అన్వేషించండి › అంశాలు › గొర్రెలు
ప్రకృతి
బైబిల్‌లో గొర్రెలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 38 భాగాలు, వాక్యం వాక్యంగా.
- హేబెలు గొర్రెల కాపరిఆది 4:2
వచనాలు
ఆది 4:2తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు.
- హేబెలు తన మందలోని తొలిచూలు పిల్లలను తెచ్చాడుఆది 4:4
వచనాలు
ఆది 4:4హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు.
- అబ్రాహాము పొదలో కొమ్ములు చిక్కుకున్న ఒక పొట్టేలును చూశాడుఆది 22:13
వచనాలు
ఆది 22:13అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు.
- మందలకు నీళ్ళు పెట్టడానికి కాపరులు బావి నోటి మీది రాయిని దొర్లించేవారుఆది 29:2–3
వచనాలు
ఆది 29:2–3అక్కడ అతనికి పొలంలో ఒక బావి కనబడింది. దాని దగ్గర మూడు గొర్రెల మందలు పండుకుని ఉన్నాయి. కాపరులు తమ మందలకు ఆ బావి నీళ్ళు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది. అక్కడికి మందలన్నీ వచ్చి చేరినప్పుడు ఆ బావి మీద నుండి ఆ రాయిని తొలగించి, గొర్రెలకు నీళ్ళు పెట్టి తిరిగి బావి మీద రాయిని పెట్టేస్తారు.
- రాహేలు గొర్రెల కాపరి; యాకోబు ఆమె తండ్రి గొర్రెలకు నీళ్ళు పెట్టాడుఆది 29:9–10
వచనాలు
ఆది 29:9–10అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకువచ్చింది. ఆమె వాటిని మేపుతున్నది. యాకోబు తన మేనమామ అయిన లాబాను కూతురు రాహేలును, అతని గొర్రెలను చూసినప్పుడు, అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని దొర్లించి తన మేనమామ లాబాను గొర్రెలకు నీళ్ళు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని పెద్దగా ఏడ్చాడు.
- యిత్రో ఏడుగురు కుమార్తెలు మందకు నీళ్ళు పెట్టారు; మోషే వారికి సహాయం చేశాడునిర్గ 2:16–17
వచనాలు
నిర్గ 2:16–17మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ళ తొట్టెలు నింపుతున్నారు. అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి, వాళ్ళ మందకు నీళ్లు తోడిపెట్టాడు.
- హోరేబుకు వచ్చినప్పుడు మోషే యిత్రో మందను మేపుతున్నాడునిర్గ 3:1
వచనాలు
నిర్గ 3:1మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు.
- చిన్న కుమారుడైన దావీదు బయట గొర్రెలు మేపుతున్నాడు1 సమూ 16:11
వచనాలు
1 సమూ 16:11“నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?” అని యెష్షయిని అడిగాడు. అతడు “ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు” అని చెప్పాడు. అందుకు సమూయేలు “నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా” అని యెష్షయితో చెప్పాడు.
- కాపరిగా యాకోబు: పగలు ఎండ, రాత్రి మంచు, క్రూర మృగాల వల్ల నష్టాలుఆది 31:38–40
వచనాలు
ఆది 31:38–40ఈ ఇరవై సంవత్సరాలూ నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవీ పిల్లలు కనకుండా పోలేదు, నీ మంద పొట్టేళ్ళను దేనినీ నేను తినలేదు. క్రూర జంతువులు చంపివేసిన దాన్ని నీ దగ్గరికి తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగలైనా, రాత్రైనా, ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు. నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది.
- యాకోబు జీతం: పొడలు, మచ్చలు, నల్లని రంగు ఉన్న జంతువులుఆది 30:32
వచనాలు
ఆది 30:32ఈ రోజు నేను నీ మంద అంతటిలో నడచి చూసి పొడలైనా మచ్చలైనా గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానినీ, మేకల్లో మచ్చలైనా, పొడలైనా గలవాటినీ వేరు చేస్తున్నాను. అలాటివన్నీ నాకు జీతమౌతాయి.
- నీటి తొట్ల దగ్గర అతడు ఒలిచిన కొమ్మలు, చారల పిల్లలుఆది 30:37–39
వచనాలు
ఆది 30:37–39యాకోబు గంగ రావి, బాదం, సాల చెట్ల చువ్వలు తీసుకు ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు. మందలు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలవల్లో, నీటి గాళ్ళలో, వాటి ముందు పెట్టాడు. అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి.
- కాపరులు రాత్రివేళ తమ మందలకు కావలి కాస్తున్నారులూకా 2:8
వచనాలు
లూకా 2:8ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు
- గొర్రెలకు కాపరి స్వరం తెలుసు; అతడు వాటిని పేరు పెట్టి పిలుస్తాడుయోహా 10:3–4
వచనాలు
యోహా 10:3–4అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు. తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.
ఉన్ని, పాలు, బొచ్చు కత్తిరించడం
- మంద పాలు, గొర్రెపిల్లల కొవ్వు, బాషాను పొట్టేళ్ళుద్వితీ 32:14
వచనాలు
ద్వితీ 32:14ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు.
- రాహేలు విగ్రహాలను తీసుకున్నప్పుడు లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడుఆది 31:19
వచనాలు
ఆది 31:19లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవుళ్ళను దొంగిలించింది.
- యూదా తిమ్నాలోని తన గొర్రెల బొచ్చు కత్తిరించేవారి దగ్గరికి వెళ్ళాడుఆది 38:12–13
వచనాలు
ఆది 38:12–13చాలా రోజుల తరువాత యూదా భార్య అయిన షూయ కూతురు చనిపోయింది. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అనే తన స్నేహితుడితో కలిసి తిమ్నాతులో తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి వెళ్ళాడు. తన మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారుకు తెలిసింది.
- నాబాలుకు 3,000 గొర్రెలు, 1,000 మేకలు ఉన్నాయి; కర్మెలులో వాటి బొచ్చు కత్తిరిస్తున్నాడు1 సమూ 25:2
వచనాలు
1 సమూ 25:2మాయోను గ్రామంలో ఒకడున్నాడు. అతని ఆస్తిపాస్తులన్నీ కర్మెలులో ఉన్నాయి. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు.
- బొచ్చు కత్తిరించే కాలం అంటే విందు: నాబాలు విందు, అబ్షాలోము విందు1 సమూ 25:11, 1 సమూ 25:36, 2 సమూ 13:23–24
వచనాలు
1 సమూ 25:11నా అన్నపానాలను, నా గొర్రెల బొచ్చు కత్తిరించే వారికోసం సిద్ధపరచిన నా మాంసాన్ని, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని వాడికి ఇవ్వాలా?” అన్నాడు.
1 సమూ 25:36అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరికి వచ్చినప్పుడు, రాజుల్లాగా అతడు ఇంట్లో విందు చేసి, తప్ప తాగుతూ కులుకుతూ మత్తుగా ఉన్నాడు. అందుకని తెల్లవారే వరకూ ఆమె అతనితో ఏమాటా చెప్పలేదు.
2 సమూ 13:23–24రెండేళ్ళ తరువాత అబ్షాలోముకు గొర్రెలబొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. ఎఫ్రాయిముకు దగ్గర బయల్హాసోరులో అబ్షాలోము రాజకుమారులనందరినీ విందుకు పిలిచాడు. అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి “రాజా, వినండి. నీ దాసుడనైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజవైన నువ్వూ నీ సేవకులూ విందుకు రావాలని నీ దాసుడనైన నేను కోరుతున్నాను” అని మనవి చేసుకున్నాడు.
- మంద నుంచి మొదట కత్తిరించిన ఉన్ని యాజకులకు వెళ్ళిందిద్వితీ 18:3–4
వచనాలు
ద్వితీ 18:3–4ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు, పొట్ట భాగం యాజకులకు ఇవ్వాలి. ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో ప్రథమ ఫలం యాజకునికి ఇవ్వాలి. గొర్రెల బొచ్చు కత్తిరింపులో మొదటి భాగం యాజకునికి ఇవ్వాలి.
- యోబు తన గొర్రెల బొచ్చుతో పేదలకు వెచ్చదనం ఇచ్చాడుయోబు 31:20
వచనాలు
యోబు 31:20వారి హృదయాలు నన్ను దీవించక పోతే, వారు నా గొర్రెల బొచ్చు చేత వెచ్చదనం పొందక పోయినట్టయితే,
సంఖ్యల్లో మందలు
- మోయాబు రాజైన మేషా 100,000 గొర్రెపిల్లలనూ 100,000 పొట్టేళ్ళ ఉన్నినీ చెల్లించాడు2 రాజులు 3:4
వచనాలు
2 రాజులు 3:4మోయాబు రాజు మేషాకు విస్తారమైన మేకల, గొర్రెల మందలున్నాయి. ఇతడు ఇశ్రాయేలు రాజుకి ఒక లక్ష గొర్రె పిల్లలనూ, లక్ష గొర్రె పొట్టేళ్ల ఉన్నినీ పన్నుగా కడుతుండేవాడు.
- అరబీయులు యెహోషాపాతుకు 7,700 పొట్టేళ్ళనూ 7,700 మేకపోతులనూ తెచ్చారు2 దిన 17:11
వచనాలు
2 దిన 17:11ఫిలిష్తీయుల్లో కొందరు యెహోషాపాతుకు పన్ను, కానుకలు ఇస్తూ వచ్చారు. అరబీయులు కూడా అతనికి 7, 700 గొర్రె పొట్టేళ్లను, 7, 700 మేకపోతులను సమర్పించేవారు.
- హగ్రీయుల దగ్గర నుంచి 250,000 గొర్రెలను తీసుకున్నారు1 దిన 5:21
వచనాలు
1 దిన 5:21కాబట్టి ఇశ్రాయేలీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు యాభై వేల ఒంటెలనూ, రెండు లక్షల యాభై వేల గొర్రెలనూ, రెండు వేల గాడిదలనూ, లక్ష మంది మనుషులనూ స్వాధీనం చేసుకున్నారు.
- యోబుకు 7,000 గొర్రెలు, తర్వాత 14,000 ఉన్నాయియోబు 1:3, యోబు 42:12
వచనాలు
యోబు 1:3అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశుసంపద ఉంది. అనేకమంది పనివాళ్ళు అతని దగ్గర పని చేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పవాడుగా ఎంచారు.
యోబు 42:12యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడు. అతనికి పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటెలు, వెయ్యి జతల ఎడ్లు, వెయ్యి ఆడగాడిదలు ఉన్నాయి.
- కేదారు తూరుతో గొర్రెపిల్లలు, పొట్టేళ్ళు, మేకల వ్యాపారం చేసిందియెహె 27:21
వచనాలు
యెహె 27:21అరేబియా వాళ్ళు, కేదారు నాయకులంతా నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను తెచ్చి నీ సరుకులు కొన్నారు.
- దేవాలయ ప్రతిష్ఠలో సొలొమోను 120,000 గొర్రెలను అర్పించాడు1 రాజులు 8:63
వచనాలు
1 రాజులు 8:63సొలొమోను 22,000 ఎద్దులను, 1, 20,000 గొర్రెలను, యెహోవాకు సమాధాన బలులుగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులంతా కలిసి యెహోవా మందిరాన్ని ప్రతిష్టించారు.
ధర్మశాస్త్రంలో
- దొంగిలించిన గొర్రెను వధించినా అమ్మినా: నాలుగు గొర్రెలు చెల్లించాలినిర్గ 22:1
వచనాలు
నిర్గ 22:1“ఎవరైనా ఒకడు ఎద్దును గానీ, గొర్రెను గానీ దొంగిలించి వాటిని అమ్మినా, లేదా చంపినా ఒక ఎద్దుకు బదులు ఐదు ఎద్దులు, ఒక గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు చెల్లించాలి.
- క్రూర మృగాలు చీల్చిన గొర్రె: రుజువుగా కళేబరాన్ని తేవాలినిర్గ 22:10, నిర్గ 22:13
వచనాలు
నిర్గ 22:10ఒకడు గాడిద, ఎద్దు, గొర్రె, మరి ఏ జంతువునైనా కాపాడమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు, అది చనిపోయినా, గాయపడినా, లేదా ఎవరూ చూడకుండా ఎవరైనా వాటిని తోలుకు పోయినా,
నిర్గ 22:13లేదా ఒకవేళ మృగాలు దాన్ని చీల్చివేస్తే రుజువు కోసం దాన్ని తీసుకురావాలి. అలా చనిపోయినప్పుడు దాని నష్టం చెల్లించనక్కర లేదు.
యెరూషలేములో
- యాజకులు గొర్రెల ద్వారాన్ని మళ్ళీ కట్టారునెహె 3:1
వచనాలు
నెహె 3:1ప్రధానయాజకుడు ఎల్యాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు నూరవ గోపురం, హనన్యేలు గోపురం వరకూ ప్రతిష్టించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు.
- బేతెస్ద కోనేరు గొర్రెల ద్వారం దగ్గర ఉండేదియోహా 5:2
వచనాలు
యోహా 5:2యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి.
సూక్తులు
- “ఉన్ని కత్తిరించి, కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల్లాగా నీ పళ్ళు ఉన్నాయి”పరమ 4:2
వచనాలు
పరమ 4:2ఉన్ని కత్తిరించి, కడిగిన తరువాత పైకి వచ్చిన గొర్రెల్లాగా నీ పళ్ళు ఉన్నాయి. ఒక్కటీ పోకుండా అవి జోడుజోడుగా ఉన్నాయి.
- “నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసుకో”సామె 27:23
వచనాలు
సామె 27:23నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసుకో. నీ మందల మీద మనస్సు ఉంచు.
- “నీకు వెచ్చటి బట్టల కోసం గొర్రెపిల్లలున్నాయి”సామె 27:26
వచనాలు
సామె 27:26నీకు వెచ్చటి బట్టల కోసం గొర్రెపిల్లలున్నాయి. ఒక చేను కొనడానికి మేకలు సరిపోతాయి.
- “బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె మౌనంగా” ఉన్నట్టుయెష 53:7
వచనాలు
యెష 53:7ఆయన దుర్మార్గానికి గురి అయ్యాడు. బాధల పాలైనా అతడు నోరు తెరవలేదు. గొర్రెపిల్లలాగా ఆయన్ని వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు