అన్వేషించండి › అంశాలు › వ్యాపారం, వర్తకులు
దైనందిన జీవితం
బైబిల్లో వ్యాపారం, వర్తకులు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 37 భాగాలు, వాక్యం వాక్యంగా.
- అబ్రాహాము “వర్తకుల తూకం ప్రకారం” వెండి తూచి ఇస్తాడుఆది 23:16
వచనాలు
ఆది 23:16అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం నాలుగు వందల షెకెల్ల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.
- ఇష్మాయేలీయుల బిడారు సుగంధ ద్రవ్యాలు, గుగ్గిలం, బోళం ఐగుప్తుకు తీసుకువెళ్తుందిఆది 37:25
వచనాలు
ఆది 37:25వారు భోజనానికి కూర్చున్నపుడు, ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు.
- యోసేపును ఇరవై తులాల వెండికి వర్తకులకు అమ్మేస్తారుఆది 37:28, ఆది 37:36
వచనాలు
ఆది 37:28ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరవై షెకెల్ ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు.
ఆది 37:36మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి, ఫరో రాజు అంగ రక్షకుల సేనానిగా పని చేస్తున్న పోతీఫరుకు అతణ్ణి అమ్మేశారు.
- హీరాము దేవదారు, సరళ వృక్షాలు పంపిస్తాడు; సొలొమోను గోధుమ, ఒలీవ నూనెతో చెల్లిస్తాడు1 రాజులు 5:8–11, 2 దిన 2:15
వచనాలు
1 రాజులు 5:8–11అతడు సొలొమోనుకు జవాబు పంపుతూ “నీవు నాకు పంపిన సందేశాన్ని నేను అంగీకరించాను. దేవదారు, సరళ మానులను గురించి నీవు కోరినట్టే చేయిస్తాను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం దగ్గరకి తెస్తారు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు చెప్పిన చోటికి సముద్రం మీద చేరేలా చేసి, అక్కడ వాటిని నీకు అప్పగించే ఏర్పాటు నేను చేస్తాను. నీవు వాటిని తీసుకోవచ్చు. ఇందుకు బదులుగా నీవు నా సేవకుల పోషణ కోసం ఆహారం పంపించు” అన్నాడు. హీరాము సొలొమోను కోరినన్ని దేవదారు, సరళ మానులను పంపించాడు. సొలొమోను హీరాముకూ అతని పరివారం పోషణకు 2,00,000 తూముల గోదుమలు, 4, 16, 350 లీటర్ల స్వచ్ఛమైన నూనె పంపించాడు. ఈ విధంగా సొలొమోను ప్రతి సంవత్సరం హీరాముకు ఇస్తూ వచ్చాడు.
2 దిన 2:15ఇప్పుడు నా ప్రభువైన నువ్వు చెప్పినట్టే గోదుమలూ యవలూ నూనే ద్రాక్షారసమూ నీ సేవకులతో పంపించు.
- సొలొమోను ఓడలు ఓఫీరు నుంచి 420 తలాంతుల బంగారం తెస్తాయి1 రాజులు 9:26–28
వచనాలు
1 రాజులు 9:26–28సొలొమోను రాజు ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరంలోని ఏలతు దగ్గర, ఎసోన్గెబెరులో, ఓడలను నిర్మించాడు. హీరాము సముద్ర ప్రయాణం బాగా తెలిసిన నావికులైన తన సేవకులను సొలొమోను సేవకులతోబాటు ఓడల మీద పంపించాడు. వారు ఓఫీరు అనే స్థలానికి వెళ్ళి అక్కడ నుండి 14, 500 కిలోగ్రాముల బంగారాన్ని రాజైన సొలొమోను దగ్గరికి తీసుకువచ్చారు.
- సొలొమోనుకు వర్తకుల నుంచీ వ్యాపారుల నుంచీ ఆదాయం వస్తుంది1 రాజులు 10:15, 2 దిన 9:14
వచనాలు
1 రాజులు 10:15ఇది గాక, వర్తకులూ, అరబి రాజులూ, దేశాధికారులూ అతనికి సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని పెద్ద మొత్తంలో పంపేవారు.
2 దిన 9:14అరబ్బు దేశపు రాజులు, దేశాధిపతులు కూడా సొలొమోను దగ్గరికి బంగారం, వెండి తీసుకు వచ్చారు.
- ఎలీమెలెకుకు చెందిన భూమిని నయోమి అమ్ముతుందిరూతు 4:3
వచనాలు
రూతు 4:3తరువాత అతడు “మోయాబు దేశంనుండి తిరిగి వచ్చిన నయోమి మన సోదరుడైన ఎలీమెలెకు భార్య. ఆమె తన భర్తకు చెందిన భూమిని అమ్మివేస్తోంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా వినాలని నేను ఒక విషయం చెబుతున్నాను.
- కంసాలులూ వర్తకులూ యెరూషలేము గోడలో ఒక భాగాన్ని బాగుచేస్తారునెహె 3:32
వచనాలు
నెహె 3:32మూలనున్న పై గది నుండి గొర్రెల ద్వారం మధ్య వరకూ కంసాలులు, వర్తకులు బాగు చేశారు.
- తూరు మనుషులు విశ్రాంతి దినాన యెరూషలేములో చేపలు అమ్ముతారునెహె 13:16
వచనాలు
నెహె 13:16యెరూషలేంలో ఉంటున్న తూరు దేశస్థులు విశ్రాంతిదినాన చేపలు మొదలైన రకరకాల వస్తువులు తెచ్చి యూదులకు అమ్ముతున్నారు.
- నెహెమ్యా ద్వారాలు మూయిస్తాడు; వర్తకులు పట్టణం బయట బస చేస్తారునెహె 13:19–20
వచనాలు
నెహె 13:19–20విశ్రాంతి దినానికి ముందు రోజు చీకటి పడినప్పుడు యెరూషలేం ద్వారాలు మూసి ఉంచాలనీ, విశ్రాంతి దినం ముగిసేదాకా తలుపులు తియ్యకూడదనీ ఆజ్ఞాపించాను. విశ్రాంతి దినాన ఎలాంటి బరువులు లోపలికి రాకుండేలా తలుపుల దగ్గర నా పనివాళ్ళలో కొందరిని కాపలా ఉంచాను. వర్తకులు, రకరకాల వస్తువులు అమ్మేవారు ఒకటి రెండుసార్లు యెరూషలేం ప్రాకారం బయట బస చేశారు.
- గుణవతి అయిన భార్య పొలం కొంటుంది, నార వస్త్రాలు అమ్ముతుందిసామె 31:16, సామె 31:24
వచనాలు
సామె 31:16ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది.
సామె 31:24ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది.
- పౌలు ఓడ తూరులో సరుకు దించుతుందిఅపొ.కా 21:2–3
వచనాలు
అపొ.కా 21:2–3అక్కడ ఫేనీకే బయలుదేరుతున్న ఒక ఓడను చూసి దానిలో ఎక్కాం. దానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ ఉండగా దానికి ఎడమ పక్కగా ప్రయాణించి, సిరియా వైపుగా వెళ్ళి, తూరులో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చెయ్యాల్సి ఉంది.
- తుయతైర పట్టణానికి చెందిన ఊదా రంగు బట్టల వ్యాపారి లూదియఅపొ.కా 16:14
వచనాలు
అపొ.కా 16:14లూదియ అనే దేవుని ఆరాధకురాలు ఒకామె మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు బట్టలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు.
- దేవాలయ ఆవరణల్లో రూకలు మార్చేవారూ పావురాలు అమ్మేవారూయోహా 2:14
వచనాలు
యోహా 2:14అక్కడ దేవాలయంలో ఎద్దులనూ, గొర్రెలనూ, పావురాలనూ అమ్ముతున్న వారిని చూశాడు. అక్కడే కూర్చుని డబ్బు మారకం చేసే వారిని కూడా చూశాడు.
- ఒక వర్తకుడు ఒక్క విలువైన ముత్యం కోసం తనకున్నదంతా అమ్మేస్తాడు (ఉపమానం)మత్తయి 13:45–46
వచనాలు
మత్తయి 13:45–46“పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది. అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.
- వ్యాపారం చేయడానికి సేవకులకు డబ్బు ఇస్తారు (ఉపమానం)లూకా 19:13, మత్తయి 25:16
వచనాలు
లూకా 19:13దానికి ముందు తన సేవకులు పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణాలు ఇచ్చాడు. “నేను తిరిగి వచ్చే వరకూ మీరు వీటితో వ్యాపారం చేయండి” అని చెప్పాడు.
మత్తయి 25:16ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు.
- “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి”యాకో 4:13
వచనాలు
యాకో 4:13“నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట.
తూరుతో వ్యాపారం (యెహెజ్కేలు 27)
- తర్షీషు: వెండి, ఇనుము, తగరం, సీసంయెహె 27:12
వచనాలు
యెహె 27:12రకరకాల సరకులు నీ దగ్గర చాలా ఎక్కువగా ఉండడం వలన తర్షీషు వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ సరకులు కొన్నారు.
- యావాను, తుబాలు, మెషెకు: బానిసలు, కంచు పాత్రలుయెహె 27:13
వచనాలు
యెహె 27:13యావాను, తుబాలు, మెషెకు ప్రాంతాలవాళ్ళు నీతో వ్యాపారం చేశారు. బానిసలనూ ఇత్తడి వస్తువులనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
- బేత్ తోగర్మా: గుర్రాలు, యుద్ధ గుర్రాలు, కంచరగాడిదలుయెహె 27:14
వచనాలు
యెహె 27:14బేత్ తోగర్మా వాళ్ళు గుర్రాలను యుద్ధాశ్వాలనూ కంచరగాడిదలనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.
- దదాను: జీను బట్టలు; ద్వీపాలు: దంతాలు, నల్లమద్దియెహె 27:15, యెహె 27:20
వచనాలు
యెహె 27:15దదాను వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. అనేక సముద్ర తీరాల ప్రజలు నీ సరుకులు కొన్నారు. వాళ్ళు దంతం, నల్లచేవ మాను తెచ్చి ఇచ్చారు.
యెహె 27:20దెదాను వాళ్ళు గుర్రపు జీనుల కోసం వాడే బట్టలు తెచ్చి నీ సరుకులు కొన్నారు.
- అరాము: పచ్చలు, ఊదా బట్టలు, బుటా పని, సన్నని నార, పగడాలు, కెంపులుయెహె 27:16
వచనాలు
యెహె 27:16నువ్వు చేసిన వివిధ వస్తువులను కొనుక్కోడానికి సిరియనులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు పచ్చలు, ఊదా రంగు, అద్దకం వేసిన బట్ట, నునుపైన బట్ట, ముత్యాలు, రత్నాలు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
- యూదా, ఇశ్రాయేలు: గోధుమ, తేనె, నూనె, గుగ్గిలంయెహె 27:17
వచనాలు
యెహె 27:17యూదావారూ ఇశ్రాయేలు వారూ నీతో వ్యాపారం చేశారు. మిన్నీతు నుంచి గోదుమలు, చిరు ధాన్యాలు, తేనె, నూనె, గుగ్గిలం తెచ్చి నీ సరుకులు కొన్నారు.
- దమస్కు: హెల్బోను ద్రాక్షారసం, ఉన్నియెహె 27:18
వచనాలు
యెహె 27:18దమస్కు వాళ్ళు హెల్బోను ద్రాక్షారసం, జహారు ప్రాంతం ఉన్ని తెచ్చి నీతో వ్యాపారం చేశారు.
- అరేబియా, కేదారు: గొర్రెపిల్లలు, పొట్టేళ్ళు, మేకలుయెహె 27:21
వచనాలు
యెహె 27:21అరేబియా వాళ్ళు, కేదారు నాయకులంతా నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను తెచ్చి నీ సరుకులు కొన్నారు.
- షేబ, రాయమా: సుగంధ ద్రవ్యాలు, విలువైన రత్నాలు, బంగారంయెహె 27:22
వచనాలు
యెహె 27:22షేబ వ్యాపారులు రమా వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు అతి ప్రశస్తమైన గంధవర్గాలనూ విలువగల నానా విధమైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంటారు.
ధర్మశాస్త్రంలో
- సరైన త్రాసులు, తూకపు రాళ్ళు, కొలతలులేవీ 19:35–36, ద్వితీ 25:13–15
వచనాలు
లేవీ 19:35–36కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.
ద్వితీ 25:13–15వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు. వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు. మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి.
- కొనేవాడూ అమ్మేవాడూ ఒకరినొకరు మోసం చేసుకోకూడదులేవీ 25:14
వచనాలు
లేవీ 25:14నీవు నీ పొరుగు వాడికి అమ్మిన దాని విషయంలో గానీ నీ పొరుగు వాడి దగ్గర నీవు కొనుక్కున్న దాని విషయంలో గానీ మీరు ఒకరినొకరు బాధించుకోకూడదు.
సూక్తులు
- కొనేవాడు నాసిరకం అంటాడు, తర్వాత వెళ్ళి గొప్పలు చెప్పుకుంటాడుసామె 20:14
వచనాలు
సామె 20:14కొనేవాడు నాసిరకం అంటాడు. అవతలికి వెళ్లి దాన్నే మెచ్చుకుంటాడు.
- ధాన్యం అమ్మడానికి విశ్రాంతి దినం ఎప్పుడు ముగుస్తుందా అని కనిపెట్టే వర్తకులుఆమో 8:5
వచనాలు
ఆమో 8:5వారిలా అంటారు, “మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో? గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో? మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం. తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు