అన్వేషించండి › అంశాలు › తేళ్ళు
ప్రకృతి
బైబిల్లో తేళ్ళు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 8 భాగాలు, వాక్యం వాక్యంగా.
- అరణ్యంలో విషసర్పాలూ తేళ్ళూ ఉన్నాయిద్వితీ 8:15
వచనాలు
ద్వితీ 8:15బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు.
- తేళ్ళ మధ్య నివసిస్తున్నా భయపడవద్దని యెహెజ్కేలుకు చెబుతారుయెహె 2:6
వచనాలు
యెహె 2:6నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మాటలకి గానీ, వాళ్లకి గానీ భయపడకు. నీ చుట్టూ ముళ్ళ చెట్లూ, బ్రహ్మజెముడు పొదలూ ఉన్నా, నువ్వు తేళ్ళ మధ్య నివాసం చేస్తున్నా భయపడకు. వాళ్ళు తిరుగుబాటు చేసే జాతి. అయినా వాళ్ళ మాటలకు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి వ్యాకుల పడకు.
- పాములనూ తేళ్ళనూ తొక్కే అధికారం యేసు తన శిష్యులకు ఇస్తాడులూకా 10:17, లూకా 10:19
వచనాలు
లూకా 10:17ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు.
లూకా 10:19ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు.
సూక్తులు
- గుడ్డు అడిగితే తండ్రి తేలును ఇస్తాడా?లూకా 11:12
వచనాలు
లూకా 11:12గుడ్డు అడిగితే తేలునిస్తాడా?
- రెహబాము: మా నాన్న మిమ్మల్ని చెర్నాకోలలతో శిక్షించాడు, నేను కొరడాలతో శిక్షిస్తాను1 రాజులు 12:11, 1 రాజులు 12:14, 2 దిన 10:14
వచనాలు
1 రాజులు 12:11మా నాన్న భారమైన కాడిని పెట్టాడు కానీ నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”
1 రాజులు 12:14“మా నాన్న మీ కాడిని భారం చేశాడు గాని నేను మీ దాన్ని మరింత భారంగా చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”
2 దిన 10:14అతడు వారితో “నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు, నేను దాన్ని మరింత బరువు చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను” అని చెప్పాడు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు