Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › ద్రోహులు, నమ్మకద్రోహులు

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో ద్రోహులు, నమ్మకద్రోహులు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 26 భాగాలు, వాక్యం వాక్యంగా.

యూదా

  • పన్నెండుమందిలో ఒకడైన యూదా ఇస్కరియోతు, ద్రోహిగా మారినవాడులూకా 6:16
    వచనాలు
    లూకా 6:16యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు.
  • డబ్బు సంచి అతని దగ్గరే ఉండేది; అతడు దానిలోనుంచి తీసుకునేవాడుయోహా 12:6
    వచనాలు
    యోహా 12:6అతనికి పేదవాళ్ళ పట్ల శ్రద్ధ ఉండి ఇలా అనలేదు. అతడు దొంగ. అతని ఆధీనంలో ఉన్న డబ్బు సంచిలో నుండి కొంత సొమ్ము తన సొంతానికి తీసుకుంటూ ఉండేవాడు.
  • తనకు ఏమి ఇస్తారని అతడు ప్రధాన యాజకులను అడిగాడు: ముప్ఫై వెండి నాణేలుమత్తయి 26:14–15
    వచనాలు
    మత్తయి 26:14–15అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. “యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు.
  • అప్పటి నుంచి అతడు జనసమూహం లేని సమయం కోసం అవకాశం వెదికాడుమత్తయి 26:16, మార్కు 14:11, లూకా 22:6
    వచనాలు
    మత్తయి 26:16అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
    మార్కు 14:11అది విని వారు చాలా సంతోషించి అతనికి కొంత సొమ్ము ముట్టజెపుతామని మాట ఇచ్చారు. అప్పటినుండీ యేసును వారికి అప్పగించడానికి తగిన అవకాశం కోసం యూదా ఎదురు చూస్తూ ఉన్నాడు.
    లూకా 22:6అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.
  • భోజన సమయంలో యేసు అన్నాడు: మీలో ఒకడు నన్ను పట్టిస్తాడుమత్తయి 26:21
    వచనాలు
    మత్తయి 26:21వారు భోజనం చేస్తుండగా ఆయన, “మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
  • యూదా: బోధకా, నేనా?మత్తయి 26:25
    వచనాలు
    మత్తయి 26:25ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.
  • యేసు ముంచిన ముక్కను యూదాకు ఇచ్చాడు; యూదా రాత్రివేళ బయటికి వెళ్ళాడుయోహా 13:26, యోహా 13:30
    వచనాలు
    యోహా 13:26అప్పుడు యేసు జవాబిస్తూ, “ఈ రొట్టె ముక్క ఎవరికి ముంచి ఇస్తానో, అతడే” అన్నాడు. తరువాత ఆయన రొట్టె ముంచి ఇస్కరియోతు సీమోను కొడుకు యూదాకు ఇచ్చాడు.
    యోహా 13:30అది రాత్రి సమయం. అతడు ఆ రొట్టె ముక్క తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు.
  • యేసు తరచుగా తన శిష్యులతో అక్కడ కలుసుకునేవాడు కాబట్టి యూదాకు ఆ తోట తెలుసుయోహా 18:2
    వచనాలు
    యోహా 18:2యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయనను పట్టించబోతున్న యూదాకు కూడా ఆ ప్రదేశం తెలుసు.
  • అతడు దీపాలూ కాగడాలూ ఆయుధాలూ పట్టుకున్న సైనికులతో వచ్చాడుయోహా 18:3
    వచనాలు
    యోహా 18:3అతడు సైనికుల గుంపును, ముఖ్య యాజకులు, పరిసయ్యులు తనకు ఇచ్చిన దేవాలయ అధికారులను వెంట తీసుకుని, కాగడాలతో, దీపాలతో ఆయుధాలతో అక్కడికి వచ్చాడు.
  • గుర్తు: “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు”మత్తయి 26:48–49, మార్కు 14:44–45
    వచనాలు
    మత్తయి 26:48–49ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
    మార్కు 14:44–45ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, “నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి” అన్నాడు. అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు.
  • “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?”లూకా 22:47–48
    వచనాలు
    లూకా 22:47–48ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు. అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు.
  • పశ్చాత్తాపంతో అతడు వెండిని తిరిగి ఇచ్చి ఉరి వేసుకున్నాడుమత్తయి 27:3–5
    వచనాలు
    మత్తయి 27:3–5అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, “నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు. అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.
  • ఆ డబ్బుతో కుమ్మరి పొలం కొన్నారు; దాన్ని రక్తపు పొలం అని పిలిచారుమత్తయి 27:7–8
    వచనాలు
    మత్తయి 27:7–8వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు. ఆ పొలాన్ని నేటివరకూ “రక్త పొలం” అని పిలుస్తున్నారు.
  • అపొస్తలుల కార్యాల్లో ఆ పొలాన్ని అకెల్దమ అని పిలుస్తారుఅపొ.కా 1:18–19
    వచనాలు
    అపొ.కా 1:18–19ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బుతో ఒక పొలం కొన్నాడు. అతడు తలకిందులుగా పడి శరీరం బద్దలై పేగులన్నీ బయటికి వచ్చాయి. ఈ విషయం యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలిసింది. కాబట్టి వారి భాషలో ఆ పొలాన్ని ‘అకెల్దమ’ అంటున్నారు. దాని అర్థం ‘రక్త భూమి.’ ఇందుకు రుజువుగా,

ఇతరులు

  • బేతేలుకు చెందిన ఒక మనిషి వేగులవారికి లోపలికి దారి చూపించాడు; అతని కుటుంబం కాపాడబడిందిన్యాయా 1:23–25
    వచనాలు
    న్యాయా 1:23–25పూర్వకాలంలో లూజు అనే పేరుగల బేతేలును వేగు చూడడానికి యోసేపు గోత్రికులు దూతలను పంపినప్పుడు ఆ గూఢచారులు, ఆ పట్టణంలోనుంచి ఒకడు రావడం చూసి “దయచేసి ఈ పట్టణంలోకి వెళ్ళే దారి మాకు చూపిస్తే మేము నీకు ఉపకారం చేస్తాం” అని చెప్పారు. అతడు ఆ పట్టణంలోకి వెళ్ళే దారి వాళ్లకు చూపించినప్పుడు, వాళ్ళు ఆ పట్టణంలోని వారిని కత్తివాత హతం చేశారు. అయితే, ఆ వ్యక్తిని, అతని కుటుంబంలోని వాళ్ళందరినీ వదిలేశారు.
  • సంసోను బలం రహస్యం కోసం ప్రతి ఫిలిష్తీయ అధికారి దెలీలాకు వెండి ఇస్తానన్నాడున్యాయా 16:5
    వచనాలు
    న్యాయా 16:5ఫిలిష్తీయుల అధికారులు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో “నువ్వు అతణ్ణి ఏమార్చి అతడి గొప్ప బలం దేంట్లో ఉందో, మేము అతణ్ణి బంధించడానికి ఎలా అతణ్ణి గెలవవచ్చో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణచివేస్తాం. నువ్వు దీన్ని చేస్తే మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి నాణేలిస్తాం” అన్నారు.
  • సంసోను తన రహస్యం చెప్పినప్పుడు ఆమె వారిని పిలిపించింది; వారు డబ్బు తెచ్చారున్యాయా 16:18
    వచనాలు
    న్యాయా 16:18అతడు తన రహస్యాన్ని చెప్పేశాడని దెలీలాకు అర్థమైంది. ఆమె ఫిలిష్తీయుల అధికారులకు కబురు పంపింది. “మరోసారి రండి. ఇతను నాకు తన రహస్యాన్ని చెప్పాడు” అంది. ఫిలిష్తీయుల అధికారులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చారు.
  • నోబులోని యాజకుడు దావీదుకు సహాయం చేశాడని ఎదోమీయుడైన దోయేగు సౌలుకు చెప్పాడు1 సమూ 22:9–10
    వచనాలు
    1 సమూ 22:9–10అప్పుడు ఎదోమీయుడు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలబడి “యెష్షయి కొడుకు పారిపోయి నోబులో ఉంటున్న అహీటూబు కొడుకు అహీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు నేను చూశాను. అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారం, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గం అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు.
  • కెయీలా పౌరులు తనను సౌలుకు అప్పగిస్తారని దావీదు తెలుసుకుంటాడు1 సమూ 23:12
    వచనాలు
    1 సమూ 23:12“కెయీలా ప్రజలు నన్నూ నా ప్రజలనూ సౌలు చేతికి అప్పగిస్తారా?” అని దావీదు తిరిగి అడిగితే, యెహోవా “వారు నిన్ను అప్పగించాలని ఉన్నారు” అన్నాడు.
  • దావీదు సలహాదారుడైన అహీతోపెలు అబ్షాలోము కుట్రలో చేరాడు2 సమూ 15:12, 2 సమూ 15:31
    వచనాలు
    2 సమూ 15:12బలి అర్పించాలని గిలో గ్రామ నివాసి అహీతోపెలును పిలిపించాడు. ఇతడు దావీదు సలహాదారుడు. అబ్షాలోము దగ్గర కూడుకొన్న జన సమూహం మరీ ఎక్కువ కావడంవల్ల జరుగుతున్న కుట్ర మరింత బలపడింది.
    2 సమూ 15:31అంతలో ఒకడు వచ్చి “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా పాత్ర ఉంది” అని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు “యెహోవా, అహీతోపెలు పథకాలను చెడగొట్టు” అని ప్రార్థన చేశాడు.
  • తన సలహా పాటించబడనప్పుడు అహీతోపెలు ఇంటికి వెళ్ళి ఉరి వేసుకున్నాడు2 సమూ 17:23
    వచనాలు
    2 సమూ 17:23అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు