అన్వేషించండి › అంశాలు › తిరగళ్ళు, పొయ్యిలు, రొట్టెలు కాల్చడం
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో తిరగళ్ళు, పొయ్యిలు, రొట్టెలు కాల్చడం
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 32 భాగాలు, వాక్యం వాక్యంగా.
తిరగలి రాళ్ళు, విసరడం
- తిరగలి రాళ్ళను అప్పుకు తాకట్టుగా తీసుకోకూడదుద్వితీ 24:6
వచనాలు
ద్వితీ 24:6తిరగలిని, తిరగటి పైరాతిని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే ఒకడి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే.
- ఐగుప్తులో అతి తక్కువ స్థాయి దాసి తిరగలి దగ్గర పనిచేసేదినిర్గ 11:5
వచనాలు
నిర్గ 11:5ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకుని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి.
- మన్నాను తిరగలిలో విసిరేవారు లేదా రోటిలో దంచేవారుసంఖ్యా 11:8
వచనాలు
సంఖ్యా 11:8ప్రజలు శిబిరం మైదానంలో నడుస్తూ మన్నాని సేకరించేవారు. తిరగలిలో విసిరి గానీ రోట్లో దంచి గానీ దాన్ని పిండి చేసి పెనం పైన కాల్చి రొట్టెలు చేసే వారు. దాని రుచి తాజా ఒలీవ నూనె రుచిలా ఉండేది.
- తేబేసులో ఒక స్త్రీ అబీమెలెకు మీద తిరగలి పైరాయిని పడవేసిందిన్యాయా 9:53, 2 సమూ 11:21
వచనాలు
న్యాయా 9:53అప్పుడు ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగలి రాయిని పడేసినందువల్ల అతని పుర్రె పగిలింది.
2 సమూ 11:21ఎరుబ్బెషెతు కొడుకు అబీమెలెకు ఎలా చనిపోయాడు? తేబేసు దగ్గర ఒక స్త్రీ తిరగలి రాయిని గోడపై నుండి అతని మీద వేయడం వల్లనే గదా అతడు చనిపోయింది? ప్రాకారం దగ్గరికి మీరెందుకు వెళ్ళారు?’ అని అడిగితే, నువ్వు, ‘తమ సేవకుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పు” అని చెప్పి ఆ సైనికుణ్ణి పంపాడు.
- గుడ్డివాడై సంకెళ్ళతో బంధించబడిన సంసోను గాజా చెరసాలలో ధాన్యం విసిరాడున్యాయా 16:21
వచనాలు
న్యాయా 16:21అప్పుడు ఫిలిష్తీయులు అతణ్ణి బంధించి అతని కళ్ళు ఊడబెరికారు. గాజాకు అతణ్ణి తీసుకు వచ్చి ఇత్తడి సంకెళ్ళతో బంధించారు.
- కలిసి ధాన్యం విసిరే ఇద్దరు స్త్రీల గురించి యేసు మాట్లాడతాడుమత్తయి 24:41, లూకా 17:35
వచనాలు
మత్తయి 24:41ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది.
లూకా 17:35ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.”
- యేసు: మెడకు పెద్ద తిరగలి రాయి కట్టి ముంచివేయబడడం మేలుమత్తయి 18:6
వచనాలు
మత్తయి 18:6కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
- యిర్మీయా తిరగలి చప్పుడును పెళ్ళికూతురు, పెళ్ళికొడుకుల స్వరాలతో కలిపి చెబుతాడుయిర్మీ 25:10
వచనాలు
యిర్మీ 25:10సంతోషసంబరాల ధ్వనులూ, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్వరాలూ, తిరుగటిరాళ్ల శబ్దం, దీపాల వెలుగూ వారిలో ఉండకుండా చేస్తాను.
- విలాపవాక్యాలు: యువకులు తిరగళ్ళ దగ్గర కష్టపడతారువిలాప 5:13
వచనాలు
విలాప 5:13బలమైన యువకులను గానుగల దగ్గరికి తీసుకొచ్చారు. యువకులు కొయ్య దుంగలు మొయ్యలేక తూలిపడ్డారు.
పొయ్యిలు, రొట్టెలు కాల్చడం
- కప్పలు ఐగుప్తు పొయ్యిల్లోకీ పిండి పిసికే తొట్టెల్లోకీ వస్తాయినిర్గ 8:3
వచనాలు
నిర్గ 8:3నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కివస్తాయి.
- నైవేద్యాలను పొయ్యిలో కాల్చవచ్చు లేదా పెనం మీద వండవచ్చులేవీ 2:4, లేవీ 7:9
వచనాలు
లేవీ 2:4మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యం అర్పించాలంటే పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె కలిపి చేసిన మెత్తని చపాతీ అయి ఉండాలి. లేదా సన్నని పిండితో, నూనె రాసి చేసిన అప్పడంలా గట్టిగా ఉండాలి.
లేవీ 7:9పొయ్యి మీద కుండలోనైనా, పెనం మీదనైనా వండిన లేదా కాల్చిన నైవేద్యం అంతా యాజకుడికే చెందుతుంది.
- అపవిత్రమైన కళేబరం తగిలిన పొయ్యిని పగలగొట్టాలిలేవీ 11:35
వచనాలు
లేవీ 11:35వాటి కళేబరాల్లో ఏ కొంచెమన్నా దేనిపైనన్నా పడితే అది అపవిత్రం అవుతుంది. అది పొయ్యి అయినా, వంటపాత్ర అయినా దాన్ని ముక్కలుగా పగలగొట్టాలి. అది అపవిత్రం, అది మీకు అపవిత్రంగానే ఉండాలి.
- ధర్మశాస్త్రంలోని ఒక శాపం: పది మంది స్త్రీలు ఒకే పొయ్యిలో రొట్టెలు కాలుస్తారులేవీ 26:26
వచనాలు
లేవీ 26:26నేను మీ ఆహారాన్ని, అంటే మీ ప్రాణాధారం తీసేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు రొట్టెలు చేసి కొలత ప్రకారం మీకు ఇస్తారు. మీరు తింటారు గాని తృప్తి పొందరు.
- శారా మూడు మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు కాల్చాలిఆది 18:6
వచనాలు
ఆది 18:6అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు.
- లోతు తన అతిథుల కోసం పులియని రొట్టెలు కాల్చాడుఆది 19:3
వచనాలు
ఆది 19:3కానీ అతడు వాళ్ళను చాలా బలవంతపెట్టాడు. వారు అతనితో కలసి అతని ఇంటికి వెళ్ళారు. అతడు వారికి విందు చేశాడు. అతడు వారి కోసం పొంగని రొట్టెలు కాల్చి ఇచ్చాడు. వారు భోజనం చేశాడు.
- ఫరో ముఖ్య రొట్టెలవాడు తన తలపై మూడు రొట్టెల బుట్టల గురించి కలగన్నాడుఆది 40:16–17
వచనాలు
ఆది 40:16–17రొట్టెలు చేసే వాడు యోసేపు మంచి అర్థం చెప్పడం చూసి అతనితో “నాకూ ఒక కల వచ్చింది. మూడు రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి. పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి” అన్నాడు.
- ఐగుప్తు నుంచి బయలుదేరుతూ ఇశ్రాయేలు తాము మోసుకువెళ్ళిన పిండి ముద్దతో పులియని రొట్టెలు కాల్చిందినిర్గ 12:34, నిర్గ 12:39
వచనాలు
నిర్గ 12:34ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు.
నిర్గ 12:39తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు.
- విశ్రాంతి దినానికి ముందు: కాల్చాలనుకున్నది కాల్చుకోండినిర్గ 16:23
వచనాలు
నిర్గ 16:23అందుకు మోషే “యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.”
- యెహోవా ఎదుట బంగారు బల్ల కోసం పన్నెండు రొట్టెలు కాల్చారులేవీ 24:5–6
వచనాలు
లేవీ 24:5–6నీవు గోదుమ పిండి తీసుకుని దానితో పన్నెండు రొట్టెలు చెయ్యాలి. ఒక్కొక్క రొట్టెకు రెండు కిలోల పిండి వాడాలి. యెహోవా సన్నిధిలో నిర్మలమైన బల్లమీద ఆరేసి రొట్టెలున్న రెండు దొంతులుగా వాటిని ఉంచాలి.
- సమూయేలు: రాజు మీ కుమార్తెలను వంటవారుగా, రొట్టెలు కాల్చేవారుగా తీసుకుంటాడు1 సమూ 8:13
వచనాలు
1 సమూ 8:13మీ ఆడపిల్లలను వంటలు చేయడానికి, అలంకరించడానికి, రొట్టెలు కాల్చడానికి పెట్టుకొంటాడు.
- ఏన్దోరులోని స్త్రీ పిండి పిసికి సౌలు కోసం పులియని రొట్టెలు కాల్చింది1 సమూ 28:24
వచనాలు
1 సమూ 28:24ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న కొవ్విన దూడ తెచ్చి త్వరగా వధించి, పిండి తెచ్చి పిసికి, పులవని రొట్టెలు కాల్చి
- తామారు పిండి పిసికి అమ్నోను కోసం అప్పాలు కాల్చింది2 సమూ 13:8
వచనాలు
2 సమూ 13:8తామారు, అమ్నోను ఇంటికి వెళ్ళింది.
- నిప్పుల మీద కాల్చిన రొట్టెను ఏలీయా మేల్కొని చూశాడు1 రాజులు 19:6
వచనాలు
1 రాజులు 19:6ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు.
- యెషయా: కర్రలో ఒక భాగం రొట్టె కాలుస్తుంది, మిగతాది విగ్రహం అవుతుందియెష 44:15, యెష 44:19
వచనాలు
యెష 44:15అప్పుడు ఒక మనిషి ఆ చెట్టుని కాల్చి వాటిలో కొంత తీసుకుని చలి కాచుకోడానికి, కొంత నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకోడానికి ఉపయోగిస్తాడు. మిగిలినదాన్ని తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడతాడు.
యెష 44:19ఎవరూ ఆలోచించడం లేదు. ‘నేను సగం చెక్కను అగ్నిలో కాల్చాను, ఆ నిప్పుల మీద రొట్టె కాల్చుకుని, మాంసం వండుకుని భోజనం చేశాను. మిగిలిన చెక్కను తీసుకుని దానితో అసహ్యమైన దాన్ని చేయాలా? ఒక చెట్టు మొద్దుకు సాగిలపడి నమస్కరించాలా?’ అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి, వివేచన లేదు.
- యిర్మీయాకు రొట్టెలు కాల్చేవారి వీధి నుంచి రోజుకు ఒక రొట్టె దొరికిందియిర్మీ 37:21
వచనాలు
యిర్మీ 37:21కాబట్టి రాజైన సిద్కియా ఆజ్ఞ జారీ చేశాడు. అతని సేవకులు ఆ ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయాను పెట్టారు. పట్టణంలో రొట్టెలున్నంత వరకూ రొట్టెలు కాల్చేవాళ్ళ వీధిలోనుంచి ప్రతిరోజూ ఒక రొట్టె అతనికి ఇస్తూ వచ్చారు. కాబట్టి సేవకుల ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయా ఉన్నాడు.
- యెరూషలేము గోడకు పొయ్యిల గోపురం ఉండేదినెహె 3:11, నెహె 12:38
వచనాలు
నెహె 3:11రెండవ భాగాన్ని, అగ్నిగుండాల గోపురాన్ని హారిము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు బాగు చేశారు.
నెహె 12:38కృతజ్ఞతాస్తుతి గీతాలు పాడేవాళ్ళ రెండవ గుంపు వారికి ఎదురుగా బయలుదేరింది. గోడపై ఉన్న సగం మంది అగ్నిగుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ దాకా వెళ్ళారు. వారితో కలసి నేను కూడా వెళ్లాను.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు