Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › నక్కలు

ప్రకృతి

బైబిల్‌లో నక్కలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 10 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • “నక్కలకు గుంటలున్నాయి”మత్తయి 8:20, లూకా 9:58
    వచనాలు
    మత్తయి 8:20అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు.
    లూకా 9:58అందుకు యేసు, “నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు” అని అతనికి చెప్పాడు.
  • సంసోను 300 నక్కలను పట్టుకుని, జతల తోకల మధ్య కాగడాలు కట్టాడున్యాయా 15:4
    వచనాలు
    న్యాయా 15:4సంసోను అక్కడి నుంచి వెళ్లి మూడు వందల నక్కలను పట్టుకున్నాడు. రెండేసి నక్కల తోకలను ముడి పెట్టాడు. ఆ తోకల మధ్యలో ఒక్కో కాగడా కట్టి ఉంచాడు.
  • నక్కలు ఫిలిష్తీయుల ధాన్యాన్నీ ద్రాక్షతోటలనూ ఒలీవ తోటలనూ కాల్చివేశాయిన్యాయా 15:5
    వచనాలు
    న్యాయా 15:5ఆ కాగడాలను మండించి అవి మండుతుండగా ఆ నక్కలను ఫిలిష్తీయుల గోదుమ పొలాల్లోకి తరిమాడు. అవి ధాన్యం కుప్పలనూ, పైరునీ, ద్రాక్ష, ఒలీవ తోటలనూ తగులబెట్టాయి.
  • “ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో”పరమ 2:15
    వచనాలు
    పరమ 2:15మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. తోడేళ్ళను పట్టుకో. ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.
  • టోబీయా ఎగతాళి చేశాడు: నక్క ఎక్కినా వారి గోడ కూలిపోతుందినెహె 4:3
    వచనాలు
    నెహె 4:3అమ్మోనీయుడు టోబీయా అతని దగ్గరుండి “వీళ్ళు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరితే ఆ గాలికి గోడ పడిపోతుంది” అన్నాడు.
  • నక్కలు తిరుగుతున్న పాడైన సీయోను పర్వతంవిలాప 5:18
    వచనాలు
    విలాప 5:18సీయోను పర్వతం నిర్జీవంగా ఉంది. దాని మీద నక్కలు తిరుగులాడుతున్నాయి.
  • చచ్చినవారు నక్కలకు ఆహారం అవుతారుకీర్త 63:10
    వచనాలు
    కీర్త 63:10వారు కత్తి పాలవుతారు. నక్కలకు ఆహారం అవుతారు.

సూక్తులు

  • ఇశ్రాయేలు ప్రవక్తలు “బంజరు భూముల్లో తిరిగే నక్కల్లా ఉన్నారు”యెహె 13:4
    వచనాలు
    యెహె 13:4ఇశ్రాయేలు ప్రజలారా, మీ ప్రవక్తలు బంజరు భూముల్లో తిరిగే నక్కల్లా ఉన్నారు.
  • యేసు హేరోదును ఆ నక్క అంటాడులూకా 13:31–32
    వచనాలు
    లూకా 13:31–32అదే రోజున కొందరు పరిసయ్యులు వచ్చి, “నువ్వు ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు” అని ఆయనతో చెప్పారు. ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఈ రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు