Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › చిమ్మెటలు, పురుగులు

ప్రకృతి

బైబిల్‌లో చిమ్మెటలు, పురుగులు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 18 భాగాలు, వాక్యం వాక్యంగా.

చిమ్మెటలు

  • చిమ్మెటలు బట్టలను తినేస్తాయియాకో 5:2
    వచనాలు
    యాకో 5:2మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి.
  • భూమి మీది సంపదలను చిమ్మెటా తుప్పూ నాశనం చేస్తాయిమత్తయి 6:19–20
    వచనాలు
    మత్తయి 6:19–20“భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు. పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు.
  • చిమ్మెట నాశనం చేయని పరలోకంలో సంపదలూకా 12:33
    వచనాలు
    లూకా 12:33మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు.
  • “చిమ్మటలు తినివేసిన గుడ్డపేలికలాంటివాడి”యోబు 13:28
    వచనాలు
    యోబు 13:28కుళ్ళిపోయిన శవంలాగా ఉన్నవాడి చుట్టూ, చిమ్మటలు తినివేసిన గుడ్డపేలికలాంటివాడి చుట్టూ గిరి గీసి కాపు కాస్తున్నావు.
  • “వారిని చిమ్మెట తినివేస్తుంది”యెష 50:9, యెష 51:8
    వచనాలు
    యెష 50:9ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. నా మీద ఎవరు నేరం మోపుతారు? వారంతా బట్టలాగా పాతబడిపోతారు. వారిని చిమ్మెట తినివేస్తుంది.
    యెష 51:8చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. అయితే నా నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా రక్షణ తరతరాలుంటుంది.
  • అతడు కట్టిన ఇల్లు పురుగుల గూడు లాంటిదియోబు 27:18
    వచనాలు
    యోబు 27:18వారు పురుగుల గూళ్లవంటి ఇళ్ళు కట్టుకుంటారు కావలివాడు కట్టుకునే గుడిసె లాంటి ఇళ్ళు వారు కట్టుకుంటారు.
  • మట్టి ఇళ్ళలో నివసించేవారు చిమ్మెటలా నలిగిపోతారుయోబు 4:19
    వచనాలు
    యోబు 4:19అలాంటిది బంకమట్టి ఇళ్ళలో నివసించే వాళ్ళలో, మట్టిలో పుట్టిన వాళ్ళలో, చిమ్మెట చితికిపోయేలా చితికిపొయే వాళ్ళలో ఇంకెన్ని తప్పులు ఆయన చూస్తాడు!

పురుగులు

  • రాత్రంతా ఉంచిన మన్నాలో పురుగులు పట్టి కంపు కొట్టిందినిర్గ 16:20
    వచనాలు
    నిర్గ 16:20అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది.
  • విశ్రాంతి దినం కోసం ఉంచిన వంతులో పురుగులు పట్టలేదునిర్గ 16:24
    వచనాలు
    నిర్గ 16:24మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకూ దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు.
  • తెల్లవారే సరికి ఒక పురుగు యోనా మొక్కను తొలిచింది; అది వాడిపోయిందియోనా 4:7
    వచనాలు
    యోనా 4:7మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది ఆ మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది.
  • హేరోదును పురుగులు తినివేశాయి; అతడు చనిపోయాడుఅపొ.కా 12:21–23
    వచనాలు
    అపొ.కా 12:21–23నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసమిచ్చాడు. ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు. అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.
  • పురుగులు ద్రాక్షలను తినేస్తాయి, ఎవరూ వాటిని కూర్చుకోరుద్వితీ 28:39
    వచనాలు
    ద్వితీ 28:39ద్రాక్షతోటలను మీరు నాటి, వాటి బాగోగులు చూసుకుంటారు కానీ ఆ ద్రాక్షారసాన్ని తాగరు. ద్రాక్ష పండ్లు కొయ్యరు. ఎందుకంటే పురుగులు వాటిని తినేస్తాయి.
  • యోబు: “నా శరీరమంతా పురుగులతో, మట్టిపెళ్లలతో కప్పి ఉంది”యోబు 7:5
    వచనాలు
    యోబు 7:5నా శరీరమంతా పురుగులతో, మట్టిపెళ్లలతో కప్పి ఉంది. నా చర్మంపై గడ్డలు గట్టిపడి మళ్ళీ మెత్తగా అయిపోయి బాధ పెడతాయి.
  • సమాధిలో ధనవంతులనూ దుఃఖితులనూ ఒకేలా పురుగులు కప్పుతాయియోబు 21:23–26
    వచనాలు
    యోబు 21:23–26ఒకడు సమస్త సుఖాలు అనుభవించి, మంచి ఆరోగ్యం, నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు. అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి. మరొకడు ఎన్నడూ సుఖ సంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడై చనిపోతాడు. ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి.
  • “పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది”యెష 51:8
    వచనాలు
    యెష 51:8చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. అయితే నా నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా రక్షణ తరతరాలుంటుంది.
  • “నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి”యెష 14:11
    వచనాలు
    యెష 14:11నీ ఆడంబరం, నీ తీగ వాయిద్య స్వరం పాతాళానికి పడిపోయాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి.
  • ఒక కీర్తన: “నేను మనిషిని కాదు. పురుగును”కీర్త 22:6
    వచనాలు
    కీర్త 22:6కాని నేను మనిషిని కాదు. పురుగును. మనుషుల ద్వేషం అనుభవించాను, మానవాళికి అవమానంగా ఉన్నాను.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు