అన్వేషించండి › అంశాలు › గంటలు, జాములు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్‌లో గంటలు, జాములు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 49 భాగాలు, వాక్యం వాక్యంగా.
- సాయంత్రం అయింది, ఉదయం అయింది — మొదటి రోజుఆది 1:5
వచనాలు
ఆది 1:5దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు.
- యేసు: పగటికి పన్నెండు గంటలు లేవా?యోహా 11:9
వచనాలు
యోహా 11:9అందుకు యేసు జవాబిస్తూ, “పగలు పన్నెండు గంటల వెలుగు ఉండదా? ఒకడు పగటి వేళ నడిస్తే తడబడడు. ఎందుకంటే అతడు వెలుగులో అన్నీ చూస్తాడు.
- ఒక రోజు ప్రయాణం: ఏలీయా అంత దూరం అరణ్యంలోకి వెళ్ళాడు1 రాజులు 19:4
వచనాలు
1 రాజులు 19:4అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. “యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో” అని ప్రార్థన చేశాడు.
- విశ్రాంతి దినపు ప్రయాణం: ఒలీవల కొండ నుంచి యెరూషలేము వరకుఅపొ.కా 1:12
వచనాలు
అపొ.కా 1:12అప్పుడు వారు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది.
- సిద్ధపాటు దినం: విశ్రాంతి దినానికి ముందు రోజుమార్కు 15:42, యోహా 19:31
వచనాలు
మార్కు 15:42అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు.
యోహా 19:31అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు.
- విశ్రాంతి దినానికి ముందు సాయంత్రపు నీడలు పడినప్పుడు నెహెమ్యా ద్వారాలు మూయించాడునెహె 13:19
వచనాలు
నెహె 13:19విశ్రాంతి దినానికి ముందు రోజు చీకటి పడినప్పుడు యెరూషలేం ద్వారాలు మూసి ఉంచాలనీ, విశ్రాంతి దినం ముగిసేదాకా తలుపులు తియ్యకూడదనీ ఆజ్ఞాపించాను. విశ్రాంతి దినాన ఎలాంటి బరువులు లోపలికి రాకుండేలా తలుపుల దగ్గర నా పనివాళ్ళలో కొందరిని కాపలా ఉంచాను.
- ఆహాజు మెట్ల మీద నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళింది2 రాజులు 20:9–11
వచనాలు
2 రాజులు 20:9–11“తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు. అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు. ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.
రాత్రి జాములు
- విలాపవాక్యాలు: రాత్రి మొదటి జాము నుంచే మొర పెట్టువిలాప 2:19
వచనాలు
విలాప 2:19రాత్రి పూట నువ్వు లేచి మొర్ర పెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు. ప్రతి వీధి మొదట్లో ఆకలితో సతమతమౌతున్న నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన వైపు ఎత్తు.”
- కావలి మారిన తర్వాత, నడిజాము మొదట్లో గిద్యోను వచ్చాడున్యాయా 7:19
వచనాలు
న్యాయా 7:19కాబట్టి, అర్దరాత్రి కాపలా కాసేవారు కాపలా సమయం మారుతూ ఉన్నప్పుడు, గిద్యోను, అతనితో ఉన్న వందమంది, శిబిరం చివరకూ వెళ్లి, బూరలు ఊది, వాళ్ళ చేతుల్లో ఉన్న కుండలు పగులగొట్టారు.
- తెల్లవారే జాములో ఐగుప్తు శిబిరం గందరగోళంలో పడిందినిర్గ 14:24
వచనాలు
నిర్గ 14:24తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు.
- సౌలు తెల్లవారే జాములో అమ్మోనీయుల శిబిరం మీద దాడి చేశాడు1 సమూ 11:11
వచనాలు
1 సమూ 11:11తరువాతి రోజు సౌలు ప్రజలను మూడు గుంపులుగా చేసిన తరువాత వారు తెల్లవారేలోగా శిబిరం మధ్యకు చేరుకుని మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను సంహరించారు. మిగిలిన వారిలో ఏ ఇద్దరూ కలసి తప్పించుకోలేకుండా చెదరిపోయారు.
- రాత్రి నాలుగో జాములో యేసు సముద్రం మీద నడిచాడుమత్తయి 14:25, మార్కు 6:48
వచనాలు
మత్తయి 14:25రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు.
మార్కు 6:48ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,
- యజమాని రెండో జాములో గాని మూడో జాములో గాని రావచ్చులూకా 12:38
వచనాలు
లూకా 12:38అతడు రాత్రి రెండవ జాములో వచ్చినా, మూడవ జాములో వచ్చినా ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులు ధన్యులు.
- సాయంత్రమో, అర్ధరాత్రో, కోడి కూసేటప్పుడో, ఉదయమోమార్కు 13:35
వచనాలు
మార్కు 13:35కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు.
- ఒక కీర్తనకారుడు రాత్రి జాముల్లో ధ్యానిస్తాడుకీర్త 63:6, కీర్త 119:148
వచనాలు
కీర్త 63:6రాత్రి జాముల్లో నా పడక మీద ఉండి నీ గురించి ధ్యానం చేస్తాను.
కీర్త 119:148నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.
పగటి గంటలు
- పేతురు: ఇప్పుడు పగలు తొమ్మిది గంటలే!అపొ.కా 2:15
వచనాలు
అపొ.కా 2:15“మీరనుకున్నట్టు వీరు మద్యపానం చేయలేదు. ఇప్పుడు ఉదయం తొమ్మిదయినా కాలేదు.
- మూడో, ఆరో, తొమ్మిదో, పదకొండో గంటల్లో పనివారిని కూలికి పెట్టుకున్నారుమత్తయి 20:3, మత్తయి 20:5–6
వచనాలు
మత్తయి 20:3తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి,
మత్తయి 20:5–6దాదాపు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ, అతడు బయటికి వెళ్ళి, ఆ విధంగా చేశాడు. మళ్ళీ సుమారు ఐదు గంటలకు అతడు బయటికి వెళ్ళి, ఇంకా కొందరు ఊరికే నిలబడి ఉండడం చూసి, ‘మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు.
- సాయంత్రమైనప్పుడు అందరికీ కూలి ఇచ్చారు, చివరగా వచ్చినవారికి మొదటమత్తయి 20:8–9
వచనాలు
మత్తయి 20:8–9“సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్షతోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి, ‘పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారి వరకూ అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు. దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది.
- యేసును సిలువ వేసినప్పుడు మూడో గంటమార్కు 15:25
వచనాలు
మార్కు 15:25ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు.
- ఆరో గంట నుంచి తొమ్మిదో గంట వరకు చీకటిమత్తయి 27:45, మార్కు 15:33, లూకా 23:44
వచనాలు
మత్తయి 27:45మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.
మార్కు 15:33మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.
లూకా 23:44అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది.
- పిలాతు: ఇదిగో మీ రాజు! అప్పుడు సుమారు ఆరో గంటయోహా 19:14
వచనాలు
యోహా 19:14అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు.
- ఏడో గంటకు అధికారి కుమారుణ్ణి జ్వరం విడిచిపోయిందియోహా 4:52
వచనాలు
యోహా 4:52“ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది” అని అతడు వారిని అడిగాడు. వారు, “నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది” అని చెప్పారు.
- సుమారు పదో గంటకు ఇద్దరు శిష్యులు యేసుతో వెళ్ళారుయోహా 1:39
వచనాలు
యోహా 1:39ఆయన, “వచ్చి చూడండి” అన్నాడు. వారు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వారు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు.
- పేతురు, యోహాను ప్రార్థన సమయమైన తొమ్మిదో గంటకు దేవాలయానికి వెళ్ళారుఅపొ.కా 3:1
వచనాలు
అపొ.కా 3:1మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.
- కొర్నేలి తొమ్మిదో గంటకు ప్రార్థిస్తున్నాడుఅపొ.కా 10:3, అపొ.కా 10:30
వచనాలు
అపొ.కా 10:3మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, “కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు.
అపొ.కా 10:30అందుకు కొర్నేలి, “నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి
- పేతురు సుమారు ఆరో గంటకు ప్రార్థించడానికి మిద్దె మీదికి ఎక్కాడుఅపొ.కా 10:9
వచనాలు
అపొ.కా 10:9తరువాతి రోజున వారు ప్రయాణమై పోయి పట్టణానికి దగ్గరగా వచ్చేటప్పటికి పగలు సుమారు పన్నెండు గంటల వేళకి పేతురు ప్రార్థన చేసుకోడానికి ఇంటి పైకి వెళ్ళాడు.
- సైనికులు రాత్రి మూడో గంటకు కైసరయకు బయలుదేరారుఅపొ.కా 23:23
వచనాలు
అపొ.కా 23:23తరువాత అతడు ఇద్దరు శతాధిపతులను పిలిచి, “కైసరయ వరకూ వెళ్ళడానికి రెండు వందల మంది సైనికులనూ డెబ్భై మంది గుర్రపురౌతులనూ రెండు వందలమంది ఈటెల వారినీ రాత్రి తొమ్మిది గంటలకల్లా సిద్ధపరచండి.
ఉదయం, మధ్యాహ్నం, అర్ధరాత్రి
- దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి రోజుకు మూడుసార్లు ప్రార్థించాడుదాని 6:10
వచనాలు
దాని 6:10ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు.
- ఒక కీర్తన: సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నేను మొరపెడతానుకీర్త 55:17
వచనాలు
కీర్త 55:17సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు.
- మండుటెండలో అబ్రాహాము తన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడుఆది 18:1
వచనాలు
ఆది 18:1మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు.
- ఇస్సాకు సాయంకాలం పొలంలోకి వెళ్ళాడుఆది 24:63
వచనాలు
ఆది 24:63ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి.
- పస్కా గొర్రెపిల్లలను సంధ్యా సమయంలో వధించారునిర్గ 12:6
వచనాలు
నిర్గ 12:6ఈ నెల 14 వ రోజు వరకూ దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి.
- ఏలీయా సాయంత్రపు బలి సమయంలో ప్రార్థించాడు1 రాజులు 18:36
వచనాలు
1 రాజులు 18:36సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు.
- నెహెమ్యా మనుషులు తెల్లవారినప్పటి నుంచి నక్షత్రాలు కనిపించే వరకు ఈటెలు పట్టుకున్నారునెహె 4:21
వచనాలు
నెహె 4:21ఆ విధంగా మేము పనిచేస్తూ వచ్చాం. సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకూ ఈటెలు పట్టుకుని నిలబడ్డారు.
- అర్ధరాత్రి సంసోను గాజా పట్టణ ద్వారపు తలుపులను పెకలించాడున్యాయా 16:3
వచనాలు
న్యాయా 16:3సంసోను అర్థ రాత్రి వరకూ పండుకున్నాడు. అర్థ రాత్రి వేళ ఆ పట్టణం ద్వారం తలుపులను వాటి రెండు దర్వాజాలనూ అడ్డకర్రలతో సహా ఊడబెరికి వాటిని మోసుకుంటూ హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండశిఖరానికి వాటిని తీసుకు వెళ్ళాడు.
- అర్ధరాత్రి బోయజు మేల్కొని తన పాదాల దగ్గర ఒక స్త్రీ పడుకుని ఉండడం చూశాడురూతు 3:8
వచనాలు
రూతు 3:8అర్థరాత్రి సమయంలో బోయజు ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పడుకుని ఉండటం కనిపించింది.
- సుమారు అర్ధరాత్రి పౌలు, సీల చెరసాలలో ప్రార్థిస్తూ కీర్తనలు పాడారుఅపొ.కా 16:25
వచనాలు
అపొ.కా 16:25మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు.
- పౌలు అర్ధరాత్రి వరకు మాట్లాడాడు; ఐతుకు కిటికీలోనుంచి పడిపోయాడుఅపొ.కా 20:7, అపొ.కా 20:9
వచనాలు
అపొ.కా 20:7ఆదివారం నాడు మేము రొట్టె విరవడానికి సమకూడినప్పుడు పౌలు తరువాతి రోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి అతడు వారితో అర్థరాత్రి దాకా విస్తరించి మాట్లాడుతూ ఉండిపోయాడు.
అపొ.కా 20:9పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీలో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడవ అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు.
- కోడి రెండోసారి కూసింది; పేతురు గుర్తుచేసుకున్నాడుమార్కు 14:30, మార్కు 14:72
వచనాలు
మార్కు 14:30అప్పుడు యేసు, “నీతో కచ్చితంగా చెప్పేదేమిటంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడు సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు” అని అతనితో అన్నాడు.
మార్కు 14:72వెంటనే రెండోసారి కోడి కూసింది. ‘కోడి రెండు సార్లు కూసే ముందే నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు’ అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. అతడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు.
- వారం మొదటి రోజు చాలా పెందలకడనే, సూర్యోదయమైన వెంటనే, వారు సమాధికి వెళ్ళారుమార్కు 16:2
వచనాలు
మార్కు 16:2ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ,
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు