అన్వేషించండి › అంశాలు › ఉప్పు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో ఉప్పు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 21 భాగాలు, వాక్యం వాక్యంగా.
- లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిందిఆది 19:26
వచనాలు
ఆది 19:26కానీ లోతు వెనుకే వస్తున్న అతని భార్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది.
- రుచిలేని ఆహారాన్ని ఉప్పు లేకుండా తింటారా?యోబు 6:6
వచనాలు
యోబు 6:6ఉప్పు లేకుండా చప్పగా ఉండే వాటిని ఎవరైనా తింటారా? గుడ్డులోని తెల్ల సొనకు రుచి ఉంటుందా?
- ఎలీషా యెరికో నీటి ఊటలో ఉప్పు వేశాడు2 రాజులు 2:20–21
వచనాలు
2 రాజులు 2:20–21దానికి ఎలీషా “ఒక కొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకు రండి” అని చెప్పాడు. వారు అలాగే దాన్ని అతని దగ్గరికి తీసుకుని వచ్చారు. అప్పుడు ఎలీషా ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊటలో ఉప్పు వేసి ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ నీటిని నేను బాగు చేశాను. కాబట్టి ఇప్పటి నుండి దీని వల్ల చావు అనేది ఉండదు. నిస్సారత ఇక ఉండదు.”
- అబీమెలెకు షెకెమును నేలమట్టం చేసి దాని మీద ఉప్పు చల్లాడున్యాయా 9:45
వచనాలు
న్యాయా 9:45ఆ రోజంతా అబీమెలెకు ఆ ఊరివారితో యుద్ధం చేసి ఊరిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న మనుషులను చంపి, పట్టణాన్ని పడగొట్టి ఆ ప్రాంతమంతా ఉప్పు చల్లించాడు.
- అప్పుడే పుట్టిన శిశువులను ఉప్పుతో రుద్దేవారుయెహె 16:4
వచనాలు
యెహె 16:4నువ్వు పుట్టిన రోజు నీ తల్లి నీ బొడ్డు కొయ్యలేదు. శుభ్రం చెయ్యడానికి నిన్ను నీళ్ళతో కడగలేదు, నిన్ను ఉప్పుతో తుడవలేదు, నిన్ను బట్టల్లో చుట్టలేదు.
- పర్షియా రాజు దేవాలయం కోసం లెక్కలేనంత ఉప్పు ఇచ్చాడుఎజ్రా 6:9, ఎజ్రా 7:22
వచనాలు
ఎజ్రా 6:9ఆకాశంలో నివసించే దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, గొర్రెలు, పొట్టేళ్ళు, గోదుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె మొదలైన వాటిని యాజకులకు ఇవ్వాలి. యెరూషలేములో ఉంటున్న వారు ఆకాశంలో ఉండే దేవునికి సువాసన గల అర్పణలు అర్పించి రాజు, అతని సంతానం బతికి ఉండేలా ప్రార్థన చేస్తారు.
ఎజ్రా 7:22మూడున్నర టన్నుల వెండి, వెయ్యి తూముల గోదుమలు రెండు వేల రెండు వందల లీటర్ల ద్రాక్షారసం, మూడు వందల తూముల నూనె, ఇంకా అవసరమైన దాని కంటే మించి ఉప్పు ఇవ్వండి.
ఆరాధనలో
- ప్రతి నైవేద్యానికీ ఉప్పు వేసేవారులేవీ 2:13
వచనాలు
లేవీ 2:13నువ్వు అర్పించే ప్రతి నైవేద్యానికీ ఉప్పు కలపాలి. నీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా నీ నైవేద్యం ఉండకూడదు. నీ నైవేద్యాలన్నిటితో పాటు ఉప్పు కూడా అర్పించాలి.
- యాజకులు దహనబలుల మీద ఉప్పు చల్లేవారుయెహె 43:24
వచనాలు
యెహె 43:24వాటిని యెహోవా సన్నిధికి తెచ్చి యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పించాలి.
- ఉప్పు నిబంధనసంఖ్యా 18:19, 2 దిన 13:5
వచనాలు
సంఖ్యా 18:19ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్రమైన ప్రతిష్ఠార్పణలన్నీ నేను నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా ఇచ్చాను. అది నీకూ, నీతో పాటు నీ సంతానానికీ యెహోవా సన్నిధిలో స్థిరమైన శాశ్వత నిబంధన” అన్నాడు.
2 దిన 13:5ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎల్లకాలం పాలించడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా దావీదుతో, అతని సంతతివారితో ఎవరూ భంగం చేయలేని నిబంధన చేసి దాన్ని వారికిచ్చాడని మీకు తెలుసు గదా
స్థలాలు
- ఉప్పు సముద్రం, ఇశ్రాయేలు తూర్పు సరిహద్దుఆది 14:3, సంఖ్యా 34:12, యెహో 15:2
వచనాలు
ఆది 14:3వీళ్ళందరూ కలిసి సిద్దీము (ఉప్పు సముద్రం) లోయలో ఏకంగా సమకూడారు.
సంఖ్యా 34:12అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం’ అని వారితో చెప్పు.”
యెహో 15:2వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది.
- యూదా అరణ్యంలోని ఉప్పు పట్టణంయెహో 15:62
వచనాలు
యెహో 15:62ఉప్పు పట్టణం నిబ్షాను, ఈల్మెలహు ఏన్గెదీ అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
- ఉప్పు లోయలో ఎదోముతో యుద్ధాలు2 సమూ 8:13, 2 రాజులు 14:7
వచనాలు
2 సమూ 8:13దావీదు ఉప్పు లోయలో పద్దెనిమిది వేలమంది అరామీయ సైన్యాలను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు అతని పేరు అన్నిచోట్లా ప్రసిద్ది చెందింది.
2 రాజులు 14:7ఇంకా అతడు ఉప్పు లోయలో యుద్ధం చేసి ఎదోమీయుల్లో 10,000 మందిని హతం చేసి, సెల అనే పట్టణాన్ని జయించి, దానికి యొక్తయేలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ దానికి అదే పేరు.
సూక్తులు
- సారం కోల్పోయిన ఉప్పు దేనికీ పనికిరాదుమత్తయి 5:13, లూకా 14:34
వచనాలు
మత్తయి 5:13“లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.
లూకా 14:34“ఉప్పు మంచిదే. అయితే ఉప్పు తన సారాన్ని కోల్పోతే దానికి తిరిగి సారం దేనివల్ల కలుగుతుంది?
- మీలో మీరు ఉప్పు కలిగి, సమాధానంగా ఉండండిమార్కు 9:50
వచనాలు
మార్కు 9:50ఉప్పు మంచిదే కాని దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి” అని చెప్పాడు.
- మీ మాటలు ఉప్పు వేసినట్టు దయగలవై ఉండాలికొలస్స 4:6
వచనాలు
కొలస్స 4:6మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు