Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › గుర్రాలు

ప్రకృతి

బైబిల్‌లో గుర్రాలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 37 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • యోబు: గుర్రం లోయలో కాలు దువ్వుతుంది, తన బలాన్ని బట్టి సంతోషించి యుద్ధంలోకి దూకుతుందియోబు 39:19–21
    వచనాలు
    యోబు 39:19–21గుర్రానికి నువ్వు బలం ఇచ్చావా? జూలు వెంట్రుకలతో దాని మెడను నువ్వే కప్పావా? మిడతవలె అది కదం తొక్కేలా చేశావా? దాని సకిలింపు ధ్వని భీకరం. అది కాలు దువ్వి తన బలాన్నిబట్టి రేగిపోతుంది. అది ఆయుధాలను ఎదుర్కోడానికి ముందుకు దూకుతుంది.
  • అది భయాన్ని చూసి నవ్వుతుంది, కత్తి ఎదుట వెనక్కి తిరగదుయోబు 39:22–23
    వచనాలు
    యోబు 39:22–23అది భయాన్ని వెక్కిరిస్తుంది. హడలిపోదు. కత్తిని చూసి వెనక్కి తగ్గదు. దాని వీపుపై అంబుల పొది, తళతళలాడే ఈటెలు బల్లేలు గలగలలాడినప్పుడు,
  • బూర మోగగానే అది నిలవలేదు; యుద్ధపు వాసన దానికి దూరం నుంచే తెలుస్తుందియోబు 39:24–25
    వచనాలు
    యోబు 39:24–25పట్టరాని కోపంతో అది పరుగులు పెడుతుంది. అది భేరీనాదం విని ఉరకలు వేస్తుంది. బాకా ధ్వని వినబడినప్పుడెల్లా అది హుంకరిస్తుంది. దూరం నుండి యుద్ధవాసన పసిగడుతుంది. సేనాధిపతుల సింహనాదాలను, కదనఘోషను వింటుంది.
  • యుద్ధ గుర్రాల బుసలూ సకిలింపులూ చాలా దూరం నుంచి వినిపించేవియిర్మీ 8:16
    వచనాలు
    యిర్మీ 8:16దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది. వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు.
  • నోటిలోని కళ్ళెం ద్వారా రౌతులు జంతువును పూర్తిగా నడిపిస్తారుయాకో 3:3
    వచనాలు
    యాకో 3:3గుర్రాలు మనకు లోబడడానికి దాని నోటికి కళ్ళెం పెట్టి, దాని శరీరం అంతా మనకు లోబడేలా చేస్తాం కదా!
  • గుర్రాలనూ కంచరగాడిదలనూ కళ్ళెంతో, పగ్గంతో అదుపు చేయాలికీర్త 32:9
    వచనాలు
    కీర్త 32:9వివేకం లేని గుర్రం లాగానో, గాడిద లాగానో ఉండకు. వాటిని అదుపు చేయాలంటే కళ్ళెం ఉండాలి. అవి నువ్వు కోరిన చోటికి వెళ్ళవు.
  • రథపు గుర్రాల కోసం బార్లీ, గడ్డి తెచ్చేవారు1 రాజులు 4:28
    వచనాలు
    1 రాజులు 4:28రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న వివిధ స్థలాలకు ప్రతివాడూ తన బాధ్యతను బట్టి బార్లీ, ఎండు గడ్డి తెచ్చి ఇచ్చేవాడు.
  • బండి చక్రాలూ గుర్రాలూ ధాన్యాన్ని నలగగొట్టకుండా దాని మీదుగా దొర్లేవియెష 28:28
    వచనాలు
    యెష 28:28మనుషులు రొట్టెల కోసం గోధుమలను నూర్చి పిండి చేస్తారు. కానీ అదేపనిగా గోధుమలను పిండి చేస్తూనే ఉండరు కదా! గోధుమలను దుళ్ళగొట్టడానికి గుర్రాలనూ బండి చక్రాలనూ నడిపిస్తారు గానీ దాన్ని పిండి చేయడానికి కాదు కదా!

యుద్ధంలో

  • ఫరో గుర్రాలూ రథాలూ ఇశ్రాయేలును సముద్రం వరకు తరిమాయినిర్గ 14:9, నిర్గ 15:19
    వచనాలు
    నిర్గ 14:9బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు.
    నిర్గ 15:19ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ళ మీదికి సముద్రపు నీళ్ళు పొంగిపొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు.
  • యెహోషువ శత్రువు గుర్రాల గుదికాలి నరాలు తెగగొట్టి వారి రథాలను కాల్చివేశాడుయెహో 11:6, యెహో 11:9
    వచనాలు
    యెహో 11:6అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు. రేపు ఈ సమయానికి నేను వారినందరినీ ఇశ్రాయేలు ప్రజల చేతిలో చచ్చినవారుగా అప్పగిస్తాను. నీవు వారి గుర్రాల గుదికాలి నరాలు తెగగోసి వారి రథాలను అగ్నితో కాల్చివేస్తావు” అని యెహోషువతో చెప్పాడు.
    యెహో 11:9యెహోవా యెహోషువతో చెప్పినట్టు అతడు వారికి చేశాడు. అతడు వారి గుర్రాల గుదికాలి నరాలుని తెగగొట్టి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు.
  • దావీదు వంద తప్ప రథపు గుర్రాలన్నిటి గుదికాలి నరాలు తెగగొట్టాడు2 సమూ 8:4
    వచనాలు
    2 సమూ 8:4అతని దగ్గరనుండి వెయ్యీ ఏడు వందల మంది గుర్రపు రౌతులను, ఇరవై వేల కాల్బలాన్ని పట్టుకుని, వారి గుర్రాల మందలో వంద ఉంచుకుని, మిగిలినవాటి చీలమండ నరాలను కోయించాడు.
  • అహాబుతో రాజైన యెహోషాపాతు: “నా గుర్రాలు నీ గుర్రాలే”1 రాజులు 22:4
    వచనాలు
    1 రాజులు 22:4అతడు “యుద్ధానికి నాతో పాటు నీవు రామోత్గిలాదు వస్తావా?” అని యెహోషాపాతును అడిగాడు. అందుకు యెహోషాపాతు “నువ్వేదంటే అదే. మా వాళ్ళు నీవాళ్ళే. నా గుర్రాలు నీ గుర్రాలే” అని ఇశ్రాయేలు రాజుతో అన్నాడు.
  • అష్షూరీయుల ఎగతాళి: రెండు వేల గుర్రాలిస్తాం, వాటి మీద రౌతులను పెట్టగలిగితే2 రాజులు 18:23
    వచనాలు
    2 రాజులు 18:23కాబట్టి, నా యజమాని అష్షూరు రాజు పక్షంగా నిన్ను సవాలు చేస్తున్నాను. చాలినంత మంది రౌతులు నీ దగ్గర ఉంటే రెండువేల గుర్రాలు నేను నీకిస్తాను.
  • షోమ్రోనులో వేగులవారు అరామీయులను వెంబడించడానికి గుర్రాలతో రెండు రథాలు తీసుకువెళ్ళారు2 రాజులు 7:13–14
    వచనాలు
    2 రాజులు 7:13–14అప్పుడు రాజు సేవకుల్లో ఒకడు “పట్టణంలో ఇంకా మిగిలి ఉన్న ఐదు గుర్రాల పైన కొంతమందిని వెళ్ళనీయండి. ఇశ్రాయేలులో చాలా మంది చనిపోయారు కదా, మరో ఐదుగురు పోతే నష్టమేంటి? వాళ్ళని పంపి చూద్దాం” అని బతిమాలాడు. కాబట్టి రాజు వాళ్లకి “సిరియా సైన్యం ఎలా ఉందో వెళ్ళి చూడండి” అని ఆదేశించాడు. వారు రెండు రథాలనూ, వాటి గుర్రాలనూ తీసుకున్నారు.
  • “గుర్రాలను సిద్ధం చేయండి. రౌతులారా, శిరస్త్రాణం పెట్టుకుని వాటిని అధిరోహించండి”యిర్మీ 46:4
    వచనాలు
    యిర్మీ 46:4గుర్రాలను సిద్ధం చేయండి. రౌతులారా, శిరస్త్రాణం పెట్టుకుని వాటిని అధిరోహించండి. బల్లేలకు పదును పెట్టండి. ఆయుధాలు ధరించండి.
  • దౌడు తీసే గుర్రాల డెక్కల చప్పుడు, రథాల రొదయిర్మీ 47:3
    వచనాలు
    యిర్మీ 47:3వాళ్ళ బలమైన గుర్రాల డెక్కలు నేలను తన్నే చప్పుడు వినిపించినప్పుడు, వాళ్ళ రథాల వేగం హోరుకూ, ఉరుము లాంటి వాటి చక్రాల శబ్దానికీ భయపడిన తండ్రులు తమ బలహీనత కారణంగా తమ పిల్లలకు సహాయం చేయరు.

రాజులు, వ్యాపారం

  • ధర్మశాస్త్రం: రాజు అనేక గుర్రాలను సంపాదించుకోకూడదుద్వితీ 17:16
    వచనాలు
    ద్వితీ 17:16అతడు గుర్రాలను చాలా ఎక్కువగా సంపాదించుకోకూడదు. గుర్రాలను ఎక్కువగా సంపాదించడానికి ప్రజలను ఐగుప్తుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ దారిలో వెళ్లకూడదని మీతో చెప్పాడు.
  • సొలొమోను రథపు గుర్రాల కోసం శాలలు, అతని గుర్రపు రౌతులు1 రాజులు 4:26, 2 దిన 9:25
    వచనాలు
    1 రాజులు 4:26సొలొమోను రాజు రథాల కోసం శాలల్లో 40,000 గుర్రాలు, అశ్విక దళానికి 12,000 గుర్రాలు ఉండేవి.
    2 దిన 9:25సొలొమోనుకు రథాలు నిలిపి ఉంచే పట్టణాల్లో, తన దగ్గర, యెరూషలేములో, గుర్రాలకు, రథాలకు 4,000 శాలలు ఉండేవి. 12,000 గుర్రపు రౌతులు ఉండేవారు.
  • ఐగుప్తు నుంచి వచ్చిన గుర్రం ధర 150 తులాల వెండి, రథం ధర 6001 రాజులు 10:28–29
    వచనాలు
    1 రాజులు 10:28–29ఐగుప్తు నుండి, కిలికియ నుండి తెచ్చిన గుర్రాలు సొలొమోనుకు ఉన్నాయి. రాజు వాణిజ్యాధికారులు గుర్రాల మందలను కొని తెప్పించారు. ఒక్కొక్క మందకు తగిన ధర చెల్లించారు. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన ఒక్కొక్క రథానికి 6 కిలోల వెండి, ఒక్కొక్క గుర్రానికి ఒకటిన్నర కిలోల వెండి చెల్లించారు. వాటిలో ఎక్కువ భాగం హిత్తీయుల రాజులందరికీ అరాము రాజులకూ తగిన ధరకు అమ్మారు.
  • సొలొమోను గుర్రాలు ఐగుప్తు, కూయె, ఇతర దేశాల నుంచి వచ్చాయి1 రాజులు 10:28, 2 దిన 9:28
    వచనాలు
    1 రాజులు 10:28ఐగుప్తు నుండి, కిలికియ నుండి తెచ్చిన గుర్రాలు సొలొమోనుకు ఉన్నాయి. రాజు వాణిజ్యాధికారులు గుర్రాల మందలను కొని తెప్పించారు. ఒక్కొక్క మందకు తగిన ధర చెల్లించారు.
    2 దిన 9:28ఐగుప్తు నుండీ ఇతర అన్ని దేశాల నుండీ సొలొమోనుకు గుర్రాలు సరఫరా అవుతూ ఉండేవి.
  • బేత్ తోగర్మా తూరుతో గుర్రాలు, యుద్ధ గుర్రాలు, కంచరగాడిదల వ్యాపారం చేసిందియెహె 27:14
    వచనాలు
    యెహె 27:14బేత్ తోగర్మా వాళ్ళు గుర్రాలను యుద్ధాశ్వాలనూ కంచరగాడిదలనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
  • బబులోను నుంచి తిరిగి వచ్చినవారి దగ్గర 736 గుర్రాలు, 245 కంచరగాడిదలు ఉన్నాయిఎజ్రా 2:66
    వచనాలు
    ఎజ్రా 2:66వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245,
  • యూదాలో కొందరు గుర్రాలనూ రథాలనూ నమ్ముకుని ఐగుప్తుకు వెళ్ళారుయెష 31:1
    వచనాలు
    యెష 31:1“ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి పట్టించుకోకుండా, ఆలోచన కోసం యెహోవా దగ్గరకి వెళ్ళకుండా సహాయం కోసం ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళకీ, గుర్రాలపై ఆధార పడేవాళ్ళకీ, అసంఖ్యాకంగా ఉన్న వాళ్ళ రథాలపైనా, లెక్కకు మించిన రౌతుల పైనా నమ్మకం ఉంచే వాళ్ళకీ బాధ!
  • యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను యోషీయా తొలగించాడు2 రాజులు 23:11
    వచనాలు
    2 రాజులు 23:11ఇదే కాకుండా, అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్మెలకు గది దగ్గర, యెహోవా మందిరపు ద్వారం దగ్గర నుంచి వాటిని తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నితో కాల్చేశాడు.
  • మొర్దెకైని రాజు సొంత గుర్రం మీద పట్టణమంతా ఊరేగించారుఎస్తే 6:8–11
    వచనాలు
    ఎస్తే 6:8–11రాజు ధరించుకునే రాజవస్త్రాలను, రాజు ఎక్కే గుర్రాన్ని, రాజు తన తలపై పెట్టుకునే రాజకిరీటాన్ని తేవాలి. ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీరాజు ఉన్నతాధికారుల్లో ఒకడికి అప్పగించాలి. రాజు గొప్ప చేయాలని కోరుకున్న వ్యక్తికి ఆ వస్త్రాలు తొడిగి ఆ గుర్రం మీద అతణ్ణి ఎక్కించి రాజవీధిలో ఊరేగిస్తూ ‘రాజు గొప్ప చేయాలని కోరిన వాడికి ఈ విధంగా చేస్తారు’ అని అతని ముందు నడుస్తూ చాటించాలి.” వెంటనే రాజు “అయితే తొందరగా వెళ్లి నువ్వు చెప్పినట్టే ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీ తీసుకుని రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి ఆ విధంగా చెయ్యి. నువ్వు చెప్పిన వాటిలో ఏదీ తక్కువ కానియ్యకుండా అంతా చెయ్యి” అని హామానుకు ఆజ్ఞాపించాడు. హామాను ఆ వస్త్రాలను, గుర్రాన్నీ తెచ్చి మొర్దెకైకి ఆ బట్టలు తొడిగి ఆ గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి రాజ వీధిలో నడిపిస్తూ “రాజు గొప్ప చేయాలని కోరే వాడికి ఇలా జరుగుతుంది” అని అతని ముందర నడుస్తూ చాటించాడు.
  • అగ్ని గుర్రాలున్న అగ్ని రథం ఏలీయాను ఎలీషా నుంచి వేరు చేసింది2 రాజులు 2:11
    వచనాలు
    2 రాజులు 2:11వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలూ కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడి గాలి లేచింది. ఆ సుడిగాలిలో ఎలీయా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు.

సూక్తులు

  • “ఆయన గుర్రాలు గరుడ పక్షుల కంటే వేగంగా పరుగెత్తుతున్నాయి”యిర్మీ 4:13
    వచనాలు
    యిర్మీ 4:13ఆయన రాక మేఘాలు కమ్ముతున్నట్టుగా ఉంది. ఆయన రథాలు సుడిగాలిలాగా, ఆయన గుర్రాలు గరుడ పక్షుల కంటే వేగంగా పరుగెత్తుతున్నాయి. అయ్యో, మనం నాశనమై పోయాం.
  • “వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి”హబ 1:8
    వచనాలు
    హబ 1:8వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి. రాత్రిలో తిరుగులాడే తోడేళ్లకంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు. ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు.
  • “యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు”సామె 21:31
    వచనాలు
    సామె 21:31యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు. అయితే విజయం యెహోవాదే.
  • ఒక కీర్తన: గుర్రపు గొప్ప బలం కూడా రక్షించలేదుకీర్త 33:17
    వచనాలు
    కీర్త 33:17గుర్రం విజయానికి పూచీ కాదు. దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు.
  • “గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం”సామె 26:3
    వచనాలు
    సామె 26:3గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం. మూర్ఖుల వీపుకు బెత్తం.
  • “గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా?”ఆమో 6:12
    వచనాలు
    ఆమో 6:12గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా? అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు.
  • “నువ్వు పాదచారులతో పరిగెత్తినప్పుడే … నువ్వు గుర్రపు రౌతులతో ఏ విధంగా పోటీ పడతావు?”యిర్మీ 12:5
    వచనాలు
    యిర్మీ 12:5యిర్మీయా, నువ్వు పాదచారులతో పరిగెత్తినప్పుడే నీవు అలసిపోయావు కదా, నువ్వు గుర్రపు రౌతులతో ఏ విధంగా పోటీ పడతావు? నెమ్మదిగా ఉన్న ప్రాంతంలోనే నువ్వు నిశ్చింతగా ఉండగలవు. మరి యొర్దాను పరవళ్ళు తొక్కుతూ వస్తే నీవేం చేస్తావు?

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు