అన్వేషించండి › అంశాలు › ముద్దులు
దైనందిన జీవితం
బైబిల్‌లో ముద్దులు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 32 భాగాలు, వాక్యం వాక్యంగా.
పలకరింపులు, వీడ్కోళ్ళు
- యాకోబు బావి దగ్గర రాహేలును ముద్దుపెట్టుకుని బిగ్గరగా ఏడుస్తాడుఆది 29:11
వచనాలు
ఆది 29:11యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననీ,
- లాబాను తన మనుమలనూ కుమార్తెలనూ ముద్దుపెట్టుకుని వీడ్కోలు చెబుతాడుఆది 31:55
వచనాలు
ఆది 31:55తెల్లవారినప్పుడు లాబాను తన మనుమలనూ తన కుమార్తెలనూ ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు.
- ఏశావు యాకోబు దగ్గరికి పరుగెత్తి కౌగిలించుకుని ముద్దుపెట్టుకుంటాడుఆది 33:4
వచనాలు
ఆది 33:4అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోడానికి పరుగెత్తి అతనిని కౌగలించుకుని అతని మెడను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
- యోసేపు ఏడుస్తూ తన అన్నలందరినీ ముద్దుపెట్టుకుంటాడుఆది 45:15
వచనాలు
ఆది 45:15అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
- అహరోను దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని ముద్దుపెట్టుకుంటాడునిర్గ 4:27
వచనాలు
నిర్గ 4:27మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు.
- మోషే తన మామకు నమస్కరించి ముద్దుపెట్టుకుంటాడునిర్గ 18:7
వచనాలు
నిర్గ 18:7మోషే తన మామకు ఎదురు వెళ్ళాడు. అతనికి వందనం చేసి ముద్దు పెట్టుకున్నాడు. ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకుని గుడారంలోకి వచ్చారు.
- నయోమి తన కోడళ్ళను ముద్దుపెట్టుకుంటుంది; ఓర్పా ఆమెను ముద్దుపెట్టుకుని వీడ్కోలు చెబుతుందిరూతు 1:9, రూతు 1:14
- దావీదు, యోనాతాను ముద్దుపెట్టుకుని కలిసి ఏడుస్తారు1 సమూ 20:41
వచనాలు
1 సమూ 20:41పనివాడు వెళ్లిపోగానే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడుసార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొంటూ ఏడ్చారు. అయితే దావీదు మాత్రం మరింత గట్టిగా ఏడ్చాడు.
- యొర్దాను దగ్గర దావీదు బర్జిల్లయిని ముద్దుపెట్టుకుంటాడు2 సమూ 19:39
వచనాలు
2 సమూ 19:39అప్పుడు రాజు, ప్రజలందరూ నది అవతలకు వచ్చారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తరువాత బర్జిల్లయి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు.
- తన తండ్రికీ తల్లికీ ముద్దుపెట్టి వీడ్కోలు చెప్పనివ్వమని ఎలీషా అడుగుతాడు1 రాజులు 19:20
వచనాలు
1 రాజులు 19:20అతడు ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంట పరిగెత్తి “నేను వెళ్లి నా తలిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను” అన్నాడు. ఏలీయా “వెళ్లి రా. నేను నీకేం చేశానో గుర్తు పెట్టుకో” అన్నాడు.
- తిరిగి వస్తున్న కుమారుని దగ్గరికి తండ్రి పరుగెత్తి ముద్దుపెట్టుకుంటాడులూకా 15:20
వచనాలు
లూకా 15:20అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు.
- ఎఫెసు పెద్దలు పౌలును కౌగిలించుకుని ముద్దుపెట్టుకుంటారుఅపొ.కా 20:37
వచనాలు
అపొ.కా 20:37అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు.
కుటుంబం, ఆప్యాయత
- ఇస్సాకు: “నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు”ఆది 27:26–27
వచనాలు
ఆది 27:26–27అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు “నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. “చూడు, నా కొడుకు సువాసన, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది.
- దాదాపు గుడ్డివాడైన వృద్ధ యాకోబు యోసేపు కుమారులను ముద్దుపెట్టుకుంటాడుఆది 48:10
వచనాలు
ఆది 48:10ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేక పోయాడు. కాబట్టి, యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకు వచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు.
- యోసేపు చనిపోయిన తన తండ్రి మీద పడి ఏడ్చి ముద్దుపెట్టుకుంటాడుఆది 50:1
వచనాలు
ఆది 50:1యోసేపు తన తండ్రి మీద వాలి ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు.
- సమూయేలు సౌలును అభిషేకించి ముద్దుపెట్టుకుంటాడు1 సమూ 10:1
వచనాలు
1 సమూ 10:1అప్పుడు సమూయేలు నూనె బుడ్డి తీసుకు సౌలు తల మీద నూనె పోసి అతణ్ణి ముద్దు పెట్టుకుని “యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల మీద నిన్ను రాజుగా నియమించాడు” అని ఇంకా ఇలా చెప్పాడు,
- అబ్షాలోము తిరిగి వచ్చిన తర్వాత రాజైన దావీదు అతణ్ణి ముద్దుపెట్టుకుంటాడు2 సమూ 14:33
వచనాలు
2 సమూ 14:33అప్పుడు యోవాబు రాజు దగ్గరికి వచ్చి ఆ విషయం రాజుకు చెప్పినప్పుడు, రాజు అబ్షాలోమును పిలిపించాడు. అతడు రాజు దగ్గరికి వచ్చి రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
- “నీ నోటితో నాకు ముద్దులు పెడితే ఎంత బాగుండు”పరమ 1:2
వచనాలు
పరమ 1:2నీ నోటితో నాకు ముద్దులు పెడితే ఎంత బాగుండు. నీ ప్రేమ ద్రాక్షారసం కంటే ఉత్తమం.
- నిజాయితీ గల జవాబు పెదవులపై ముద్దు లాంటిదిసామె 24:26
వచనాలు
సామె 24:26సరియైన మాటలతో జవాబివ్వడం పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది.
మోసపు ముద్దులు
- శత్రువు ముద్దులు మోసకరమైనవిసామె 27:6
వచనాలు
సామె 27:6స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.
- అబ్షాలోము ప్రజలను ముద్దుపెట్టుకుంటూ వారి మనసులు గెలుచుకుంటాడు2 సమూ 15:5
వచనాలు
2 సమూ 15:5ఎవరైనా తనకు నమస్కారం చేయడానికి తన దగ్గరికి వస్తే అతడు తన చెయ్యి చాపి వారిని పట్టుకుని ముద్దు పెట్టుకొనేవాడు.
- యోవాబు ముద్దుపెట్టుకోవడానికి అమాశా గడ్డం పట్టుకుని అతణ్ణి పొడుస్తాడు2 సమూ 20:9–10
వచనాలు
2 సమూ 20:9–10అప్పుడు యోవాబు అమాశాను చూసి “నా సోదరా, క్షేమంగా ఉన్నావా?” అని అడుగుతూ, అమాశాను ముద్దు పెట్టుకొంటున్నట్టు తన కుడి చేత్తో అతని గడ్డం పట్టుకున్నాడు. యోవాబు చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కనుక తనను కాపాడుకోలేక పోయాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో బలంగా పొడిచాడు. కత్తి కడుపులో దిగిన వెంటనే అతని పేగులు జారి నేలపై పడడంతో ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు. తరువాత యోవాబు, అతని సోదరుడు అబీషైలు బిక్రి కొడుకు షెబను తరమడానికి వెళ్ళిపోయారు.
- యూదా: “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు”మత్తయి 26:48–49, లూకా 22:48
వచనాలు
మత్తయి 26:48–49ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
లూకా 22:48అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు.
ఆరాధన, తొలి సంఘం
- విగ్రహాలను ముద్దుపెట్టుకోవడం: బయలు, దూడలు1 రాజులు 19:18, హోషే 13:2
వచనాలు
1 రాజులు 19:18అయినా ఇశ్రాయేలు ప్రజల్లో బయలుకు మొక్కకుండా, వాడి విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఇంకా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు.”
హోషే 13:2ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. అదంతా నిపుణులు చేసే పనే. “వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు.
- ఒక స్త్రీ యేసు పాదాలను ముద్దుపెట్టుకుంటుంది; ఆయనను పిలిచినవాడు ముద్దు పెట్టలేదులూకా 7:38, లూకా 7:45
వచనాలు
లూకా 7:38ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది.
లూకా 7:45నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చిన దగ్గర్నించి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకోవడం ఆపలేదు.
- పవిత్రమైన ముద్దుతో ఒకరినొకరు పలకరించుకోండిరోమా 16:16, 1 తెస్స 5:26, 1 పేతు 5:14
వచనాలు
రోమా 16:16పవిత్రమైన ముద్దుతో ఒకడికొకడు అభివందనాలు చెప్పుకోండి. క్రైస్తవ సంఘాలన్నీ మీకు అభివందనాలు చెబుతున్నాయి.
1 తెస్స 5:26పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి.
1 పేతు 5:14ప్రేమ ముద్దుతో ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి. క్రీస్తులో మీకందరికీ శాంతి కలుగు గాక.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు