అన్వేషించండి › అంశాలు › వేసవి, చలికాలం
ప్రకృతి
బైబిల్‌లో వేసవి, చలికాలం
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 40 భాగాలు, వాక్యం వాక్యంగా.
- విత్తే కాలం, కోత కాలం, చలి, వేడి, వేసవి, చలికాలం ఎన్నటికీ ఆగవుఆది 8:22
వచనాలు
ఆది 8:22భూమి ఉన్నంత వరకూ విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు” అని తన హృదయంలో అనుకున్నాడు.
- కాలాలనూ రోజులనూ సంవత్సరాలనూ సూచించడానికి ఆకాశంలో జ్యోతులుఆది 1:14, కీర్త 104:19
వచనాలు
ఆది 1:14దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి.
కీర్త 104:19ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు.
- ఒక కీర్తన: “వేసవికాలం, చలికాలం నువ్వే కలిగించావు”కీర్త 74:17
వచనాలు
కీర్త 74:17భూమికి సరిహద్దులు నియమించింది నువ్వే. వేసవికాలం, చలికాలం నువ్వే కలిగించావు.
- తగిన కాలంలో వర్షం: తొలకరి, కడవరి వర్షాలుద్వితీ 11:14, యోవే 2:23, యిర్మీ 5:24
వచనాలు
ద్వితీ 11:14మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు.
యోవే 2:23సీయోను ప్రజలారా, ఆనందించండి. మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి. ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు. ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు.
యిర్మీ 5:24వారు “రండి, మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు చూపుదాం. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే కదా. నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను మనకు వచ్చేలా చేసేవాడు ఆయనే కదా” అని తమ మనస్సులో అనుకోరు.
- వసంతకాలంలో, రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో2 సమూ 11:1
వచనాలు
2 సమూ 11:1వసంత కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరే కాలంలో, అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దావీదు యోవాబునీ తన సేవకులనూ ఇశ్రాయేలు సైన్యమంతటినీ పంపించాడు. దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.
- ద్రాక్ష కోత వరకు నూర్పిడి, విత్తే కాలం వరకు ద్రాక్ష కోతలేవీ 26:5
వచనాలు
లేవీ 26:5మీ ద్రాక్ష పండ్లకాలం వరకూ మీ పంట నూర్పు కొనసాగుతుంది. మీరు తృప్తిగా తిని మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు.
- రూతు బార్లీ కోత మొదట్లో వచ్చి, గోధుమ కోత అయ్యే వరకు పరిగె ఏరుకుందిరూతు 1:22, రూతు 2:23
- గోధుమ కోత కాలంలో సమూయేలు ఉరుములనూ వర్షాన్నీ రప్పించాడు1 సమూ 12:17–18
వచనాలు
1 సమూ 12:17–18ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.” సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.
- యాకోబు సంవత్సరాలు: పగలు ఎండ, రాత్రి మంచుఆది 31:40
వచనాలు
ఆది 31:40నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది.
వేసవి
- ఎగ్లోను తన మేడ గదిలోని చల్లదనంలో కూర్చున్నాడున్యాయా 3:20, న్యాయా 3:24
వచనాలు
న్యాయా 3:20ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఏహూదు “నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది” అని చెప్పగా, రాజు తన సింహాసనం మీద నుంచి లేచాడు.
న్యాయా 3:24అతడు వెళ్ళిపోయిన తరువాత ఆ రాజు సేవకులు లోపలికి వచ్చి చూసినప్పుడు ఆ మేడగది తలుపుల గడియలు వేసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు, రాజు తన చల్లని గదిలో మూత్ర విసర్జన చేస్తున్నాడనుకున్నారు.
- శీతాకాలపు ఇళ్ళు, వేసవికాలపు ఇళ్ళుఆమో 3:15
వచనాలు
ఆమో 3:15చలికాలపు భవనాలనూ వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను. ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి. పెద్ద భవనాలు అంతరించిపోతాయి.” యెహోవా ప్రకటించేది ఇదే.
- సీబా దావీదుకు వంద వేసవి పండ్లు తెచ్చాడు2 సమూ 16:1–2
వచనాలు
2 సమూ 16:1–2దావీదు కొండ అంచుకు అవతల కొంచెం దూరం వెళ్లినప్పుడు మెఫీబోషెతు సేవకుడు సీబా కళ్ళకు గంతలు కట్టిబడి ఉన్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. గాడిదలపై 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, వంద అంజూర ఫలాలున్న కొమ్మలు, ఒక ద్రాక్షారసపు తిత్తి వేయబడి ఉన్నాయి. రాజు “ఇవి ఎందుకు తెచ్చావు?” అని సీబాను అడిగాడు. అప్పుడు సీబా “రాజు పరివారం ఎక్కడానికి గాడిదలు, పనివారు తినడానికి రొట్టెలు, అంజూర ఫలాల కొమ్మలు, ఎడారిలో అలసిపోయిన వారు తాగడానికి ద్రాక్షారసం తెచ్చాను” అని చెప్పాడు.
- గెదల్యా: ద్రాక్షారసం, వేసవి పండ్లు, నూనె కుండల్లో నిల్వ చేసుకోండియిర్మీ 40:10, యిర్మీ 40:12
వచనాలు
యిర్మీ 40:10చూడండి, మన దగ్గరికి వచ్చే కల్దీయులను కలుసుకోడానికి నేను మిస్పాలో కాపురం ఉంటున్నాను. కాబట్టి ద్రాక్షారసం తయారుచేసుకోండి. వేసవికాల ఫలాలు, నూనె సమకూర్చుకుని, పాత్రల్లో నిల్వ చేసుకోండి. మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివాసం ఉండండి.”
యిర్మీ 40:12కాబట్టి యూదయ వాళ్ళందరూ తాము చెదిరిపోయి ఉన్న స్థలాలన్నిటినీ విడిచి, గెదల్యా దగ్గరికి మిస్పా తిరిగి వచ్చారు. వాళ్ళు ద్రాక్షారసం, వేసవికాలపు ఫలాలు అత్యంత సమృద్ధిగా సమకూర్చుకున్నారు.
- చీమ వేసవిలో తన ఆహారాన్ని నిల్వ చేసుకుంటుందిసామె 6:6–8, సామె 30:25
వచనాలు
సామె 6:6–8సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు. అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.
సామె 30:25చీమలు బలం లేని జీవులు. అయినా అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి.
- వేసవిలో కళ్ళం మీది పొట్టు, గాలికి కొట్టుకుపోతుందిదాని 2:35
వచనాలు
దాని 2:35అప్పుడు ఇనుము, బంకమన్ను, ఇత్తడి, వెండి, బంగారం అన్నీ కలిసి పిండిపిండి అయిపోయాయి. అది కోతకాలంలో కళ్ళంలో దంచిన చెత్తలాగా అయిపోయింది. వాటి ఆచూకీ ఎక్కడా కనబడకుండా గాలికి కొట్టుకుపోయాయి. అయితే ఆ విగ్రహాన్ని విరగగొట్టిన ఆ రాయి గొప్ప పర్వతంగా మారి భూలోకమంతటా వ్యాపించింది.”
- అంజూరపు చెట్టు ఆకులు వేసినప్పుడు వేసవి దగ్గరలో ఉందిమత్తయి 24:32
వచనాలు
మత్తయి 24:32“అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.
- “వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది”కీర్త 32:4
వచనాలు
కీర్త 32:4పగలూ రాత్రీ నా మీద నీ చెయ్యి భారంగా ఉంది. వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది. సెలా.
చలికాలం
- “చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి”పరమ 2:11–13
వచనాలు
పరమ 2:11–13చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి. దేశమంతా పూలు పూశాయి. కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి. అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. ద్రాక్షచెట్లు పూతపట్టాయి. అవి సువాసన ఇస్తున్నాయి. ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
- తొమ్మిదో నెలలో రాజు తన శీతాకాలపు భవనంలో నిప్పు దగ్గర కూర్చున్నాడుయిర్మీ 36:22
వచనాలు
యిర్మీ 36:22తొమ్మిదో నెలలో, రాజు శీతాకాలం రాజమందిరంలో కూర్చుని ఉన్నప్పుడు, అతని ఎదుట కుంపటిలో అగ్ని రగులుతూ ఉంది.
- వర్షాకాలంలో ప్రజలు భారీ వర్షంలో రాజవీధిలో వణుకుతూ కూర్చున్నారుఎజ్రా 10:9, ఎజ్రా 10:13
వచనాలు
ఎజ్రా 10:9యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు.
ఎజ్రా 10:13అయితే ఇక్కడ జనసమూహం ఎక్కువగా ఉంది. ఇప్పుడు విపరీతంగా వర్షం కురుస్తున్నందువల్ల మేము బయట నిలబడలేకపోతున్నాం. ఈ పని ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలామందిమి పాపం చేశాం. కాబట్టి అన్ని సమాజాల్లోని పెద్దలందరికీ ఈ పని కేటాయించండి.
- చలికాలంలో ప్రతిష్ఠ పండగ; యేసు సొలొమోను మంటపంలో నడిచాడుయోహా 10:22–23
వచనాలు
యోహా 10:22–23ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం. అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా
- “మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ … రాకూడదని ప్రార్థన చేసుకోండి”మత్తయి 24:20
వచనాలు
మత్తయి 24:20అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి.
- ఉపవాస దినం తర్వాత సముద్ర ప్రయాణం ప్రమాదకరమైంది; చలికాలం గడపడానికి రేవు కోసం చూశారుఅపొ.కా 27:9, అపొ.కా 27:12
వచనాలు
అపొ.కా 27:9చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచింది కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.
అపొ.కా 27:12పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది ఆలోచన చెప్పారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు.
- ఒక అలెగ్జాండ్రియ ఓడ ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉందిఅపొ.కా 28:11
వచనాలు
అపొ.కా 28:11కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి
- పౌలు నికొపొలిలో చలికాలం గడపాలని నిర్ణయించుకున్నాడుతీతు 3:12
వచనాలు
తీతు 3:12నేను నికొపొలిలో చలికాలం గడపాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను అర్తెమానుగాని, తుకికునుగాని నీ దగ్గరకి పంపినప్పుడు నువ్వు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి.
- తిమోతితో పౌలు: “నీవు చలికాలం రాకముందే రావడానికి ప్రయత్నం చెయ్యి”2 తిమో 4:21
వచనాలు
2 తిమో 4:21నీవు చలికాలం రాకముందే రావడానికి ప్రయత్నం చెయ్యి. యుబూలు, పుదే, లీను, క్లౌదియ, ఇతర సోదరులంతా నీకు వందనాలు చెబుతున్నారు.
- ఉన్నిలా మంచు పరచబడింది, బూడిదలా మంచు చల్లబడిందికీర్త 147:16
వచనాలు
కీర్త 147:16గొర్రెబొచ్చు లాంటి తెల్లని మంచు కురిపించేవాడు ఆయనే. బూడిదలాంటి మంచు ముద్దలు చల్లేవాడు ఆయనే.
సామెతల్లోని మాటలు
- “బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు”సామె 10:5
వచనాలు
సామె 10:5బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.
- “ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో”సామె 26:1
వచనాలు
సామె 26:1ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.
- “కోతకాలపు మంచు చల్లదనం వంటి”సామె 25:13
వచనాలు
సామె 25:13నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు.
- సోమరి కాలానికి దున్నడుసామె 20:4
వచనాలు
సామె 20:4నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు