అన్వేషించండి › అంశాలు › మంచు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో మంచు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 17 భాగాలు, వాక్యం వాక్యంగా.
- మంచు పడిన రోజున బెనాయా ఒక గుంటలో సింహాన్ని చంపాడు2 సమూ 23:20
వచనాలు
2 సమూ 23:20కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు.
- లెబానోను మంచు ఎప్పుడైనా దాని వాలులను విడిచిపెడుతుందా?యిర్మీ 18:14
వచనాలు
యిర్మీ 18:14లెబానోను పర్వతం మీద బండలపై మంచు లేకుండా పోతుందా? దూరం నుంచి పారే చల్లని వాగులు ఇంకిపోతాయా?
- మంచు గడ్డలతో, కరిగే మంచుతో నల్లబడిన వాగులుయోబు 6:16
వచనాలు
యోబు 6:16అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, కురిసిన మంచుతో మురికిగా కనబడతాయి.
- భూమి మీద పడమని దేవుడు మంచుకు ఆజ్ఞ ఇస్తాడుయోబు 37:6
వచనాలు
యోబు 37:6నువ్వు భూమి మీద పడమని మంచుకు, వర్షానికి, జడివానకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు.
- మంచు గిడ్డంగుల్లోకి నువ్వు ప్రవేశించావా?యోబు 38:22–23
వచనాలు
యోబు 38:22–23నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా? ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను.
- ఆయన ఉన్నిలా మంచును పరుస్తాడుకీర్త 147:16
వచనాలు
కీర్త 147:16గొర్రెబొచ్చు లాంటి తెల్లని మంచు కురిపించేవాడు ఆయనే. బూడిదలాంటి మంచు ముద్దలు చల్లేవాడు ఆయనే.
- వర్షమూ మంచూ భూమిని తడిపి మొలకెత్తేలా చేస్తాయియెష 55:10
వచనాలు
యెష 55:10వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి. దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి. అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు.
- సల్మోను మీద కురిసే మంచులాకీర్త 68:14
వచనాలు
కీర్త 68:14సర్వశక్తుడు అక్కడి రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండ మీద మంచు కురిసినట్టు కనిపించింది.
సామెతల్లోని మాటలు
- నమ్మకమైన దూత కోతకాలంలో చల్లని మంచు లాంటివాడుసామె 25:13
వచనాలు
సామె 25:13నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు.
- వేసవిలో మంచులా, బుద్ధిహీనునికి గౌరవం తగదుసామె 26:1
వచనాలు
సామె 26:1ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.
- మంచు కురిసినప్పుడు ఆమె భయపడదు; ఆమె ఇంటివారు ఎర్ర బట్టలు వేసుకుంటారుసామె 31:21
వచనాలు
సామె 31:21తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు.
మంచులా తెల్లగా
- మోషే చెయ్యి, మిర్యాము, గేహజీ: కుష్ఠుతో మంచులా తెల్లగానిర్గ 4:6, సంఖ్యా 12:10, 2 రాజులు 5:27
వచనాలు
నిర్గ 4:6తరువాత యెహోవా “నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో” అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది.
సంఖ్యా 12:10గుడారం పైనుండి మేఘం పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా మిర్యాముకు కుష్టు వ్యాధి సోకింది. ఆమె మంచులా తెల్లగా కన్పించింది. అహరోను ఆమెని చూశాడు. ఆమెకి కుష్టువ్యాధి ఉండడం చూశాడు.
2 రాజులు 5:27అందుచేత నయమానుకి ఉన్న కుష్ఠు నీకూ, నీ వారసులకూ నిత్యం ఉంటుంది” అన్నాడు. కాబట్టి గేహాజీకి మంచులా తెల్లని కుష్టురోగం వచ్చింది. అతడు ఎలీషా దగ్గరనుండి వెళ్ళి పోయాడు.
- యోబు: నేను మంచు నీళ్ళతో కడుక్కున్నాయోబు 9:30
వచనాలు
యోబు 9:30నన్ను నేను మంచులాగా శుభ్రం చేసుకున్నా, సబ్బుతో నా చేతులు తోముకున్నా,
- దావీదు ప్రార్థన: నన్ను కడుగు, నేను మంచు కంటే తెల్లగా ఉంటానుకీర్త 51:7
వచనాలు
కీర్త 51:7నన్ను హిస్సోపుతో శుభ్రం చెయ్యి. నేను పవిత్రుణ్ణి అవుతాను. నన్ను కడుగు. నేను మంచు కంటే తెల్లగా ఉంటాను.
- సమాధి దగ్గర దేవదూత: మంచులా తెల్లని బట్టలుమత్తయి 28:3
వచనాలు
మత్తయి 28:3ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు