అన్వేషించండి › అంశాలు › కాకులు
ప్రకృతి
బైబిల్లో కాకులు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 9 భాగాలు, వాక్యం వాక్యంగా.
- ఇశ్రాయేలు తినకూడని పక్షుల్లో కాకులు ఉన్నాయిలేవీ 11:15, ద్వితీ 14:14
- నోవహు ఒక కాకిని పంపాడు; నీళ్ళు ఇంకిపోయే వరకు అది ఇటూ అటూ తిరిగిందిఆది 8:7
వచనాలు
ఆది 8:7ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమిమీద నుంచి నీళ్ళు ఇంకిపోయేవరకూ ఇటూ అటూ తిరుగుతూ ఉంది.
- కెరీతు వాగు దగ్గర కాకులు ఉదయం సాయంత్రం ఏలీయాకు రొట్టె, మాంసం తెచ్చాయి1 రాజులు 17:4–6
వచనాలు
1 రాజులు 17:4–6ఆ వాగు నీళ్ళు నీవు తాగాలి. అక్కడ నీకు ఆహారం తెచ్చేలా నేను కాకులకు ఆజ్ఞాపించాను” అని అతనికి చెప్పాడు. అతడు వెళ్లి యెహోవా చెప్పినట్టు యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివసించాడు. అక్కడ కాకులు ఉదయమూ సాయంత్రమూ రొట్టె, మాంసాలను అతని దగ్గరికి తెచ్చేవి. అతడు వాగు నీళ్ళు తాగాడు.
- ఆహారం లేక కాకి పిల్లలు అరుస్తాయియోబు 38:41, కీర్త 147:9
వచనాలు
యోబు 38:41కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు?
కీర్త 147:9పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు.
- కాకులు విత్తవు, కోయవు; వాటికి గిడ్డంగి గాని కొట్టు గాని లేవులూకా 12:24
వచనాలు
లూకా 12:24కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు.
సూక్తులు
- జుట్టు “ఉంగరాల జుట్టు, కాకి నలుపు”పరమ 5:11
వచనాలు
పరమ 5:11అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు.
- ఒక సామెత: ఎగతాళి చేసే కంటిని లోయ కాకులు పీకుతాయిసామె 30:17
వచనాలు
సామె 30:17తండ్రిని దూషిస్తూ తల్లి మాట వినని వాడి కళ్ళు లోయ కాకులు పీక్కుతింటాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు