Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › నక్షత్రాలు

ఆశ్చర్యకరమైన వివరాలు

బైబిల్‌లో నక్షత్రాలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 21 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • దేవుడు రెండు గొప్ప జ్యోతులనూ నక్షత్రాలనూ చేశాడుఆది 1:16
    వచనాలు
    ఆది 1:16దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.
  • లెక్కించగలిగితే నక్షత్రాలను లెక్కించమని అబ్రాహాముకు చెబుతాడుఆది 15:5
    వచనాలు
    ఆది 15:5ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు.
  • నక్షత్రాలంత, ఇసుకంత సంతానంఆది 22:17, ద్వితీ 1:10
    వచనాలు
    ఆది 22:17నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.
    ద్వితీ 1:10యెహోవా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు కనుక ఈ రోజు మీరు ఆకాశంలో నక్షత్రాల్లాగా విస్తరించారు.
  • ఆయన నక్షత్రాల సంఖ్యను నిర్ణయించి ఒక్కొక్కదానికి పేరు పెడతాడుకీర్త 147:4
    వచనాలు
    కీర్త 147:4ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే.
  • మహిమలో నక్షత్రానికీ నక్షత్రానికీ తేడా ఉంది1 కొరింతీ 15:41
    వచనాలు
    1 కొరింతీ 15:41నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల వెలుగు వేరు. ఒక నక్షత్రానికీ మరొక నక్షత్రానికీ వెలుగులో తేడా ఉంటుంది కదా.
  • పదకొండు నక్షత్రాలు నమస్కరించినట్టు యోసేపు కలగన్నాడుఆది 37:9
    వచనాలు
    ఆది 37:9అతడింకొక కల కని తన సోదరులతో “ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి” అని చెప్పాడు.
  • నక్షత్రాలు తమ దారుల్లోనుంచి సీసెరాతో యుద్ధం చేశాయిన్యాయా 5:20
    వచనాలు
    న్యాయా 5:20కాని వాళ్ళు ఆ యుద్ధం నుంచి వెండిని కొల్లసొమ్ముగా తీసుకువెళ్ళలేదు. నక్షత్రాలు ఆకాశం నుంచి యుద్ధం చేశాయి. నక్షత్రాలు తమ ఆకాశమార్గాల్లో నుంచి సీసెరాతో యుద్ధం చేశాయి.
  • జ్ఞానులు తూర్పున ఆయన నక్షత్రాన్ని చూశారుమత్తయి 2:2
    వచనాలు
    మత్తయి 2:2“యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం” అన్నారు.
  • నక్షత్రం వారికి ముందుగా వెళ్ళి ఆ స్థలం పైన నిలిచిందిమత్తయి 2:9–10
    వచనాలు
    మత్తయి 2:9–10వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది. ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు.
  • ఇరవై ఏళ్ళ లోపువారిని దావీదు లెక్కించలేదు: ఇశ్రాయేలు నక్షత్రాల్లా ఉంటుంది1 దిన 27:23
    వచనాలు
    1 దిన 27:23ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు గనుక ఇరవై సంవత్సరాలు మొదలుకుని, అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు.

పేర్లున్న నక్షత్ర రాశులు

  • సప్తర్షి మండలం, మృగశిర, కృత్తిక, దక్షిణ నక్షత్ర రాశులుయోబు 9:9
    వచనాలు
    యోబు 9:9స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు.
  • కృత్తికను బంధించగలవా? మృగశిర కట్లు విప్పగలవా?యోబు 38:31–32
    వచనాలు
    యోబు 38:31–32కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా? వాటి కాలాల్లో నక్షత్ర రాసులను వచ్చేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను వాటి ఉపనక్షత్రాలను నువ్వు నడిపించగలవా?
  • ఆమోసు: ఆయన కృత్తికనూ మృగశిరనూ చేశాడుఆమో 5:8
    వచనాలు
    ఆమో 5:8ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. చీకటిని తెలవారేలా చేసేవాడు. పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి భూమి మీద కుమ్మరిస్తాడు.

నక్షత్రాల పూజ

  • సూర్యచంద్రులకూ నక్షత్రాలకూ నమస్కరించవద్దని ఇశ్రాయేలుకు చెప్పారుద్వితీ 4:19
    వచనాలు
    ద్వితీ 4:19ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా ఆకాశ సైన్యాలను చూసి మైమరచిపోయి మీ యెహోవా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి, వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి.
  • ఇశ్రాయేలు, రాజైన మనష్షే ఆకాశ సైన్యమంతటికీ నమస్కరించారు2 రాజులు 17:16, 2 రాజులు 21:3
    వచనాలు
    2 రాజులు 17:16వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు.
    2 రాజులు 21:3తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు అతడు మళ్ళీ కట్టించి, బయలు దేవుడుకు బలిపీఠాలు కట్టించి ఇశ్రాయేలురాజు అహాబు చేసినట్టు దేవతాస్తంభాలు చేయించి, నక్షత్రాలకు మొక్కి, వాటిని పూజిస్తూ ఉన్నాడు.
  • నక్షత్ర రాశులకు ధూపం వేసిన యాజకులను యోషీయా తొలగించాడు2 రాజులు 23:5
    వచనాలు
    2 రాజులు 23:5ఇంకా యూదా పట్టణాల్లో ఉన్న ఉన్నత స్థలాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ధూపం వెయ్యడానికి యూదా రాజులు నియమించిన అర్చకులను అంటే బయలుకు, సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపం వేసే వాళ్ళను అతడు తొలగించాడు.
  • ప్రజలు మిద్దెల మీద ఆకాశ సైన్యానికి నమస్కరించారుయిర్మీ 19:13, జెఫ 1:5
    వచనాలు
    యిర్మీ 19:13యెరూషలేము ఇళ్ళు, యూదా రాజుల రాజ భవనాలూ ఆ తోఫెతు స్థలం లాగే అపవిత్రమవుతాయి. ఏ ఇళ్ళ మీద ప్రజలు ఆకాశ నక్షత్ర సమూహానికి మొక్కి ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటికీ ఆలాగే జరుగుతుంది.”
    జెఫ 1:5మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను, యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు