Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › గరుడ పక్షులు

ప్రకృతి

బైబిల్‌లో గరుడ పక్షులు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 20 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • ఇశ్రాయేలు తినకూడని పక్షుల్లో గరుడ పక్షి ఒకటిలేవీ 11:13, ద్వితీ 14:12
    వచనాలు
    లేవీ 11:13పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు,
    ద్వితీ 14:12మీరు తినరాని పక్షులు ఏవంటే, పక్షిరాజు, రాబందు, గద్ద.
  • గరుడ పక్షి కొండ చరియ మీద, ఎత్తయిన బండ మీద గూడు కట్టుకుంటుందియోబు 39:27–28
    వచనాలు
    యోబు 39:27–28గరుడ పక్షి నీ ఆజ్ఞకు లోబడే ఆకాశవీధి కెక్కుతుందా? తన గూడును ఎత్తయిన చోట కట్టుకుంటుందా? అది కొండశిఖరాలపై నివసిస్తుంది. కొండకొనపై ఎవరూ ఎక్కలేని చోట గూడు కట్టుకుంటుంది.
  • అక్కడి నుంచి అది ఆహారం కోసం చూస్తుంది; దాని కళ్ళు దూరం నుంచే చూస్తాయియోబు 39:29
    వచనాలు
    యోబు 39:29అక్కడ నుండి తన ఎరను వెతుకుతుంది. దాని కళ్ళు దాన్ని దూరం నుండి కనిపెడతాయి.
  • దాని పిల్లలు రక్తం పీలుస్తాయి; చచ్చినవారు ఎక్కడ ఉంటే అది అక్కడ ఉంటుందియోబు 39:30
    వచనాలు
    యోబు 39:30దాని పిల్లలు రక్తం తాగుతాయి. హతులైనవారు ఎక్కడ ఉంటారో అక్కడే అది ఉంటుంది.
  • గరుడ పక్షి తన గూడును కదిలించి తన పిల్లల మీద ఎగురుతుందిద్వితీ 32:11
    వచనాలు
    ద్వితీ 32:11గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు.
  • గరుడ పక్షి తన వేట మీదికి దూకుతుందియోబు 9:26, యిర్మీ 49:22
    వచనాలు
    యోబు 9:26రెల్లుతో కట్టిన పడవలు సాగిపోతున్నట్టు, గరుడపక్షి ఎరను చూసి హటాత్తుగా దానిపై వాలినట్టు నా రోజులు దొర్లిపోతున్నాయి.
    యిర్మీ 49:22చూడండి డేగలా శత్రువు దాడి చేస్తాడు. అది దూసుకు వచ్చి బొస్రాను తన రెక్కలతో కప్పివేస్తుంది. ఆ రోజున ఏదోము సైనికుల హృదయాలు ప్రసవించడానికి నొప్పులు పడుతున్న స్త్రీ హృదయంలా ఉంటాయి.”
  • “అంతరిక్షంలో గరుడ పక్షి జాడ” — బుద్ధికి మించిన నాలుగు విషయాల్లో ఒకటిసామె 30:18–19
    వచనాలు
    సామె 30:18–19నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి. అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ.

సూక్తులు

  • గరుడ పక్షుల కంటే వేగం: సౌలు, యోనాతాను, తరిమేవారు, గుర్రాలు2 సమూ 1:23, విలాప 4:19, యిర్మీ 4:13
    వచనాలు
    2 సమూ 1:23సౌలూ యోనాతానూ తమ బతుకులో ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు. తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు. వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు. సింహాలకంటే బలమైన వారు.
    విలాప 4:19మమ్మల్ని తరిమే వాళ్ళు ఆకాశంలో ఎగిరే గద్దలకన్నా వేగం గల వాళ్ళు. పర్వతాల్లోకి వాళ్ళు మమ్మల్ని తరిమారు. అరణ్యంలో మా కోసం కాచుకుని ఉన్నారు.
    యిర్మీ 4:13ఆయన రాక మేఘాలు కమ్ముతున్నట్టుగా ఉంది. ఆయన రథాలు సుడిగాలిలాగా, ఆయన గుర్రాలు గరుడ పక్షుల కంటే వేగంగా పరుగెత్తుతున్నాయి. అయ్యో, మనం నాశనమై పోయాం.
  • సీనాయి దగ్గర: “గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు”నిర్గ 19:4
    వచనాలు
    నిర్గ 19:4‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు.
  • గరుడ పక్షిలా దూకే దూరదేశపు జనంద్వితీ 28:49
    వచనాలు
    ద్వితీ 28:49దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు.
  • దుఃఖంలో: “రాబందులాగా బోడిగా ఉండు”మీకా 1:16
    వచనాలు
    మీకా 1:16నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో. నీ వెంట్రుకలు కత్తిరించుకో. రాబందులాగా బోడిగా ఉండు. నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.
  • సంపద “రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు”సామె 23:5
    వచనాలు
    సామె 23:5డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది.
  • “నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు”కీర్త 103:5
    వచనాలు
    కీర్త 103:5నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
  • “వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు”యెష 40:31
    వచనాలు
    యెష 40:31అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.
  • గద్దలా నువ్వు నీ గూడు ఎత్తున కట్టుకున్నాయిర్మీ 49:16, ఓబద్యా 1:4
    వచనాలు
    యిర్మీ 49:16కొండ శిఖరాలపై నివసిస్తావు. పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నావు, నీ భీకరత్వం విషయంలో నీ హృదయంలో గర్వం నిన్ను మోసం చేసింది. గద్దలాగా ఉన్నత స్థలాల్లో గూడు కట్టుకుని ఉన్నావు. అయినా నిన్ను అక్కడనుండి కిందకు లాగి పడవేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
    ఓబద్యా 1:4గద్దలా నువ్వు పై పైకి ఎగిరినా నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడనుంచి నిన్ను కింద పడేస్తాను, అని యెహోవా చెబుతున్నాడు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు