అన్వేషించండి › అంశాలు › ఉదయపు మంచు
ప్రకృతి
బైబిల్‌లో ఉదయపు మంచు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 22 భాగాలు, వాక్యం వాక్యంగా.
- రాత్రి శిబిరం మీద మంచు పడింది, దానితో పాటు మన్నా కూడాసంఖ్యా 11:9
వచనాలు
సంఖ్యా 11:9రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది.
- ఉదయపు మంచు ఆరిపోయినప్పుడు నేల మీద పలుచని రేకులు ఉన్నాయినిర్గ 16:13–14
వచనాలు
నిర్గ 16:13–14అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది. నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి.
- కొమ్మల మీద రాత్రంతా మంచు నిలిచి ఉంటుందియోబు 29:19
వచనాలు
యోబు 29:19నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నా కొమ్మల మీద మంచు నిలుస్తుంది.
- మేఘాలు మంచు బిందువులు కురిపించాయిసామె 3:20
వచనాలు
సామె 3:20ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి.
- “మంచు బిందువులను కన్నది ఎవరు?”యోబు 38:28
వచనాలు
యోబు 38:28వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు?
- రాత్రిపూట ప్రియుడు: నా తల మంచుతో తడిసిపోయిందిపరమ 5:2
వచనాలు
పరమ 5:2నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది. నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి. నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.”
- నెబుకద్నెజరు ఆకాశపు మంచుకు తడిశాడుదాని 4:33
వచనాలు
దాని 4:33ఆ క్షణంలోనే ఆ మాట నెబుకద్నెజరు విషయంలో నెరవేరింది. ప్రజల్లో నుండి అతడు తరిమివేయబడ్డాడు. అతడు పశువుల వలె గడ్డిమేశాడు. ఆకాశం నుండి కురిసే మంచు అతని శరీరాన్ని తడిపింది. అతని తల వెంట్రుకలు గరుడ పక్షి రెక్కల ఈకలంత పొడవుగా, అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివిగా పెరిగాయి.
- సీయోను పర్వతాల మీద పడే హెర్మోను మంచుకీర్త 133:3
వచనాలు
కీర్త 133:3అది సీయోను కొండల మీదికి దిగి వచ్చే హెర్మోను పర్వతం మంచులాంటిది. అక్కడ ఆశీర్వాదం ఉంటుందనీ అది శాశ్వతంగా నిలిచి ఉండే జీవమనీ యెహోవా సెలవిచ్చాడు.
కథల్లో
- గిద్యోను గొర్రె బొచ్చు నుంచి ఒక గిన్నె నిండా నీళ్ళు పిండాడున్యాయా 6:37–38
వచనాలు
న్యాయా 6:37–38నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతా పొడిగా ఉండి ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడితే, నువ్వు చెప్పినట్టు ఇశ్రాయేలీయులను నా ద్వారా రక్షిస్తావని నేను నిశ్చయించుకుంటాను” అన్నాడు. అది అలాగే జరిగింది. అతడు పొద్దున్నే లేచి ఆ బొచ్చును వత్తి ఒక పాత్ర నీటితో నిండే వరకూ ఆ బొచ్చు నుంచి నీళ్ళు పిండాడు.
- మరుసటి రాత్రి గొర్రె బొచ్చు పొడిగా ఉంది, నేల అంతా మంచు కప్పిందిన్యాయా 6:39–40
వచనాలు
న్యాయా 6:39–40అప్పుడు గిద్యోను “నా మీద కోపగించుకోకు. ఇంక ఒక్కసారి ఈ గొర్రెబొచ్చుతో పరీక్షించడానికి అవకాశం ఇవ్వు. నేల అంతటి మీద మంచు పడి ఉన్నప్పుడు, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనివ్వు” అని దేవునితో అన్నప్పుడు ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు. నేలంతటి మీద మంచు పడినా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది.
- అహాబుతో ఏలీయా: ఈ సంవత్సరాల్లో మంచు గాని వర్షం గాని పడదు1 రాజులు 17:1
వచనాలు
1 రాజులు 17:1గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు.
- దావీదు విలాపం: “గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక”2 సమూ 1:21
వచనాలు
2 సమూ 1:21గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక. అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవు గాక. పరాక్రమవంతుల డాలు అవమానం పాలయింది. సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది.
- హగ్గయి: ఆకాశం మంచును, భూమి పంటను ఆపివేశాయిహగ్గ 1:10
వచనాలు
హగ్గ 1:10అందుకే మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవడం లేదు. భూమి పండడం లేదు.
దీవెనలు
- ఇస్సాకు దీవెన: ఆకాశపు మంచు, భూమి సారంఆది 27:28
వచనాలు
ఆది 27:28ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ, భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ, ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక!
- ఏశావు ఆకాశపు మంచుకు దూరంగా నివసిస్తాడుఆది 27:39
వచనాలు
ఆది 27:39అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు. “చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు.
- మోషే: యోసేపు దేశం ఆకాశపు విలువైన మంచుతో దీవించబడుతుందిద్వితీ 33:13
వచనాలు
ద్వితీ 33:13యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. యెహోవా అతని భూమిని దీవిస్తాడు ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, కింద ఉన్న జలాగాధంతో,
- ఆకాశం మంచు కురిపించే ధాన్యం, కొత్త ద్రాక్షారసం ఉన్న దేశంద్వితీ 33:28
వచనాలు
ద్వితీ 33:28ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. యాకోబు నివాసం సురక్షితం. ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది.
సూక్తులు
- “త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా”హోషే 6:4, హోషే 13:3
వచనాలు
హోషే 6:4ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి? యూదా, నిన్నేమి చెయ్యాలి? ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది.
హోషే 13:3కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా, పెందలకడ ఆరిపోయే ప్రాతఃకాలపు మంచులాగా ఉంటారు. కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టే పొట్టులాగా, పొగ గొట్టంలో గుండా వెళ్ళిపోయే పొగలాగా ఉంటారు.
- రాజు అనుగ్రహం “గడ్డి మీద కురిసే మంచు లాంటిది”సామె 19:12
వచనాలు
సామె 19:12రాజు కోపం సింహగర్జన లాంటిది. అతని అనుగ్రహం గడ్డి మీద కురిసే మంచు లాంటిది.
- “మంచు నేల మీద ఎలా పడుతుందో ఆ విధంగా మనం అతనిమీద పడితే”2 సమూ 17:12
వచనాలు
2 సమూ 17:12అప్పుడు అతడు ఎక్కడ కనబడితే అక్కడ మనం అతనిపై దాడి చేయవచ్చు. మంచు నేల మీద ఎలా పడుతుందో ఆ విధంగా మనం అతనిమీద పడితే అతని మనుషుల్లో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.
- “కోతకాలంలో ఏర్పడే పొగమంచు మబ్బులా”యెష 18:4
వచనాలు
యెష 18:4యెహోవా నాకు చెప్పిన మాట ఇదే. “వేసవిలో ఉడుకెత్తే వేడిలా, కోతకాలంలో ఏర్పడే పొగమంచు మబ్బులా నేను నిశ్శబ్దంగా నా నివాస స్థలం నుండి గమనిస్తూ ఉంటాను.”
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు