Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › సోమరితనం

దైనందిన జీవితం

బైబిల్‌లో సోమరితనం

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 26 భాగాలు, వాక్యం వాక్యంగా.

సామెతల్లోని మాటలు

  • సోమరీ, చీమ దగ్గరికి వెళ్ళు: అది వేసవిలో ఆహారం కూర్చుకుంటుందిసామె 6:6–8
    వచనాలు
    సామె 6:6–8సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు. అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.
  • కొంచెం నిద్ర, దొంగలా దరిద్రం వస్తుందిసామె 6:9–11
    వచనాలు
    సామె 6:9–11సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు? ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు? అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.
  • సోమరి పొలం: ముళ్ళు, దురదగొండ్లు, కూలిన రాతి గోడసామె 24:30–34
    వచనాలు
    సామె 24:30–34సోమరిపోతు చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే, ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది. నేను దాన్ని చూసి ఆలోచించాను. దాన్ని గమనించి బుద్ధి తెచ్చుకున్నాను. మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం, వీటివల్ల నీకు దారిద్రర్యం పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధం ధరించిన సైనికుడు వచ్చినట్టు లేమి నీమీదికి వస్తుంది.
  • సోమరి చేతులు దరిద్రుణ్ణి చేస్తాయిసామె 10:4
    వచనాలు
    సామె 10:4శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.
  • కోతకాలంలో నిద్రపోయేవాడు సిగ్గు తెచ్చే కుమారుడుసామె 10:5
    వచనాలు
    సామె 10:5బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.
  • పళ్ళకు చిరక, కళ్ళకు పొగ లాంటివాడుసామె 10:26
    వచనాలు
    సామె 10:26సోమరిని పనికి పెట్టుకునే యజమానికి వాడు పండ్లకు పులుపులాగా, కళ్ళకు పొగలాగా ఉంటాడు.
  • సోమరితనం వెట్టిచాకిరితో ముగుస్తుందిసామె 12:24
    వచనాలు
    సామె 12:24ఒళ్ళువంచి పనిచేసే వాళ్ళు అధికారం సంపాదిస్తారు. సోమరిపోతులు ఊడిగం చెయ్యాల్సి వస్తుంది.
  • సోమరి తాను వేటాడినదాన్ని కాల్చుకోడుసామె 12:27
    వచనాలు
    సామె 12:27సోమరిపోతు వేటకు వెళ్ళినా ఏమీ పట్టుకోలేడు. చురుకుదనం కలిగి ఉండడం గొప్ప వరం.
  • సోమరి ఆశిస్తాడు, కాని అతనికి ఏమీ దొరకదుసామె 13:4, సామె 21:25
    వచనాలు
    సామె 13:4సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.
    సామె 21:25సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి.
  • సోమరి దారి ముళ్ళ కంచె లాంటిదిసామె 15:19
    వచనాలు
    సామె 15:19సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.
  • పనిలో సోమరి నాశనం చేసేవానికి సోదరుడుసామె 18:9
    వచనాలు
    సామె 18:9పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న.
  • పాత్రలో చెయ్యి పెడతాడు, కాని నోటికి ఎత్తడుసామె 19:24, సామె 26:15
    వచనాలు
    సామె 19:24సోమరిపోతు గిన్నెలో చెయ్యి పెడతాడుగానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు.
    సామె 26:15కంచంలో సోమరి తన చెయ్యి ముంచుతాడు. దాన్ని తిరిగి నోటికి ఎత్తుకోవడం అతనికి బద్ధకం.
  • కాలానికి దున్నడు, కోతకాలంలో అతనికి ఏమీ దొరకదుసామె 20:4
    వచనాలు
    సామె 20:4నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.
  • “బయట సింహం ఉంది”సామె 22:13, సామె 26:13
    వచనాలు
    సామె 22:13సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు.
    సామె 26:13సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు.
  • తలుపు బందుల మీద తిరిగినట్టు సోమరి తన మంచం మీద దొర్లుతాడుసామె 26:14
    వచనాలు
    సామె 26:14బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు.
  • తెలివిగా జవాబిచ్చే ఏడుగురి కంటే తానే జ్ఞానినని అనుకుంటాడుసామె 26:16
    వచనాలు
    సామె 26:16సహేతుకమైన కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తానే జ్ఞానిననుకుంటాడు.

ఇతర చోట్ల

  • సోమరితనం వల్ల కప్పు కూలుతుంది, ఇల్లు కారుతుందిప్రస 10:18
    వచనాలు
    ప్రస 10:18సోమరితనం ఇంటికప్పు దిగబడిపోయేలా చేస్తుంది. చేతులు బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు కురుస్తుంది.
  • బుద్ధిహీనుడు చేతులు ముడుచుకుంటాడుప్రస 4:5
    వచనాలు
    ప్రస 4:5బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు.
  • తన తలాంతును పాతిపెట్టిన సేవకుణ్ణి సోమరి అంటారుమత్తయి 25:26
    వచనాలు
    మత్తయి 25:26అందుకు ఆ యజమాని అతనితో, ‘నీవు సోమరివాడివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసేవాడిని అని నీకు తెలుసు గదా!
  • మీ ఆసక్తి తగ్గనివ్వకండిరోమా 12:11
    వచనాలు
    రోమా 12:11ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి.
  • “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు”2 తెస్స 3:10–12
    వచనాలు
    2 తెస్స 3:10–12అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా! మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం. అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.
  • యువ వితంతువులు ఇంటింటికీ తిరుగుతూ సోమరితనం నేర్చుకుంటారు1 తిమో 5:13
    వచనాలు
    1 తిమో 5:13వారు ఇంటింటికీ తిరుగుతూ, సోమరులవుతారు. అంతేగాక, వారు పనికిమాలిన మాటలు మాటలాడుతూ, వాగుడుకాయలై ఇతరుల విషయాల్లో తల దూర్చేవారుగా తయారవుతారు.
  • మందబుద్ధులుగా ఉండవద్దుహెబ్రీ 6:12
    వచనాలు
    హెబ్రీ 6:12మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు