Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › పర్వతాలు

ప్రకృతి

బైబిల్‌లో పర్వతాలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 41 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • “ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు”కీర్త 104:18
    వచనాలు
    కీర్త 104:18ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు.
  • యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయికీర్త 125:2
    వచనాలు
    కీర్త 125:2యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇప్పటినుండి యెహోవా తన ప్రజల చుట్టూ నిరంతరం ఉంటాడు.
  • కొండల్లో రాగి తవ్వగలిగే దేశంద్వితీ 8:9
    వచనాలు
    ద్వితీ 8:9మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు.
  • గనిపనివాడు చెకుముకి రాయిని కొట్టి పర్వతాలను వాటి పునాదుల నుంచి పెకలిస్తాడుయోబు 28:9
    వచనాలు
    యోబు 28:9మనిషి చెకుముకి రాళ్ళను పట్టుకుంటాడు. పర్వతాలను వాటి కుదుళ్లతో సహా బోర్లా పడదోస్తాడు.
  • పర్వతం కోసుకుపోయి కూలిపోతుందియోబు 14:18
    వచనాలు
    యోబు 14:18కూలిపోయిన పర్వతాలు ముక్కలైపోయి నేలమట్టం అవుతాయి, కొండలు వాటి స్థానం తప్పి పడిపోతాయి.
  • లెబానోను శిఖరాలు: అమానా, శెనీరు, హెర్మోను — సింహాల గుహలు, చిరుతపులుల కొండలుపరమ 4:8
    వచనాలు
    పరమ 4:8కళ్యాణీ, లెబానోను విడిచి నాతో రా. లెబానోను విడిచి నాతో రా. అమానా పర్వత శిఖరం నుంచి, శెనీరు హెర్మోను శిఖరాల నుంచి సింహాల గుహలనుంచి, చిరుతపులుండే గుహలున్న కొండలపైనుంచి కిందికి దిగి రా.
  • సొలొమోనుకు పర్వతాల్లో 80,000 మంది రాళ్ళు కొట్టేవారు ఉన్నారు1 రాజులు 5:15
    వచనాలు
    1 రాజులు 5:15అంతేగాక, సొలొమోనుకి బరువులు మోసేవారు 70,000 మందీ పర్వతాల్లో మానులు నరికే వారు 80,000 మందీ ఉన్నారు.
  • మిద్యానుకు భయపడి ఇశ్రాయేలు పర్వతాల్లో, గుహల్లో ఆశ్రయాలు చేసుకుందిన్యాయా 6:2
    వచనాలు
    న్యాయా 6:2మిద్యానీయుల హింస ఇశ్రాయేలీయుల మీద భారంగా ఉంది గనుక వాళ్ళు మిద్యానీయుల దగ్గర ఉండలేక కొండల్లో ఉన్న వాగులు, గుహలు, భద్రమైన చోటులను తమ కోసం సిద్ధం చేసుకున్నారు.
  • బోడి కొండ మీద ఎత్తిన ధ్వజం ఒక సంకేతంయెష 13:2, యెష 18:3
    వచనాలు
    యెష 13:2చెట్లు లేని కొండ మీద గుర్తు కోసం ఒక జెండా పాతండి. ప్రజలు ప్రధానుల ద్వారాల్లో ప్రవేశించమని కేకపెట్టి వాళ్ళను పిలిచి, చెయ్యి ఊపి సైగ చెయ్యండి.
    యెష 18:3ప్రపంచంలో నివసించే మీరు, భూమిపైన జీవించే మీరు పర్వతాల పైన సంకేతంగా జెండా ఎత్తినప్పుడు చూడండి! బాకా ఊదినప్పుడు వినండి!
  • “యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి”మత్తయి 24:16
    వచనాలు
    మత్తయి 24:16యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.
  • నీడనిచ్చే చెట్ల కింద కొండ శిఖరాల మీది బలిపీఠాలుహోషే 4:13, ద్వితీ 12:2
    వచనాలు
    హోషే 4:13వారు పర్వత శిఖరాల మీద బలులర్పిస్తారు. కొండలపై ధూపం వేస్తారు. సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద నీడ మంచిదని అక్కడే ధూపం వేస్తారు. అందువలనే మీ కూతుర్లు వేశ్యలయ్యారు. మీ కోడళ్ళు కూడా వ్యభిచారిణులయ్యారు.
    ద్వితీ 12:2మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి.

కథల్లో పర్వతాలు

  • ఓడ అరారాతు పర్వతాల మీద ఆగిందిఆది 8:4
    వచనాలు
    ఆది 8:4ఏడవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది.
  • పదో నెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయిఆది 8:5
    వచనాలు
    ఆది 8:5పదో నెల వరకూ నీళ్ళు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పదోనెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి.
  • మోరియా దేశంలోని ఒక పర్వతానికి అబ్రాహామును పంపారుఆది 22:2
    వచనాలు
    ఆది 22:2అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు.
  • మోషే మందతో దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడునిర్గ 3:1
    వచనాలు
    నిర్గ 3:1మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు.
  • ప్రజలు సీనాయి పర్వతాన్ని ముట్టకుండా ఒక హద్దు పెట్టారునిర్గ 19:12
    వచనాలు
    నిర్గ 19:12నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, ‘మీరు ఈ కొండ ఎక్కకూడదు. దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త. ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడూ మరణశిక్షకు లోనవుతాడు.
  • సీనాయి కొలిమిలా పొగ వేసింది, తీవ్రంగా కంపించిందినిర్గ 19:18
    వచనాలు
    నిర్గ 19:18మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. ఆ కొండంతా తీవ్రంగా కంపించింది.
  • మోషే నలభై పగళ్ళు, నలభై రాత్రులు పర్వతం మీద ఉన్నాడునిర్గ 24:18
    వచనాలు
    నిర్గ 24:18అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే ఆ కొండ మీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ ఉండిపోయాడు.
  • అహరోను హోరు కొండ శిఖరం మీద చనిపోయాడుసంఖ్యా 20:27–28
    వచనాలు
    సంఖ్యా 20:27–28యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉన్నప్పుడు వారు హోరు కొండ ఎక్కారు. మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు.
  • పిస్గా శిఖరం మీద ఉన్న నెబో పర్వతం నుంచి మోషే దేశాన్ని చూశాడుద్వితీ 34:1
    వచనాలు
    ద్వితీ 34:1ఆ తరువాత మోషే మోయాబు మైదానాల నెబో కొండకు వెళ్ళాడు. యెరికోకు ఎదురుగా ఉన్న పిస్గా కొండ శిఖరం ఎక్కాడు. యెహోవా ఆ దేశం అంతటినీ మోషేకు చూపించాడు.
  • ఆరు గోత్రాలు గెరిజీము కొండ మీద, ఆరు ఏబాలు కొండ మీద నిలబడ్డాయిద్వితీ 27:12–13
    వచనాలు
    ద్వితీ 27:12–13బెన్యామీను గోత్రాలవాళ్ళు ప్రజలకు దీవెన పలుకులు అందించడానికి గెరిజీము కొండ మీద నిలబడాలి. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు శిక్షలు పలకడానికి ఏబాలు కొండ మీద నిలబడాలి.
  • యోతాము గెరిజీము కొండ శిఖరం మీద నుంచి తన కథను బిగ్గరగా చెప్పాడున్యాయా 9:7
    వచనాలు
    న్యాయా 9:7అది యోతాముకు తెలిసినప్పుడు అతడు వెళ్లి గెరిజీము కొండ అంచు మీద నిలబడి బిగ్గరగా పిలిచి, వాళ్ళతో ఇలా అన్నాడు, “షెకెము పెద్దలారా, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు.
  • బారాకు తాబోరు పర్వతం దగ్గర పదివేల మందిని సమకూర్చాడున్యాయా 4:6
    వచనాలు
    న్యాయా 4:6ఆమె నఫ్తాలిలోని కెదెషులో నుంచి అబీనోయము కొడుకు బారాకును పిలిపించి అతనితో ఇలా అంది “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, ‘నువ్వు వెళ్లి నఫ్తాలీయుల్లో, జెబూలూనీయుల్లో పదివేల మందిని తాబోరు కొండ దగ్గరికి రప్పించు.
  • సౌలు, దావీదు ఒకే కొండకు ఎదురెదురు వైపుల1 సమూ 23:26
    వచనాలు
    1 సమూ 23:26కొండకు ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు, అతని అనుచరులు వెళ్తున్నపుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు, అతని సైనికులు దావీదును, అతని అనుచరులను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు.
  • సౌలు, అతని ముగ్గురు కుమారులు గిల్బోవ పర్వతం మీద పడిపోయారు1 సమూ 31:8
    వచనాలు
    1 సమూ 31:8తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండమీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి,
  • ఏలీయా ఇశ్రాయేలునూ బయలు ప్రవక్తలనూ కర్మెలు పర్వతం మీద సమకూర్చాడు1 రాజులు 18:19–20
    వచనాలు
    1 రాజులు 18:19–20అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషిస్తున్న బయలు దేవుడి ప్రవక్తలు 450 మందినీ అషేరాదేవి ప్రవక్తలు 400 మందినీ నా దగ్గరికి కర్మెలు పర్వతానికి పిలిపించు” అన్నాడు. అహాబు ఇశ్రాయేలు వారందరి దగ్గరికి వార్తాహరులను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతం దగ్గరికి సమకూర్చాడు.
  • కర్మెలు శిఖరం మీద ఏలీయా తన ముఖాన్ని మోకాళ్ళ మధ్య పెట్టుకున్నాడు1 రాజులు 18:42
    వచనాలు
    1 రాజులు 18:42అహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు గాని, ఏలీయా కర్మెలు పర్వతం ఎక్కి నేలమీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు.
  • సమరయ స్త్రీ: “మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు”యోహా 4:20
    వచనాలు
    యోహా 4:20మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలనీ మీరు అంటారు” అంది. అందుకు యేసు ఇలా చెప్పాడు.
  • యేసు కొండ ఎక్కి బోధించడానికి కూర్చున్నాడుమత్తయి 5:1
    వచనాలు
    మత్తయి 5:1యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.
  • ప్రార్థించడానికి యేసు ఒంటరిగా కొండ ఎక్కాడుమత్తయి 14:23, లూకా 6:12
    వచనాలు
    మత్తయి 14:23ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు.
    లూకా 6:12ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు.
  • ఎత్తయిన పర్వతం మీద యేసు రూపాంతరం పొందాడుమత్తయి 17:1–2
    వచనాలు
    మత్తయి 17:1–2ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తీసుకుని ఎత్తయిన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు. వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి.
  • నజరేతు అంచున కొండ చరియ ఉన్న ఒక కొండ మీద ఉందిలూకా 4:29
    వచనాలు
    లూకా 4:29ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు తోసుకుపోయి కొండ కొమ్ము వరకూ తీసికెళ్ళారు. వారి ఊరు కొండ పైన ఉంది. ఆయనను అక్కడ నుండి పడదోయాలనుకున్నారు.
  • యేసు సాయంత్రాలు ఒలీవల కొండ మీద గడిపాడులూకా 21:37
    వచనాలు
    లూకా 21:37ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవ కొండపై గడిపేవాడు.
  • ఒలీవల కొండ: యెరూషలేము నుంచి విశ్రాంతి దినపు ప్రయాణమంత దూరంఅపొ.కా 1:12
    వచనాలు
    అపొ.కా 1:12అప్పుడు వారు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది.

సూక్తులు

  • తాబోరు పర్వతం లాంటివాడు, సముద్రం పక్కనే ఉన్న కర్మెలు లాంటివాడుయిర్మీ 46:18
    వచనాలు
    యిర్మీ 46:18సేనల ప్రభువూ, రాజూ అయిన యెహోవా ఇలా ప్రకటన చేస్తున్నాడు. “నా తోడు, ఒక మనిషి రాబోతూ ఉన్నాడు. అతడు తాబోరు పర్వతం లాంటి వాడు. సముద్రం పక్కనే ఉన్న కర్మెలు లాంటి వాడు.
  • ఈ పర్వతాన్ని కదిలిపొమ్మని చెప్పగల విశ్వాసంమత్తయి 17:20, మత్తయి 21:21
    వచనాలు
    మత్తయి 17:20అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
    మత్తయి 21:21అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది.
  • “కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను”కీర్త 121:1
    వచనాలు
    కీర్త 121:1యాత్రల కీర్తన కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు