అన్వేషించండి › అంశాలు › తేనె
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో తేనె
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 22 భాగాలు, వాక్యం వాక్యంగా.
- పాలు తేనెలు ప్రవహించే దేశంనిర్గ 3:8, లేవీ 20:24
వచనాలు
నిర్గ 3:8కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను.
లేవీ 20:24నేను మీతో చెప్పాను. మీరు వారి భూమిని వారసత్వంగా పొందుతారు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీరు స్వాధీన పరచుకునేందుకై మీకిస్తాను. జాతుల్లో నుండి మిమ్మల్ని వేరు చేసిన మీ దేవుడైన యెహోవాను నేనే.
- ఒలీవ నూనె, తేనె ఉన్న దేశంద్వితీ 8:8
వచనాలు
ద్వితీ 8:8దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం.
- మన్నా రుచి తేనెతో చేసిన అప్పడాల్లా ఉందినిర్గ 16:31
వచనాలు
నిర్గ 16:31ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి “మన్నా” అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది.
- తేనెను అర్పణగా దహించకూడదులేవీ 2:11
వచనాలు
లేవీ 2:11మీరు యెహోవాకి సమర్పించే ఏ నైవేద్యం లోనూ పొంగజేసే పదార్ధం ఉండకూడదు. ఎందుకంటే తేనెనూ, పొంగజేసే పదార్ధం దేనినైనా నైవేద్యంగా బలిపీఠం పైన దహించకూడదు.
- బండలోనుంచి తేనెద్వితీ 32:13, కీర్త 81:16
వచనాలు
ద్వితీ 32:13లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు.
కీర్త 81:16అతిశ్రేష్ఠమైన గోదుమలతో నేను ఇశ్రాయేలును పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను.
కథల్లో
- యాకోబు ఐగుప్తుకు కానుకగా కొంచెం తేనె పంపాడుఆది 43:11
వచనాలు
ఆది 43:11వారి తండ్రి ఇశ్రాయేలు, వారితో “అలాగైతే మీరిలా చేయండి. ఈ దేశంలోని మేలైన వస్తువులను మీ సంచుల్లో వేసుకుని తీసుకెళ్ళండి. కొంచెం సుగంధ ద్రవ్యాలు, కొంచెం తేనె, మసాలా దినుసులు, బోళం, పిస్తా కాయలు, బాదం కాయలు మీ సంచుల్లో వేసుకుని అతనికి కానుకగా తీసుకెళ్లండి.
- సంసోను సింహం కళేబరంలోని తేనె తిన్నాడున్యాయా 14:8–9
వచనాలు
న్యాయా 14:8–9కొంతకాలం గడచిన తరువాత ఆమెను తీసుకుని రావడానికి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సింహం కళేబరం చూడడానికి పక్కకు తిరిగాడు. ఆ సింహపు అస్థిపంజరంలో అతనికి ఒక తేనెటీగల గుంపూ తేనే కనిపించాయి. అతడు ఆ తేనె తీసి చేతిలో పట్టుకుని తింటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారికీ కొంత తేనె ఇచ్చాడు. వారూ దాన్ని తిన్నారు. అయితే తాను ఆ తేనెను సింహం కళేబరం నుండి తీశానని వారికి చెప్పలేదు.
- సౌలు ఒట్టుకు విరుద్ధంగా యోనాతాను అడవిలో తేనె రుచి చూశాడు1 సమూ 14:25–27, 1 సమూ 14:43
వచనాలు
1 సమూ 14:25–27సైన్యం మొత్తం అడవిలోకి వచ్చినప్పుడు ఒకచోట నేలమీద తేనె కనబడింది. వారు ఆ అడవిలోకి వెళ్తున్నప్పుడు తేనె ధారగా కారుతూ ఉంది. తాము చేసిన ప్రమాణానికి లోబడి ఎవ్వరూ ఆ తేనె ముట్టుకోలేదు. అయితే యోనాతానుకు తన తండ్రి ప్రజలచేత చేయించిన ప్రమాణం గురించి తెలియదు. అతడు తన చేతికర్ర చాచి దాని అంచును తేనెపట్టులో ముంచి దాన్ని నోటిలో పెట్టుకోగానే అతని కళ్ళకు వెలుగు వచ్చింది.
1 సమూ 14:43“నువ్వు చేసిన పని ఏమిటో నాకు తెలియజేయి” అని యోనాతానును అడిగినప్పుడు, యోనాతాను “నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె తీసుకుని తిన్న విషయం నిజమే, కొంచెం తేనె కోసం నేను చనిపోవలసి వచ్చింది” అని సౌలుతో అన్నాడు.
- కొంచెం తేనె రుచి చూసిన తర్వాత అతని కళ్ళు తేజరిల్లాయి1 సమూ 14:29
వచనాలు
1 సమూ 14:29అందుకు యోనాతాను “నా తండ్రి మనుషులను కష్టపెట్టిన వాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్ళు ఎంతగా వెలిగిపోయాయో చూడు.
- దావీదు ఆకలిగొన్న మనుషులకు స్నేహితులు తేనె తెచ్చారు2 సమూ 17:29
వచనాలు
2 సమూ 17:29తేనె, వెన్న, గొర్రెలు, జున్నుముద్దలు తీసుకువచ్చారు.
- యరొబాము భార్య ప్రవక్త దగ్గరికి ఒక తేనె బుడ్డి తీసుకువెళ్ళింది1 రాజులు 14:3
వచనాలు
1 రాజులు 14:3కాబట్టి నీవు పది రొట్టెలూ కొన్ని తీపి రొట్టెలు, ఒక సీసా నిండా తేనె తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. అబ్బాయికి ఏమవుతుందో అతడు నీకు చెబుతాడు.”
- యూదా తూరుతో తేనె వ్యాపారం చేసిందియెహె 27:17
వచనాలు
యెహె 27:17యూదావారూ ఇశ్రాయేలు వారూ నీతో వ్యాపారం చేశారు. మిన్నీతు నుంచి గోదుమలు, చిరు ధాన్యాలు, తేనె, నూనె, గుగ్గిలం తెచ్చి నీ సరుకులు కొన్నారు.
- యోహాను మిడతలూ అడవి తేనే తిన్నాడుమత్తయి 3:4
వచనాలు
మత్తయి 3:4ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
సూక్తులు
- నా కుమారుడా, తేనె తిను, అది మంచిదిసామె 24:13
వచనాలు
సామె 24:13కుమారా, తేనె తాగు. అది రుచికరం. తేనెపట్టునుండి కారే తేనె తినుము అది నీ నాలుకకి మధురం గదా.
- తేనె దొరికితే నీకు కావలసినంత మాత్రమే తినుసామె 25:16, సామె 25:27
వచనాలు
సామె 25:16నీకు తేనె దొరికితే మితంగా తిను. మితిమీరి తింటే ఒకవేళ కక్కి వేస్తావేమో.
సామె 25:27తేనె మితిమీరి తినడం మంచిది కాదు. గొప్ప కోసం అదే పనిగా పాకులాడడం అలాటిదే.
- కడుపు నిండినవాడు తేనెపట్టును కూడా తొక్కేస్తాడు; ఆకలిగొన్నవానికి చేదు కూడా తీపేసామె 27:7
వచనాలు
సామె 27:7కడుపు నిండిన వాడు తేనెపట్టునైనా సరే కాళ్ళతో తొక్కేస్తాడు. ఆకలి వేసిన వాడికి చేదు పదార్థమైనా తియ్యగా ఉంటుంది.
- తేనెపట్టు నుంచి కారే తేనె కంటే తీయనిదికీర్త 19:10
వచనాలు
కీర్త 19:10అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.
- నా వధూ, నీ పెదవులు తేనెపట్టులా మధురాన్ని ఒలికిస్తాయిపరమ 4:11
వచనాలు
పరమ 4:11వధూ! నీ పెదాలు తేనెలూరుతున్నాయి. నీ నాలుక కింద తేనె, పాలు తొణికిసలాడుతున్నాయి. నీ వస్త్రాల సువాసన లెబానోను సువాసనలాగా ఉంది.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు