అన్వేషించండి › అంశాలు › లెబానోను దేవదారు వృక్షాలు
ప్రకృతి
బైబిల్లో లెబానోను దేవదారు వృక్షాలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 32 భాగాలు, వాక్యం వాక్యంగా.
- సొలొమోను లెబానోను దేవదారు మొదలుకొని గోడలోని హిస్సోపు వరకు చెట్ల గురించి మాట్లాడాడు1 రాజులు 4:33
వచనాలు
1 రాజులు 4:33లెబానోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కే గాని, చెట్లన్నిటిని గూర్చీ అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు, అన్నిటిని గురించీ అతడు రాశాడు.
- ఒక కీర్తన: లెబానోను దేవదారు వృక్షాలు తృప్తిగా నీరు పీలుస్తాయికీర్త 104:16
వచనాలు
కీర్త 104:16యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి.
- సొలొమోను కాలంలో దేవదారు కర్ర షెఫేలా ప్రాంతపు మేడి చెట్లంత విస్తారంగా ఉంది1 రాజులు 10:27, 2 దిన 1:15
వచనాలు
1 రాజులు 10:27రాజు యెరూషలేములో వెండిని రాళ్లతో సమానంగా పరిగణించాడు. దేవదారు మానులను షెఫేలా ప్రదేశంలో ఉన్న మేడి చెట్లంత విరివిగా ఉండేలా చేశాడు.
2 దిన 1:15రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్ళ వలె విస్తారంగా, సరళ మాను కలపను కొండ ప్రాంతాల్లో దొరికే మేడిచెట్లంత విస్తారంగా పోగుచేశాడు.
- లెబానోను దేవదారు తూరు ఓడకు స్తంభం అయిందియెహె 27:5
వచనాలు
యెహె 27:5నీ ఓడలను హెర్మోను పర్వత సరళ వృక్షం కలపతో కట్టారు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ దూలం చేశారు.
- శుద్ధి ఆచారాల్లో దేవదారు కర్ర, హిస్సోపు, ఎర్ర నూలు వాడారులేవీ 14:4, సంఖ్యా 19:6
వచనాలు
లేవీ 14:4శుద్ధీకరణ కావాలని కోరే ఆ వ్యక్తిని యాజకుడు జీవించి ఉన్న, లోపం లేని రెండు పక్షులనూ, దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు చెట్టు రెమ్మనూ తీసుకు రమ్మని ఆదేశించాలి.
సంఖ్యా 19:6ఇంకా ఆ యాజకుడు దేవదారు కర్ర, హిస్సోపు, ఎర్రరంగు నూలు తీసుకుని, ఆ ఆవును కాలుస్తున్న మంటల్లో వాటిని వెయ్యాలి.
దేవదారుతో నిర్మాణం
- తూరు రాజైన హీరాము దావీదు రాజభవనం కోసం దేవదారు దూలాలనూ వడ్రంగులనూ రాతి పనివారినీ పంపాడు2 సమూ 5:11
వచనాలు
2 సమూ 5:11తూరు రాజు హీరాము తన మనుషులనూ, దేవదారు చెక్కలనూ, వడ్రంగం పనివారిని, భవనాలు కట్టేవారిని పంపించాడు. వాళ్ళు దావీదు కోసం ఒక పట్టణం కట్టారు.
- దావీదు: “నేను దేవదారుకలపతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను”1 దిన 17:1
వచనాలు
1 దిన 17:1దావీదు తన ఇంటికి వెళ్లి సేదదీరిన తరువాత ప్రవక్త అయిన నాతానును పిలిపించి అతనితో “నేను దేవదారుకలపతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను. కాని, యెహోవా నిబంధన మందసం మాత్రం ఒక గుడారంలో ఉంది” అని చెప్పాడు.
- సొలొమోను హీరామును దేవదారు చెట్లు అడిగాడు; సీదోనీయులంత బాగా చెట్లు నరికేవారు లేరు1 రాజులు 5:6
వచనాలు
1 రాజులు 5:6లెబానోనులో నా కోసం దేవదారు మానులను నరికించడానికి అనుమతి ఇవ్వండి. నా సేవకులు మీ సేవకులతో కలిసి పని చేస్తారు. ఎందుకంటే మానులు నరకడంలో సీదోనీయులకు సాటి మాలో ఎవరూ లేరు అని మీకు తెలుసు గదా.
- దూలాలను సముద్రానికి లాగి తెప్పలుగా కట్టి తేల్చారు1 రాజులు 5:8–9, 2 దిన 2:16
వచనాలు
1 రాజులు 5:8–9అతడు సొలొమోనుకు జవాబు పంపుతూ “నీవు నాకు పంపిన సందేశాన్ని నేను అంగీకరించాను. దేవదారు, సరళ మానులను గురించి నీవు కోరినట్టే చేయిస్తాను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం దగ్గరకి తెస్తారు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు చెప్పిన చోటికి సముద్రం మీద చేరేలా చేసి, అక్కడ వాటిని నీకు అప్పగించే ఏర్పాటు నేను చేస్తాను. నీవు వాటిని తీసుకోవచ్చు. ఇందుకు బదులుగా నీవు నా సేవకుల పోషణ కోసం ఆహారం పంపించు” అన్నాడు.
2 దిన 2:16మేము నీకు కావలసిన కలపను లెబానోనులో కొట్టించి వాటిని తెప్పలుగా కట్టి సముద్రం మీద యొప్పే వరకూ తెస్తాము. తరువాత నువ్వు వాటిని యెరూషలేముకు తెప్పించుకోవచ్చు” అని జవాబిచ్చాడు.
- హీరాము చెట్లు నరికేవారికి గోధుమ, బార్లీ, ద్రాక్షారసం, ఒలీవ నూనెలతో జీతం ఇచ్చారు2 దిన 2:10
వచనాలు
2 దిన 2:10కలప కోసే నీ పనివారికి ఆహారంగా రెండు లక్షల తూముల గోదుమ పిండి, రెండు లక్షల తూముల బార్లీ, నాలుగు లక్షల నలభై వేల లీటర్ల ద్రాక్షారసమూ నాలుగు లక్షల నలభై వేల లీటర్ల నూనే ఇస్తాను.”
- 30,000 మంది ఇశ్రాయేలీయులు 10,000 మంది చొప్పున నెలవారీ దఫాల్లో లెబానోనులో పనిచేశారు1 రాజులు 5:13–14
వచనాలు
1 రాజులు 5:13–14సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి చేతా బలవంతంగా వెట్టి పని చేయించాడు. వారిలో 30,000 మంది వెట్టి చాకిరీ చేసే వారయ్యారు. అతడు వంతుల ప్రకారం వీరిని నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించాడు. వారు ఒక నెల లెబానోనులో, రెండు నెలలు ఇంటి దగ్గరా ఉండేవారు. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారిగా ఉన్నాడు.
- దేవదారు, సరళ వృక్షాల కోసం సొలొమోను హీరాముకు గలిలయలో ఇరవై పట్టణాలు ఇచ్చాడు1 రాజులు 9:11
వచనాలు
1 రాజులు 9:11కాబట్టి సొలొమోను గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణాలను హీరాముకు ఇచ్చాడు.
- దేవాలయానికి దేవదారు దూలాలతో, పలకలతో కప్పు వేశారు1 రాజులు 6:9–10
వచనాలు
1 రాజులు 6:9–10ఈ విధంగా అతడు మందిర నిర్మాణం ముగించి మందిరాన్ని దేవదారు దూలాలతో, పలకలతో కప్పించాడు. మందిరానికి చుట్టూ గదులు కట్టించాడు. ఇవి ఐదు మూరల ఎత్తు కలిగి దేవదారు దూలాల చేత మందిరంతో గట్టిగా సంధించి ఉన్నాయి.
- లోపల సొరకాయలు, పువ్వులు చెక్కిన దేవదారు; ఒక్క రాయి కూడా కనిపించలేదు1 రాజులు 6:15, 1 రాజులు 6:18
వచనాలు
1 రాజులు 6:15అతడు మందిరం లోపలి గోడలను దేవదారు పలకలతో కట్టించాడు. అడుగు నుండి పైకప్పు వరకూ గోడలను దేవదారు పలకలతో కప్పించాడు. మందిరం నేలను సరళ మాను పలకలతో కప్పించాడు.
1 రాజులు 6:18మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు, వికసించిన పువ్వులు చెక్కి ఉన్నాయి. అంతా దేవదారు కర్ర పనే, రాయి ఒక్కటి కూడా కనిపించ లేదు.
- లోపలి ఆవరణ: చెక్కిన రాళ్ళ మూడు వరుసలు, దేవదారు దూలాల ఒక వరుస1 రాజులు 6:36
వచనాలు
1 రాజులు 6:36లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
- లెబానోను అరణ్య భవనం నాలుగు వరుసల దేవదారు స్తంభాల మీద నిలిచింది1 రాజులు 7:2–3
వచనాలు
1 రాజులు 7:2–3అతడు లెబానోను అరణ్య రాజగృహాన్ని కట్టించాడు. దీని పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. దాన్ని నాలుగు వరసల దేవదారు స్తంభాలతో కట్టారు. ఆ స్తంభాలపై మీద దేవదారు దూలాలు వేశారు. పక్కగదులు 45 స్తంభాలతో కట్టి పైన దేవదారు కలపతో కప్పారు. ఆ స్తంభాలు ఒక్కో వరసకి 15 చొప్పున మూడు వరుసలు ఉన్నాయి.
- తిరిగి వచ్చిన బందీలు లెబానోను నుంచి యొప్పేకు దేవదారు దూలాలను సముద్రం మీదుగా తెప్పించారుఎజ్రా 3:7
వచనాలు
ఎజ్రా 3:7వారు తాపీ పనివారికి, వడ్రంగం పనివారికి డబ్బు ఇచ్చారు. ఇంకా పర్షియా దేశపు రాజు కోరెషు తమకు చెప్పిన విధంగా లెబానోను నుండి దేవదారు మానులను సముద్ర మార్గంలో యొప్పే పట్టణానికి తెప్పించడానికి సీదోను, తూరు వారికి భోజన పదార్థాలు, పానీయాలు, నూనె ఇచ్చారు.
- ఒక రాజు తన రాజభవనానికి దేవదారు పలకలు బిగించి ఎర్ర రంగు వేయిస్తాడుయిర్మీ 22:14
వచనాలు
యిర్మీ 22:14“నేను విశాలమైన మేడ గదులున్న పెద్ద ఇంటిని కట్టించుకుంటాను, అనుకునే వాళ్లకు బాధ. అతడు పెద్ద పెద్ద కిటికీలు చేయించుకుని దేవదారు పలకలతో పొదిగి, ఎర్ర రంగుతో అలంకరిస్తాడు.”
- “మన ఇంటి దూలాలు దేవదారు వృక్షం మ్రానులు”పరమ 1:17
వచనాలు
పరమ 1:17మన ఇంటి దూలాలు దేవదారు వృక్షం మ్రానులు. మన వాసాలు సరళ వృక్షం మ్రానులు.
సూక్తులు, కల్పిత కథలు
- యెహోయాషు కథ: ఒక ముళ్ళ పొద దేవదారు కుమార్తెను అడుగుతుంది2 రాజులు 14:9
వచనాలు
2 రాజులు 14:9ఇశ్రాయేలు రాజు యెహోయాషు యూదా రాజు అమజ్యాకు ఇలా చెప్పి పంపాడు. “లెబానోనులో ఉన్న ముళ్ళ చెట్టొకటి ‘నీ కూతుర్ని నా కొడుక్కి ఇవ్వు’ అని లెబానోనులో ఉన్న దేవదారు వృక్షానికి కబురంపిందట. అంతలోనే లెబానోనులో ఉన్న అడవి మృగం ఒకటి వచ్చి ఆ ముళ్ళ చెట్టును తొక్కేసింది.
- యోతాము కథ: ముళ్ళపొద నుంచి వచ్చిన అగ్ని దేవదారు వృక్షాలను కాల్చివేస్తుందిన్యాయా 9:15
వచనాలు
న్యాయా 9:15ముండ్ల పొద ‘మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోవాలని కోరుకుంటే నా నీడలోకి రండి. లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది’ అని చెట్లతో చెప్పింది.”
- దేవదారు వృక్షాలంత ఎత్తూ సింధూర వృక్షాలంత బలమూ ఉన్న అమోరీయుడుఆమో 2:9
వచనాలు
ఆమో 2:9దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా! పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ నేను నాశనం చేశాను గదా!
- ఒక కీర్తన: “లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు”కీర్త 92:12
వచనాలు
కీర్త 92:12నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు.
- “యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది”కీర్త 29:5
వచనాలు
కీర్త 29:5యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు.
- “లెబానోను పర్వతాల్లా, దేవదారు వృక్షాల్లా రమ్యం”పరమ 5:15
వచనాలు
పరమ 5:15అతని కాళ్లు పాలరాతి స్తంభాల్లా ఉన్నాయి. అవి అచ్చమైన బంగారు కుదురు మీద నిలిపినట్టున్నాయి. అతని ఆకారం లెబానోను పర్వతాల్లా, దేవదారు వృక్షాల్లా రమ్యం.
- దేవదారు వృక్షాలు సంతోషిస్తాయి: మమ్మల్ని నరకడానికి చెట్లు నరికేవాడెవడూ రాడుయెష 14:8
వచనాలు
యెష 14:8నిన్ను గూర్చి తమాల వృక్షాలు, లెబానోను దేవదారు వృక్షాలు సంతోషిస్తూ ఇలా అంటాయి, ‘నువ్వు ఓడిపోయినప్పట్నుంచి చెట్లు నరికే వాడెవడూ మమ్మల్ని నరకడానికి మా మీదకు రాలేదు.’
- “సరళవృక్షాల్లారా, విలపించండి” — దేవదారు చెట్లు కూలిపోయాయిజెక 11:2
వచనాలు
జెక 11:2దేవదారు చెట్లు కూలిపోయాయి. మహా వృక్షాలు నాశనమయ్యాయి. సరళవృక్షాల్లారా, విలపించండి. ఎందుకంటే దట్టమైన అడవి నరకబడింది. సింధూర వృక్షాల్లారా, విలపించండి.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు