Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › కవలలు

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో కవలలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 8 భాగాలు, వాక్యం వాక్యంగా.

ఏశావు, యాకోబు

  • రిబ్కా గర్భంలో కవలలు ఒకరితో ఒకరు పెనుగులాడారుఆది 25:22
    వచనాలు
    ఆది 25:22ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది.
  • ఏశావు మొదట బయటికి వచ్చాడు, ఎర్రగా, ఒళ్ళంతా వెంట్రుకలతోఆది 25:24–25
    వచనాలు
    ఆది 25:24–25ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏశావు అనే పేరు పెట్టారు.
  • యాకోబు ఏశావు మడమ పట్టుకుని బయటికి వచ్చాడుఆది 25:26
    వచనాలు
    ఆది 25:26తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు.
  • కవలలు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు అరవైఆది 25:26
    వచనాలు
    ఆది 25:26తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు.

పెరెసు, జెరహు

  • తామారు కవలలను కన్నది; ఒకని చేతికి ఎర్ర దారం కట్టారుఆది 38:27–28
    వచనాలు
    ఆది 38:27–28నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి “వీడు మొదట బయటికి వచ్చాడు” అని చెప్పింది.
  • కాని అతని సోదరుడు మొదట బయటికి వచ్చాడు; అతనికి పెరెసు అని పేరు పెట్టారుఆది 38:29
    వచనాలు
    ఆది 38:29వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె “నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?” అంది. అందుచేత వాడికి “పెరెసు” అని పేరు పెట్టారు.
  • తర్వాత చేతికి ఎర్ర దారంతో జెరహు వచ్చాడుఆది 38:30
    వచనాలు
    ఆది 38:30ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి “జెరహు” అని పేరు పెట్టారు.

ఇంకా

  • కవల దేవుళ్ళ చిహ్నం ఉన్న అలెగ్జాండ్రియ ఓడలో పౌలు ప్రయాణించాడుఅపొ.కా 28:11
    వచనాలు
    అపొ.కా 28:11కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు