Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › పాములు

ప్రకృతి

బైబిల్‌లో పాములు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 28 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • ఆదికాండం: పొలంలోని ఏ మృగం కంటే సర్పం యుక్తిగలదిఆది 3:1
    వచనాలు
    ఆది 3:1దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు.
  • ఆదికాండం: సర్పం తన పొట్టతో పాకుతూ మట్టి తినాలిఆది 3:14
    వచనాలు
    ఆది 3:14అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు.
  • “బండమీద పాము జాడ” — బుద్ధికి మించిన నాలుగు విషయాల్లో ఒకటిసామె 30:18–19
    వచనాలు
    సామె 30:18–19నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి. అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ.
  • గోడల్లో పాములు: గోడను పగలగొట్టేవాణ్ణి గాని దాని మీద ఆనుకునేవాణ్ణి గాని పాము కరవవచ్చుప్రస 10:8, ఆమో 5:19
    వచనాలు
    ప్రస 10:8గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది.
    ఆమో 5:19ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురు పడినట్టు, లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.
  • పాములు ఆడించేవారు: మంత్రం వేయకముందే పాము కరిస్తే లాభం లేదుప్రస 10:11
    వచనాలు
    ప్రస 10:11పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు.
  • మంత్రగాని రాగానికి చెవులు మూసుకునే నాగుపాముకీర్త 58:4–5
    వచనాలు
    కీర్త 58:4–5వారు చిమ్మేది నాగుపాము విషం. వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు. మంత్రగాళ్ళు ఎంతో నేర్పుగా మంత్రం వేసినా వారు ఎంతమాత్రం పట్టించుకోరు.
  • మంత్రానికి లొంగని కట్లపాములుయిర్మీ 8:17
    వచనాలు
    యిర్మీ 8:17యెహోవా చెప్పేదేమంటే, ‘నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.’”
  • దారిలోని కట్లపాము గుర్రపు మడమలను కరుస్తుంది; రౌతు వెనక్కి పడతాడుఆది 49:17
    వచనాలు
    ఆది 49:17దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.
  • అరణ్యంలో విషసర్పాలూ తేళ్ళూ ఉన్నాయిద్వితీ 8:15
    వచనాలు
    ద్వితీ 8:15బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు.
  • నెగెవు: సింహం, కట్లపాము, ఎగిరే సర్పం ఉన్న దేశంయెష 30:6
    వచనాలు
    యెష 30:6దక్షిణ దేశంలో ఉన్న క్రూరమృగాలను గూర్చిన దైవ ప్రకటన. సింహాలూ, ఆడ సింహాలూ, రక్త పింజేరి పాములూ, ఎగిరే సర్పాలతో దేశం ప్రమాదకరంగా మారినా వాళ్ళు మాత్రం తమ ఆస్తిని గాడిదల వీపుల పైనా, తమ సంపదలను ఒంటెల మూపుల పైనా తరలిస్తూ ఉంటారు. తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి వాటిని తీసుకు వెళ్తారు.
  • కట్లపాము గుడ్డు పగలగొడితే కట్లపాము పుడుతుందియెష 59:5
    వచనాలు
    యెష 59:5వాళ్ళు విషసర్పాల గుడ్లను పొదుగుతారు. సాలెగూడు నేస్తారు. ఆ గుడ్లు తినే వాళ్ళు చస్తారు. ఒకవేళ గుడ్డు పగిలితే విషసర్పం బయటికి వస్తుంది.

కథల్లో

  • మోషే కర్ర పాముగా మారింది; అతడు దాని నుంచి పారిపోయి, తర్వాత తోక పట్టుకున్నాడునిర్గ 4:3–4
    వచనాలు
    నిర్గ 4:3–4అప్పుడు దేవుడు “ఆ కర్రను నేల మీద పడవెయ్యి” అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు. అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది.
  • అహరోను కర్ర సర్పంగా మారి మాంత్రికుల కర్రలను మింగివేసిందినిర్గ 7:10–12
    వచనాలు
    నిర్గ 7:10–12మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది. అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు. వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది.
  • అరణ్యంలో విషసర్పాలు ఇశ్రాయేలీయులను కరిచాయి; చాలామంది చనిపోయారుసంఖ్యా 21:6
    వచనాలు
    సంఖ్యా 21:6అప్పుడు యెహోవా ప్రజల్లోకి విషసర్పాలు పంపించాడు. అవి ప్రజలను కాటువేసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు.
  • మోషే ఒక స్తంభం మీద కంచు సర్పాన్ని చేశాడు; కాటుపడినవారు దాన్ని చూసి బతికారుసంఖ్యా 21:8–9
    వచనాలు
    సంఖ్యా 21:8–9మోషే ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా “పాము ఆకారం చేయించి స్థంభం మీద పెట్టు. అప్పుడు పాము కాటేసిన ప్రతి వాడు దానివైపు చూసి బతుకుతాడు” అని మోషేకు చెప్పాడు. కాబట్టి మోషే, ఇత్తడి పాము ఒకటి చేయించి, స్థంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడూ ఆ ఇత్తడి పాము వైపు చూసినప్పుడు అతడు బతికాడు.
  • ధూపం వేస్తున్నందువల్ల హిజ్కియా ఆ కంచు సర్పమైన నెహుష్టానును ముక్కలు చేశాడు2 రాజులు 18:4
    వచనాలు
    2 రాజులు 18:4ఉన్నత స్థలాలను తొలగించి, విగ్రహాలను పగలగొట్టి, దేవతా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. దానికి ఇశ్రాయేలీయులు “నెహుష్టాను” అని పేరు పెట్టి, దానికి ధూపం వేసేవారు.
  • మెలితేలో మంట వేడికి బయటికి వచ్చిన ఒక విషసర్పం పౌలు చేతికి పట్టుకుందిఅపొ.కా 28:3–4
    వచనాలు
    అపొ.కా 28:3–4అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకుని వేలాడడం చూసి “ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం ఇతణ్ణి వదిలిపెట్ట లేదు” అని తమలో తాము చెప్పుకున్నారు.
  • పౌలు దాన్ని విదిలించాడు; అతనికి వాపు వస్తుందని ద్వీపవాసులు కనిపెట్టారుఅపొ.కా 28:5–6
    వచనాలు
    అపొ.కా 28:5–6కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు. వారైతే అతనికి హటాత్తుగా జ్వరం వంటిది రావటమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకుని, “ఇతడొక దేవుడు” అని చెప్పసాగారు.
  • పాములనూ తేళ్ళనూ తొక్కే అధికారం యేసు తన శిష్యులకు ఇస్తాడులూకా 10:17, లూకా 10:19
    వచనాలు
    లూకా 10:17ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు.
    లూకా 10:19ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు.

సూక్తులు

  • “పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి”మత్తయి 10:16
    వచనాలు
    మత్తయి 10:16“తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి.
  • చేప అడిగితే తన కుమారునికి పామును ఇచ్చే తండ్రి ఎవరు?మత్తయి 7:10, లూకా 11:11
    వచనాలు
    మత్తయి 7:10లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా?
    లూకా 11:11“మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపకోసం అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా?
  • ద్రాక్షారసం “పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది”సామె 23:31–32
    వచనాలు
    సామె 23:31–32ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు. అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది.
  • “వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు”కీర్త 140:3
    వచనాలు
    కీర్త 140:3వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. సెలా.
  • “పాము లాగా … వాళ్ళు మట్టి నాకుతారు”మీకా 7:17
    వచనాలు
    మీకా 7:17పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు. వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు. భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు. నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు.
  • ఐగుప్తు “పాములా బుసలు కొడుతూ” వెళ్ళిపోతుందియిర్మీ 46:22
    వచనాలు
    యిర్మీ 46:22ఐగుప్తు పైకి శత్రువులు దండెత్తి వస్తున్నారు. అది పాములా బుసలు కొడుతూ పాక్కుంటూ అవతలికి వెళ్ళిపోతుంది. చెట్ల కొమ్మలు నరికే వాళ్ళు గొడ్డళ్ళు పట్టుకుని వచ్చినట్టుగా వాళ్ళు ఆమె దగ్గరికి వస్తున్నారు.”

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు