Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › నిద్ర

దైనందిన జీవితం

బైబిల్‌లో నిద్ర

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 34 భాగాలు, వాక్యం వాక్యంగా.

సూక్తులు

  • తనకు ప్రియమైనవారికి ఆయన నిద్ర ఇస్తాడుకీర్త 127:2
    వచనాలు
    కీర్త 127:2మీరు తెల్లారే లేచి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తూ, కష్టపడి పని చేసి ఆహారం తింటూ ఉండడం వ్యర్ధం. దేవుడు తనకిష్టమైన వారికి నిద్రనిస్తున్నాడు.
  • “శాంతిసమాధానాలతో నేను పడుకుని నిద్రపోతాను”కీర్త 4:8, కీర్త 3:5
    వచనాలు
    కీర్త 4:8యెహోవా, శాంతిసమాధానాలతో నేను పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు మాత్రమే నాకు క్షేమం, భద్రత ఇస్తావు.
    కీర్త 3:5నేను పడుకుని నిద్రపోయాను. యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక మేల్కొన్నాను.
  • నువ్వు పడుకుంటే నీ నిద్ర సుఖంగా ఉంటుందిసామె 3:24
    వచనాలు
    సామె 3:24పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.
  • కష్టజీవి నిద్ర సుఖమైనది; ధనవంతుని సమృద్ధి అతణ్ణి నిద్రపోనివ్వదుప్రస 5:12
    వచనాలు
    ప్రస 5:12కష్టజీవులు కొంచెమే తినినా హాయిగా నిద్ర పోతారు. అయితే ఐశ్వర్యవంతులు తమ ధనసమృధ్థి వలన నిద్రపోలేరు.
  • నిద్రను ప్రేమించకు, లేకపోతే దరిద్రుడవవుతావుసామె 20:13
    వచనాలు
    సామె 20:13అతిగా నిద్ర పోవద్దు. లేకపోతే దరిద్రం ముంచుకు వస్తుంది. మేలుకుని ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది.
  • “మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం”సామె 6:9–10, సామె 24:33
    వచనాలు
    సామె 6:9–10సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు? ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు?
    సామె 24:33మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం,
  • సోమరితనం గాఢనిద్రను తెస్తుందిసామె 19:15
    వచనాలు
    సామె 19:15సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు.
  • ఇశ్రాయేలు కాపరి కునకడు, నిద్రపోడుకీర్త 121:4
    వచనాలు
    కీర్త 121:4ఇశ్రాయేలు ప్రజల సంరక్షకుడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు.
  • ఏలీయా బయలు ప్రవక్తలను వెక్కిరిస్తాడు: బహుశా అతడు నిద్రపోతున్నాడేమో1 రాజులు 18:27
    వచనాలు
    1 రాజులు 18:27మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా “వాడు దేవుడు గదా! పెద్దగా కేకలేయండి. వాడు ఒకవేళ పరధ్యానంలో ఉన్నాడేమో! మూత్రవిసర్జనకు వెళ్లాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో! ఒకవేళ నిద్రపోతుంటే లేపాలేమో” అని గేలి చేశాడు.
  • ఒక మొక్కుబడి: యెహోవా కోసం నివాసం దొరికే వరకు నిద్రపోనుకీర్త 132:3–5
    వచనాలు
    కీర్త 132:3–5నేను యెహోవా కోసం ఒక స్థలం చూసే దాకా, యాకోబు పరాక్రమశాలికి ఒక నివాస స్థలం సమకూర్చేదాకా నా ఇంట్లో అడుగు పెట్టను. నా కళ్ళకు నిద్ర, నా కనురెప్పలకు విశ్రాంతి రానివ్వను.

ఉదాహరణలు

  • ఆదాముకు గాఢనిద్ర పడుతుందిఆది 2:21
    వచనాలు
    ఆది 2:21అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు.
  • సూర్యుడు అస్తమిస్తుండగా అబ్రాముకు గాఢనిద్ర పడుతుందిఆది 15:12
    వచనాలు
    ఆది 15:12చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది.
  • యాకోబు తల కింద రాయి పెట్టుకుని నిద్రపోతాడుఆది 28:11
    వచనాలు
    ఆది 28:11ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు.
  • యాకోబు: రాత్రి మంచు, నా కళ్ళకు నిద్ర దూరమైందిఆది 31:40
    వచనాలు
    ఆది 31:40నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది.
  • అలసటతో నిద్రపోతున్న సీసెరాను యాయేలు చంపుతుందిన్యాయా 4:21
    వచనాలు
    న్యాయా 4:21ఆ తరువాత హెబెరు భార్య యాయేలు గుడారానికి కొట్టే మేకు తీసుకుని ఒక సుత్తె చేత్తో పట్టుకుని మెల్లగా అతని దగ్గరికి వచ్చి, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని కణతలో ఆ మేకు దిగగొట్టగా అది అతని తలలో గుండా నేలలోకి దిగింది.
  • దెలీలా సంసోనును తన ఒడిలో నిద్రపుచ్చుతుందిన్యాయా 16:19
    వచనాలు
    న్యాయా 16:19ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్ర పోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తల పై ఉన్న ఏడు జడలనూ క్షౌరం చేయించింది. అతణ్ణి లొంగదీసుకోసాగింది. ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది.
  • బోయజు ధాన్యపు కుప్ప దగ్గర నిద్రపోతాడు; అర్ధరాత్రి రూతును చూస్తాడురూతు 3:7–8
    వచనాలు
    రూతు 3:7–8బోయజు భోజనం చేసి ద్రాక్షారసం తాగి మనస్సులో ఉల్లాసంగా పోయి ధాన్యం కుప్ప దగ్గర పడుకున్నాడు. అప్పుడు రూతు నెమ్మదిగా వెళ్ళి అతని కాళ్ళ పైన ఉన్న దుప్పటి తీసి పడుకుంది. అర్థరాత్రి సమయంలో బోయజు ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పడుకుని ఉండటం కనిపించింది.
  • నిద్రపోతున్న సౌలు దగ్గర నుంచి దావీదు ఈటెనూ నీటి బుడ్డినీ తీసుకుంటాడు1 సమూ 26:7, 1 సమూ 26:12
    వచనాలు
    1 సమూ 26:7దావీదు, అబీషైలు రాత్రి సమయంలో ఆ శిబిరం దగ్గరికి వెళితే సౌలు శిబిరం మధ్యలో పండుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని దిండు పక్క నేలకు గుచ్చి ఉంది. అబ్నేరు, ఇతరులు సౌలు చుట్టూ పండుకుని నిద్రపోతున్నారు.
    1 సమూ 26:12సౌలు దిండు దగ్గర ఉన్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకు ఇద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా వల్ల అక్కడు ఉన్న వారందరికీ గాఢనిద్ర కలిగింది. వారిలో ఎవ్వరూ నిద్ర నుండి లేవలేదు. ఎవ్వరూ వచ్చిన వాళ్ళను చూడలేదు, ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు.
  • మధ్యాహ్నం కునుకు తీస్తుండగా ఇష్బోషెతును చంపుతారు2 సమూ 4:5
    వచనాలు
    2 సమూ 4:5రిమ్మోను కొడుకులు రేకాబు, బయనా ఇద్దరూ మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బయలుదేరి ఇష్బోషెతు మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు అతని ఇంటికి వెళ్లారు.
  • ఏలీయా ఒక బదరీ వృక్షం కింద నిద్రపోతాడు1 రాజులు 19:5
    వచనాలు
    1 రాజులు 19:5అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు.
  • నిద్రపట్టని అహష్వేరోషు రాజ్య దస్తావేజులు చదివించుకుంటాడుఎస్తే 6:1
    వచనాలు
    ఎస్తే 6:1ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. అతడు తన పరిపాలన విశేషాలు రాసి ఉండే గ్రంథం తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు తెచ్చి దాన్ని రాజుకు చదివి వినిపించారు.
  • నెబుకద్నెజరు కలలు: అతనికి నిద్రపట్టలేదుదాని 2:1
    వచనాలు
    దాని 2:1రాజైన నెబుకద్నెజరు పాలన కాలం రెండవ సంవత్సరంలో అతనికి నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలలను బట్టి అతడు కలవరం చెందాడు. అతనికి నిద్రపట్టడం లేదు.
  • దానియేలు సింహాల దగ్గర ఉండగా దర్యావేషుకు నిద్రపట్టదుదాని 6:18
    వచనాలు
    దాని 6:18తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు.
  • తుపాను మధ్య యోనా ఓడ అడుగున నిద్రపోతాడుయోనా 1:5
    వచనాలు
    యోనా 1:5అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు.
  • తుపాను మధ్య యేసు పడవ వెనుక భాగంలో తలగడ మీద నిద్రపోతాడుమత్తయి 8:24, మార్కు 4:38, లూకా 8:23
    వచనాలు
    మత్తయి 8:24అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు.
    మార్కు 4:38పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు.
    లూకా 8:23వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది.
  • గేత్సేమనేలో శిష్యులు నిద్రపోతారుమత్తయి 26:40–43, లూకా 22:45
    వచనాలు
    మత్తయి 26:40–43శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా? మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం” అని పేతురుతో అన్నాడు. యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు. ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి.
    లూకా 22:45ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు.
  • చెరసాలలో పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతాడుఅపొ.కా 12:6
    వచనాలు
    అపొ.కా 12:6హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు.
  • పౌలు మాట్లాడుతుండగా ఐతుకు కునికిపాట్లు పడి కిటికీలోనుంచి పడిపోతాడుఅపొ.కా 20:9
    వచనాలు
    అపొ.కా 20:9పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీలో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడవ అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు