Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › మేకలు

ప్రకృతి

బైబిల్‌లో మేకలు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 34 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • ఇశ్రాయేలు తినగలిగే జంతువుల్లో మేకలు ఉన్నాయిద్వితీ 14:4
    వచనాలు
    ద్వితీ 14:4ఎద్దు, గొర్రె, మేక.
  • రిబ్కా రెండు మేకపిల్లలతో ఇస్సాకుకు ఇష్టమైన వంటకం చేసిందిఆది 27:9
    వచనాలు
    ఆది 27:9నువ్వు మంద దగ్గరికి వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను పట్టుకుని రా. నేను వాటితో మీ నాన్నఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను.
  • ఏశావులా అనిపించేలా యాకోబు చేతులకూ మెడకూ మేక చర్మాలుఆది 27:16
    వచనాలు
    ఆది 27:16ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేక పిల్లల చర్మాన్ని అతని మెడ పైని నున్నని భాగంలో కప్పింది.
  • యోసేపు అన్నలు అతని అంగీని మేకపిల్ల రక్తంలో ముంచారుఆది 37:31
    వచనాలు
    ఆది 37:31వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు.
  • యూదా తన మందలోనుంచి ఒక మేకపిల్లను చెల్లింపుగా ఇస్తానన్నాడుఆది 38:17, ఆది 38:20
    వచనాలు
    ఆది 38:17అందుకు అతడు “నా మందలో నుండి ఒక మేక పిల్లను పంపుతాను” అన్నాడు. ఆమె “అది పంపే వరకూ ఏమైనా తాకట్టు పెడితే సరే” అని అంది.
    ఆది 38:20తరవాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోడానికి తన స్నేహితుడయిన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.
  • యాకోబు ఏశావుకు పంపిన కానుకలో 200 మేకలు, 20 మేకపోతులు ఉన్నాయిఆది 32:14
    వచనాలు
    ఆది 32:14అతడు రెండువందల మేకలూ ఇరవై మేక పోతులూ రెండువందల గొర్రెలూ ఇరవై పొట్టేళ్ళూ
  • గిద్యోను ఒక మేకపిల్లను సిద్ధం చేశాడు: మాంసం బుట్టలో, పులుసు కుండలోన్యాయా 6:19
    వచనాలు
    న్యాయా 6:19అప్పుడు గిద్యోను లోపలికి వెళ్లి ఒక మేక పిల్లను, తూమెడు పిండితో పొంగని రొట్టెలను సిద్ధం చేసి, ఆ మాంసాన్ని గంపలో పెట్టి, అది వండిన నీళ్ళు కుండలో పోసి, ఆయన కోసం ఆ మస్తకి చెట్టు కిందకు దాన్ని తీసుకువచ్చి దూత దగ్గర పెట్టాడు.
  • మనోహ ఒక బండ మీద మేకపిల్లను అర్పించాడున్యాయా 13:19
    వచనాలు
    న్యాయా 13:19అప్పుడు మనోహ కొంత ధాన్యం తో పాటు ఒక మేకపిల్లను అక్కడ ఒక రాయి మీద యెహోవాకు బలిగా అర్పించాడు. మనోహా అతని భార్యా చూస్తుండగా యెహోవా దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు.
  • యెష్షయి దావీదు ద్వారా సౌలుకు రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, మేకపిల్ల పంపాడు1 సమూ 16:20
    వచనాలు
    1 సమూ 16:20అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు.
  • కర్మెలు వాడైన నాబాలుకు వెయ్యి మేకలు ఉన్నాయి1 సమూ 25:2
    వచనాలు
    1 సమూ 25:2మాయోను గ్రామంలో ఒకడున్నాడు. అతని ఆస్తిపాస్తులన్నీ కర్మెలులో ఉన్నాయి. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు.
  • అన్న: “నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా” ఇవ్వలేదులూకా 15:29
    వచనాలు
    లూకా 15:29కాని అతడు, ‘ఇదిగో విను, ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు.
  • ఇంటివారికి ఆహారంగా సమృద్ధిగా మేక పాలుసామె 27:27
    వచనాలు
    సామె 27:27నీ ఆహారానికి, నీ కుటుంబం తినే ఆహారానికి, నీ దాసదాసీల పోషణకు మేకపాలు ఉంటాయి.
  • మేకలు ఒక పొలం కొనేంత విలువ తెస్తాయిసామె 27:26
    వచనాలు
    సామె 27:26నీకు వెచ్చటి బట్టల కోసం గొర్రెపిల్లలున్నాయి. ఒక చేను కొనడానికి మేకలు సరిపోతాయి.

మేక వెంట్రుకలు

  • మేక వెంట్రుకలతో చేసిన పదకొండు తెరలు ప్రత్యక్ష గుడారం మీది గుడారాన్ని తయారు చేశాయినిర్గ 26:7, నిర్గ 36:14
    వచనాలు
    నిర్గ 26:7మందిరం పైకప్పుగా మేకవెంట్రుకలతో తెరలు చెయ్యాలి. అలా పదకొండు తెరలు చెయ్యాలి.
    నిర్గ 36:14దైవ సన్నిధి మందిరం పైకప్పుగా మేక వెంట్రుకలతో పదకొండు తెరలు సిద్ధం చేశారు.
  • నైపుణ్యం గల స్త్రీలు మేక వెంట్రుకలు వడికారునిర్గ 35:26
    వచనాలు
    నిర్గ 35:26నేర్పు గల స్త్రీలు తమ జ్ఞానహృదయంతో ప్రేరణ పొంది మేక వెంట్రుకలు వడికారు.
  • దావీదు మంచం మీద పెట్టిన విగ్రహానికి మీకాలు మేక వెంట్రుకలు పెట్టింది1 సమూ 19:13
    వచనాలు
    1 సమూ 19:13తరువాత మీకాలు ఒక విగ్రహం తీసుకు మంచంమీద ఉంచి తలవైపు మేక చర్మం ఉంచి దుప్పటితో కప్పివేసింది.
  • మిద్యానుతో యుద్ధం తర్వాత మేక వెంట్రుకలతో చేసినవన్నీ శుద్ధి చేశారుసంఖ్యా 31:20
    వచనాలు
    సంఖ్యా 31:20మీరు మీ వస్త్రాలను, చర్మంతో, మేక వెండ్రుకలతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను అన్నిటినీ శుద్ధి చేయాలి.”

ధర్మశాస్త్రంలో

  • పస్కా పిల్లను గొర్రెల్లోనుంచి గాని మేకల్లోనుంచి గాని తీసుకోవచ్చునిర్గ 12:5
    వచనాలు
    నిర్గ 12:5మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి.
  • పస్కా కోసం యోషీయా 30,000 గొర్రెపిల్లలూ మేకపిల్లలూ ఇచ్చాడు2 దిన 35:7
    వచనాలు
    2 దిన 35:7యోషీయా తన సొంత మందలో 30,000 గొర్రెపిల్లలనూ మేకపిల్లలనూ 3,000 కోడెదూడలనూ అక్కడ ఉన్న ప్రజలందరికీ పస్కాబలికోసం ఇచ్చాడు.
  • అప్పుడే పుట్టిన మేకపిల్ల ఏడు రోజులు తన తల్లి దగ్గర ఉంటుందిలేవీ 22:27
    వచనాలు
    లేవీ 22:27“దూడగాని, గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని పుట్టినప్పుడు అది ఏడు రోజులు దాని తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు మొదలు అది యెహోవాకు హోమంగా అంగీకారమే.
  • “మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు”నిర్గ 23:19
    వచనాలు
    నిర్గ 23:19నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాలు యెహోవా దేవుని మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు.
  • ప్రాయశ్చిత్త దినం: రెండు మేకపోతుల కోసం చీట్లు; ఒకదాన్ని అరణ్యంలోకి విడిచిపెడతారులేవీ 16:8–10, లేవీ 16:21–22
    వచనాలు
    లేవీ 16:8–10అప్పుడు అహరోను రెండు చీటీలు వేయాలి. ఒకటి యెహోవా కోసం రెండోది విడిచి పెట్టబోయే మేక కోసం వేయాలి. ఆరెండు చీటీలను ఆ రెండు మేకల పైన వేయాలి. యెహోవా కోసం రాసిన చీటీ ఏ మేక పైన పడుతుందో ఆ మేకని తెచ్చి పాపం కోసం బలిగా అర్పించాలి. ఏ మేకమీద ‘విడిచి పెట్టాలి’ అనే చీటీ పడుతుందో ఆ మేకని యెహోవా సమక్షంలోకి ప్రాణంతో తీసుకుని రావాలి. దాని మూలంగా ప్రజల పాపాలకు పరిహారం కలిగేలా దాన్ని అడవిలో వదిలిపెట్టాలి.
    లేవీ 16:21–22అప్పుడు అహరోను బతికి ఉన్న ఆ మేక తలపైన తన రెండు చేతులూ ఉంచి ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గాలన్నటినీ, వారి తిరుగుబాటు అంతటినీ, వారి పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. ఆ విధంగా ఆ పాపాన్నంతా ఆ మేక పైన మోపి దాన్ని అడవిలోకి తోలుకుని వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తితో పంపించి వేయాలి. ఆ మేక ప్రజల దుర్మార్గాలన్నిటినీ తన పై వేసుకుని ఎవరూ లేని ప్రాంతానికి వెళ్ళాలి. ఆ వ్యక్తి దాన్ని అడవిలోకి తీసుకు వెళ్ళి అక్కడ దాన్ని విడిచిపెట్టాలి.

అడవి మేకలు

  • “ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు”కీర్త 104:18
    వచనాలు
    కీర్త 104:18ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు.
  • సౌలు అడవి మేకల బండల దగ్గర దావీదు కోసం వెదికాడు1 సమూ 24:2
    వచనాలు
    1 సమూ 24:2అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి, కొండమేకలు ఉండే రాతి కొండల మీద దావీదును అతని అనుచరులను వెదకడానికి బయలుదేరాడు.
  • “అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా?”యోబు 39:1
    వచనాలు
    యోబు 39:1అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా? లేళ్లు పిల్లలు పెట్టే కాలం నువ్వు గ్రహించగలవా?
  • అడవి మేకనూ కొండ మేకనూ తినవచ్చుద్వితీ 14:5
    వచనాలు
    ద్వితీ 14:5దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె.

సూక్తులు

  • జుట్టు “గిలాదు పర్వత సానువుల నుంచి దిగి వస్తున్న మేకల మందలా”పరమ 4:1, పరమ 6:5
    వచనాలు
    పరమ 4:1ప్రేయసీ, నువ్వెంత అందంగా ఉన్నావు! ప్రియురాలా! నువ్వెంత అందంగా ఉన్నావు! నీ ముసుకు గుండా కన్పించే నీ కళ్ళు, గువ్వ కన్నుల్లాగా ఉన్నాయి. నీ జుట్టు గిలాదు పర్వతం మీద నుంచి దిగి వస్తున్న మేకల మందలా ఉంది.
    పరమ 6:5నీ కళ్ళు నాపైనుండి తిప్పుకో. అవి నన్ను లొంగతీసుకుంటున్నాయి. నీ జుట్టు గిలాదు పర్వత సానువుల నుంచి దిగి వస్తున్న మేకల మందలా ఉంది.
  • మేకపోతు, దర్జాగా నడిచేవాటిలో ఒకటిసామె 30:29–31
    వచనాలు
    సామె 30:29–31డంబంగా నడుచుకునేవి మూడు ఉన్నాయి. ఠీవిగా నడిచేవి నాలుగు ఉన్నాయి. అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం, బడాయిగా నడిచే కోడి పుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు.
  • “ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు”మత్తయి 25:32
    వచనాలు
    మత్తయి 25:32మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు
  • మేకపిల్లను చీల్చినట్టు సంసోను సింహాన్ని చీల్చాడున్యాయా 14:6
    వచనాలు
    న్యాయా 14:6యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు