
- పతకపు పన్నెండు రాళ్ళు, ఒక్కొక్కదాని మీద ఒక గోత్రం పేరు ముద్రలా చెక్కబడిందినిర్గ 28:21, నిర్గ 39:14
వచనాలు
నిర్గ 28:21ఆ రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్ల ప్రకారం పన్నెండు పేర్లు ఉండాలి. ముద్ర మీద చెక్కినట్టు వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ఉండాలి.
నిర్గ 39:14ఇశ్రాయేలు కొడుకులు పన్నెండు మంది పేర్ల ప్రకారం ఆ రత్నాలు పన్నెండు. ఆ రత్నాలపై ముద్రపై చెక్కిన విధంగా పన్నెండు గోత్రాల పేర్లు ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క పేరు చెక్కారు.
- ముద్రలా చెక్కిన బంగారు రేకు: యెహోవాకు ప్రతిష్ఠితంనిర్గ 28:36, నిర్గ 39:30
వచనాలు
నిర్గ 28:36నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్టు దానిపై ‘యెహోవాకు పరిశుద్ధం’ అనే మాట చెక్కాలి.
నిర్గ 39:30స్వచ్ఛమైన బంగారంతో కిరీటం వంటి ఆకారంలో ఒక రేకు తయారు చేసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా దాని మీద “యెహోవాకు పవిత్రం” అని చెక్కించారు.
- పరమగీతంలోని ఒక మాట: నీ హృదయం మీద నన్ను ముద్రలా ఉంచుకోపరమ 8:6
వచనాలు
పరమ 8:6నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో. ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది. మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది. దాని మంటలు ఎగిసి పడతాయి. అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు