అన్వేషించండి › అంశాలు › గోపురాలు, కావలి గోపురాలు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో గోపురాలు, కావలి గోపురాలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 30 భాగాలు, వాక్యం వాక్యంగా.
- బాబెలు దగ్గర: ఆకాశాన్ని అంటే గోపురం ఉన్న పట్టణంఆది 11:4
వచనాలు
ఆది 11:4వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు.
- ఆ పట్టణాన్నీ గోపురాన్నీ చూడడానికి యెహోవా దిగి వచ్చాడుఆది 11:5
వచనాలు
ఆది 11:5యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.
- వారు పట్టణం కట్టడం మానేశారు; దానికి బాబెలు అని పేరు వచ్చిందిఆది 11:8–9
వచనాలు
ఆది 11:8–9ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది. అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.
- యాకోబు ఏదెరు గోపురం అవతల తన గుడారం వేశాడుఆది 35:21
వచనాలు
ఆది 35:21ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.
యుద్ధంలో గోపురాలు
- గిద్యోను పెనూయేలు గోపురాన్ని బెదిరించి, తర్వాత కూలదోశాడున్యాయా 8:9, న్యాయా 8:17
వచనాలు
న్యాయా 8:9“నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను” అని పెనూయేలు వాళ్ళతో చెప్పాడు.
న్యాయా 8:17అతడు పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివాళ్ళను చంపాడు.
- అబీమెలెకు షెకెము గోపురాన్ని కాల్చినప్పుడు సుమారు వెయ్యి మంది చనిపోయారున్యాయా 9:46, న్యాయా 9:49
వచనాలు
న్యాయా 9:46షెకెము గోపుర నాయకులు ఆ వార్త విని, ఏల్ బెరీతు గుడి కోటలోకి చొరబడ్డారు.
న్యాయా 9:49అప్పుడు ఆ మనుషులందరూ ప్రతివాడూ ఒక్కొక్క కొమ్మ నరికి అబీమెలెకు చేసినట్టుగానే ఆ కోట దగ్గర వాటిని పేర్చి, వాటితో ఆ కోటను తగలబెట్టారు. అప్పుడు షెకెము గోపుర యజమానులు, వాళ్ళల్లో ఉన్న స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చనిపోయారు.
- తేబేసులో ప్రజలు ఒక బలమైన గోపురంలో తాళం వేసుకున్నారున్యాయా 9:50–52
వచనాలు
న్యాయా 9:50–52తరువాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి తేబేసును ముట్టడించి, దాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టణం మధ్యలో ఒక బలమైన గోపురం ఉంది. స్త్రీ పురుషులు, పట్టణపు యజమానులు, అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకు ఎక్కారు. అబీమెలెకు ఆ గోపురం దగ్గరికి వచ్చి దాని మీద యుద్ధం చేసి అగ్నితో దాన్ని కాల్చడానికి ఆ గోపుర ద్వారం దగ్గరికి వచ్చాడు.
- దాని పైకప్పు మీద నుంచి ఒక స్త్రీ అబీమెలెకు మీద తిరగలి రాయి పడవేసిందిన్యాయా 9:53
వచనాలు
న్యాయా 9:53అప్పుడు ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగలి రాయిని పడేసినందువల్ల అతని పుర్రె పగిలింది.
- యెజ్రెయేలులో గోపురం మీది కావలివాడు యెహూ సైన్యం రావడం చూశాడు2 రాజులు 9:17
వచనాలు
2 రాజులు 9:17యెజ్రెయేలు ప్రాకారం మీద ఒక కాపలా వాడు కావలి కాస్తున్నాడు. వాడు ప్రాకారం పైనుండి కొంత దూరంలో వస్తున్న యెహూనూ అతనితో వస్తున్న సైనిక దళాన్నీ చూసి “ఒక సైనిక దళం రావడం నాకు కనిపిస్తుంది” అన్నాడు. అప్పుడు యెహోరాము “ఒక గుర్రపు రౌతును పిలవండి. ఆ వచ్చేవాళ్ళను కలుసుకోడానికి అతణ్ణి పంపించండి. అతడు వాళ్ళను ‘శాంతిభావంతో వస్తున్నారా’ అని అడగాలి” అని చెప్పాడు.
- కావలి గోపురం మొదలుకొని ప్రాకారాలున్న పట్టణం వరకు2 రాజులు 17:9, 2 రాజులు 18:8
వచనాలు
2 రాజులు 17:9ఇంకా ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకమైన పనులు రహస్యంగా చేస్తూ, తమ పట్టణాలన్నిటిలో బురుజుల మీదా ప్రాకారాల మీదా పూజా స్థలాలు కట్టుకున్నారు.
2 రాజులు 18:8ఇంకా గాజా పట్టణం, దాని సరిహద్దుల వరకూ బురుజులనుండి ప్రాకారాల వరకూ ఫిలిష్తీయులపై దాడి చేశాడు.
గోపురాలు కట్టిన రాజులు
- ఆసా: గోడలు, గోపురాలు, తలుపులు, అడ్డకర్రలతో పట్టణాలు2 దిన 14:7
వచనాలు
2 దిన 14:7అతడు యూదా వారికి ఈ విధంగా ప్రకటన చేశాడు “మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము. అందువలన ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించాడు. దేశంలో మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనం ఈ పట్టణాలను కట్టించి, వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను అమర్చుదాం.” కాబట్టి వారు పట్టణాలను నిర్మించి వృద్ధి పొందారు.
- ఉజ్జియా యెరూషలేము ద్వారాల దగ్గరా అరణ్యంలోనూ గోపురాలు కట్టించాడు2 దిన 26:9–10
వచనాలు
2 దిన 26:9–10ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మం దగ్గర, లోయ గుమ్మం దగ్గర, ప్రాకారపు మూల దగ్గర, బురుజులు కట్టించి వాటి చుట్టూ ప్రాకారాలు ఏర్పరచాడు. అతడు అరణ్యంలో కావలి గోపురాలు కట్టించి చాలా బావులు తవ్వించాడు. అతనికి పల్లపు భూముల్లో, మైదాన భూముల్లో చాలా పశు సంపద ఉంది. కాబట్టి కొండ సీమలో ప్రాంతంలో అతనికి సారవంతమైన భూమీ రైతులూ ద్రాక్షతోట పనివారూ ఉన్నారు. ఎందుకంటే అతనికి వ్యవసాయమంటే ఎంతో ఇష్టం.
- ఉజ్జియా యంత్రాలు గోపురాల మీద నుంచి బాణాలు వేశాయి, రాళ్ళు విసిరాయి2 దిన 26:15
వచనాలు
2 దిన 26:15అతడు అంబులనూ పెద్దరాళ్లనూ ప్రయోగించడానికి నిపుణులు కల్పించిన యంత్రాలను యెరూషలేములో చేయించి కోటల్లో ప్రాకారాల్లో ఉంచాడు. అతడు స్థిరపడే వరకూ అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది కాబట్టి అతని కీర్తి సుదూర ప్రాంతాలకు వ్యాపించింది.
- యోతాము అడవుల్లో కోటలూ గోపురాలూ కట్టించాడు2 దిన 27:4
వచనాలు
2 దిన 27:4అతడు యూదా కొండప్రాంతంలో పట్టణాలనూ, అరణ్య ప్రాంతంలో కోటలనూ, బురుజులనూ కట్టించాడు.
- హిజ్కియా కూలిన గోడను మళ్ళీ కట్టించి దాని మీద గోపురాలు లేపాడు2 దిన 32:5
వచనాలు
2 దిన 32:5రాజు ధైర్యం తెచ్చుకుని, పాడైన గోడ అంతా తిరిగి కట్టించి, గోపురాల వరకూ దాన్ని ఎత్తు చేయించి, బయట మరొక గోడ కట్టించి, దావీదు పట్టణంలో మిల్లో కోట బాగు చేయించాడు. చాలా ఆయుధాలనూ డాళ్లనూ చేయించాడు.
యెరూషలేము గోపురాలు
- నూరవ గోపురం, హనన్యేలు గోపురంనెహె 3:1, నెహె 12:39
వచనాలు
నెహె 3:1ప్రధానయాజకుడు ఎల్యాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు నూరవ గోపురం, హనన్యేలు గోపురం వరకూ ప్రతిష్టించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు.
నెహె 12:39ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయీం ద్వారం మీదగా వెళ్లి, పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, హనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్ళి, గొర్రెల ద్వారం వరకూ ఎక్కి బందీ గృహం ద్వారం దగ్గర నిలిచారు.
- పొయ్యిల గోపురంనెహె 3:11, నెహె 12:38
వచనాలు
నెహె 3:11రెండవ భాగాన్ని, అగ్నిగుండాల గోపురాన్ని హారిము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు బాగు చేశారు.
నెహె 12:38కృతజ్ఞతాస్తుతి గీతాలు పాడేవాళ్ళ రెండవ గుంపు వారికి ఎదురుగా బయలుదేరింది. గోడపై ఉన్న సగం మంది అగ్నిగుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ దాకా వెళ్ళారు. వారితో కలసి నేను కూడా వెళ్లాను.
- ఓపెలు గోడ దగ్గర బయటికి పొడుచుకు వచ్చిన పెద్ద గోపురంనెహె 3:25–27
వచనాలు
నెహె 3:25–27ఆ భాగాన్ని ఆనుకుని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజు భవనం ఉండే మహా గోపురం దాకా ఊజై కొడుకు పాలాలు బాగు చేశాడు. దాని పక్కన పరోషు కొడుకు పెదాయా బాగు చేశాడు. ఓపెలులో నివసించే దేవాలయ సేవకులు తూర్పున నీటి ద్వారం పక్కన, గోపురం దగ్గర బాగు చేశారు. తెకోవీయులు ఓపెలు గోడ వరకూ గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న మరో భాగాన్ని బాగు చేశారు.
- సిలోయం గోపురం కూలినప్పుడు పద్దెనిమిది మంది చనిపోయారులూకా 13:4
వచనాలు
లూకా 13:4అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా?
ద్రాక్షతోటలు, సూక్తులు
- ద్రాక్షతోట యజమాని కావలి గోపురం కట్టి ద్రాక్ష గానుగ తొట్టి తవ్విస్తాడుయెష 5:2, మత్తయి 21:33
వచనాలు
యెష 5:2ఆయన దాన్ని బాగా దున్ని రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించాడు. దాని మధ్య కావలి గోపురం ఒకటి కట్టించి ద్రాక్షలు తొక్కే తొట్టి తొలిపించాడు. ద్రాక్షపండ్లు కాయాలని ఎదురు చూశాడు గానీ అది పిచ్చి ద్రాక్షకాయలు కాసింది.
మత్తయి 21:33“ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు.
- యేసు: గోపురం కట్టే ముందు ఖర్చు లెక్క చూసుకోలూకా 14:28–30
వచనాలు
లూకా 14:28–30“మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దాన్ని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా? అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే, చూస్తున్న వారంతా ‘ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు’ అంటూ వేళాకోళం చేస్తారు.
- ఒక కావలివాడు: రోజు తర్వాత రోజు నేను కావలి గోపురం మీద నిలబడి ఉంటానుయెష 21:8
వచనాలు
యెష 21:8ఆ కాపలా వాడు ఇలా అరుస్తాడు. “నా ప్రభూ, ఈ పహారా స్తంభంపై ప్రతి రోజూ, రోజంతా నిలబడి ఉన్నాను. రాత్రంతా నేను కాపలా కాస్తూనే ఉన్నాను.”
- పరమగీతం: నీ మెడ దావీదు గోపురం లాంటిదిపరమ 4:4, పరమ 7:4
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు