Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › నాట్యం

దైనందిన జీవితం

బైబిల్‌లో నాట్యం

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 21 భాగాలు, వాక్యం వాక్యంగా.

  • సముద్రం దాటిన తర్వాత మిర్యాము, స్త్రీలు తంబురలతో నాట్యం చేస్తారునిర్గ 15:20
    వచనాలు
    నిర్గ 15:20అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు.
  • మోషే దూడనూ నాట్యాన్నీ చూస్తాడునిర్గ 32:19
    వచనాలు
    నిర్గ 32:19అతడు శిబిరం చేరుకున్నప్పుడు ప్రజలు చేసుకున్న ఆ దూడ, నాట్యం చేస్తున్న ప్రజలు కనిపించారు. మోషే కోపం రగులుకుంది. అతడు తన చేతుల్లో ఉన్న పలకలను కొండ కింది భాగానికి విసిరేసి వాటిని పగలగొట్టాడు.
  • యెఫ్తా కుమార్తె నాట్యం చేస్తూ అతణ్ణి ఎదుర్కోవడానికి బయటికి వస్తుందిన్యాయా 11:34
    వచనాలు
    న్యాయా 11:34యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కూతురు తంబురలతో నాట్యంతో బయలుదేరి అతనికి ఎదురొచ్చింది. ఆమె తప్ప అతనికి మగ సంతానమేగాని ఆడసంతానమేగాని లేదు.
  • ఏటేటా జరిగే పండగలో షిలోహు కుమార్తెలు నాట్యం చేస్తారున్యాయా 21:19–21
    వచనాలు
    న్యాయా 21:19–21కాబట్టి వాళ్ళు బెన్యామీనీయులతో ఇలా అన్నారు “చూడండి, బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెముకు వెళ్ళే రాజమార్గానికి తూర్పున ఉన్న లెబోనాకు దక్షిణ దిక్కున ఉన్న షిలోహు లో ప్రతి సంవత్సరం యెహోవాకు పండగ జరుగుతుంది. మీరు వెళ్లి ద్రాక్షతోటల్లో చాటున దాక్కుని ఉండండి. షిలోహు నుండి స్త్రీలు నాట్యమాడటానికి బయటకు వస్తారు. ద్రాక్షతోటల్లో నుండి వేగంగా బయటకు వచ్చి మీలో ప్రతి ఒక్కడూ ఒక్కో షిలోహు అమ్మాయిని పట్టుకుని భార్యగా చేసుకోడానికి మీ బెన్యామీనీయుల దేశానికి పారిపొండి.
  • స్త్రీలు నాట్యం చేస్తూ పాడతారు: “సౌలు వెయ్యిమందిని”1 సమూ 18:6–7, 1 సమూ 21:11
    వచనాలు
    1 సమూ 18:6–7వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు. ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ: “సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందినీ చంపేశారు.” అని పాడారు.
    1 సమూ 21:11ఆకీషు సేవకులు “ఈ దావీదు ఆ దేశపు రాజు కదా? ఆ దేశపు ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేల మందిని హతం చేసారని పాడిన పాటలు ఇతని గురించినవే గదా” అని అతని గురించి రాజుతో చెబుతుంటే,
  • దావీదు మందసం ఎదుట తన శక్తి అంతటితో నాట్యం చేస్తాడు2 సమూ 6:15–16
    వచనాలు
    2 సమూ 6:15–16ఈ విధంగా దావీదు, ఇశ్రాయేలీయులంతా ఉత్సాహంగా తంతి వాయిద్యాలు వాయిస్తూ యెహోవా మందసాన్ని తీసుకు వచ్చారు. యెహోవా మందసం దావీదు పట్టణానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేస్తున్న దావీదును చూసి, తన మనస్సులో అతన్ని గూర్చి నీచంగా భావించుకుంది.
  • నాట్యం చేస్తున్న రాజైన దావీదును చూసి మీకాలు అతణ్ణి తృణీకరిస్తుంది1 దిన 15:29
    వచనాలు
    1 దిన 15:29కాని, యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోకి వచ్చినప్పుడు, సౌలు కూతురు మీకాలు కిటికీలో నుంచి చూసి రాజైన దావీదు నాట్యం చేస్తూ సంబరం చేసుకోవడం గమనించి, తన మనస్సులో అతన్ని అసహ్యించుకుంది.
  • పిల్లలు తంబుర, సితారలకు గంతులు వేస్తారుయోబు 21:11–12
    వచనాలు
    యోబు 21:11–12వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయటికి వస్తారు. వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తారు. వాళ్ళు తంబుర, తంతివాద్యం వాయిస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ సంతోషిస్తారు.
  • “నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు”కీర్త 30:11
    వచనాలు
    కీర్త 30:11నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు.
  • తంబురతో, నాట్యంతో ఆయనను స్తుతించండికీర్త 149:3, కీర్త 150:4
    వచనాలు
    కీర్త 149:3వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తారు గాక. తంబుర, సితారా మోగిస్తూ ఆయనను గూర్చి ఆనంద గీతాలు గానం చేస్తారు గాక.
    కీర్త 150:4తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆయనను స్తుతించండి. తంతివాద్యం మీటుతూ, వేణువు మోగిస్తూ ఆయనను స్తుతించండి.
  • దుఃఖించడానికి ఒక కాలం, నాట్యం చేయడానికి ఒక కాలంప్రస 3:4
    వచనాలు
    ప్రస 3:4ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ
  • మహనయీము నాట్యంపరమ 6:13
    వచనాలు
    పరమ 6:13అందాల రాశీ, వెనక్కి తిరిగి రా. వచ్చెయ్యి. తిరిగి వచ్చెయ్యి. నేను నిన్ను తనివితీరా చూడాలి. రెండు వరసల నర్తకిల మధ్య నేను నాట్యం చేస్తున్నట్టు నావైపు అంత తదేకంగా ఎందుకు చూస్తావు?
  • కన్యలు నాట్యంతో సంతోషిస్తారు, యువకులూ వృద్ధులూ కూడాయిర్మీ 31:4, యిర్మీ 31:13
    వచనాలు
    యిర్మీ 31:4ఇశ్రాయేలు కన్యా, నువ్వు నిర్మాణం అయ్యేలా నేను నిన్ను మళ్ళీ కడతాను. నువ్వు మళ్ళీ తంబురలు వాయిస్తావు. సంతోష నాట్యాలతో బయటకు వెళ్తావు.
    యిర్మీ 31:13అప్పుడు కన్యలు నాట్యమాడి ఆనందిస్తారు. యువకులూ వృద్ధులూ కలిసి ఉంటారు. “ఎందుకంటే, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను. వాళ్ళ మీద కనికరం చూపించి దుఃఖానికి బదులుగా వాళ్ళు ఆనందించేలా చేస్తాను.
  • “మా నాట్యం దుఃఖంగా మారిపోయింది”విలాప 5:15
    వచనాలు
    విలాప 5:15మా గుండెల్లో ఆనందం అడుగంటింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది.
  • తిరిగి వచ్చిన కుమారుని కోసం సంగీతం, నాట్యంలూకా 15:25
    వచనాలు
    లూకా 15:25“ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటిని సమీపిస్తుండగా సంగీతం, నాట్యధ్వని అతనికి వినిపించాయి.
  • హేరోదు పుట్టినరోజు విందులో హేరోదియ కుమార్తె నాట్యం చేస్తుందిమత్తయి 14:6–7, మార్కు 6:22
    వచనాలు
    మత్తయి 14:6–7హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది. కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు.
    మార్కు 6:22హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధులను మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, “నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!” అని అన్నాడు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు