అన్వేషించండి › అంశాలు › ఎడమచేతి వాటంవారు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్‌లో ఎడమచేతి వాటంవారు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 5 భాగాలు, వాక్యం వాక్యంగా.
- గెరా కుమారుడైన ఏహూదు ఎడమచేతి వాటం గల బెన్యామీనీయుడున్యాయా 3:15
వచనాలు
న్యాయా 3:15ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు బెన్యామీనీయుడైన గెరా కొడుకు ఏహూదు అనే న్యాయాధిపతిని వాళ్ళ కోసం యెహోవా నియమించాడు. అతడు ఎడమచేతి వాటం గలవాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం పంపినప్పుడు
- అతడు మూర పొడవున్న కత్తిని తన కుడి తొడకు కట్టుకున్నాడున్యాయా 3:16
వచనాలు
న్యాయా 3:16ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల కత్తిని చేయించుకుని, తన వస్త్రంలో తన కుడి తొడమీద
- ఎడమ చేత్తో దాన్ని తీసి రాజైన ఎగ్లోనును చంపాడున్యాయా 3:21–22
వచనాలు
న్యాయా 3:21–22అప్పుడు ఏహూదు తన ఎడమచేతిని చాపి తన కుడి తొడమీదనుంచి కత్తి తీసి అతడి కడుపులో బలంగా పొడిచాడు. ఆ కత్తితో పాటు దాని పిడి కూడా అతని కడుపులోకి దిగి పోయింది. ఆ కత్తి అతని వెనుకనుంచి బయటకు వచ్చింది. అతని క్రొవ్వు ఆ కత్తిని కప్పేసిన కారణంగా ఏహూదు ఆ కత్తిని అతని శరీరంలోనుంచి బయటకు తీయలేదు.
- బెన్యామీనులో వెంట్రుక వాసి గురి తప్పకుండా వడిసెలతో రాయి విసిరే ఎడమచేతి వాటంవారు 700 మందిన్యాయా 20:16
వచనాలు
న్యాయా 20:16వాళ్ళందరిలో ప్రత్యేకంగా ఏడు వందలమంది ఎడమ చేత్తో యుద్ధం చేస్తారు. వీరు ఒక ఒడిసెలలో రాయి పెట్టి తలవెంట్రుకనైనా కొట్టగల నైపుణ్యం గలవారు.
- దావీదు బెన్యామీనీయ విలుకాళ్ళు ఏ చేత్తోనైనా రాళ్ళు విసిరేవారు, బాణాలు వేసేవారు1 దిన 12:2
వచనాలు
1 దిన 12:2వీళ్ళు బాణాలు ధరించి, కుడి ఎడమ చేతులతో, వడిసెలతో రాళ్లు రువ్వడంలో, బాణాలు వేయడంలో సామర్ధ్యం ఉన్నవాళ్ళు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు