Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › లిల్లీ పువ్వులు, గడ్డి

ప్రకృతి

బైబిల్‌లో లిల్లీ పువ్వులు, గడ్డి

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 35 భాగాలు, వాక్యం వాక్యంగా.

లిల్లీ పువ్వులు

  • దేవాలయ మంటప స్తంభాల పీటలు లిల్లీ పువ్వుల ఆకారంలో ఉన్నాయి1 రాజులు 7:19, 1 రాజులు 7:22
    వచనాలు
    1 రాజులు 7:19స్తంభాల మీది పీటలపై 4 మూరల వరకూ తామర పూవుల్లాంటి ఆకృతులు ఉన్నాయి.
    1 రాజులు 7:22ఈ స్తంభాల మీద తామర పూవుల్లాంటి చెక్కడం పని ఉంది. ఈ విధంగా స్తంభాల పని పూర్తి అయ్యింది.
  • కంచు సముద్రం అంచు లిల్లీ పువ్వులా ఉంది1 రాజులు 7:26, 2 దిన 4:5
    వచనాలు
    1 రాజులు 7:26సరస్సు మందం బెత్తెడు. దాని పై అంచుకు పాత్రకు పై అంచులాగా తామర పూవుల్లాంటి పోత పని ఉంది. అందులో సుమారు 2,000 తొట్టెలు నీరు పడుతుంది.
    2 దిన 4:5దాని మందం బెత్తెడు. దాని అంచు ఒక గిన్నె అంచులాగా ఉండి తామరపువ్వును పోలి ఉంది. దానిలో దాదాపు 66,000 లీటర్ల నీరు పడుతుంది.
  • పొలాల్లో పూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి: “అవి పని చేయవు, బట్టలు నేయవు”మత్తయి 6:28, లూకా 12:27
    వచనాలు
    మత్తయి 6:28బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు.
    లూకా 12:27అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను.
  • తన వైభవమంతటిలో సొలొమోను కూడా వాటిలో ఒకదానిలా అలంకరించబడలేదుమత్తయి 6:29
    వచనాలు
    మత్తయి 6:29అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు.
  • ఒక కాపరి లిల్లీ పువ్వుల మధ్య తన మందను మేపుతాడుపరమ 2:16, పరమ 6:3
    వచనాలు
    పరమ 2:16నా ప్రియుడు నా వాడు. నేను అతని దాన్ని. లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.
    పరమ 6:3నేను నా ప్రియుని దాన్ని, అతడు నావాడు. అతడు లిల్లీ మొక్కల్లో మేపుతాడు.
  • ప్రియుడు లిల్లీ పువ్వులు ఏరుకోవడానికి తన తోటలోకి దిగి వెళ్తాడుపరమ 6:2
    వచనాలు
    పరమ 6:2మేపడానికీ లిల్లీలు ఏరడానికీ నా ప్రియుడు తన తోటలోకి వెళ్ళాడు. సుగంధ వనస్పతులున్న తోటలోకి వెళ్ళాడు.
  • “లోయలోని లిల్లీ పువ్వును … ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా”పరమ 2:1–2
    వచనాలు
    పరమ 2:1–2నేను కేవలం మైదానంలోని పువ్వును. కేవలం లోయలోని లిల్లీ పువ్వును. ప్రేయసీ! నువ్వు నా దేశపు యువతుల మధ్య ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా ఉన్నావు.
  • “అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి”పరమ 5:13
    వచనాలు
    పరమ 5:13అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి.
  • లిల్లీ పువ్వుల మధ్య మేసే కవల జింకపిల్లలుపరమ 4:5
    వచనాలు
    పరమ 4:5నీ రెండు స్తనాలు లిల్లీ పూల మధ్య మేస్తున్న కవల జింకపిల్లల్లా ఉన్నాయి.

గడ్డి

  • పశువుల కోసం, కొండల మీద గడ్డి మొలుస్తుందికీర్త 104:14, కీర్త 147:8, ద్వితీ 11:15
    వచనాలు
    కీర్త 104:14పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు
    కీర్త 147:8ఆయన ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం వర్షం సిద్ధం చేస్తాడు. కొండల మీద గడ్డి మొలిపిస్తాడు.
    ద్వితీ 11:15మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు.
  • కోసిన గడ్డి మీద కురిసే వర్షంకీర్త 72:6
    వచనాలు
    కీర్త 72:6కోసిన గడ్డిపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు దిగి వస్తాడు గాక.
  • మిద్దెల మీది గడ్డి పెరగకముందే వాడిపోతుందికీర్త 129:6–7, 2 రాజులు 19:26
    వచనాలు
    కీర్త 129:6–7వాళ్ళు ఇంటికప్పుపై మొలకెత్తే గడ్డిమొక్కలవలె ఉంటారు గాక. అవి ఎదిగీ ఎదగక ముందే వాడిపోతాయి. కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు.
    2 రాజులు 19:26కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసి, విభ్రాంతి పొంది, పొలంలో ఉన్న గడ్డిలా, కాడలు లేని చేలలా అయ్యారు.
  • పొలంలోని గడ్డి: ఈ రోజు ఉంటుంది, రేపు పొయ్యిలో వేయబడుతుందిమత్తయి 6:30, లూకా 12:28
    వచనాలు
    మత్తయి 6:30ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!
    లూకా 12:28అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా.
  • ఎండుగడ్డి తీసేసినప్పుడు కొత్త చిగురు కనిపిస్తుందిసామె 27:25
    వచనాలు
    సామె 27:25ఎండిన గడ్డి వామి వేస్తారు. పచ్చిక ఇక కనిపించడం లేదు. మొలకలు వస్తున్నాయి. ఆలమందల కోసం కొండగడ్డి కోసుకొస్తున్నారు.
  • మండే ఎండ మొక్కను వాడిపోయేలా చేస్తుంది, దాని పువ్వు రాలిపోతుందియాకో 1:11
    వచనాలు
    యాకో 1:11సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు.
  • కరువులో గుర్రాల కోసం గడ్డి వెదకడానికి అహాబు ప్రతి నీటి ఊటా ప్రతి లోయా గాలించాడు1 రాజులు 18:5
    వచనాలు
    1 రాజులు 18:5అహాబు ఓబద్యాతో “దేశంలోని నీటి ఊటలనూ వాగులనూ చూడడానికి వెళ్ళు. మన గుర్రాలూ కంచర గాడిదలూ చావకుండా వాటికి గడ్డి దొరుకుతుందేమో చూడు. అలా కొన్ని పశువులనైనా దక్కించుకుంటాం” అన్నాడు.
  • నిమ్రీము నీళ్ళు ఎండిపోయాయి, గడ్డి వాడిపోయిందియెష 15:6
    వచనాలు
    యెష 15:6ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు.
  • నీటేనుగు ఎద్దులా గడ్డి మేస్తుందియోబు 40:15
    వచనాలు
    యోబు 40:15నిన్ను చేసినట్టే నేను చేసిన మరొక జీవి నీటి ఏనుగును నువ్వు చూశావు గదా? ఎద్దులాగా అది గడ్డి మేస్తుంది.
  • నెబుకద్నెజరు ఎద్దులా గడ్డి తిన్నాడుదాని 4:33
    వచనాలు
    దాని 4:33ఆ క్షణంలోనే ఆ మాట నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ప్రజల్లో నుండి అతడు తరిమివేయబడ్డాడు. అతడు పశువుల వలె గడ్డిమేశాడు. ఆకాశం నుండి కురిసే మంచు అతని శరీరాన్ని తడిపింది. అతని తల వెంట్రుకలు గరుడ పక్షి రెక్కల ఈకలంత పొడవుగా, అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివిగా పెరిగాయి.
  • “అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా?”యోబు 6:5
    వచనాలు
    యోబు 6:5అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా? ఎద్దు తన మేతను చూసి రంకెలు వేస్తుందా?
  • ఐదు వేల మంది పచ్చని గడ్డి మీద కూర్చున్నారుయోహా 6:10, మార్కు 6:39
    వచనాలు
    యోహా 6:10యేసు “ప్రజలందర్నీ కూర్చోబెట్టండి” అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు ఐదువేల మంది ఉంటారు.
    మార్కు 6:39అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.

సూక్తులు

  • “మానవులంతా గడ్డిలాంటి వారు … గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది”యెష 40:6–8, 1 పేతు 1:24
    వచనాలు
    యెష 40:6–8వినండి “ప్రకటించండి” అని ఒక స్వరం పలికింది. “నేనేం ప్రకటించాలి?” మరొక స్వరం పలికింది. “శరీరులంతా గడ్డివంటివారు, వారి అందమంతా అడవి పువ్వులాటిది. యెహోవా తన ఊపిరి ఊదినప్పుడు గడ్డి ఎండిపోతుంది. పువ్వులు వాడిపోతారు. మనుషులు నిజంగా గడ్డిలాంటివారే. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది.”
    1 పేతు 1:24“ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది
  • కొత్త గడ్డి ఉదయం మొలిచి సాయంత్రానికి వాడిపోతుందికీర్త 90:5–6
    వచనాలు
    కీర్త 90:5–6వరదలో కొట్టుకుపోయినట్టు నువ్వు వారిని లాక్కెళ్ళిపోతావు, వాళ్ళు నిద్ర పోతారు. పచ్చ గడ్డిలాగా వాళ్ళు పొద్దున్నే చిగురిస్తారు. ఉదయాన అది మొలిచి పెరుగుతుంది, సాయంకాలం అది వాడిపోయి ఎండిపోతుంది.
  • మనిషి రోజులు గడ్డి లాంటివి; గాలి దాని మీదుగా వీస్తే అది కనిపించకుండా పోతుందికీర్త 103:15–16
    వచనాలు
    కీర్త 103:15–16మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు. దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.
  • లేత గడ్డి మీద కురిసే మెల్లని వానలా, మంచులా దిగే మాటలుద్వితీ 32:2
    వచనాలు
    ద్వితీ 32:2నా ఉపదేశం వానలా కురుస్తుంది. నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు