అన్వేషించండి › అంశాలు › జింకలు, లేళ్ళు
ప్రకృతి
బైబిల్లో జింకలు, లేళ్ళు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 19 భాగాలు, వాక్యం వాక్యంగా.
- జింకలనూ లేళ్ళనూ పవిత్రులూ అపవిత్రులూ ఒకేలా తినవచ్చుద్వితీ 12:15, ద్వితీ 14:5
వచనాలు
ద్వితీ 12:15అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్ళలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా, అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు.
ద్వితీ 14:5దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె.
- సొలొమోను బల్ల కోసం దుప్పులు, జింకలు, కణుజులు సరఫరా చేశారు1 రాజులు 4:22–23
వచనాలు
1 రాజులు 4:22–23రోజుకి సొలొమోను భోజన సామగ్రి 600 తూముల మెత్తని గోదుమ పిండి, 1, 200 తూముల ముతక పిండి, పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు.
- యోబు: లేడి తన పిల్లను కనడానికి వంగుతుంది; పిల్లలు పొలంలో పెరుగుతాయియోబు 39:1–4
వచనాలు
యోబు 39:1–4అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా? లేళ్లు పిల్లలు పెట్టే కాలం నువ్వు గ్రహించగలవా? అవి కడుపుతో ఉండే నెలలెన్నో నువ్వు లెక్క పెట్టగలవా? అవి ఈనే కాలం తెలుసా? అవి వంగి తమ పిల్లలను కంటాయి. వాటి పురిటి నొప్పులు తీరుతాయి. వాటి పిల్లలు పుష్టిగా పర్రల్లో పెరుగుతాయి. అవి తల్లులను విడిచిపెట్టి పోయి మళ్లీ వాటి దగ్గరికి తిరిగి రావు.
- కరువులో గడ్డి లేనందువల్ల లేడి అప్పుడే పుట్టిన తన పిల్లను విడిచిపెడుతుందియిర్మీ 14:5
వచనాలు
యిర్మీ 14:5గడ్డి లేకపోవడంతో లేడి కూడా తన పిల్లలను పొలాల్లో వదిలేస్తున్నది.
- “జింక సెలయేళ్ల కోసం దాహం గొన్నట్టుగా”కీర్త 42:1
వచనాలు
కీర్త 42:1ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల దైవ ధ్యానం. జింక సెలయేళ్ల కోసం దాహం గొన్నట్టుగా దేవా, నా హృదయం నీ కోసం తపించిపోతోంది.
- మేత దొరకని జింకలకు వేటగాని నుంచి పారిపోయే బలం ఉండదువిలాప 1:6
వచనాలు
విలాప 1:6సీయోను కుమారి అందమంతా పోయింది. దాని అధిపతులు పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు. వాళ్ళు శక్తి లేనివాళ్ళుగా తరిమే వాళ్ళ ముందు నిలబడ లేక పారిపోయారు.
- లేడి వేటగాని చేతి నుంచి తనను తాను విడిపించుకుంటుందిసామె 6:5
వచనాలు
సామె 6:5వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.
సూక్తులు
- అశాహేలు అడవి లేడిలా వేగంగా పరుగెత్తగలడు2 సమూ 2:18
వచనాలు
2 సమూ 2:18సెరూయా ముగ్గురు కొడుకులు యోవాబు, అబీషై, అశాహేలు అక్కడ ఉన్నారు. అశాహేలు అడవి లేడి లాగా వేగంగా పరిగెత్తగలడు.
- గాదీయ యోధులు కొండల మీది లేళ్ళంత వేగవంతులు1 దిన 12:8
వచనాలు
1 దిన 12:8ఇంకా, గాదీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది అరణ్యంలో దాగి ఉన్న దావీదు దగ్గర చేరారు. వీళ్ళు డాలు, ఈటె తో యుద్ధం చేయడంలో ప్రవీణులు. వీళ్ళు సింహం ముఖంలాంటి ముఖం ఉన్నవాళ్ళు. కొండల్లో ఉండే జింకలంత వేగంగా పరుగెత్త గలిగిన వాళ్ళు.
- ఆయన నా కాళ్లు జింకకాళ్ళలా చేసి ఎత్తయిన స్థలాల మీద నిలుపుతాడు2 సమూ 22:34, కీర్త 18:33, హబ 3:19
వచనాలు
2 సమూ 22:34ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు.
కీర్త 18:33ఆయన నాకాళ్లు జింక కాళ్లలా చురుగ్గా చేస్తున్నాడు, కొండలమీద నన్ను ఉంచుతున్నాడు.
హబ 3:19ప్రభువైన యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు.
- “రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది”సామె 5:19
వచనాలు
సామె 5:19ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు.
- ప్రియుడు, కొండల మీది జింకలా లేదా లేత దుప్పిలాపరమ 2:9, పరమ 2:17, పరమ 8:14
వచనాలు
పరమ 2:9నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు. చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు. కిటికీలోనుంచి చూస్తున్నాడు. అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు.
పరమ 2:17ప్రియా, వెళ్ళిపో. ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో. కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.
పరమ 8:14ప్రియా, త్వరగా వచ్చెయ్యి. జింకలా, లేడిపిల్లలా సుగంధ పర్వతాల మీదుగా చెంగు చెంగున వచ్చెయ్యి.
- “పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి”పరమ 2:7
వచనాలు
పరమ 2:7యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.
- “నఫ్తాలి వదిలిపెట్టిన లేడి”ఆది 49:21
వచనాలు
ఆది 49:21నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు