Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › సముద్రం

ప్రకృతి

బైబిల్‌లో సముద్రం

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 32 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • సమకూడిన జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడుఆది 1:9–10
    వచనాలు
    ఆది 1:9–10దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.
  • ఐదో రోజున మహా సముద్ర జీవులు చేయబడ్డాయిఆది 1:21–23
    వచనాలు
    ఆది 1:21–23దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు.
  • విశాలమైన మహా సముద్రం, జీవులతో నిండినది, ఓడలు తిరిగేదికీర్త 104:25–26
    వచనాలు
    కీర్త 104:25–26అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి. అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి.
  • నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, అయినా సముద్రం ఎన్నటికీ నిండదుప్రస 1:7
    వచనాలు
    ప్రస 1:7నదులన్నీ సముద్రంలోకే వెళ్తున్నాయి గానీ అది ఎప్పటికీ నిండడం లేదు. నదుల నీరంతా అవి ఎక్కడనుండి పారుతూ వస్తున్నాయో అక్కడికే వెళ్లి తిరిగి సముద్రంలోకి వెళ్తున్నాయి.
  • అలలు దాటలేని సరిహద్దు ఇసుకయిర్మీ 5:22, యోబు 38:8–11
    వచనాలు
    యిర్మీ 5:22యెహోవా చెప్పేదేమంటే, నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? నేను ఒక నిత్యమైన నిర్ణయం తీసుకుని సముద్రానికి ఒక సరిహద్దుగా ఇసుకను ఉంచాను. దాని అలలు ఎంత పైకి లేచినా అవి దాన్ని దాటలేవు. ఎంత ఘోష పెట్టినా దాన్ని జయించలేదు.
    యోబు 38:8–11సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా? సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు, “నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి” అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా?
  • అలల మీది నావికులు ఆకాశం వరకు లేచి అగాధాల్లోకి దిగుతారుకీర్త 107:23–27
    వచనాలు
    కీర్త 107:23–27ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు. ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది. వారు ఆకాశందాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు. బాధతో వారి ప్రాణం కరిగిపోయింది. మత్తెక్కిన వారివలె వారు ముందుకి, వెనక్కి దొర్లుతూ ఇటు అటు తూలుతూ ఉన్నారు. వారు ఏమీ తోచక ఉన్నారు.

దేశపు సముద్రాలు

  • మహా సముద్రం పశ్చిమ సరిహద్దుసంఖ్యా 34:6, యెహో 1:4
    వచనాలు
    సంఖ్యా 34:6మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.
    యెహో 1:4ఈ అరణ్యం, లెబానోను నుండి యూఫ్రటీసు మహానది వరకూ, హిత్తీయుల దేశమంతా, పడమట మహాసముద్రం వరకూ మీకు సరిహద్దు.
  • సిద్దీము లోయ ఉన్న చోటి ఉప్పు సముద్రంఆది 14:3
    వచనాలు
    ఆది 14:3వీళ్ళందరూ కలిసి సిద్దీము (ఉప్పు సముద్రం) లోయలో ఏకంగా సమకూడారు.
  • ఇశ్రాయేలు దాటుతుండగా ఉప్పు సముద్రానికి యొర్దాను ప్రవాహం ఆగిపోయిందియెహో 3:16
    వచనాలు
    యెహో 3:16పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు.
  • ఎర్ర సముద్రం నుంచి ఫిలిష్తీయుల సముద్రం వరకు సరిహద్దులునిర్గ 23:31
    వచనాలు
    నిర్గ 23:31ఎర్ర సముద్రం నుంచి ఫిలిష్తీయుల సముద్రం దాకా, ఎడారి నుంచి నది దాకా మీకు సరిహద్దులు నియమిస్తాను. ఆ దేశ నివాసులను మీ చేతికి అప్పగిస్తాను. మీరు మీ ఎదుట నుండి వాళ్ళను వెళ్లగొడతారు.
  • సొలొమోను ఎర్ర సముద్రపు తీరంలోని ఎసోన్గెబెరులో ఓడలు కట్టించాడు1 రాజులు 9:26
    వచనాలు
    1 రాజులు 9:26సొలొమోను రాజు ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరంలోని ఏలతు దగ్గర, ఎసోన్గెబెరులో, ఓడలను నిర్మించాడు.
  • పేతురు, అంద్రెయ గలిలయ సముద్రంలో వలలు వేశారుమత్తయి 4:18
    వచనాలు
    మత్తయి 4:18యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వల వేయడం చూశాడు. వారు పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ. వారు చేపలు పట్టేవారు.

కథల్లో

  • తూర్పు గాలి సముద్రాన్ని వెనక్కి తోసింది; ఇశ్రాయేలు ఆరిన నేల మీద దాటిందినిర్గ 14:21–22
    వచనాలు
    నిర్గ 14:21–22మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి.
  • తెల్లవారేసరికి సముద్రం తిరిగి వచ్చి ఫరో రథాలను కప్పివేసిందినిర్గ 14:27–28
    వచనాలు
    నిర్గ 14:27–28మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు.
  • ఓడను తేలిక చేయడానికి యోనా నావికులు సరుకును సముద్రంలో పడవేశారుయోనా 1:4–5
    వచనాలు
    యోనా 1:4–5అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది. అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు.
  • యోనాను సముద్రంలో పడవేయగానే ఉగ్రమైన సముద్రం నిమ్మళమైందియోనా 1:15
    వచనాలు
    యోనా 1:15ఇలా అని వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. పడేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది.
  • ఒక పెద్ద చేప యోనాను మింగిందియోనా 1:17
    వచనాలు
    యోనా 1:17ఒక పెద్ద చేప యోనాను మింగడానికి యెహోవా నియమించాడు. యోనా మూడు రోజులు, మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు.
  • అలలు పడవ మీద పడుతుండగా యేసు పడవ వెనుక భాగంలో తలగడ మీద నిద్రపోయాడుమార్కు 4:37–39
    వచనాలు
    మార్కు 4:37–39అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు. ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.
  • రాత్రి నాలుగో జాములో యేసు సముద్రం మీద నడిచాడుమత్తయి 14:25–26
    వచనాలు
    మత్తయి 14:25–26రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు.
  • పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడిచాడుమత్తయి 14:28–29
    వచనాలు
    మత్తయి 14:28–29పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని
  • మొదట పడిన చేప నోటిలో ఒక నాణెంమత్తయి 17:27
    వచనాలు
    మత్తయి 17:27అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దాన్ని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు” అన్నాడు.
  • 153 పెద్ద చేపలు, అయినా వల చినగలేదుయోహా 21:11
    వచనాలు
    యోహా 21:11సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు.
  • సుమారు రెండు వేల పందులు ఒడ్డు మీద నుంచి సముద్రంలోకి దూకాయిమార్కు 5:13
    వచనాలు
    మార్కు 5:13యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి.
  • అద్రియ సముద్రంలో లోతు కొలవడం: నీళ్ళు తక్కువవుతున్నాయిఅపొ.కా 27:27–28
    వచనాలు
    అపొ.కా 27:27–28పద్నాలుగవ రాత్రి మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకు పోతుండగా అర్థరాత్రి వేళ ఓడ నావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు 120 అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్ళిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి 90 అడుగుల లోతని తెలుసుకున్నారు.

దేవాలయంలోని సముద్రం

  • సొలొమోను పోత పోసిన సముద్రం: పెద్ద గుండ్రని తొట్టి1 రాజులు 7:23
    వచనాలు
    1 రాజులు 7:23హీరాము పోత పనితో ఒక గుండ్రని సరస్సు తొట్టిని చేశాడు. అది ఈ చివరి పై అంచు నుండి ఆ చివరి పై అంచు దాకా 10 మూరలు. దాని ఎత్తు 5 మూరలు, చుట్టుకొలత 30 మూరలు.
  • అది పన్నెండు ఎద్దుల మీద ఉంది, ప్రతి దిక్కుకూ మూడేసి1 రాజులు 7:25
    వచనాలు
    1 రాజులు 7:25ఆ సరస్సు 12 ఎద్దుల ఆకారాల మీద నిలబడి ఉంది. వీటిలో మూడు ఉత్తర దిక్కుకూ మూడు పడమర దిక్కుకూ మూడు దక్షిణ దిక్కుకూ మూడు తూర్పు దిక్కుకూ చూస్తున్నాయి. వీటి మీద ఆ సరస్సు నిలబెట్టి ఉంది. ఎద్దుల వెనక భాగాలన్నీ లోపలి వైపుకు ఉన్నాయి.

సూక్తులు

  • సంతానం “సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే”ఆది 22:17, ఆది 32:12
    వచనాలు
    ఆది 22:17నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.
    ఆది 32:12నాతో, ‘నేను నీకు తోడై తప్పకుండా మేలు చేస్తూ వారి సంఖ్యను బట్టి లెక్కించలేని సముద్రపు ఇసకలాగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను’ అని నువ్వు సెలవిచ్చావు కదా” అన్నాడు.
  • సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకలా సొలొమోను వివేచన1 రాజులు 4:29
    వచనాలు
    1 రాజులు 4:29దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు.
  • అల్లకల్లోలమైన సముద్రం నిశ్చలంగా ఉండలేదు; దాని అలలు బురదను పైకి తెస్తాయియెష 57:20
    వచనాలు
    యెష 57:20అయితే దుర్మార్గులు అటూ ఇటూ కొట్టుకునే సముద్రం లాంటి వారు. దాని నీళ్ళు, బురద పైకి తెస్తూ ఉంటుంది.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు