Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › పక్షులు

ప్రకృతి

బైబిల్‌లో పక్షులు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 38 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • ఐదో రోజున సముద్ర జీవులతో పాటు పక్షులు చేయబడ్డాయిఆది 1:20–23
    వచనాలు
    ఆది 1:20–23దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు.
  • జలప్రళయం తర్వాత పక్షులు కూడా ఆహారంగా ఇవ్వబడ్డాయిఆది 9:2–3
    వచనాలు
    ఆది 9:2–3అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి. ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను.
  • ఇశ్రాయేలు ఏ పవిత్ర పక్షినైనా తినవచ్చుద్వితీ 14:11
    వచనాలు
    ద్వితీ 14:11పవిత్రమైన ప్రతి పక్షినీ మీరు తినవచ్చు.
  • తినకూడనివి: గరుడ పక్షి, రాబందులు, కాకి, నిప్పుకోడి, గుడ్లగూబలు, కొంగ, నారాయణ పక్షి, కుకుడు పక్షి, గబ్బిలంలేవీ 11:13–19
    వచనాలు
    లేవీ 11:13–19పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు, గరుడ పక్షి, డేగ జాతిలో ప్రతి పక్షీ, కాకి జాతిలోని ప్రతి పక్షీ, కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ. ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ, తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు, కొక్కిరాయి, అన్ని రకాల కొంగలు, కుకుడు గువ్వ, గబ్బిలం.
  • పక్షులు నీటి ఊటల పక్కన గూళ్ళు కట్టుకుని కొమ్మల మధ్య పాడతాయికీర్త 104:12
    వచనాలు
    కీర్త 104:12వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి.
  • కొంగ సరళ వృక్షాల్లో తన నివాసం ఏర్పరచుకుంటుందికీర్త 104:17
    వచనాలు
    కీర్త 104:17అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి.
  • వసంతకాలంలో గువ్వల కూత వినిపిస్తుందిపరమ 2:12
    వచనాలు
    పరమ 2:12దేశమంతా పూలు పూశాయి. కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.
  • కొంగ, గువ్వ, ఉల్లంకి, వానకోయిల తమ వలస కాలాన్ని పాటిస్తాయియిర్మీ 8:7
    వచనాలు
    యిర్మీ 8:7ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు దాని కాలాలు తెలుసు. తెల్ల గువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకులకు అవి తిరిగి రావలసిన సమయాలు తెలుసు. అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధి తెలియదు.
  • నిప్పుకోడి తన గుడ్లను ఇసుకలో వెచ్చబడడానికి నేల మీద విడిచిపెడుతుందియోబు 39:14–15
    వచనాలు
    యోబు 39:14–15లేదు సుమా, అది దాని గుడ్లు నేలపై పెడుతుంది. ఇసుకే వాటిని పొదుగుతుంది. దేని పాదమైనా వాటిని తొక్కుతుందని అయినా, అడవిజంతువు ఏదైనా వాటిని చితకగొడుతుందేమోనని అయినా అది మర్చిపోతుంది.
  • రెక్కలు చాచి నిప్పుకోడి గుర్రాన్నీ దాని రౌతునూ చూసి నవ్వుతుందియోబు 39:18
    వచనాలు
    యోబు 39:18అది వడిగా పరిగెత్తితే గుర్రాన్ని, దానిపై స్వారీ చేసే వాణ్ణి చూసి హేళనగా నవ్వుతుంది.
  • డేగ దక్షిణం వైపు తన రెక్కలు చాపుతుందియోబు 39:26
    వచనాలు
    యోబు 39:26డేగ నీ జ్ఞానం చేతనే ఎగురుతుందా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాస్తుందా?
  • పిచ్చుకలు ఒక పైసాకు రెండు, లేదా రెండు పైసలకు ఐదు అమ్ముడవుతాయిమత్తయి 10:29, లూకా 12:6
    వచనాలు
    మత్తయి 10:29రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు.
    లూకా 12:6ఐదు పిచ్చుకలను రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు.
  • పిచ్చుకా వానకోయిలా దేవాలయ బలిపీఠాల దగ్గర గూళ్ళు కట్టుకుంటాయికీర్త 84:3
    వచనాలు
    కీర్త 84:3సేనల ప్రభువైన యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది. తన పిల్లలను పెట్టడానికి వానకోయిలకు గూడు దొరికింది.
  • పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవుమత్తయి 6:26
    వచనాలు
    మత్తయి 6:26ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?
  • పూర్తిగా పెరిగిన ఆవ మొక్క కొమ్మల్లో పక్షులు గూళ్ళు కట్టుకుంటాయిమత్తయి 13:32
    వచనాలు
    మత్తయి 13:32అది విత్తనాలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించిన పెద్ద చెట్టు అవుతుంది. పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి.”
  • “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి”మత్తయి 8:20
    వచనాలు
    మత్తయి 8:20అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు.
  • అన్ని రకాల పక్షులను మనిషి మచ్చిక చేశాడుయాకో 3:7
    వచనాలు
    యాకో 3:7అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా.
  • సొలొమోను జంతువులు, పక్షులు, పాకే జీవులు, చేపల గురించి బోధించాడు1 రాజులు 4:33
    వచనాలు
    1 రాజులు 4:33లెబానోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కే గాని, చెట్లన్నిటిని గూర్చీ అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు, అన్నిటిని గురించీ అతడు రాశాడు.

కథల్లో

  • నోవహు పావురం అప్పుడే తెంపిన ఒలీవ ఆకుతో తిరిగి వచ్చిందిఆది 8:8–12
    వచనాలు
    ఆది 8:8–12నీళ్ళు నేలమీదనుంచి తగ్గాయో లేదో చూడడానికి అతడు తన దగ్గరనుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు. భూమి అంతటా నీళ్ళు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు. అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు. సాయంకాలానికి అది అతని దగ్గరికి తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్ని బట్టి నీళ్ళు నేల మీద ఇంకి పోయాయని నోవహు గ్రహించాడు. అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరికి తిరిగి రాలేదు.
  • అబ్రాము కళేబరాల మీదికి డేగలు దిగాయి; అతడు వాటిని తోలివేశాడుఆది 15:10–11
    వచనాలు
    ఆది 15:10–11అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు. ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు.
  • సాయంత్రం పూరేడు పిట్టలు శిబిరాన్ని కప్పాయినిర్గ 16:13
    వచనాలు
    నిర్గ 16:13అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది.
  • సముద్రం వైపు నుంచి తోలబడిన పూరేడు పిట్టలు; ఎవరూ పది హోమెర్ల కంటే తక్కువ సేకరించలేదుసంఖ్యా 11:31–32
    వచనాలు
    సంఖ్యా 11:31–32అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి. కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.
  • సొలొమోను బల్లకు బలిసిన కోళ్ళు; నెహెమ్యా బల్లకు ప్రతి రోజు కోళ్ళు1 రాజులు 4:23, నెహె 5:18
    వచనాలు
    1 రాజులు 4:23పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు.
    నెహె 5:18నా కోసం ప్రతి రోజూ ఒక ఎద్దు, ఆరు శ్రేష్ఠమైన గొర్రెలు భోజనం కోసం సిద్ధం చేసేవారు. ఇవి కాకుండా పిట్టలు, పది రోజులకొకసారి రకరకాల ద్రాక్షారసాలు సమృద్ధిగా సిద్ధపరిచే వారు. అయినప్పటికీ ఈ ప్రజలు ఎంతో కఠినమైన బానిసత్వం కింద ఉన్నందువల్ల అధికారిగా నాకు రావలసిన రాబడి నేను ఆశించలేదు.
  • పేతురు యేసును ఎరుగనన్నప్పుడు కోడి కూసిందిమత్తయి 26:74–75
    వచనాలు
    మత్తయి 26:74–75దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది. “ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.

ధర్మశాస్త్రంలో

  • గూడులోని పిల్లలను తీసుకో, కాని తల్లి పక్షిని వెళ్ళనివ్వుద్వితీ 22:6–7
    వచనాలు
    ద్వితీ 22:6–7చెట్టు మీదగానీ, నేల మీదగానీ, దారిలోగానీ పక్షిగుడ్లు గానీ పిల్లలు గానీ ఉన్న గూడు మీకు కనబడితే తల్లి ఆ పిల్లల మీద గానీ, ఆ గుడ్ల మీద గానీ పొదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లిపక్షిని తీసుకోకూడదు. మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేలా తప్పకుండా తల్లిని విడిచిపెట్టి పిల్లలను తీసుకోవచ్చు.
  • చర్మవ్యాధి నుంచి శుద్ధీకరణ: రెండు పక్షులు, ఒకదాన్ని పొలంలోకి విడిచిపెడతారులేవీ 14:4–7
    వచనాలు
    లేవీ 14:4–7శుద్ధీకరణ కావాలని కోరే ఆ వ్యక్తిని యాజకుడు జీవించి ఉన్న, లోపం లేని రెండు పక్షులనూ, దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు చెట్టు రెమ్మనూ తీసుకు రమ్మని ఆదేశించాలి. తరువాత యాజకుడు ఆరెండు పక్షుల్లో ఒకదాన్ని పారే నీటిపైన, ఒక మట్టి పాత్రలో చంపమని ఆదేశించాలి. అప్పుడు యాజకుడు బతికి ఉన్న రెండో పక్షినీ, దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు రెమ్మనూ తీసుకుని వాటిని పారే నీటిపైన, ఒక మట్టి పాత్రలో చనిపోయిన పక్షి రక్తంలో ముంచాలి. చర్మవ్యాధి నయమై శుద్ధీకరణ కోసం చూసే వ్యక్తి పైన యాజకుడు ఆ నీళ్ళని ఏడు సార్లు చిలకరించాలి. తరువాత యాజకుడు అతడు శుద్ధుడని ప్రకటించాలి. అప్పుడు యాజకుడు జీవించి ఉన్న రెండో పక్షిని ఎగిరి పోయేట్టు బయట మైదానంలో వదిలి వేయాలి.
  • శిశువైన యేసు కోసం: ఒక జత గువ్వలు లేదా రెండు పావురం పిల్లలులూకా 2:22–24
    వచనాలు
    లూకా 2:22–24మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు.

ఉచ్చుల గురించి సూక్తులు

  • “ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం”సామె 1:17
    వచనాలు
    సామె 1:17ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం.
  • “నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా?”ఆమో 3:5
    వచనాలు
    ఆమో 3:5నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా?
  • “వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది”కీర్త 124:7
    వచనాలు
    కీర్త 124:7వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము.
  • ఉరిలో చిక్కుకున్న పక్షుల్లాప్రస 9:12
    వచనాలు
    ప్రస 9:12తమకాలం ఎప్పుడు వస్తుందో మనుషులకు తెలియదు. చేపలు తమకు మరణకరమైన వలలో చిక్కుకున్నట్టు, పిట్టలు వలలో పట్టుబడినట్టు, హఠాత్తుగా ఏదో ఒక చెడ్డ సమయం తమ మీదికి వచ్చినప్పుడు వారు చిక్కుకుంటారు.

ఇతర సూక్తులు

  • “గూడు విడిచి తిరిగే పక్షితో సమానం”సామె 27:8
    వచనాలు
    సామె 27:8తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం.
  • కపటంతో నిండిన ఇళ్ళు “పంజరం నిండా పిట్టలు ఉన్నట్టు”యిర్మీ 5:27
    వచనాలు
    యిర్మీ 5:27పంజరం నిండా పిట్టలు ఉన్నట్టు వారి ఇళ్ళు కపటంతో నిండి ఉన్నాయి. దానితోనే వారు గొప్పవారు, ధనవంతులు అవుతారు.
  • “ఇంటిమీద ఏకాకిగా కూర్చున్న ఒంటరి పిట్టలాగా”కీర్త 102:7
    వచనాలు
    కీర్త 102:7ఇంటిమీద ఏకాకిగా కూర్చున్న ఒంటరి పిట్టలాగా రాత్రంతా మెలకువగా ఉన్నాను.
  • “ముళ్ళ తోక పిట్టలాగా కిచ కిచలాడాను. పావురం లాగా కూశాను”యెష 38:14
    వచనాలు
    యెష 38:14ముళ్ళ తోక పిట్టలాగా కిచ కిచలాడాను. పావురం లాగా కూశాను. పైకి చూసీ చూసీ నా కళ్ళు అలసిపోయాయి. నలిగి పోయాను. యెహోవా, నాకు సహాయం చెయ్యి.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు