అన్వేషించండి › అంశాలు › ఇళ్ళు
దైనందిన జీవితం
బైబిల్లో ఇళ్ళు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 38 భాగాలు, వాక్యం వాక్యంగా.
- రాతి ఇళ్ళు, దేవదారు దూలాలు, సరళ వృక్షపు వాసాలుఆమో 5:11, పరమ 1:17
- గోడలకు సున్నం పూసేవారులేవీ 14:42, దాని 5:5
వచనాలు
లేవీ 14:42వేరే రాళ్ళను తెచ్చి తీసివేసిన రాళ్ళ స్థానంలో చేర్చాలి. అలాగే కొత్త అడుసు తెచ్చి ఆ ఇంటి గోడలకు పూయాలి.
దాని 5:5ఆ సమయంలోనే రాజుకు మనిషి చేతి వేళ్ళు కనిపించాయి. దీపస్తంభం ఎదురుగా రాజ భవనం గోడ మీద ఏదో ఒక రాత రాస్తూ ఉన్నట్టు కనబడింది.
- పది మూరలు, ఎనిమిది మూరల పొడవున్న పెద్ద, విలువైన రాళ్ళ పునాదులు1 రాజులు 7:9–10
వచనాలు
1 రాజులు 7:9–10ఈ కట్టడాలన్నీ పునాది నుండి పైకప్పు వరకూ లోపలా బయటా వాటి పరిమాణం ప్రకారం తొలిచి రంపాలతో కోసి చదును చేసిన బహు విలువైన రాళ్లతో నిర్మితమైనాయి. ఈ విధంగానే విశాలమైన ఆవరణం బయటి వైపున కూడా ఉన్నాయి. దాని పునాది పదేసి, ఎనిమిదేసి మూరలు ఉన్న బహు విలువైన, పెద్ద రాళ్లతో కట్టి ఉంది.
- సొలొమోను తన రాజభవనం కట్టడానికి పదమూడు సంవత్సరాలు పట్టింది1 రాజులు 7:1
వచనాలు
1 రాజులు 7:1సొలొమోను 13 సంవత్సరాల పాటు తన రాజ గృహాన్ని కూడా కట్టించి పూర్తి చేశాడు.
- దావీదు దేవదారు ఇంట్లో నివసిస్తాడు2 సమూ 7:2
వచనాలు
2 సమూ 7:2“నేను దేవదారు చెక్కలతో కట్టిన పట్టణంలో నివసిస్తున్నాను. అయితే దేవుని మందసం గుడారంలో ఉంటున్నది” అన్నాడు.
- చెక్క పలకలు బిగించిన ఇళ్ళుహగ్గ 1:4
వచనాలు
హగ్గ 1:4“ఈ మందిరం పాడై ఉండగా మీరు కలపతో కప్పిన ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?
- రాహాబు ఇల్లు పట్టణ ప్రాకారంలో కట్టబడిందియెహో 2:15
వచనాలు
యెహో 2:15ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది, ఆమె ప్రాకారం మీద నివాసం ఉంటున్నది కాబట్టి తాడువేసి కిటికీ గుండా వాళ్ళని దింపింది.
- సంఘాలు విశ్వాసుల ఇళ్ళలో సమకూడేవిఅపొ.కా 12:12, రోమా 16:5, కొలస్స 4:15, ఫిలే 1:2
వచనాలు
అపొ.కా 12:12దీన్ని గ్రహించిన తరువాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. చాలామంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు.
రోమా 16:5ఆసియలో క్రీస్తుకు మొదటి ఫలం, నాకిష్టమైన ఎపైనెటుకు అభివందనాలు.
కొలస్స 4:15లవొదికయలో ఉన్న సోదరులకూ, నుంఫాకూ, ఆమె ఇంట్లో ఉన్న సంఘానికీ అభివందనాలు తెలియజేయండి.
ఫిలే 1:2మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు.
మిద్దెలు
- రాహాబు తన మిద్దె మీద పరిచిన అవిసె కట్టల కింద వేగులవారిని దాచిపెడుతుందియెహో 2:6
వచనాలు
యెహో 2:6అంతకుముందు ఆమె ఆ ఇద్దరినీ తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి ఉన్న జనపకట్టల్లో వాళ్ళని దాచి పెట్టింది.
- సమూయేలు మిద్దె మీద సౌలుతో మాట్లాడతాడు; సౌలు అక్కడే నిద్రపోతాడు1 సమూ 9:25–26
వచనాలు
1 సమూ 9:25–26పట్టణ ప్రజలు కొండపై నుండి కిందికి దిగుతున్న సమయంలో సమూయేలు తన ఇంటిపై సౌలుతో మాట్లాడుతున్నాడు. తరువాతి రోజు తెల్లవారుజామున సమూయేలు “నేను నీకు వీడ్కోలు చెప్పడానికి మిద్దెమీదికి రా” అని సౌలును పిలవగా సౌలు లేచాడు. తరువాత వారిద్దరూ బయలుదేరి
- సాయంత్రం దావీదు రాజభవనం మిద్దె మీద తిరుగుతాడు2 సమూ 11:2
వచనాలు
2 సమూ 11:2ఒకరోజు సాయంత్రం సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం డాబా మీద నడుస్తున్నాడు. డాబాపై నుండి కిందికి చూస్తున్నప్పుడు స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీ కనిపించింది.
- పండగ కోసం మిద్దెల మీద, ఆవరణల్లో పందిళ్ళు వేస్తారునెహె 8:16
వచనాలు
నెహె 8:16కాబట్టి ప్రజలు వెళ్లి కొమ్మలు తెచ్చి అందరూ తమ తమ ఇళ్ళ మీద, వాకిళ్ళలో, మందిరం పరిసరాల్లో, నీటి ద్వారం వీధిలో, ఎఫ్రాయీం ద్వారం వీధిలో పర్ణశాలలు కట్టారు.
- ఫిలిష్తీయుల గుడి మిద్దె మీద సుమారు మూడు వేల మందిన్యాయా 16:27
వచనాలు
న్యాయా 16:27ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పు పైన సుమారు మరో మూడు వేలమంది స్త్రీలూ పురుషులూ చూస్తూ ఉన్నారు.
- స్నేహితులు కప్పు విప్పి, పెంకుల గుండా పక్షవాతం ఉన్న మనిషిని కిందికి దించుతారుమార్కు 2:4, లూకా 5:19
వచనాలు
మార్కు 2:4ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు.
లూకా 5:19ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు.
- లోపలి గదుల్లో చెవిలో చెప్పినది మిద్దెల మీద నుంచి ప్రకటించబడుతుందిలూకా 12:3
వచనాలు
లూకా 12:3అందుకని మీరు చీకటిలో మాట్లాడేవి వెలుగులో వినబడతాయి. గదుల్లో చెప్పుకునేవి ఇంటి కప్పుల పైన చాటిస్తారు.
గదులు, తలుపులు, కిటికీలు
- రాజైన ఎగ్లోను తన చల్లని మేడ గదిలో ఒంటరిగా కూర్చున్నాడున్యాయా 3:20
వచనాలు
న్యాయా 3:20ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఏహూదు “నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది” అని చెప్పగా, రాజు తన సింహాసనం మీద నుంచి లేచాడు.
- ఏలీయా వితంతువు ఇంటి మేడ గదిలో ఉంటాడు1 రాజులు 17:19
వచనాలు
1 రాజులు 17:19అతడు “నీ కొడుకును ఇలా తీసుకురా” అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకు తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్లి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు.
- పస్కా కోసం సిద్ధం చేసిన, అలంకరించిన పెద్ద మేడ గదిమార్కు 14:14–15
వచనాలు
మార్కు 14:14–15అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు’ అని చెప్పండి. అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు.
- యోసేపు ఏడ్వడానికి ఏకాంత గదిలోకి వెళ్తాడుఆది 43:30
వచనాలు
ఆది 43:30అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకుని వచ్చింది కాబట్టి అతడు త్వరగా ఏడవడానికి చోటు వెతికి, లోపలి గదిలోకి వెళ్ళి, అక్కడ ఏడ్చాడు.
- అహజ్యా తన మేడ గది కిటికీ జాలీలోనుంచి కింద పడతాడు2 రాజులు 1:2
వచనాలు
2 రాజులు 1:2అప్పుడే అహజ్యా షోమ్రోనులోని తన మేడగది కిటికీలో నుండి కింద పడి గాయపడ్డాడు. అప్పుడతడు దూతలను పిలిచి “మీరు ఎక్రోను దేవుడు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఈ గాయం మాని బాగుపడతానో లేదో కనుక్కుని రండి” అని వారికి చెప్పి పంపించాడు.
- సీసెరా తల్లి కిటికీ జాలీలోనుంచి చూస్తుందిన్యాయా 5:28
వచనాలు
న్యాయా 5:28సీసెరా తల్లి కిటికీలోనుంచి చూస్తూ ఉంది. అల్లిక కిటికీలోనుంచి చూస్తూ ఆందోళనగా కేక పెడుతోంది అతని రథం తిరిగి రావడానికి ఇంత సమయం పడుతోందేమిటి? అతని రథాన్ని లాగే గుర్రాల డెక్కల శబ్ధాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి?
- ఐతుకు కిటికీలో నిద్రపోయి మూడో అంతస్తు నుంచి పడిపోతాడుఅపొ.కా 20:9
వచనాలు
అపొ.కా 20:9పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీలో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడవ అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు.
ధర్మశాస్త్రంలో
- కొత్త ఇంటి మిద్దె చుట్టూ పిట్టగోడ ఉండాలిద్వితీ 22:8
వచనాలు
ద్వితీ 22:8మీరు కొత్త ఇల్లు కట్టించుకొనేటప్పుడు ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. అప్పుడు దాని మీద నుంచి ఎవరైనా పడిపోతే మీ ఇంటి మీద హత్యాదోషం ఉండదు.
- ధర్మశాస్త్ర వాక్కులు ద్వారబంధాల మీదా గుమ్మాల మీదా రాయాలిద్వితీ 6:9
వచనాలు
ద్వితీ 6:9మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.
- ఇంట్లో బూజు: రాళ్ళు మార్చి, గోడలు గీకి, మళ్ళీ సున్నం పూయాలిలేవీ 14:40–45
వచనాలు
లేవీ 14:40–45ఒకవేళ అది వ్యాపిస్తే, ఆ బూజు పట్టిన రాళ్ళను గోడలోంచి తీసి పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయమని యాజకుడు ఆదేశించాలి. ఆ తరువాత ఆ యింటి లోపల చుట్టూ గోడలను గీకించాలి. అలా గీకించిన తరువాత మాలిన్యం అంటిన పెళ్లలను పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయాలి. వేరే రాళ్ళను తెచ్చి తీసివేసిన రాళ్ళ స్థానంలో చేర్చాలి. అలాగే కొత్త అడుసు తెచ్చి ఆ ఇంటి గోడలకు పూయాలి. అతడు ఆ రాళ్లను ఊడదీసి, ఆ ఇల్లు గీకించి, కొత్త అడుసు పూసిన తరువాత మళ్ళీ బూజు కన్పిస్తే యాజకుడు వచ్చి చూడాలి. ఆ ఇల్లంతా బూజు వ్యాపించిందేమో యాజకుడు పరీక్షించాలి. ఒకవేళ బూజు కన్పిస్తే అది హానికరం. ఆ ఇల్లు అశుద్ధం. కాబట్టి ఆ ఇంటిని కూల్చి వేయాలి. ఆ ఇంటి రాళ్ళనూ, కలపనూ, అడుసునూ తీసి పట్టణం బయట ఉన్న అశుద్ధమైన ప్రాంతంలోకి మోసుకు వెళ్ళి పారవేయాలి.
- ప్రాకారాలున్న పట్టణంలో అమ్మిన ఇంటిని ఒక సంవత్సరం లోపల తిరిగి కొనుక్కోవచ్చులేవీ 25:29–30
వచనాలు
లేవీ 25:29–30ఎవరైనా ప్రాకారం ఉన్న ఊరిలోని తన సొంతిల్లు అమ్మితే దాన్ని అమ్మిన రోజు మొదలుకుని సంవత్సరంలోగా దాన్ని విడిపించుకోవచ్చు. ఆ సంవత్సరమంతా దాన్ని విడిపించుకునే అవకాశం అతనికి ఉంది. అయితే ఆ సంవత్సరం నిండే లోగా దాన్ని విడిపించుకోకపోతే ప్రాకారం ఉన్న ఊళ్ళోని ఆ ఇల్లు కొనుక్కున్న వాడికే తరతరాలకు ఉండిపోతుంది. అది సునాద సంవత్సరంలో మొదటి యజమాని ఆధీనంలోకి తిరిగి రాదు.
- ప్రాకారాలు లేని గ్రామాల్లోని ఇళ్ళు సునాద సంవత్సరంలో యజమానులకు తిరిగి వస్తాయిలేవీ 25:31
వచనాలు
లేవీ 25:31ప్రాకారం లేని గ్రామాల్లోని ఇళ్ళను మాత్రం దేశంలోని పొలాలతో సమానంగా ఎంచాలి. వాటిని తిరిగి విడిపించుకోవచ్చు. అవి సునాదకాలంలో విడుదల అవుతాయి.
- కొత్త ఇల్లు కట్టి ఇంకా ప్రతిష్ఠించనివాణ్ణి యుద్ధం నుంచి ఇంటికి పంపిస్తారుద్వితీ 20:5
వచనాలు
ద్వితీ 20:5సేనాధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి. ‘మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని దాన్ని ప్రతిష్ట చేయకుండా ఉన్నాడా? యుద్ధంలో అతడు చనిపోతే వేరొకడు దాన్ని ప్రతిష్ట చేస్తాడు. కనుక అలాంటివాడు ఎవరైనా ఉంటే అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.
సూక్తులు
- జ్ఞాని తన ఇంటిని బండ మీద కడతాడు (ఉపమానం)మత్తయి 7:24–27, లూకా 6:48
వచనాలు
మత్తయి 7:24–27“కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు. వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు. నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు. వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”
లూకా 6:48వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉంటాడు. వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దాన్ని బలంగా కట్టారు కనుక దాన్ని కదిలించలేక పోయింది.
- జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుందిసామె 24:3
వచనాలు
సామె 24:3జ్ఞానం వలన ఇల్లు నిర్మాణం అవుతుంది. వివేచన వలన అది స్థిరం అవుతుంది.
- జ్ఞానవతి అయిన ప్రతి స్త్రీ తన ఇంటిని కడుతుందిసామె 14:1
వచనాలు
సామె 14:1జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు