అన్వేషించండి › అంశాలు › గాలులు
ప్రకృతి
బైబిల్లో గాలులు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 32 భాగాలు, వాక్యం వాక్యంగా.
తూర్పు గాలి
- ఫరో కల: తూర్పు గాలికి మాడిపోయిన వెన్నులుఆది 41:6, ఆది 41:23
- ఒక పగలూ ఒక రాత్రీ తూర్పు గాలి వీచి మిడతలను తెచ్చిందినిర్గ 10:13
వచనాలు
నిర్గ 10:13మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి.
- బలమైన తూర్పు గాలి రాత్రంతా సముద్రాన్ని వెనక్కి తోసిందినిర్గ 14:21
వచనాలు
నిర్గ 14:21మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు.
- వేడి తూర్పు గాలీ ఎండా యోనాను సొమ్మసిల్లేలా చేశాయియోనా 4:8
వచనాలు
యోనా 4:8ఆ తరువాత రోజు సూర్యోదయం అయినప్పుడు, దేవుడు తూర్పునుండి వీచే వడగాలిని సిద్ధం చేశాడు. యోనాకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. “బతకడం కంటే చావడమే నాకు మేలు” అని తనలో తాను అనుకున్నాడు.
- తూర్పు గాలి సముద్రంలో ఓడలను బద్దలు చేస్తుందికీర్త 48:7, యెహె 27:26
వచనాలు
కీర్త 48:7తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు.
యెహె 27:26తెడ్లతో ఓడ నడిపేవాళ్ళు నిన్ను మహాసముద్రం లోకి తీసుకుపోయారు. అయితే తూర్పు గాలి సముద్ర మధ్యలో నీ మీద విరుచుకు పడింది.
ఇతర గాలులు
- చాలా బలమైన పడమటి గాలి మిడతలను ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయిందినిర్గ 10:19
వచనాలు
నిర్గ 10:19అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.
- “ఉత్తర వాయువు వాన తెస్తుంది”సామె 25:23
వచనాలు
సామె 25:23ఉత్తర వాయువు వాన తెస్తుంది. అలానే గుట్టు బయట పెట్టేవాడి ముఖం గంభీరంగా ఉంటుంది.
- ఉత్తరం నుంచి వీచే గాలుల వల్ల చలి వస్తుందియోబు 37:9
వచనాలు
యోబు 37:9దక్షిణాన తుఫాను దాని ఆవాసం నుండి వస్తుంది. ఉత్తర దిక్కు నుండి చెదరగొట్టే చలి గాలులు వీస్తాయి.
- దక్షిణపు గాలి కింద దేశం నిశ్చలంగా ఉన్నప్పుడు బట్టలు వేడెక్కుతాయియోబు 37:17
వచనాలు
యోబు 37:17దక్షిణపుగాలి వీయడం వలన ఉక్క పోసేటప్పుడు నీ బట్టలు ఎలా వెచ్చబడ్డాయో నీకు తెలుసా?
- “దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు”లూకా 12:55
వచనాలు
లూకా 12:55దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు. అలాగే జరుగుతుంది.
- గాలి ఆకాశాన్ని శుభ్రం చేసిన తర్వాత సూర్యుని వైపు ఎవరూ చూడలేరుయోబు 37:21
వచనాలు
యోబు 37:21ఎత్తుగా ఉన్న మేఘంలో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకపోయినా గాలి మేఘాలను పోగొట్టి దాన్ని తేటగా కనపరుస్తుంది.
కథల్లో
- భూమి మీదుగా గాలి వీచింది; జలప్రళయపు నీళ్ళు తగ్గడం మొదలైందిఆది 8:1
వచనాలు
ఆది 8:1దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి.
- గాలి సముద్రం వైపు నుంచి పూరేడు పిట్టలను తెచ్చిందిసంఖ్యా 11:31
వచనాలు
సంఖ్యా 11:31అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి.
- ఎడారి గాలి యోబు పిల్లల ఇంటి నాలుగు మూలలనూ కొట్టిందియోబు 1:18–19
వచనాలు
యోబు 1:18–19అదే సమయంలో మరో సేవకుడు వచ్చి “నీ కొడుకులు, కూతుళ్ళు నీ పెద్ద కొడుకు ఇంట్లో భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు. అప్పుడు ఎడారి ప్రాంతం నుండి గొప్ప సుడిగాలి బలంగా వీచి వాళ్ళున్న ఇల్లు నాలుగు వైపులా కొట్టింది. ఇల్లు ఆ యువతీయువకుల మీద పడిపోవడం వల్ల వాళ్ళంతా చనిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.
- హోరేబులో పెద్ద గాలి బండలను బద్దలు చేసింది, తర్వాత భూకంపం వచ్చింది1 రాజులు 19:11
వచనాలు
1 రాజులు 19:11యెహోవా అతనితో “నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు” అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు.
- సముద్రం మీది పెద్ద గాలి యోనా ఓడను దాదాపు ముక్కలు చేసిందియోనా 1:4
వచనాలు
యోనా 1:4అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది.
- యేసు గాలులనూ సముద్రాన్నీ గద్దించాడు; అంతా నిమ్మళమైందిమత్తయి 8:24–27
వచనాలు
మత్తయి 8:24–27అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు. యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది. శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.
- ఎదురుగాలి ఉన్నందువల్ల శిష్యులు కష్టపడి తెడ్డు వేశారుమార్కు 6:48, మత్తయి 14:24, యోహా 6:18
వచనాలు
మార్కు 6:48ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,
మత్తయి 14:24అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది.
యోహా 6:18అప్పుడు పెనుగాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.
- మెల్లని దక్షిణపు గాలి, తర్వాత ఈశాన్య పెనుగాలి అనే తుపానుఅపొ.కా 27:13–15
వచనాలు
అపొ.కా 27:13–15అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి ఫీనిక్సు చేరి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు. కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది. ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకుపోయాం.
- దక్షిణపు గాలితో పౌలు ఓడ రెండు రోజుల్లో రేగియు నుంచి పొతియొలీకి వెళ్ళిందిఅపొ.కా 28:13
వచనాలు
అపొ.కా 28:13అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియు పట్టణం వచ్చి ఒక రోజు తరువాత దక్షిణపు గాలి విసరడంతో మరునాడు పొతియొలీ పట్టణం వచ్చాం.
సూక్తులు
- “గాలి దక్షిణ దిక్కుకు వీచి మళ్ళీ ఉత్తర దిక్కుకు తిరుగుతుంది”ప్రస 1:6
వచనాలు
ప్రస 1:6గాలి దక్షిణ దిక్కుకు వీచి మళ్ళీ ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. అలా తన దారిలో మళ్ళీ మళ్ళీ వీస్తూ తిరిగి వస్తున్నది.
- “గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు”ప్రస 11:4
వచనాలు
ప్రస 11:4గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు. మబ్బులను చూస్తూ ఉండేవాడు పంట కోయడు.
- గాలి ఎక్కడ నుంచి వస్తుందో నువ్వు గ్రహించలేవుప్రస 11:5
వచనాలు
ప్రస 11:5స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో, గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు.
- “గాలి తనకిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు”యోహా 3:8
వచనాలు
యోహా 3:8గాలి తనకిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడు.”
- గాలికి కొట్టుకుపోయే పొట్టులాకీర్త 1:4
వచనాలు
కీర్త 1:4దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు.
- “గాలికి ఊగే గడ్డి పోచనా?”మత్తయి 11:7
వచనాలు
మత్తయి 11:7వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా?
- బలమైన గాలులకు కొట్టుకుపోయే పెద్ద ఓడలను చిన్న చుక్కానితో నడిపిస్తారుయాకో 3:4
వచనాలు
యాకో 3:4ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు.
- “సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు”యాకో 1:6
వచనాలు
యాకో 1:6కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు